సెప్టెంబర్ 21–27. 3 నీఫై 12–16: “నేనే ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“సెప్టెంబర్ 21–27. 3 నీఫై 12–16: “ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020
సెప్టెంబర్ 21–27
3 నీఫై 12–16
“నేనే ధర్మశాస్త్రమును, వెలుగునైయున్నాను”
3 నీ 12–16 లో కనుగొనుటకు అనేక సూత్రములున్నాయి. ఈ సంక్షిప్తమైన వర్ణనలో కొన్ని ప్రధానంగా గుర్తించబడినవి, కానీ మీరు మిగిలినవి కనుగొనవచ్చు. పరలోక తండ్రి ఆయన ఆత్మ ద్వారా ఇప్పుడు మీకు అవసరమైన దానిని బోధించనియ్యండి.
మీ మనోభావాలను వ్రాయండి
గలిలయ కొండవద్ద సమావేశమైన యేసు యొక్క శిష్యుల వలే, సమృద్ధి దేశములో దేవాలయము వద్ద సమావేశమైన జనులు మోషే ధర్మశాస్త్రము ప్రకారము జీవించారు. అది వారి ఆత్మలను క్రీస్తుకు సూచించును కనుక వారు దానిని అనుసరించారు (జేకబ్ 4:5 చూడుము), మరియు ఇప్పుడు ఒక ఉన్నతమైన ధర్మశాస్త్రమును ప్రకటిస్తూ, క్రీస్తు వారి యెదుట నిలబడెను. కానీ మోషే ధర్మశాస్త్రము ఎన్నడూ జీవించని మనము కూడ యేసు తన శిష్యుల కొరకు ఉంచిన ప్రమాణము ఎక్కువ ఉన్నతమైనదని గుర్తించవచ్చు. “మీరును పరిపూర్ణులు కావలెనని నేను కోరుచున్నాను,” (3 నీఫై 12:48) అని ఆయన ప్రకటించెను. ఇది సరిపోదని మీరు భావిస్తే, యేసు ఇలా కూడ చెప్పెనని జ్ఞాపకముంచుకొనండి, “ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది” (3 నీఫై 12:3). మరొకవిధంగా చెప్పుచూ—ఈ మహోన్నతమైన ధర్మశాస్త్రము ఒక ఆహ్వానాన్ని కలిగియున్నది, “నా యొద్దకు రండి మరియు రక్షణ పొందుడి” (3 నీఫై 12:20). మోషే ధర్మశాస్త్రము వలే, ఈ ధర్మశాస్త్రము మనల్ని క్రీస్తు వైపు సూచిస్తుంది—మనల్ని రక్షించి మరియు మనల్ని పరిపూర్ణులుగా చేయు ఏకైక వ్యక్తి. “ఇదిగో,” “నేనే ధర్మశాస్త్రమును వెలుగునైయున్నాను. నావైపు చూడుడి మరియు అంతము వరకు స్థిరముగానుండుడి మరియు మీరు జీవించెదరు” (3 నీఫై 15:9) అని ఆయన చెప్పెను.
వ్యక్తిగత అధ్యయనము కొరకు ఉపాయములు
ఒక నిజమైన శిష్యునిగా ఎలా ఉండాలో రక్షకుని బోధనలు నాకు చూపిస్తాయి.
3 నీఫై 12–14 లో అనేక సత్యములు, సలహా మాటలు, హెచ్చరికలు ఉన్నాయి. ఈ అధ్యాయములలో రక్షకుడు బోధించిన దానిని అధ్యయనము చేయుటకు మరియు అన్వయించుకొనుటకు ఒక విధానము ఇక్కడున్నది: వచనముల గుంపును ఎంచుకొని, “యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు …” అని ప్రారంభి ఒక వాక్యములో వచనములు బోధించు దానిని మీరు సంక్షిప్తపరచగలరేమో చూడండి, ఉదాహరణకు 3 నీఫై 14:1–5 యొక్క సంగ్రహము ఇలా ఉండవచ్చు, “యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యులు విమర్శకులుగా ఉండరు.” మీకు ప్రత్యేకంగా అర్ధవంతమైనది, ఈ అధ్యాయములనుండి ఒక వచనమును ఎంపిక చేసి, దానిని కంఠస్తము చేయుటకు లేక దానిని వ్రాసి, తరచుగా మీరు చూసే చోట దానిని ఉంచుటకు కోరవచ్చు. యేసు క్రీస్తు యొక్క మంచి శిష్యునిగా ఉండుటకు మీ వ్యక్తిగత ప్రయత్నములకు మీరు నేర్చుకొన్నదానిని ఎలా అన్వయించగలరో లోతుగా ధ్యానించండి.
మత్తయి 5–7; లూకా 6:20–49 కూడా చూడండి.
