రండి, నన్ను అనుసరించండి
జులై 6–12. ఆల్మా 30–31: “దేవుని వాక్యము యొక్క సుగుణము”


“జులై 6–12. ఆల్మా 30–31: ‘దేవుని వాక్యము యొక్క సుగుణము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జులై 6–12. ఆల్మా 30–31,“ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

ఆల్మా, కొరిహోర్ కు బోధించుట

అన్ని విషయములు ఒక దేవుడున్నాడని సూచించుచున్నవి (ఆల్మా మరియు కొరిహోర్), వాల్టర్ రేన్ చేత

జులై 6–12

ఆల్మా 30–31

“దేవుని వాక్యము యొక్క సుగుణము”

దేవుని వాక్యము యొక్క ”శక్తివంతమైన ప్రభావమును” (ఆల్మా 31:5) గూర్చి ఆల్మా సాక్ష్యమిచ్చెను. మీరు ఆల్మా 30–31 చదివినప్పుడు, దేవుని వాక్యము మీపై కలిగియున్న శక్తివంతమైన ప్రభావమును మీరు భావించినప్పుడు, మీ మనోభావాలను నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆల్మా 30–31 లోని వృత్తాంతములు మాటల యొక్క శక్తిని—మంచి కొరకైనా మరియు చెడు కొరకైనా స్పష్టముగా నిరూపించును. అబద్ధ బోధకుడైన కొరిహోర్ యొక్క ”పొగడ్తలు” మరియు ”గొప్ప నేర్పుగల మాటలు”, ”అనేక ఆత్మలను నాశనము” చేయుదునని బెదిరించెను (ఆల్మా 30:31, 47). అదేవిధముగా, జోరమ్ అనబడు నీఫై అసమ్మతీయుని బోధనలు ఒక జన సమూహము మొత్తాన్ని “గొప్ప తప్పిదములలో పడునట్లు“ మరియు “ప్రభువు మార్గములను చెరుపునట్లు” నడిపించెను (ఆల్మా 31:9, 11).

దానికి విరుద్ధంగా, దేవుని వాక్యము కొరిహోర్ మరియు జోరమ్ మాటలతోపాటు—“ఖడ్గము లేక వారికి సంభవించిన ఇతర వాటన్నింటి కంటే జనుల యొక్క మనస్సులపైన అధిక శక్తివంతమైన ప్రభావము కలిగియుంటుందని“ (ఆల్మా 31:5) ఆల్మా స్థిరమైన విశ్వాసాన్ని కలిగియున్నాడు. ఆల్మా మాటలు నిత్య సత్యాన్ని వ్యక్తం చేసాయి మరియు కొరిహోర్ నోరు మూయించడానికి పరలోక శక్తులను ఆకర్షించాయి (ఆల్మా 30:39–50 చూడండి), మరియు జోరమీయులను సత్యమునకు తిరిగి తెచ్చుటకు అతనితో పాటు వెళ్ళిన వారిపై పరలోక దీవెనలను అవి ఆహ్వానించాయి (ఆల్మా 31:31–38 చూడండి). “గొప్ప నేర్పుగల మాటలు” మరియు “గొప్ప తప్పిదములు” జనుల మనస్సులపై శక్తివంతమైన ప్రభావమును కలిగియున్నప్పుడు, నేటికీ క్రీస్తు అనుచరులకు ఇవి విలువైన మాదిరులు (ఆల్మా 30:31; 31:9). కానీ ఆల్మా వలె “దేవుని వాక్యము యొక్క సుగుణము” (ఆల్మా 31:5) ను నమ్ముట ద్వారా మనము సత్యమును కనుగొనగలము.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 30:6, 12

క్రీస్తు విరోధి అనగానేమి?

ఆల్మా 30 లో కొరిహోర్, “క్రీస్తు విరోధి” అని పిలువబడ్డాడు (వచనము 6). క్రీస్తు విరోధి అనగా “క్రీస్తు యొక్క ముసుగు వేసుకున్నప్పటికీ, వాస్తవంలో క్రీస్తును వ్యతిరేకించు వాడు (1 యోహాను 2:18–22; 4:3–6; 2 యోహాను 1:7). వివరంగా చెప్పాలంటే, నిజమైన సువార్తను లేక రక్షణ ప్రణాళికను అనుకరిస్తున్నట్లుగా నటిస్తూ, బహిరంగంగా లేక రహస్యంగా క్రీస్తును వ్యతిరేకించు వారు ఎవరైనా లేక ఏదైనా అని అర్థం” (బైబిలు నిఘంటువు, “క్రీస్తు విరోధి ”).

