రండి, నన్ను అనుసరించండి
జూలై 20–26. ఆల్మా 36–38: “దేవుని వైపు చూచి జీవించుడి”


“జూలై 20–26. ఆల్మా 36–38: “దేవుని వైపు చూచి జీవించుడి” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జూలై 20-26. రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
వ్యక్తి ప్రార్ధించుట

జాషువా డెన్నిస్ చేత ఒక వ్యక్తి ప్రార్ధించుట యొక్క దృష్టాంతము

జూలై 20–26

ఆల్మా 36–38

“దేవుని వైపు చూచి జీవించుడి”

సువార్త గ్రహించుట నుండి వచ్చు ఆనందమును మీరు అనుభవించినప్పుడు, మీరు నేర్చుకొన్న దానిని అన్వయించుటకు మీరు కోరతారు” (నా సువార్త ప్రకటించుడి [2004], 19). మీరు నేర్చుకొన్న సత్యములను ఎలా అన్వయించుకోవాలో మీ ఆలోచనలు మరియు మీ మనోభావాలు నమోదుచేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

తన చుట్టూ ఉన్న దుర్మార్గమును ఆల్మా చూసినప్పుడు, అతడు లోతైన “విచారమును,” “శ్రమను,” మరియు “ఆత్మ యొక్క దుఃఖమును,” (ఆల్మా 8:14) భావించాడు. “ఈ జనుల మధ్య అట్టి దుష్టత్వము,” “నా ఆత్మను బాధపెట్టును” అని (ఆల్మా 31:30) జోరమీయులను గూర్చి అతడు చెప్పాడు. “జనుల యొక్క హృదయములు కఠినము చెందుచున్నవని మరియు వారు వాక్యము యొక్క ఖచ్చితమగుటను బట్టి నొచ్చుకొనుట మొదలు పెట్టిరని,” అతడు గమనించాడు మరియు ఇది తన “హృదయము మిక్కిలి దుఃఖముగా” చేసెను (ఆల్మా 35:15). తాను చూసిన, భావించిన దాని గురించి ఆల్మా ఏమి చేసెను? ఆయన కేవలము నిరాశ చెందలేదు లేక లోక స్థితి గురించి ద్వేషించలేదు. బదులుగా, “ఆయన తన కుమారులు సమావేశమగునట్లు చేసి” “నీతికి సంబంధించిన సంగతులను గూర్చి,” (ఆల్మా 35:16) వారికి బోధించెను. “మనుష్యుడు రక్షింపబడగల మరే ఇతర మార్గము లేక సాధనము లేదని, కేవలము క్రీస్తునందు మరియు ద్వారనే” అని, … ఇదిగో, అతడు సత్యము మరియు నీతి యొక్క వాక్యమైయున్నాడు” అని (ఆల్మా 38:9) అతడు వారికి బోధించెను.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 36

నేను తగ్గించుకొని, పశ్చాత్తాపపడినప్పుడు నేను దేవుని వలన జన్మించగలను.

ఆల్మా యొక్క పరివర్తన వలె కొందరే నాటకీయమైన అనుభవాలు కలిగియుంటారు. కానీ అతడి అనుభవములో మనమందరము నేర్చుకొని అన్వయించుకోగల అనుభవాలున్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరు తప్పకుండా “దేవుని వలన జన్మించాలి” (ఆల్మా 36:23{). మీరు ఆల్మా 36 చదివినప్పుడు, మీరు అన్వయించుకోగల సూత్రముల కొరకు వెదకండి. ఉదాహరణకు, దేవుని వలన జన్మించిన వారు ఎవరైనా పాపము గురించి, యేసు క్రీస్తు గురించి ఎలా భావిస్తారు? దేవుని వలన జన్మించిన ఎవరైనా ఒకరి నమ్మకాలు మరియు క్రియలందు మీరు చూడాలని ఆశించిన మార్పుల కొరకు కూడ చూడవచ్చు.

మోషైయ 5:7; 27:25–26; ఆల్మా 5:14; 22:15; హీలమన్ 3:35; “పరివర్తన,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

ఆల్మా 36

యేసు క్రీస్తు లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసెను.

