రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 24–30. హీలమన్ 7–12: “ప్రభువును జ్ఞాపకముంచుకొనుము”


ఆగష్టు 24–30. హీలమన్ 7–12: “ప్రభువును జ్ఞాపకముంచుకొనుము” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఆగష్టు 24–30. హీలమన్ 7–12,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020

చిత్రం
తోట గోపురములో నీఫై ప్రార్థించుట

జెర్రీ థాంప్సన్ చేత తోట గోపురములో నీఫై యొక్క దృష్టాంతము

ఆగష్టు 24–30

హీలమన్ 7–12

“ప్రభువును జ్ఞాపకముంచుకొనుము”

నీఫై, లీహై, మరియు ఇతరులు “అనేక బయల్పాటులను ప్రతిరోజు పొందియుండిరి” (హీలమన్ 11:23) తరచుగా వచ్చు బయల్పాటు కేవలము ప్రవక్తలకు మాత్రమే కాదు—అది మీకు కూడ లభ్యమవుతుంది. మీ మనోభావాలను నమోదు చేయుట ఎక్కువ స్థిరంగా బయల్పాటును పొందటానికి మీకు సహాయపడగలదు.

మీ మనోభావాలను నమోదు చేయండి

నీఫై యొక్క తండ్రి, హీలమన్, తన కుమారులను “జ్ఞాపకముంచుకొనుడి, జ్ఞాపకముంచుకొనుడి” అని పురికొల్పెను: అతడు వారి పూర్వీకులను జ్ఞాపకముంచుకోవాలని, ప్రవక్తల మాటలను జ్ఞాపకముంచుకోవాలని, మరియు అన్నిటికంటే ఎక్కువగా “మన విమోచకుడైన, క్రీస్తు” (హీలమన్ 5: 5–14 చూడండి) జ్ఞాపకముంచుకోవాలని ఆయన వారిని కోరెను. నీఫై జ్ఞాపకముంచుకొన్నట్లు స్పష్టమైంది, ఎందుకనగా ఇదే సందేశాన్ని అతడు సంవత్సరాల తరువాత “అలసట లేకుండా” (హీలమన్ 10:4 జనులకు ప్రకటించాడు. “మీ దేవునిని మీరు ఎలా మరిచిపోయారు?” (హీలమన్ 7:20), అని అతడు అడిగాడు. ప్రకటించడం, ప్రార్థన చేయడం, ఆశ్చర్యకార్యములు చేయడం, మరియు ఒక కరువు కొరకు దేవునికి మనవి చేయడం—నీఫై యొక్క ప్రయత్నాలన్నీ—జనులు దేవునివైపు తిరగడానికి సహాయపడుటకు చేసిన ప్రయత్నాలు. అనేక విధాలుగా, దేవునిని మరచిపోవుట ఆయనను తెలుసుకోకుండా ఉండుట కంటే కూడా పెద్ద సమస్య, మరియు మన మనస్సులు “లోకము యొక్క వ్యర్ధమైన వస్తువుల” చేత పరధ్యానపరచబడినప్పుడు, పాపముచేత కప్పబడినప్పుడు ఆయనను మరచిపోవుట సులభము (హీలమన్ 7:21; హీలమన్ 12:2 కూడా చూడండి). కానీ, నీఫై యొక్క పరిచర్య చూపినట్లుగా, జ్ఞాపకముంచుకొనుట మరియు “మీ దేవుడైన ప్రభువునకు … తిరుగుటకు” హీలమన్ 7:17 ఎన్నడూ ఆలస్యము కాదు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

హీలమన్ 7–11

ప్రవక్తలు దేవుని యొక్క చిత్తమును బయల్పరచును.

మోర్మన్ గ్రంథమంతటా అనేకమంది ప్రవక్తలు వివరించబడ్డారు, కానీ ప్రవక్త ఏమిటి, అతడు ఏమి చేస్తాడు, మరియు మనము అతని మాటలు ఎలా స్వీకరించాలో నేర్చుకొనుటకు హీలమన్ 7–11 ఖచ్చితంగా మంచి స్థలము. ఈ అధ్యాయములు మీరు చదివినప్పుడు, నీఫై క్రియలు, ఆలోచనలు మరియు ప్రభువుతో ప్రతిస్పందనలకు ఆసక్తిని చూపండి. నీఫై యొక్క పరిచర్య మన కాలములో ప్రవక్త పాత్ర మీరు బాగా గ్రహించటానికి ఎలా సహాయపడగలదు? ఇక్కడ కొన్ని మాదిరులున్నాయి. ఇంకా మీరు దేనిని కనుగొంటారు?

