రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 31–సెప్టెంబర్ 6: “ఆనందము యొక్క గొప్ప సంతోష వార్తలు”


“ఆగష్టు 31–సెప్టెంబర్ 6. హీలమన్ 13–16: ‘ఆనందము యొక్క గొప్ప సంతోష వార్తలు’” }రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఆగష్టు 31–సెప్టెంబర్ 6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020

చిత్రం
లేమనీయుడైన సమూయేలు గోడపై బోధించుట

ఆర్నాల్డ్ ఫ్రైబర్గ్ చేత లేమనీయుడైన సమూయేలు గోడపై బోధించుట

ఆగష్టు 31–సెప్టెంబర్ 6

హీలమన్ 13–16

“ఆనందము యొక్క గొప్ప సంతోష వార్తలు”

ఈ వారము మీ భావనలు వ్రాసినప్పుడు, హీలమన్ 13–16 లో సూత్రములు లేఖనాలలో మీరు నేర్చుకొంటున్న మిగిలిన విషయాలపై ఎలా నిర్మించబడి మరియు బలపరుస్తున్నాయో ఆలోచించండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

లేమనీయుడైన సమూయేలు మొదటిసారి జారహేమ్లలో “సంతోష వార్తలు” (హీలమన్ 13:7) పంచుకోవటానికి ప్రయత్నించినప్పుడు, అతడు ఖఠిన హృదయముగల నీఫైయుల చేత తిరస్కరించబడ్డాడు మరియు త్రోసివేయబడ్డాడు. సమూయేలు సందేశమును స్వీకరించకుండా నిరోధించుటకు వారి హృదయాల చుట్టూ ఒక అభేధ్యమైన గోడను వారు కట్టుకొన్నట్లుగా అది ఉన్నదని మీరు చెప్పవచ్చు. తాను చెప్పిన సందేశము యొక్క ప్రాముఖ్యతను సమూయేలు గ్రహించాడు మరియు “అతడు తిరిగి వెనుకకు వెళ్ళవలెనని, మరియు ప్రవచించవలెను ” (హీలమన్ 13:3) అన్న దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించుట ద్వారా విశ్వాసమును రుజువు చేసాడు. సమూయేలు చేసినట్లుగా, మనము “ప్రభువు యొక్క మార్గమును సిద్ధపరచి” (హీలమన్ 14:9) మరియు ఆయన ప్రవక్తలను అనుసరించుటకు ప్రయాసపడినప్పుడు మనమందరము అడ్డు గోడలను ఎదుర్కొంటాము. సమూయేలు వలే, మనము కూడా యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యము వహిస్తాము, “ఆయన నిశ్చయముగా వచ్చి,” “ఆయన నామముపై విశ్వసించిమని” (హీలమన్ 13:6; 14:13) అందరిని ఆహ్వానించును. అందరూ వినరు, మరియు కొందరు చురుకుగా మనల్ని వ్యతిరేకించవచ్చు. క్రీస్తునందు విశ్వాసముతో ఈ సందేశమునందు విశ్వసించు వారు అది “ఆనందము యొక్క గొప్ప సంతోష వార్తలు” (హీలమన్ 16:14) అని కనుగొంటారు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

హీలమన్ 13

ప్రభువు తన ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేయును.

లేఖనాలలో, కొన్నిసార్లు ప్రవక్తలు గోడ లేక గోపురముపై అపాయములను గూర్చి హెచ్చరించు కావలికాయు వారితో పోల్చబడ్డారు (యెషయా 62:6; యెహెజ్కేలు 33:1–7 చూడండి).

అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బ్యాలర్డ్ ఇలా ప్రకటించారు: “శతాబ్ధాలుగా, ప్రవక్తలు జనుల యెదుట ఉన్న అపాయములను గూర్చి హెచ్చరించినప్పుడు, ప్రవక్తలు తమ బాధ్యతను నెరవేర్చారు. ప్రభువు యొక్క అపొస్తలులు కావలి కాయుటకు, హెచ్చరించుటకు, మరియు జీవితపు ప్రశ్నలకు జవాబులను వెదకు వారికి సహాయపడుటకు బాధ్యత కలిగియున్నారు” (“God Is at the Helm,” Ensign or Liahona, నవం. 2015, 25).

మీరు హీలమన్ 13 అధ్యయనము చేసి, ధ్యానించినప్పుడు, సమూయేలు చేసిన అనేక హెచ్చరికలను మీరు గుర్తించవచ్చు. ఉదాహరణకు, పశ్చాత్తాపము గురించి, నమ్రత, ఐశ్వర్యము గురించి అతడు ఏమి బోధించాడు? ఈ హెచ్చరికలు మీకు ఎలా వర్తిస్తాయి? ఇటీవల ఆధునిక ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికలు ఏవి, మరియు ఆ హెచ్చరికలను గూర్చి మీరేమని భావిస్తున్నారు?