ఈ అధ్యాయములో ఆల్మా తన పరివర్తన వృత్తాంతములో కొంత పునశ్చరణను చేయడం గమనించండి. ఇది ఎందుకనగా ఆల్మా 36 చియాస్మస్ అని పిలవబడిన హీబ్రూ కవిత్వము యొక్క గొప్ప మాదిరిగా ఉన్నది, దానిలో మాటలు లేక ఆలోచనలు ప్రధానమైన ఆలోచనకు నడిపిస్తూ, ఒక నిర్ధిష్టమైన క్రమములో సమర్పించబడినవి మరియు తరువాత వెనుక క్రమములో తిరిగి చేయబడతాయి. ఆల్మా 36, 3వ వచనములోని ఆలోచన 27వ వచనము లో తిరిగి చెప్పబడింది, 5వ వచనములో ఆలోచన 26వ వచనము లో తిరిగి చెప్పబడింది, మరియు ఆ విధంగా కొనసాగుతుంది. ప్రధానమైన ఆలోచన చియాస్మస్ లో అతి ముఖ్యమైన సందేశము. 17–18 వచనాలలో ప్రధానమైన ఆలోచనను మీరు కనుగొనగలరేమో చూడండి. “ఈ ఆలోచన రాగానే” హృదయమందు మొర్రపెట్టుట ఆల్మాను ఎలా ప్రభావితం చేసింది మరియు అతని జీవితాన్ని మార్చివేసింది. ఈ సత్యము మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసింది? ఈ లేఖన భాగములో మీరు కనుగొన్న పునరావృతమైన ఇతర ఆలోచనలు ఏవి?

ఆల్మా యొక్క మాదిరిను అనుసరించుటకు మరియు రక్షకుని వైపు తిరుగుటకు పశ్చాత్తాపము మరియు క్షమాపణను గూర్చి ఈ వివరణ మిమ్మల్ని ఎలా ప్రేరేపిస్తుంది?

చియాస్మస్ గురించి ఎక్కువ సమాచారము కొరకు, BookofMormonStudentManual (Church Educational System manual [2009], 232–33) చూడండి.

ఆల్మా 37

“ఒక తెలివైన ఉద్దేశము నిమిత్తము” లేఖనాలు కాపాడబడినవి.

నేడు లేఖనాలను కలిగియుండుట ఎటువంటి అద్భుతము మరియు దీవెన అని మీరెప్పుడైనా ఆలోచించారా? దేవుడు “పవిత్రమైన వాటిని, [మనకు] అప్పగించియున్నాడు” (ఆల్మా 37:14) మీరు ఆల్మా 37 చదివినప్పుడు, లేఖనములు కలిగియుండుట నుండి వచ్చు దీవెనల కొరకు చూడుము. ఈ దీవెనలు మీరు అనుభవించియున్నారా? “ముందు తరములకు [దేవుని యొక్క] శక్తిని ప్రదర్శించుటకు” సహాయపడుటకు మనము లేఖనాలను ఎలా ఉపయోగించగలము?ఆల్మా 37:18

ఆల్మా 37:18 లో ఆల్మా “క్రీస్తు యొక్క వాక్యమును” లియహోనాతో పోల్చెను. ఈ పోలికను మీరు ధ్యానించినప్పుడు, “దినదినము” (ఆల్మా 37:40 ) క్రీస్తు యొక్క బోధనల అద్భుతమును మరియు శక్తిని మీరు అనుభవించిన విధానముల గురించి ఆలోచించండి.

D. Todd Christofferson, “The Blessing of Scripture,” Ensign or Liahona, May 2010, 32–35 కూడా చూడండి.

చిత్రం
స్త్రీ లేఖనాలను చదువుట

దేవునిని ఎలా అనుసరించాలో లేఖనాలు మనకు బోధిస్తాయి.

ఆల్మా 37:6–7

“చిన్న మరియు సాధారణమైన వస్తువుల ద్వార గొప్ప క్రియలు జరిగించబడును.”

