రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబర్ 7–13. 3 నీఫై 1–7: “నీ తల పైకెత్తి ఆనందించుము”


సెప్టెంబర్ 7–13. 3 నీఫై 1–7: “నీ తల పైకెత్తి ఆనందించుము”, రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

”సెప్టెంబర్ 7–13. 3 నీఫై 1–7,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
ఏ రాత్రి లేని ఒక దినమును నీఫైయులు చూస్తారు

ఒక పగలు, ఒక రాత్రి, మరియు ఒక పగలు, జార్జ్ కొక్కో చేత

సెప్టెంబర్ 7–13

3 నీఫై 1–7

“నీ తల పైకెత్తి ఆనందించుము”

నీఫైయులు ఆశ్చర్యకరమైన సూచనలను చూసారు, కాని కాలక్రమేణ వారు అనుభవించిన వాటిని మరిచిపోయారు (3 నీఫై 2:1 చూడండి). మీ మనోభావాలను నమోదు చేయడం, 3 నీఫై 1–7 చదువుతున్నప్పుడు మీ ఆత్మీయ అనుభవాలను గుర్తు చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

మీ మనోభావాలను నమోదు చేయండి.

కొన్ని విధాలుగా, యేసు క్రీస్తు నందు విశ్వసించు వారిగా ఉండేందుకు ఇది ఆందోశనకరమైన సమయముగా ఉండెను. ప్రవచనాలు నెరవేరుతున్నాయి—జనుల మధ్య గొప్ప సూచనలు మరియు అద్భుత కార్యాలు త్వరలో రక్షకుడు జన్మించబోతున్నాడని సూచిస్తున్నాయి. మరొక ప్రక్క విశ్వాసులకు ఇది ఆందోళనకరమైన సమయముగా ఉంది, ఎందుకంటే ఎన్ని అద్భుతాలు జరిగినప్పటికీ రక్షకుడు పుట్టే “సమయము గతించిపోయినదని“ అవిశ్వాసులు పట్టుబట్టారు (3 నీఫై 1:5). ఈ జనులు “దేశమంతటా ఒక గొప్ప అలజడి సృష్టించారు” (3 నీఫై 1:7) మరియు సమూయేలు ప్రవక్త ద్వారా ఇవ్వబడిన సూచన—చీకటిలేని ఒక రాత్రి—కనిపించని యెడల, విశ్వసించిన వారందరిని చంపాలని ఒక దినమును నియమించారు.

ఈ క్లిష్ట పరిస్థితులలో, ప్రవక్త నీఫై ”అతని జనుల నిమిత్తము తన దేవునికి బలముగా మొరపెట్టెను” (3 నీఫై 1:11). హింసను లేక సందేహమును ఎదుర్కొంటూ, వెలుగు చీకటిని పారద్రోలునని తెలుసుకోవలసిన వారికి ఎవరికైనా ప్రభువు యొక్క సమాధానము ప్రేరణనిస్తుంది: “నీ తల పైకెత్తి ఆనందించుము; … నేను నా పరిశుద్ధ ప్రవక్తల నోటిద్వారా పలుకబడునట్లు చేసిన ఆ సమస్తమును నెరవేర్చెదను“ (3 నీఫై 1:13).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

3 నీఫై 1:4–21; 5:1–3

ప్రభువు తన మాటలన్నిటిని నెరవేర్చును.

3 నీఫై 1–7 లో చెప్పబడిన సమయమందున్న విశ్వాసులలో మీరు ఒకరైతే మీరెలా భావించియుండవచ్చని అనుకుంటున్నారు? ఉదాహరణకు, రక్షకుని జననమును ప్రకటించు చీకటి లేని రాత్రి కోసం వేచియుండి, అది జరుగకపోతే మీరు చంపబడతారని తెలిస్తే ఎలా అనిపించియుండేది? 3 నీఫై1:4–21 మరియు 5:1–3 మీరు చదువుతున్నప్పుడు, ఈ కష్ట సమయాల్లో తమ విశ్వాసాన్ని నిలుపుకోవడానికి నీఫై మరియు ఇతర విశ్వాసులు చేసిన దానికొరకు చూడండి. ప్రభువు వారిని ఏవిధంగా దీవించారు? ప్రభువు చేత వాగ్దానం చేయబడిన దీవెనల కొరకు మీరు వేచియున్నప్పుడు, మీకు సహాయపడునట్లు మీరు ఏమి నేర్చుకుంటారు?