నేటి ప్రపంచంలో ”నిజమైన సువార్త (యొక్క) అనుకరణలు” వేటిని మీరు గమనిస్తారు? ఉదాహరణకు, ఉపశమన సమాజ మాజీ ప్రధాన అధ్యక్షురాలు సహోదరి జూలీ బి. బెక్ ఇలా బోధించారు, “కుటుంబానికి వ్యతిరేకంగా ప్రపంచం నుండి (మనం) వినే ఏ సిద్ధాంతము లేక సూత్రమైనా క్రీస్తు విరోధే“ (“Teaching the Doctrine of the Family,” ఎన్ సైన్, మార్చి 2011, 15).

కొరిహోర్, ఆల్మాతో మాట్లాడును

కొరిహోర్, ఆల్మాను ఎదిరించును, రాబర్ట్ టి. బార్రెట్ చేత

ఆల్మా 30:6–60

నన్ను మోసగించాలని ప్రయత్నించే వారి ప్రభావాన్ని తట్టుకోవడానికి మోర్మన్ గ్రంథము నాకు సహాయపడగలదు.

మీరు ఆల్మా30:6–31 చదివినప్పుడు, కొరిహోర్ బోధనలు బాగా పరిచయమున్నట్లు ధ్వనించవచ్చు. అది ఎందుకంటే, అధ్యక్షులు ఎజ్రా టాఫ్ట్ బెన్సన్ బోధించినట్లుగా, “మన రోజులలో దయ్యము యొక్క చెడు ఉద్దేశాలు, వ్యూహాలు మరియు సిద్ధాంతాలను మోర్మన్ గ్రంథము బయలుపరచి, వాటికి వ్యతిరేకంగా మనల్ని బలపరచగలదు. నేడు మనము కలిగియున్నవారు మోర్మన్ గ్రంథములో నున్న విశ్వాసభ్రష్టులను పోలియున్నారు. దేవుడు తన అనంతమైన పూర్వజ్ఞానముతో మోర్మన్ గ్రంథమును ఏవిధంగా మలిచారంటే, మనం తప్పిదాలను చూసి, మన కాలము యొక్క విద్యాసంబంధమైన, రాజకీయపరమైన, మతపరమైన మరియు తాత్వికసంబంధమైన తప్పుడు భావాలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోగలము” (Teachings of Presidents of the Church: Ezra Taft Benson, [2014], 132).

ఆల్మా 30:6–31 లో కొరిహోర్ బోధించిన తప్పుడు సిద్ధాంతాల జాబితా చేయడం గురించి ఆలోచించండి. ఈ బోధనలను నమ్మడం వలన కలిగే కొన్ని పర్యవసానాలేవి? ఉదాహరణకు, ”ఒక మనుష్యుడు మరణించినప్పుడు అదియే వాని అంతమని” నమ్మడం వలన వచ్చే ఫలితమేమిటి? (ఆల్మా 30:18). కొరిహోర్ బోధించిన ఏ అబద్ధ సిద్ధాంతాలు, నేడు లోకంలో మీరు గమనించిన అబద్ధ సిద్ధాంతాలను పోలియున్నాయి?

కొరిహోర్ మరియు ఆల్మా మధ్య జరిగిన సంభాషణ గురించి చదవడం, మిమ్మల్ని మోసగించడానికి ఇతరులు ప్రయత్నించు సందర్భాలలో మీరు సిద్ధపడేందుకు సహాయపడగలదు. కొరిహోర్ ఎలా మోసగించబడ్డాడో (ప్రత్యేకించి వచనాలు 52–53 చూడుము) తెలుసుకోవడానికి ఆల్మా 30:29–60 అధ్యయనం చేయడం సహాయపడగలదు. కొరిహోర్ బోధనలకు ఆల్మా స్పందన నుండి మీరేమి నేర్చుకోగలరు? (ఆల్మా 30:31–35 చూడుము)

ఆల్మా 31

జనులను నీతి వైపు నడిపించుటకు దేవుని వాక్యము శక్తి కలిగియుంది.

నీఫైయుల నుండి జోరమీయులు విడిపోవడమనే సమస్యకు రాజకీయ లేక సైనికపరమైన పరిష్కారం అవసరమని కొందరికి అనిపించియుండవచ్చు (ఆల్మా 31:1–4 చూడుము). కానీ ”దేవుని వాక్యము యొక్క సుగుణము” (ఆల్మా 31:5) ను నమ్మడాన్ని ఆల్మా నేర్చుకున్నాడు. దేవుని వాక్యము యొక్క శక్తి గురించి ఆల్మా 31:5 నుండి మీరేమి నేర్చుకుంటారు? దేవుని వాక్యము, “న్యాయమైన దానిని చేయుటకు జనులను” నడిపించుటను మీరెట్లు చూచిరి? (ఆల్మా 31:5). మీరు ప్రేమించే వారికి సహాయపడేందుకు మీరు దేవుని వాక్యాన్ని ఎలా (ఉపయోగించు లేక పరీక్షించు) “ప్రయత్నించ“గలరో ధ్యానించండి.