హీలమన్ 7:17–22.ప్రవక్తలు పశ్చాత్తాపమును ప్రకటించి, పాపము యొక్క పర్యవసానములను హెచ్చరిస్తారు.

హీలమన్ 7:29; 9:21–36.జనుల వినవలసిన దానిని ప్రవక్తలు దేవుని నుండి బయల్పాటు ద్వారా ఎరుగుదురు.

హీలమన్ 10:7.ప్రవక్తలు భూమి మీద మరియు పరలోకములో బంధించుటకు అధికారము ఇవ్వబడ్డారు (మత్తయి 16:19; సిద్ధాంతము మరియు నిబంధనలు 132:46 కూడా చూడండి).

మన జీవిస్తున్న ప్రవక్త గురించి మీరు భావించు దానిని ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి? ఇటీవల ఆయన ఏమి బోధించారు? వినుటకు మరియు ఆయన నడిపింపును అనుసరించుటకు మీరేమి చేస్తున్నారు?

హీలమన్ 9–10

సూచనలు మరియు అద్భుతాలు సహాయకరమైనవి కానీ శాశ్వతమైన విశ్వాసమును నిర్మించుటకు సరిపోవు.

సూచకక్రియలు, మహత్కార్య ములు ఒక వ్యక్తి హృదయాన్ని మార్చుటకు సరిపోయిన యెడల, నీఫైయులందరు హీలమన్ 9 లో నీఫై ఇచ్చిన గొప్ప సూచకక్రియల చేత మార్పుచెంది యుండేవారు. బదులుగా, “జనుల మధ్య ఒక చీలిక లేచెను” (హీలమన్ 10:1) ఎందుకనగా వారిలో అనేకులు “వారి హృదయములను కఠినపరచుకొనిరి” (హీలమన్ 10:15) సూచకక్రియలు మరియు మహత్కార్య ములకు దుష్టులు తరచుగా ఎలా స్పందిస్తారు? (హీలమన్ 10:12–15 చూడండి; 3 నీఫై 2:1–2 కూడా చూడండి). సూచకక్రియలను సాక్ష్యమునకు పునాదిగా చేసుకోవడం వలన అపాయము ఏమిటి? (“Signs,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org చూడండి).

హీలమన్ 10:2–4

ధ్యానించుట బయల్పాటును ఆహ్వానించును.

మీరు ఎప్పుడైన, కృంగినట్లుగా, ఆందోళన చెంది, లేక కలవరపడిన యెడల, హీలమన్ 10:2–4లో నీఫై యొక్క మాదిరి నుండి ఒక ముఖ్యమైన పాఠమును మీరు నేర్చుకుంటారు. అతడు “కృంగినట్లు” భావించినప్పుడు అతడు ఏమి చేసాడు? (3వ చనము).

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ ఇలా బోధించారు, “మనము ధ్యానించినప్పుడు, మనము ఆత్మ చేత బయల్పాటును ఆహ్వానిస్తున్నాము. నాకైతే ధ్యానించుట అనగా లేఖనాలను జాగ్రత్తగా చదివి, అధ్యయనము చేసిన తరువాత ఆలోచించుట మరియు ప్రార్ధించుట” (“ఆత్మతో సేవ చేయుట,” Ensign or Liahona, నవం. 2010, 60). మీరు ఏవిధంగా ధ్యానించే అలవాటు చేసుకుంటారు? దేవుని వాక్యమును క్రమముగా ధ్యానించుటకు ఒక విధానము గురించి చదువుటకు, డెవిన్ జి. డ్యూరంట్ యొక్క సందేశము చూడండి, “My Heart Pondereth Them Continually” (Ensign or Liahona, నవం. 2015, 112–15).

సామెతలు 4:26; లూకా 2:19; 1 నీఫై 11:1; 2 నీఫై 4:15–16; 3 నీఫై 17:3; మొరోనై 10:3; సిద్ధాంతము మరియు నిబంధనలు 88:62 కూడా చూడండి.

హీలమన్ 12

ఆయనను జ్ఞాపకముంచుకోవాలని ప్రభువు నన్ను కోరుతున్నారు.

