రండి, నన్ను అనుసరించండి
జూన్ 29–జూలై 5. ఆల్మా 23–29: వారు “ఎన్నడూ తొలగిపోలేదు”


“జూన్ 29–జూలై 5. ఆల్మా 23–29: వారు ‘ఎన్నడూ తొలగిపోలేదు’,”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జూన్ 29–జూలై 5. ఆల్మా 23–29,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

ఆంటై-నీఫై-లీహైయులు తమ ఆయుధములను పాతిపెట్టుట

ఆంటై-నీఫై-లీహైయులు తమ యుద్ధ ఆయుధములను పాతిపెట్టెదరు, జోడీ లివింగ్ స్టన్ చేత

జూన్ 29–జూలై 5.

ఆల్మా 23–29

వారు “ఎన్నడూ తొలగిపోలేదు”

మీరు ఆల్మా 23–29 చదివినప్పుడు, మీ కొరకు మరియు మీ కుటుంబం కొరకు మీరు ఏ సందేశాలను కనుగొన్నారు? మీ సంఘ తరగతులలో మీరు ఏమి పంచుకోగలరు?

మీ మనోభావాలను నమోదు చేయండి.

జనులు నిజంగా మారగలరా అని మీరు కొన్నిసార్లు ఆశ్చర్యపోతున్నారా? మీరు చేసిన చెడు ఎంపికలు లేదా మీరు వృద్ధి చేసిన దురలవాట్లను జయించగలరో లేదోనని మీరు చింతిస్తూ ఉండవచ్చు, లేదా మీరు ప్రేమించే వారి గురించి అటువంటి చింత కలిగియుండవచ్చు. అలాగైతే, ఆంటై-నీఫై-లీహైయుల కథ మీకు సహాయపడగలదు. ఈ జనులు నీఫైయుల బద్ధ శత్రువులు. అమ్మోన్ మరియు అతని సహోదరులు వారికి సువార్త ప్రవచించాలని నిర్ణయించినప్పుడు, నీఫైయులు “[వారిని] ఎగతాళి చేస్తూ నవ్వారు.“ లేమనీయులలో పరివర్తన కలిగించడం కంటే వారిని చంపడం ఎక్కువ న్యాయమైన పరిష్కారంగా తోచింది. (ఆల్మా 26:23–25 చూడండి.)

కానీ ప్రభువు యొక్క పరివర్తన శక్తి ద్వారా లేమనీయులు మారారు. ఒకప్పుడు “కఠినాత్ములు మరియు రౌద్రులైన జనులుగా” (ఆల్మా 17:14) యెంచబడినవారు, “దేవుని యెడల వారి ఆసక్తి నిమిత్తము ప్రత్యేకపరచబడిరి” (ఆల్మా27:27). నిజానికి, వారు “ఎన్నడూ తొలగిపోలేదు” (ఆల్మా 23:6).

విడిచిపెట్టవలసిన తప్పుడు ఆచారాలను లేక క్రింద పడవేయవలసిన “తిరుగుబాటు ఆయుధాలను” మీరు కలిగియుండవచ్చు (ఆల్మా 23:7). లేదా మీరు మరికొద్దిగా మీ సాక్ష్యంపై ఆసక్తిని మరియు తొలగిపోవడానికి తక్కువ అవకాశాలను కలిగియుండవలసి రావచ్చు. మీకు ఎటువంటి మార్పులు అవసరమైనప్పటికీ, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి ద్వారా శాశ్వత మార్పు సాధ్యమనే నిరీక్షణను ఆల్మా 23–29 మీకు ఇవ్వగలదు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 23:1–5

దేవుని పిల్లలు సువార్తను అంగీకరించినప్పుడు, గొప్ప దీవెనలు వస్తాయి.

దేవుని వాక్యము తన జనుల మధ్య “ఏ ఆటంకము లేకుండా” ముందుకు వెళ్ళాలని లేమనీయుల రాజు ప్రకటించినప్పుడు (ఆల్మా 23:1–5 చూడండి), ఆయన వారి కొరకు గొప్ప దీవెనలకై తలుపు తెరిచాడు. మీరు ఆల్మా 23–29 చదివినప్పుడు, ఈ దీవెనల కొరకు చూడండి. మీ జీవితంలో లేక మీ కుటుంబంలో దేవుని వాక్యానికి ”ఎటువంటి ఆటంకము” లేకుండా ఉండేలా మీరెలా నిర్థారించగలరు?

ఆల్మా 23–25; 27

యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త పట్ల నా పరివర్తన నా జీవితాన్ని మారుస్తుంది.