ఇతరులను రక్షించడంలో ఆల్మా విధానాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆల్మా 31 లో వివరించినట్లుగా, అతని వైఖరులు, భావాలు మరియు చర్యలను జోరమీయుల వాటితో మీరు పోల్చవచ్చు. క్రింద ఇవ్వబడినటువంటి పట్టిక ఒకటి సహాయపడగలదు. ఏ వ్యత్యాసాలను మీరు గమనిస్తారు? మీరు మరింతగా ఆల్మా వలె కాగలరని మీరెలా భావిస్తారు?

జోరమీయులు

ఆల్మా

జోరమీయులు

వారి సమూహమునకు వెలుపల ఉన్నవారు నరకమున పడవేయబడుదురని నమ్మినవారు (ఆల్మా 31:17).

ఆల్మా

జోరమీయులు తన ”సహోదరులని” మరియు వారి ఆత్మలు ”శ్రేష్ఠమైనవని” నమ్మాడు (ఆల్మా 31:35).

జోరమీయులు

తమ హృదయాలను సంపదలపై నిలిపారు (ఆల్మా 31:24, 28).

ఆల్మా

యేసు క్రీస్తు వైపు ఆత్మలను తేవాలని కోరుకున్నాడు (ఆల్మా 31:34).

జోరమీయులు

ఆల్మా

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు ఇంట్లో కుటుంబంతో సాయంత్రము కొరకు ఉపాయములు

మీ కుటుంబంతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 30:44

మీరు ఆరుబయట నడవడానికి వెళ్ళినప్పుడు లేక దేవుని సృష్టి యొక్క చిత్రాలను చూసినప్పుడు ఆల్మా 30:44 ను కలిసి చదివి, చర్చించడం గురించి ఆలోచించండి. దేవుని గురించి సాక్ష్యమిచ్చేలా వారు చూసిన వాటిని కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు. ఈ విషయాలు—లేక మనకు కలిగిన ఇతర అనుభవాలు—దేవుడు నిజమని తెలుసుకోవడానికి మనకెలా సహాయపడతాయి?

ఆల్మా 30:56–60

దయ్యము తన అనుచరులను ఏవిధంగా ఆదరిస్తుందనే దాని గురించి ఆల్మా 30:56–60 నుండి మనమేమి నేర్చుకుంటాము? అతని ప్రభావమునకు వ్యతిరేకంగా మన ఇంటిని రక్షించుకోవడానికి మనమేమి చేయగలము?

ఆల్మా 31:20–38

మీ కుటుంబంతో ఆల్మా 31:20–38 చదివిన తర్వాత, మీరు క్రింది ప్రశ్నలను చర్చించవచ్చు: ఆల్మా ప్రార్థన, జోరమీయుల ప్రార్థన కంటే ఏవిధంగా భిన్నంగా ఉంది? మన వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్థనలలో ఆల్మా మాదిరిని మనమెలా అనుసరించగలము?

ప్రతి ఉదయం మరియు రాత్రి ప్రార్థించుటను గుర్తుంచుకోవడానికి వారికి సహాయపడేందుకు చిన్న పిల్లలు వారి తలగడ క్రింద ఒక రాయిని పెట్టుకోవచ్చు. తమ రాయిని అలంకరించడాన్ని కూడా వారు ఆనందించవచ్చు.

ఆల్మా 31:23

దేవుని గురించి నేర్చుకోవడానికి మరియు మాట్లాడడానికి ప్రతిరోజు మన ఇంటిలో మనమేమి చేస్తున్నాము?

పిల్లలకు బోధించడానికి మరిన్ని ఆలోచనల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీ పరిసరాలను సిద్ధం చేయండి. మన పరిసరాలు సత్యమును నేర్చుకొని, అనుభవించుటలో మన సామర్థ్యమును చాలా లోతుగా ప్రభావితం చేయగలవు” (రక్షకుని విధానంలో బోధించుట, 15). పరిశుద్ధాత్మ ప్రభావాన్ని ఆహ్వానించగలిగేలా లేఖనములు చదవడానికి ఒక ప్రదేశాన్ని కనుగొనేందుకు ప్రయత్నించండి. మంచి సంగీతము మరియు చిత్రాలు కూడా ఆత్మను ఆహ్వానించగలవు.

రమీయంప్టమ్ పైన జోరమీయుడు ప్రార్థించుట

రమీయంప్టమ్, డెల్ పార్సన్ చేత