గ్రంథము సంగ్రహిస్తున్న మోర్మన్ హీలమన్ 12 లో గత అధ్యాయాలలో నీఫై వృత్తాంతము నుండి మనము నేర్చుకోగల పాఠాలలో కొన్నిటిని సంక్షిప్తపరచును. మీ హృదయమును పరీక్షించుకొనుటకు ఒక అవకాశముగా ఆయన సారాంశమును ఉపయోగించుటకు ఆలోచించండి. జనులు ప్రభువును మరచిపోవునట్లు చేస్తాయని మోర్మన్ చెప్పిన విషయాల జాబితాను కూడ మీరు చేయవచ్చు. ఆయనను జ్ఞాపకముంచుకొనుటకు మీకేది సహాయపడును? మీరు నేర్చుకొన్న దానిపై ఆధారపడి ఏ మార్పులు చేయటానికి మీరు ప్రేరేపించబడ్డారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

హీలమన్ 7–9

నీఫై చేసినవి మరియు నేడు ప్రవక్తలు చేసిన విషయాల మధ్య ఏ పోలికలను మనము చూస్తాము? నేడు మన ప్రవక్త ఏమని బోధిస్తున్నారు? బహుశా ఇటీవల ప్రవక్త ఇచ్చిన సలహాను మీరు ఎంపిక చేసి, దానిని మీరు బాగా అనుసరించగల విధానాలను ఒక కుటుంబముగా చర్చించండి.

హీలమన్ 10:4–5, 11–12

తన స్వచిత్తము కంటె ప్రభువు యొక్క చిత్తమును తాను వెదికినట్లు నీఫై ఎలా రుజువు చేసెను? మనము ఆయన మాదిరిని ఎలా అనుసరించగలము? ప్రభువు యొక్క చిత్తమును మన కుటుంబము ఉత్తమంగా వెదకగల కొన్ని విధానములేవి?

హీలమన్ 11:1–16

నీఫై కోరినదేమిటి మరియు దాని గురించి ఏమి చేసెను? నీఫై యొక్క మాదిరి నుండి ప్రార్థన గురించి మనము ఏమి నేర్చుకోగలము?

హీలమన్ 11:17–23

హీలమన్ 11:17–23 లో నీఫై యొక్క సహోదరుడు లీహై గురించి మనమేమి నేర్చుకోగలము? ఎక్కువ గుర్తింపును పొందకుండా నీతిగల జీవితమును జీవించుచున్న ఎవరిని మనము ఎరుగుదుము?

హీలమన్ 12:1–6

మీ కుటుంబము “అస్థిరత్వము” అనగా అర్ధమేమిటో గ్రహించుటకు సహాయపడుటకు మీరు ఉపయోగించగల ఒక వస్తు పాఠమును మీరు గ్రహించగలరా? ఉదాహరణకు, మీ కుటుంబ సభ్యులొకరు అతడు లేక ఆమె తలపై ఏదైన సమతుల్యముగా ఉంచుటకు ప్రయత్నించమని మీరు ఆహ్వానించవచ్చు. తరువాత హీలమన్ 12:1–6లో ప్రభువును అనుసరించుటలో జనులు అస్థిరముగా ఉండగల కారణముల కొరకు చూడమని కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు. మనము ఆత్మీయంగా స్థిరముగా ఎలా నిలిచియుండగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

సమీక్షించండి. కుటుంబ సభ్యులు నేర్చుకుంటున్న లేఖనాలను జ్ఞాపకముంచుకొనుటకు సహాయపడుటకు ఇక్కడ ఒక ఉపాయము ఇవ్వబడినది: మీకు అర్ధవంతమైనదిగా కనుగొన్న ఒక వచనమును ఎంపిక చేయండి, మరియు మీ గృహములో కుటుంబ సభ్యులు తరచుగా చూడగల చోట దానిని ప్రదర్శించండి. ప్రదర్శించుటకు ఒక లేఖనమును ఒకరి తరువాత ఒకరు ఎంపిక చేయుటకు మిగిలిన కుటుంబ సభ్యులను ఆహ్వానించండి, మరియు భోజనాలు లేక కుటుంబ ప్రార్థన వంటి వాటి వద్ద కుటుంబ సమావేశమైనప్పుడు దానిని చర్చించండి.

చిత్రం
సియాంటమ్ హంతకునిగా గుర్తించబడ్డాడు

© The Book of Mormon for Young Readers, Seantum—The Murderer Is Discovered, by Briana Shawcroft; అనుకరించబడదు

ముద్రించు