3 నీఫై 1:22; 2:1–3

ఆత్మీయ అనుభవాలను మరచిపోవడం నన్ను సాతాను శోధనలకు గురిచేస్తుంది.

చీకటిలేని ఒక రాత్రి వంటి అద్భుతాన్ని చూడడం చాలాకాలం పాటు మీతో నిలిచియుండి, మీ సాక్ష్యానికి లంగరు కాగలదని మీరు అనుకోవచ్చు. కానీ నీఫైయులు చూసిన సూచనలు మరియు అద్భుతాల జ్ఞాపకాలు కాలంతో పాటు అదృశ్యమైపోతున్నట్లు అనిపించింది. వారు మరచిపోయేలా చేసినదేమిటి, మరియు మరచిపోయినందుకు ఫలితాలేవి? (3 నీఫై 1:22; 2:1–3 చూడండి).

మీరు చూసిన ఆత్మీయ సత్యాలను జ్ఞాపకముంచుకొని, క్రొత్తవిగా చేసుకోవడానికి మీరేమి చేస్తున్నారు? ఉదాహరణకు, మీ ఆత్మీయ అనుభవాలను నమోదు చేయడం ఏవిధంగా సహాయపడగలదో ఆలోచించండి. వారు విశ్వసించుటకు సహాయపడునట్లు మీకు దగ్గరైన వారితో మీ సాక్ష్యాన్ని మీరెలా పంచుకుంటారు?

ఆల్మా 5:6; హెన్రీ బి. ఐరింగ్, “O Remember, Remember,” ఎన్ సైన్ or లియహోనా, నవ. 2007, 66–69; నీల్ ఎల్. ఆండర్సన్, “Faith Is Not by Chance, but by Choice,” ఎన్ సైన్ or లియహోనా, నవ. 2015, 65–68 కూడా చూడండి.

3 నీఫై 2:11–12; 3:1–26; 5:24–26

ఆత్మీయ అపాయాలకు వ్యతిరేకంగా ప్రభువు తన పరిశుద్ధులను బలపరుస్తారు.

మన రోజులలో, సాధారణంగా మన ఇళ్ళను వదిలిపెట్టి, ఒక ప్రదేశంలో సమకూడేలా మనల్ని బలవంతపెట్టే దోపిడీ ముఠాలను మనము ఎదుర్కోము. కానీ మనం ఆత్మీయ అపాయాలను ఎదుర్కొంటాము, మరియు నీఫైయుల అనుభవం మనకు సహాయపడగల పాఠాలను కలిగియుండవచ్చు. మీరు 3 నీఫై 2:11–12 మరియు 3:1–26 చదువుతున్నప్పుడు ఈ పాఠాల కొరకు చూడండి.

3 నీఫై 5:24–26 లో కడవరి దినాలలో ప్రభువు జనులు సమకూడుట గురించి మనం చదువుతాము. నేడు తన జనులను ప్రభువు ఏవిధంగా సమకూర్చుతున్నారనే దాని గురించి ఈ వచనాలు ఏమి బోధిస్తున్నాయి?

యౌవనుల కొరకు ప్రపంచవ్యాప్త భక్తి సమావేశము: అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ మరియు సహోదరి వెండీ డబ్ల్యు. నెల్సన్ నుండి సందేశములు,” జూన్ 3, 2018, ChurchofJesusChrist.org; “ఇశ్రాయేలు—ఇశ్రాయేలు సమకూడిక,” లేఖన మార్గదర్శి, scriptures.ChurchofJesusChrist.org కూడా చూడండి.

3 నీఫై 5:12–26; 7:15–26

నేను యేసు క్రీస్తు శిష్యుడను.