కొన్నిసార్లు మనము మన సమస్యలు చాలా పెద్దవి మరియు జటిలమైనవని, పరిష్కారములు కూడా పెద్దవి మరియు జటిలమైనవిగా ఉండాలని భావించవచ్చు. అయినప్పటికినీ, దాదాపు ఎల్లప్పుడు, ఆయన పిల్లల జీవితాలను దీవించుటకు మరియు ఆయన కార్యమును నెరవేర్చుటకు “చిన్న మరియు సాధారణమైన వస్తువులను” (ఆల్మా 37:6) ఉపయోగించుటకు ప్రభువు ఎంపిక చేయును. మీరు ఆల్మా 37:6 చదివినప్పుడు, మీ జీవితంలో ఈ సూత్రము పనిచేసిన విధానములను ధ్యానించండి మరియు నమోదు చేయండి. మిమ్మల్ని దీవించుటకు మరియు ఆయన కార్యమును నెరవేర్చుటకు ప్రభువు ఉపయోగించు చిన్న మరియు సాధారణమైన వస్తువులు ఏవి?

ఆల్మా 37:41–46; Dallin H. Oaks, “చిన్న మరియు సాధారణమైన వస్తువులు,” Ensign or Liahona, May 2018, 89–92 కూడా చూడండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 36:5–26

ఆల్మా యొక్క అనుభము అసాధారణమైనది అయినప్పటికినీ, ఆయన పరివర్తన మనందరికీ అన్వయించగల కొన్ని సూత్రములను వివరించును. ఆల్మా 36:5–26 నుండి “దేవుని వలన జన్మించుట” బోధించు ఒక వచనమును ఎంపిక చేయమని ప్రతీ కుటుంబ సభ్యుని ఆహ్వానించండి. ఈ వచనములనుండి మనము ఏమి నేర్చుకున్నాము? బహుశా కుటుంబ సభ్యులు ఆల్మా వివరించిన సూత్రములను వారు ఎలా అన్వయించుకున్నారో పంచుకోవచ్చు.

ఆల్మా 36:18–21, 24

పశ్చాత్తాపము భయంకరమైనదిగా కాకుండా, సంతోషకరమైనదిగా చూచుటకు ఎవరికైనా సహాయపడుటకు మనము ఈ వచనాలను ఎలా ఉపయోగించగలము? ఇతరులతో సువార్తను పంచుకొనుటకు పశ్చాత్తాపము మనల్ని ఎలా ప్రేరేపిస్తుంది?

ఆల్మా 37:7, 38–46

మన జీవితాలలో గొప్ప విషయాలను తెచ్చు కొన్ని“చిన్న మరియు సాధారణమైన వస్తువులు” (ఆల్మా 37:6) ఏవి? క్రీస్తు యొక్క వాక్యము ఏ విధంగా లియహోనా వలే ఉన్నది? లేఖనాలు ఎక్కువ శ్రద్ధగా అధ్యయనము చేయుటకు మనము ఒకరినొకరం ఎలా సహాయపడగలము?

ఆల్మా 37:35

“మన యౌవనములో” ఆజ్ఞలు పాటించుట నేర్చుకొనుట ఎందుకు తెలివైనది?

ఆల్మా 38:12

కళ్ళెము అనగా మీ కుటుంబానికి తెలుసా? మీరు ఒక చిత్రమును చూపించవచ్చు మరియు అది ఒక జంతువును అదుపు చేయటానికి ఎలా ఉపయోగించబడుతుందో చెప్పవచ్చు. “[మన] కామోద్రేకములన్నిటికి కళ్ళెము వేయుట” అనగా అర్ధమేమిటి? మన కామోద్రేకములకు కళ్ళెము వేయుట “ప్రేమతో నింపబడుటకు” మనకు ఎలా సహాయపడుతుంది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాధమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మనోభావాలను నమోదు చేయండి మీ ఆత్మీయ భావనలు వ్రాసినప్పుడు, మీరు ఆయన నడిపింపుకు విలువిస్తున్నారని ప్రభువుకు చూపిస్తున్నారు, మరియు ఎక్కువ తరచుగల బయల్పాటుతో ఆయన మిమ్మల్ని దీవించును. మీరు అధ్యయనము చేసినప్పుడు, మీ ఆలోచనలు వ్రాయండి. (Teaching in the Savior’s Way, 12, 30 చూడండి.)

చిత్రం
ఆల్మా మరియు మోషైయ కుమారులకు దేవదూత ప్రత్యక్షమగుట

క్లార్క్ కెల్లి ప్రైస్ చేత ఆల్మా మరియు మోషైయ కుమారులకు దేవదూత ప్రత్యక్షమగుట

ముద్రించు