రండి, నన్ను అనుసరించండి
జూలై 27–ఆగష్టు 2. ఆల్మా 39–42: “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక”


జూలై 27–ఆగష్టు 2. ఆల్మా 39–42: “సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

జూలై 27–ఆగష్టు 2. రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

యేసు మరియు మరియ

మార్క్ ఆర్. పగ్ అమ్మా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు?

జూలై 27–ఆగష్టు 2

ఆల్మా 39–42

“సంతోషము యొక్క గొప్ప ప్రణాళిక”

ఆల్మా 39–42 మీరు చదివినప్పుడు, మీ జీవితంలో జరుతున్న విషయాలను గూర్చి పరిశుద్ధాత్మ మీకు జ్ఞానము ఇవ్వగలదు.

మీ మనోభావాలను నమోదు చేయండి

మనము ప్రేమించే వారు ఎవరైనా ఒక తీవ్రమైన తప్పు చేసినప్పుడు, ఎలా స్పందించాలో తెలుసుకొనుట కష్టము కావచ్చు. ఆల్మా 39–42 ను చాలా విలువైనదిగా చేసే దానిలో కొంతభాగము ఏమిటంటే, యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా—ఆల్మా పశ్చాత్తాపపడుటకు తన స్వంత దుఃఖకరమైన పాపములు ఎలా కలిగియున్నాడు—అటువంటి స్థితిని ఎలా సంభాళించెనో అది బయల్పరుచును. ఆల్మా యొక్క కుమారుడైన కొరియాంటన్ లైంగిక పాపము చేసాడు, ఆల్మా తరచుగా చేసినట్లుగా, పశ్చాత్తాపమును ప్రోత్సహించుటకు నిజమైన సిద్ధాంతము యొక్క శక్తిని నమ్మెను ఆల్మా 4:19; 31:5). ఈ అధ్యాయాలలో, ఆల్మా పాపమును నిందించుటలో ధైర్యమును, మరియు కొరియాంటన్ కొరకు దయను, ప్రేమను మనము గమనిస్తాము. మరియు చివరిగా, రక్షకుడు “[పాపములు] తీసివేయుటకు, రక్షణ యొక్క సంతోష వార్తలను ప్రకటించుటకు రాబోవుననే” ఆల్మా యొక్క విశ్వాసమును మనము గ్రహిస్తాము (ఆల్మా 39:15). చివరకు పరిచర్య కార్యమునకు కొరియాంటన్ తిరిగి వెళ్లాడనే వాస్తవము( ఆల్మా 49:30 చూడండి) మన స్వంత పాపముల కొరకు లేక మనము ప్రేమించే వారి యొక్క పాపములను గూర్చి మనము “కష్టపడినప్పుడు” (ఆల్మా 42:29) క్షమాపణ మరియు విమోచన కొరకు నిరీక్షణను మనకివ్వగలదు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 39

లైంగిక పాపము దేవుని దృష్టిలో హేయమైనది.

లైంగిక పాపము యొక్క తీవ్రతను తన కుమారుడు అర్ధము చేసుకొనుటకు సహాయపడుటకు, “ఈ క్రియలు ప్రభువు యొక్క దృష్టియందు హేయమని” (ఆల్మా 39:5) ఆల్మా బోధించెను. పవిత్రత మీకు ఎందుకు ముఖ్యమైనది? అది ప్రభువుకు ఎందుకు ముఖ్యమైనది? ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ నుండి క్రింది వివరణ సహాయకరముగా ఉండవచ్చు:

“మర్త్యత్వము గురించి ఆయన గొప్ప చింతలలో స్పష్టమైనవి ఒకరు ఈ లోకములోనికి ఎలా వస్తారు మరియు దానినుండి ఒకరు ఎలా వెళతారన్నది.” ఈ విషయాలలో ఆయన చాలా ఖచ్చితమైన పరిమితులు ఏర్పరిచెను.

“ … మానవ అన్యోన్యత వివాహితులైన దంపతుల కొరకు దాచబడింది ఎందుకనగా అది సంపూర్ణమైన కలయక యొక్క అంతిమ చిహ్నము, దేవుని చేత నిర్వచించబడిన ఐక్యత. … వివాహము అనేది ఒక పురుషుడు, స్త్రీ యొక్క పూర్తి విలీనమని అర్ధము. … ఈ కలయక అటువంటి సంపూర్ణతను కలిగియున్నది, దాని నిత్య వాగ్దానమును తెలుపుటకు మనము ముద్ర అనే మాటను ఉపయోగిస్తాము” (“Personal Purity,” Ensign, నవం. 1998, 76).