చిత్రం
అధ్యక్షులు రస్సల్ ఎమ్. నెల్సన్

ప్రవక్తలు మనల్ని యేసు క్రీస్తువైపుకు సూచిస్తారు.

హీలమన్ 13–15

పశ్చాత్తాపపడు వారి యెడల ప్రభువు కనికరము కలిగియున్నారు.

ఆరంభములో, రక్షకుని యొక్క రాకను గూర్చి సంతోషకరమైన వార్తలను పంచుకొనుటకు నీఫైయుల వద్దకు సమూయేలు పంపబడ్డాడు (హీలమన్ 13:7 చూడండి). వారు అతడిని తిరస్కరించారు కనుక, అతడు దేవుని యొక్క తీర్పులను గూర్చి కఠినమైన హెచ్చరికలతో తిరిగి వచ్చాడు. కానీ ఆ హెచ్చరికలు పశ్చాత్తాపపడాలనే కనికరముగల ఆహ్వానమును స్థిరముగా కలిగియున్నవి; హీలమన్ 13–15 అంతటా ఈ ఆహ్వానముల కొరకు చూడండి (హీలమన్ 13:6, 11; 14:15–19; 15:7–8 ప్రత్యేకంగా చూడండి). ఈ ఆహ్వానములు మీకు ఎలా వర్తిస్తాయి? పశ్చాత్తాపము గురించి ఈ వచనముల నుండి మీరేమి నేర్చుకున్నారు? పశ్చాత్తాపము నుండి వచ్చు దేవుని యొక్క కనికరమును మీరు ఎప్పుడు అనుభవించారు?

హీలమన్ 14; 16:13–23

సూచనలు మరియు అద్భుతాలు వారి హృదయాలను కఠినపరచుకొనని వారి యొక్క విశ్వాసమును బలపరచగలవు.

హీలమన్ 14 లో, సమూయేలు రక్షకుని జననము మరియు మరణము యొక్క సూచనలను ప్రభువు ఎందుకు ఇచ్చారో వివరించాడు: “ఆయన నామముపైన మీరు విశ్వసించు ఉద్దేశము నిమిత్తము” (హీలమన్ 14:12 ). మీరు హీలమన్ 14 అధ్యయనము చేసినప్పుడు, 1–8 వచనములు మరియు 20–28 వచనములలో ఆయన మరణమును గూర్చి సూచనలను గమనించండి. ఈ సూచనలు యేసు క్రీస్తు యొక్క జననము మరియు మరణమును సూచించుటకు ప్రభావవంతమైన విధానములుగా ఎందుకు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు?

ఆయనయందు విశ్వసించుటకు మీకు సహాయపడుటకు ప్రభువు ఇచ్చిన ఏవైనా సూచనలను గూర్చి మీరు ఆలోచించగలరా? ఉదాహరణకు, ప్రవక్తలు రక్షకుని యొక్క రెండవ రాకడ ముందు కనబడు సూచనలను ముందుగా చెప్పారు (“Signs of the Times,” Guide to the Scriptures, scriptures.ChurchofJesusChrist.org చూడండి). మన కాలములో ఈ సూచనలలో ఏవైనా నెరవేర్చబడ్డాయా? యేసు క్రీస్తునందు విశ్వాసమునకు నడిపించు ఇతర సూచనలు ఎక్కువ వ్యక్తిగతమైనవి మరియు తక్కువ గణనీయమైనవి కావచ్చు. మీ జీవితములో ఆయన ప్రభావమును మీరు చూసిన విధానములను ధ్యానించుటకు ఒక క్షణము తీసుకొనండి.

(హీలమన్ 16:13–23{)లో సూచనలను గూర్చి ఏ హెచ్చరిక ఇవ్వబడింది? ఈ వచనములలో వివరించబడిన జనుల యొక్క స్వభావమును మీరు ఎలా మానవచ్చు?

ఆల్మా 30:43–52 కూడా చూడండి; Ronald A. Rasband, “By Divine Design,” Ensign or Liahona, నవం. 2017, 55–57.

హీలమన్ 16

ప్రవక్త సలహాను అనుసరించడం నన్ను ప్రభువుకు దగ్గర చేస్తుంది.