అమ్మోన్ మరియు అతని సహోదరులచేత దర్శించబడిన లేమనీయులు పరివర్తనకు అవకాశం లేనివారిగా కనిపించారు—వారు తమ పితరుల ఆచారాలు మరియు తమ స్వంత దుష్టత్వమందు చిక్కుకొని ఉన్నారు. అయినను వారిలో అనేకులు యేసు క్రీస్తు సువార్తను అంగీకరించారు మరియు వారి జీవితాల్లో ముఖ్యమైన మార్పులు చేసుకున్నారు. వారి స్వంత పరివర్తనకు గుర్తుగా ఈ లేమనీయులు తమనుతాము ఆంటై-నీఫై-లీహైయులుగా పిలుచుకున్నారు. (ఈ సందర్భంలో “ఆంటై” అనగా అర్థము “క్తీస్తు-వ్యతిరేకి” లోని “వ్యతిరేకి“ అని కాదు.)

ఈ లేమనీయుల పరివర్తనపై ప్రతిబింబించడం “ప్రభువునకు” మీ స్వంత పరివర్తన గురించి ధ్యానించేలా మిమ్మల్ని ప్రోత్సహించవచ్చు (ఆల్మా 23:6). ఆంటై-నీఫై-లీహైయుల పరివర్తన వారి జీవితాలను ఎలా మార్చిందో గుర్తించడం ఈ అధ్యాాయాలు చదివేందుకు ఒక విధానము కాగలదు. క్రింది వచనాలతో మీరు ప్రారంభించవచ్చు.

ఆంటై-నీఫై-లీహైయులలో మార్పుల గురించి మీరు ధ్యానించినప్పుడు, క్రీస్తునకు మీ స్వంత పరివర్తన మిమ్మల్ని ఏవిధంగా మారుస్తున్నదో ఆలోచించండి. మీ జీవితంలో సువార్త గొప్ప శక్తి కలిగియుండునట్లు మీరింకను మార్చుకోవలసినవి ఏవని మీరు భావిస్తున్నారు?

ఆల్మా 23:6–7

ఆల్మా 23:17–18

ఆల్మా 24:11–19

ఆల్మా 25:13–16

ఆల్మా 27:26–30

ఆల్మా 24:7–19; 26:17–22

దేవుడు దయామయుడు.

అమ్మోన్ మరియు ఆంటై-నీఫై-లీహైయులు జయించవలసిన పాపములు మీ జీవితంలోని వాటికి భిన్నంగా ఉన్నప్పటికీ, మనమందరం దేవుని దయ మీద ఆధారపడియున్నాము. ఆయన దయను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడునట్లు ఆల్మా 24:7–19 మరియు26:17–22 లో మీరేమి కనుగొంటారు? మీరు చదువుతున్నప్పుడు, మీరు ఈ విషయాల గురించి ఆలోచించవచ్చు: మీరు పశ్చాత్తాపపడడానికి ఆహ్వానించబడిన విధానాలు, పశ్చాత్తాపముతో మీకున్న అనుభవాలు, మరల పాపము చేయకుండా ఉండేందుకు మీరేవిధంగా ప్రయత్నించారు మరియు పశ్చాత్తాపము ద్వారా మీకు కలిగిన దీవెనలు. వచనాలను ఈ విధంగా మీరు చదివినప్పుడు, మీ జీవితంలో దేవుని దయ గురించి మీరేమి నేర్చుకుంటారు?

ఆల్మా 26; 29

దేవునికి సేవచేయడం ఆనందాన్ని తెస్తుంది.

వారి అనుభవాలు వేరైనప్పటికీ, అమ్మోన్ మరియు ఆల్మా తమ సువార్త సేవ గురించి ఒకేరకమైన భావాలను వ్యక్తపరిచారు. ఆల్మా 26 మరియు 29 చదివి, వాటిని పోల్చడం గురించి ఆలోచించండి. ఏ పోలికలను మీరు గమనించారు? ఏ పదాలు మరియు వాక్యభాగాలు పునరావృతమయ్యాయి? మీకు సవాళ్ళు ఉన్నప్పటికీ నిజమైన ఆనందాన్ని ఏవిధంగా కనుగొనాలనే దాని గురించి అమ్మోన్ మరియు ఆల్మా నుండి మీరేమి నేర్చుకోగలరు? (ఆల్మా ఎదుర్కొన్న సవాళ్ళను పునఃసమీక్షించడానికి, ఆల్మా 5–16 అధ్యాయాల శీర్షికలు చూడండి. అమ్మోన్ మరియు అతని సహోదరుల సవాళ్ళను పునఃసమీక్షించడానికి, ఆల్మా 17–28 అధ్యాయాల శీర్షికలు చూడండి.)

ఆల్మా 26:5–7

పనలు మరియు ధాన్యాగారములు అనగానేమి?