ఆల్మా 39:8–15 లో ఆల్మా ఇచ్చిన సలహాను పరిశీలించండి. పవిత్రత చట్టము యొక్క ప్రాముఖ్యతను, మరియు శోధన ఎలా జయించాలో గ్రహించుటకు ఇంకా అది మీకు ఎలా సహాయపడుతుంది? మనము పశ్చాత్తాపపడినప్పుడు క్షమించుటకు ప్రభువు ఎంత ఆతృతగా ఉన్నారు మరియు మనందరి కొరకు నిరీక్షణ ఉన్నదని కూడ ఆల్మా యొక్క బోధనలు రుజువు చేస్తాయి. ఈ వారము ఆల్మా 39–42 మీరు చదివినప్పుడు, దేవుని కనికరము యొక్క నిదర్శనము కొరకు చూడండి. దేవుని యొక్క కనికరము మిమ్మల్ని ఎలా దీవించింది?

Sexual Purity,” For the Strength of Youth, 35–37 కూడా చూడండి.

ఆల్మా 40–41

నేను పునరుత్థానము చెందుతాను మరియు తీర్పు తీర్చబడుటకు దేవుని యెదుట నిలబడతాను.

పునరుత్థానము గురించి కొరియాంటన్ ప్రశ్నలు కలిగియున్నాడని ఆల్మా గమనించినప్పుడు, మనము చనిపోయిన తరువాత సంభవించే దాని గురించి ఆయన అతనికి బోధించెను. ఆల్మా 40–41 లో ఆల్మా బోధించిన ఏ సత్యములు కొరియాంటన్ కొరకు —మరియు పాపము చేసిన వారెవరైనా—గ్రహించుటకు సహాయకరముగా ఉండేవి? ఆల్మా ప్రసంగించిన విషయములను గుర్తించుట ద్వారా మీరు నేర్చుకున్న దానిని క్రమపరచవచ్చు (ఆత్మ లోకము, పునరుత్థానము, మరియు పునఃస్థాపన వంటివి) మరియు ఆల్మా బోధించిన ప్రతీదాని గురించి వ్రాయండి. మీరు శోధించబడినప్పుడు లేక క్షమాపణ కోరినప్పుడు ఈ సత్యములను జ్ఞాపకముంచుకొనుట మీకు ఎలా సహాయపడతాయి?

ఆల్మా 40

నా సువార్త ప్రశ్నలకు నేను విశ్వాసముతో జవాబులను వెదకుతాను.

ప్రవక్తలకు ప్రతీ సువార్త ప్రశ్నకు జవాబులు తెలుసని కొన్నిసార్లు మనము అనుకొనవచ్చు. 40 అధ్యాయము అంతటా, మరణము తరువాత జీవితం గురించి జవాబివ్వబడని కొన్ని ప్రశ్నలను ఆల్మా కలిగియుండెనని గమనించండి. జవాబులు కనుగొనుటకు అతడు ఏమి చేసాడు? అతనికి జవాబులు లేనప్పుడు అతడు ఏమి చేసాడు? మీరు కలిగియున్న సువార్త ప్రశ్నలతో ఆల్మా యొక్క మాదిరి మీకు ఎలా సహాయపడుతుందో ఆలోచించండి.

స్త్రీ ప్రార్ధించుట

సువార్త ప్రశ్నలకు మనము జవాబులు కనుగొనగల ఒక విధానము ప్రార్ధన.

ఆల్మా 42

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము విమోచన ప్రణాళికను సాధ్యము చేయును.