ఎల్డర్ నీల్ ఎల్. ఆండర్సన్ ఇలా బోధించారు: “దేవుని ప్రవక్తల మాటలను నేను ప్రార్ధనాపూర్వకంగా, జాగ్రత్తగా అధ్యయనము చేసినప్పుడు, ఓపికతో, ఆయన ప్రేరేపించబడిన బోధనలతో ఆత్మీయంగా నా చిత్తమును విలీనము చేసినప్పుడు, ప్రభువైన యేసు క్రీస్తునందు నా విశ్వాసము ఎల్లప్పుడు హెచ్చింపబడునని నేను కనుగొన్నాను. ఆయన సలహాను నిర్లక్ష్యము చేయుటకు ఎన్నుకొని, మనకు బాగా తెలుసని తీర్మానించిన యెడల, మన విశ్వాసము బాధింపబడును మరియు మన నిత్య దృష్టికోణము మసకబారును” (“దేవుని ప్రవక్త,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2018, 26–27). హీలమన్ 16లో నీఫైయుల మాటలు మరియు క్రియలు ఎల్డర్ ఆండర్సన్ బోధించిన దానిని ఏవిధంగా నిర్ధారిస్తాయి? ప్రభువు యొక్క ప్రవక్తలు మరియు వారి సందేశాలను గూర్చి మీరు చేయాల్సిన వ్యక్తిగత ఒడంబడికలు ఏవని మీరు భావిస్తున్నారు?

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఆలోచనలు ఉన్నాయి.

హీలమన్ 13:3–4

హీలమన్ 13:3–4 లో ప్రభువు యొక్క ఆజ్ఞకు సమూయేలు స్పందన గురించి మీ కుటుంబాన్ని ప్రేరేపించిన దేమిటి? ఈ వారము మీ కుటుంబ అధ్యయనమందు, బహుశా మీరు “[వారి] హృదయములో వచ్చు” భావనలు పంచుకొనుటకు కుటుంబ సభ్యులను ప్రోత్సహించవచ్చు.

హీలమన్ 13:38

“అతిక్రమము చేయుటలో” సంతోషము కనుగొనబడుననే ఆలోచన మన కాలములో సాధారణంగా ఉన్నది. సువార్తను జీవించుట మనకు ఏ విధాలుగా నిజమైన సంతోషమును తెచ్చును?

హీలమన్ 15:3

దేవుని యొక్క దిద్దుబాటు మన కొరకు ఆయన ప్రేమను ఎలా చూపును? మెరుగుపరచుకొనుటకు వారు ఏమి చేయగలరో ప్రభువును వినయముగా అడగమని కుటుంబ సభ్యులను ఆహ్వానించండి.

హీలమన్ 15:5–8

ఈ వచనములలో వివరించబడిన లేమనీయుల పరివర్తన నుండి మనము ఏమి నేర్చుకోగలము? వారి మాదిరిని మనము ఎలా అనుసరించగలము?

హీలమన్ 16:1–3

లేమనీయుడై సమూయేలు వృత్తాంతమును అభినయించుటను మీ కుటుంబము ఆనందిస్తుందా? వృత్తాంతమును చదివిన తరువాత, కుటుంబ సభ్యులు ఒకరి తరువాత ఒకరు ఒక కుర్చీపై నిలబడి, సమూయేలు ప్రవచనాలలో కొన్నిటిని చదువుతుండగా, మిగిలిన కుటుంబ సభ్యులు బాణములు వేయుట లేక రాళ్లను విసరునట్లు నటించవచ్చు. సమూయేలు మరియు నీఫైయులు ఎలా భావించారో మీ కుటుంబము గ్రహించుటకు ఇది సహాయపడవచ్చు. చిన్న పిల్లలు కథ యొక్క చిత్రములను గీయుట కూడ ఆనందించవచ్చు. మనము సమూయేలు వలే ఉండి, మన భయాలను లక్ష్యపెట్టకుండా ఇతరులతో సువార్తను ఎలా పంచుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాధమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

విధానముల కొరకు చూడండి. ఒక విధానము ఒక ప్రణాళిక లేక నమూనా, అది ఒక కార్యమును నెరవేర్చుటకు ఒక మార్గదర్శిగా ఉపయోగించబడవచ్చు. లేఖనములందు, ప్రభువు తన కార్యమును నెరవేర్చుటను చూపు విధానములను మనము కనుగొంటాము, అది మనము జనులను హెచ్చరించుటకు ఆయన సేవకులను పంపుట వంటిది.

చిత్రం
లేమనీయుడైన సమూయేలు బోధించుట

© The Book of Mormon for Young Readers,బ్రైయానా షాక్రాఫ్ట్ చేత లేమనీయుడైన సమూయేలు బోధించుట,; అనుకరించబడదు

ముద్రించు