పంటకోయు సమయంలో తరచు ధాన్యము పనలు అనబడే కుప్పలుగా కూర్చబడుతుంది మరియు ధాన్యాగారము అనబడే గిడ్డంగులలో ఉంచబడుతుంది. ఆల్మా 26:5 లోని చిహ్నము గురించి ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ ఒక సాధ్యమైన వివరణను పంచుకున్నారు: “ఈ పోలికలో పనలు సంఘములో క్రొత్తగా బాప్తీస్మము పొందిన వారిని సూచిస్తున్నాయి. ధాన్యాగారములు పరిశుద్ధ దేవాలయాలను సూచిస్తున్నాయి” (“Honorably Hold a Name and Standing,” ఎన్ సైన్ లేక లియహోనా, మే 2009, 97). దేవాలయ నిబంధనల ప్రాముఖ్యత గురించి ఆల్మా 26:5–7 లోని పోలిక మీకేమి బోధిస్తుందో ఆలోచించండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబంతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 24:6–19

ఆంటై-నీఫై-లీహైయులు తమ ఆయుధములను “భూమిలో లోతుగా”ఎందుకు పాతిపెట్టారు? (ఆల్మా 24:16). వారు జయించాలనుకుంటున్న లేక వదిలివేయాలనుకుంటున్న విషయాలను కాగితపు ముక్కలపై వ్రాయడాన్ని బహుశా కుటుంబ సభ్యులు ఆనందించవచ్చు. తరువాత వారు ఒక గొయ్యి త్రవ్వి, ఆ కాగితాలను పాతిపెట్టవచ్చు.

ఆల్మా 24:7–12

ఈ వచనాలను అధ్యయనం చేయడం, పశ్చాత్తాపమనే అద్భుతమైన బహుమానాన్ని అర్థం చేసుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడగలదు. తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడేందుకు ఆంటై-నీఫై-లీహైయులు ఏమి చేసారు? పశ్చాత్తాపపడేందుకు ప్రభువు వారికి ఏవిధంగా సహాయపడ్డారు? ఈ మాదిరి నుండి మనమేమి నేర్చుకోగలము?

ఆల్మా 24:20–27

“ఆ విధముగా ప్రభువు తన జనుల రక్షణ కొరకు అనేక విధాలుగా పనిచేయునని మనము చూచుచున్నాము,” అను మోర్మన్ ప్రకటన యొక్క సత్యమునకు సాక్ష్యమిచ్చునట్లు మనమేమి చూసాము? (ఆల్మా 24:27).

ఆల్మా 26:2

ఆల్మా 26:2 లోని అమ్మోన్ ప్రశ్నలకు మీ కుటుంబము ఏవిధంగా జవాబిస్తుంది? బహుశా మీరు వారి జవాబులన్నిటిని ఒక పెద్ద కాగితంపై జాబితా చేసి, ప్రతిఒక్కరు చూడగలిగే ప్రదేశంలో దానిని వ్రేలాడదీయవచ్చు. దేవుడు ”మనపై కుమ్మరించిన” ఇతర దీవెనల గురించి వారు ఆలోచించినప్పుడు, దానికి జతచేర్చమని కుటుంబ సభ్యులను ప్రోత్సహించండి.

ఆల్మా 29:9

అమ్మోన్ మరియు ఆల్మా ఏవిధంగా దేవుని చేతిలో సాధనాలయ్యారు? మీ ఇంట్లో ఉన్న పనిముట్లు లేదా సాధనాలను చూస్తూ, వాటిలో ప్రతిది మీ కుటుంబానికి ఏవిధంగా సహాయపడుతుందో చర్చించడం గురించి ఆలోచించండి. మనలో ప్రతిఒక్కరం ”దేవుని చేతిలో ఒక సాధనంగా” ఎలా ఉండగలమో గ్రహించడానికి ఇది మనకేవిధంగా సహాయపడుతుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

వైవిధ్యాన్ని ఉపయోగించండి. కుటుంబ లేఖన అధ్యయనములో భిన్నమైన విధానాలను అనుసరించడం, కుటుంబ సభ్యులలో ఆసక్తిని రేకెత్తించడానికి మరియు పాల్గొనేలా చేయడానికి సహాయపడగలదు. ఉదాహరణకు, ఒక కుటుంబ సభ్యుడు ఒక వచనము చదివిన తర్వాత, చదివిన దానిని తమ స్వంత మాటలలో తిరిగి చెప్పమని అతడు లేక ఆమె ఇతర కుటుంబ సభ్యులను అడగవచ్చు.

ఆంటై-నీఫై-లీహైయులు తమ ఆయుధములను పాతిపెట్టుట

ఆంటై-నీఫై-లీహైయులు తమ ఆయుధములను పాతిపెట్టుట యొక్క వివరణ, డాన్ బర్ర్ చేత