పాపముల కొరకు శిక్ష న్యాయమైనది కాదని కొరియాంటన్ నమ్మాడు (ఆల్మా 42:1 చూడండి). కానీ పాపము మనల్ని ఉంచే “దౌర్భాగ్యపు స్థితి” నుండి తప్పించుకొనుటకు ఒక మార్గమున్నదని ఆల్మా బోధించెను: పశ్చాత్తాపము మరియు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తమునందు విశ్వాసము, అది కనికరముగలది మరియు న్యాయమైనది రెండును (ఆల్మా 42:15 చూడండి). ఆల్మా 42 మీరు చదివినప్పుడు, “న్యాయమును దోచుకొన” కుండా 25వ వచనము కనికరమును పొందుటకు మీకు రక్షకుని యొక్క ప్రాయశ్చిత్తము ఎలా సాధ్యపరచునో చూడండి. ఆయన కనికరమును మీరు అనుభవించుటకు మీకు సహాయపడునట్లు ఈ అధ్యాయములో మీరు కనుగొన్న సత్యములేవి?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 39:1–9

పవిత్రత చట్టము గురించి ఒక చర్చ వలన మీ కుటుంబము ప్రయోజనము పొందుతుందా? ఆలాగైతే, మీ కుటుంబ అవసరతల ప్రకారము క్రింది వనరులు ఉపయోగించుటకు ఆలోచించండి: ఆల్మా 39:1–9; “Sexual Purity,” యౌవనుల బలము కొరకు, 35–37; “Chastity,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org; overcomingpornography.org; and the videos “What Should I Do When I See Pornography?” and “I Choose to Be Pure” (ChurchofJesusChrist.org). పవిత్రత మరియు వివాహములో అన్యోన్యత వలన దీవెనలు మీ కుటుంబము గ్రహించుటకు మీరు ఎలా సహాయపడగలరో ధ్యానించండి (ఉదాహరణకు, ఈ వీడియో చూడండి “How to Talk to Your Kids about Intimacy” on ChurchofJesusChrist.org).

ఆల్మా 39:9–15

పాపమును మానివేయుట గురించి ఈ వచనముల నుండి మనము ఏమి నేర్చుకోగలము?

ఆల్మా 42:4

క్రీస్తు వంటి లక్షణాలు గల లేక సువార్త సూత్రములు వాటిపై వ్రాయబడిన కాగితములు గది చుట్టూ పరచి వాటితో మీరు ఒక ఆట ఆడవచ్చు. నిర్ధిష్టమైన సమయములో కుటుంబ సభ్యులు సమకూర్చగల కాగితాలు ఎన్నో మీరు చూడవచ్చు, తరువాత కాగితాలపై వ్రాయబడిన విషయాలు దేవుని వలే ఎక్కువగా అగుటకు ఎలా మనకు సహాయపడగలవో చర్చించండి. భూమిపైన మనకు “అనుగ్రహించబడిన సమయము” ఈ ఆటలో కేటాయించబడిన సమయము వలే ఎలా ఉన్నది? భూమిమీద మన “పరిశీలన సమయమును” రక్షకుని వలే ఎక్కువగా అగుటకు మనము ఎలా ఉపయోగించగలము?

ఆల్మా 42:12–15, 22–24

బహుశా క్రింది వంటి ప్రశ్నలు చర్చించుటకు ఒక సాధారణమైన స్కేలు రేఖాచిత్రమును ఉపయోగించుట ద్వారా న్యాయము మరియు కనికరము మధ్య అనుబంధమును మీరు వివరించవచ్చు: మనము పాపము చేసినప్పుడు స్కేలుకు ఏమి జరుగుతుంది? స్కేలు సమతుల్యము చేయబడుటకు న్యాయమునకు అవసరమైనదేమిటి? రక్షకుడు న్యాయపు అక్కరలను ఏవిధంగా తీర్చి, కనికరమును సాధ్యపరచెను?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

మీ కుటుంబమును దీవించు సూత్రములపై దృష్టిసారించండి. దేవుని వాక్యమును మీరు ప్రార్ధనాపూర్వకంగా అధ్యయనము చేసినప్పుడు, మీకై మీరు ఇలా ప్రశ్నించుకోండి, “ఇక్కడ మరిముఖ్యముగా నా కుటుంబానికి అర్ధవంతమైనదిగా ఉండే దేనిని నేను కనుగొన్నాను?” ఈ సత్యములను మీ కుటుంబము కనుగొనుటకు ఎలా సహాయపడగలరో మీరు లోతుగా ఆలోచించినప్పుడు ఆత్మ యొక్క నడిపింపును వెదకండి.

ఆల్మా మరియు కొరియాంటన్

ఎల్స్‌పెత్ కైట్లిన్ చేత ఈయన నా కుమారుడు