యేసు క్రీస్తు శిష్యునిగా ఉండడమంటే అర్థమేమిటని మీరనుకుంటున్నారు? (సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5 చూడండి). 3 నీఫై 5:12–26 లో మోర్మన్ తాను సంక్షేపము చేస్తున్న నీఫైయుల గ్రంథాన్ని మధ్యలో ఆటంకపరచి, తాను యేసు క్రీస్తు శిష్యుడనని ప్రకటించాడు. తరువాత 3 నీఫై 7:15–26 లో మరొక శిష్యుడు—ప్రవక్తయైన నీఫై యొక్క పరిచర్యను అతడు వివరించాడు. క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండడమంటే అర్థమేమిటో మీరు గ్రహించడానికి సహాయపడేలా ఈ రెండు భాగాలలో మీరేమి కనుగొంటారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు ఇంట్లో కుటుంబంతో సాయంత్రము కొరకు ఆలోచనలు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

3 నీఫై 3:13–14, 25–26

వారు ఎదుర్కొన్న శత్రువు నుండి తమనుతాము రక్షించుకోవడానికి నీఫైయులు ఏమి చేసారు? లోకములోని చెడు నుండి మన ఇంటిని ఒక సురక్షిత ప్రదేశంగా మరియు రక్షణగా చేయడానికి మనమేమి చేస్తున్నాము?

3 నీఫై 2:1–3; 6:15–17

సాతాను మనల్ని ఎలా మోసం చేస్తాడో మీ కుటుంబం నేర్చుకొనేలా సహాయపడేందుకు ఒక శరీర ఆకారాన్ని గీయండి, మరియు మీ కుటుంబం 3 నీఫై 2:1–3 మరియు 6:15–17 చదువుతున్నప్పుడు, అందులో చెప్పబడినట్లు వివిధ శరీర భాగాలను గుర్తించండి. ఈ వచనాల ప్రకారం, దేవుడిని మరచిపోయి, పాపం వైపు తిరుగునట్లు సాతాను మనల్ని శోధించు కొన్ని విధానాలేవి?

3 నీఫై 4:7–12, 30–33

గాడియాంటన్ దొంగలు రావడం చూసినప్పుడు నీఫైయులు ఏమి చేసారు? మనం కష్టమైన సందర్భాలను ఎదుర్కొన్నప్పుడు, నీఫైయుల నుండి మన కుటుంబం ఏమి నేర్చుకోగలదు? వారి కష్ట సమయంలో ప్రభువు వారికి సహాయపడిన తర్వాత, నీఫైయుల మాటల నుండి మనమేమి నేర్చుకోగలము?

3 నీఫై 5:13; సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5

3 నీఫై 5:13 మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 41:5 చదవండి, మరియు క్రీస్తు యొక్క శిష్యునిగా ఉండడమంటే అర్థమేమిటో చర్చించండి. వారు శిష్యులుగా ఉన్నప్పుడు ఒకరినొకరు గమనించిన సందర్భాల గురించి కుటుంబ సభ్యులు మాట్లాడుకోవచ్చు. మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే, “నేను యేసు క్రీస్తు శిష్యుడను“ అని తెలిపే బ్యాడ్జిలను తయారు చేసి, వారు రక్షకుని అనుసరిస్తున్నట్లుగా మీరు గమనించినప్పుడల్లా వారు ఆ బ్యాడ్జిలు ధరించేలా చేయవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లోని ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

లేఖనములను తమతో సరిపోల్చునట్లు మీ కుటుంబానికి సహాయపడండి. ”అవి మాకు ప్రయోజనకరముగాను మరియు నేర్చుకొనుటకు ఉండునట్లు లేఖనములన్నిటినీ మాతో పోల్చుకొంటిని,” అని నీఫై చెప్పెను (1 నీఫై 19:23). లేఖనములను వారితో పోల్చుకోవడానికి మీ కుటుంబానికి సహాయపడేందుకు, 3 నీఫై 1:4–9 లో చెప్పబడిన విశ్వాసుల మధ్య వారు ఉన్నట్లయితే వారు ఏమి చేసియుండేవారో ధ్యానించమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. (రక్షకుని విధానంలో బోధించుట, 21 చూడండి.)

చిత్రం
ఏ రాత్రి లేని ఒక దినమును నీఫైయులు చూచెదరు

ఒక పగలు, ఒక రాత్రి, మరియు ఒక పగలు, వాల్టర్ రేన్ చేత

ముద్రించు