3 నీఫై 12:1–2; 15:23–24; 16:1–6
చూడకుండా విశ్వసించు వారు ఆశీర్వదించబడుదురు.
దేవుని పిల్లల యొక్క మొత్తము సంఖ్యతో పోలిస్తే, చాలా తక్కువమంది రక్షకుని చూసారు, సమృద్ధి దేశములోని జనులు చూసినట్లుగా, ఆయన స్వరమును విన్నారు. మనలో అనేకులు 3 నీఫై 12:2; 15:23; మరియు 16:4–6 లో వర్ణించబడిన జనుల వలే ఎక్కువగా ఉన్నారు. ఈ వచనములలో అటువంటి జనులకు ఏ వాగ్దానములు చేయబడినవి? ఈ వాగ్దానములు మీ జీవితంలో ఏవిధంగా నెరవేర్చబడినవి?
యోహాను 20:26–29; 2 నీఫై 26:12–13; ఆల్మా 32:16–18 కూడా చూడండి.
3 నీఫై 12:21–30; 13:1–8, 16–18; 14:21–23
నీతిగల క్రియలు సరిపోపు: నా హృదయము కూడా శుద్ధిగా ఉండాలి.
ఈ అధ్యాయాలలో మీరు గుర్తించగల ఒక విషయము, ఒక ఉన్నతమైన ధర్మశాస్త్రమును జీవించుటకు రక్షకుని యొక్క ఆహ్వానము—మన బాహ్య క్రియలందు మాత్రమే కాదు కానీ మన హృదయములందు కూడ నీతిగా ఉండాలి. రక్షకుడు వివాదము గురించి మాట్లాడినప్పుడు ఈ విషయము కొరకు వెతకండి (3 నీఫై 12:21–26), దుర్నీతి (3 నీఫై 12:27–30), ప్రార్థన (3 నీఫై 13:5–8), మరియు ఉపవాసము (3 నీఫై 13:16–18). మీరు కనుగొనగల ఇతర మాదిరులేవి? బాహ్య క్రియలపై మాత్రమే దృష్టిసారించుటకు బదులుగా మీ హృదయపు కోరికలను శుద్ధి చేయుటకు మీరేమి చేయగలరు?
నేను పరలోక తండ్రి నుండి “మంచి విషయాలను” వెతకిన యెడల, నేను పొందుతాను.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా చెప్పారు: “దేవుడు నిజముగా మీతో మాట్లాడాలని కోరుతున్నారా? అవును! … ఓహ్, మీ పరలోకమందున్న తండ్రి మీరు చాలా ఎక్కువగా తెలుసుకోవాలని కోరుతున్నారు” (“సంఘము కొరకు బయల్పాటు, మన జీవితాల కొరకు బయల్పాటు,” ఎన్‌సైన్ లేదాలియహోనా మే 2018, 95). అడుగమని, వెతకమని, మరియు తట్టమని 3 నీఫై 14:7–11 లో ప్రభువు యొక్క ఆహ్వానమును మీరు చదివినప్పుడు, ఏ “మంచి విషయాలను,” మీరు అడగాలని ఆయన కోరియుండవచ్చు. మీరు ఎలా అడగాలి, వెతకాలి మరియు తట్టాలో గ్రహించుటకు క్రింది లేఖనాలు మీకు సహాయపడవచ్చు. మీరు ఆశించిన రీతిలో కొన్ని ప్రార్థనలు ఎందుకు జవాబివ్వబడుట లేదో వివరించుటకు కూడా అవి సహాయపడగలవు: యెషయా 55:8–9; హీలమన్ 10:5; మొరోనై 7:26–27, 33, 37; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 9:7–9.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలను చదివినప్పుడు, మీ కుటుంబము యొక్క అవసరతలను తీర్చుటకు బదులుగా ఏ సూత్రములను ప్రత్యేకించి చూపి మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడును. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
3 నీఫై 12:48
ఎల్డర్ జెఫ్రి ఆర్. హాల్లెండ్ యొక్క సందేశము “చివరకు—మీరు కూడా పరిపూర్ణులు కండి” (ఎన్‌సైన్ లేదా లియహోనా నవం. 2017, 40–42) ఈ వచనములోని రక్షకుని మాటలను గ్రహించుటకు మనకు ఎలా సహాయపడతాయి? మొరోనై 10:32–33 లో కూడా మీరు సహాయము కనుగొనగలరు.
3 నీఫై 12:9, 38–42; 14:3–5, 12
కుటుంబ సభ్యుల మధ్య జరిగే పరస్పర చర్యలకు ఈ వచనాలు ఎలా వర్తిస్తాయి? బహుశా ఈ సూత్రముల చేత ఎక్కువ విశ్వసనీయంగా జీవించుటకు మీ కుటుంబము కలిసి కొన్ని లక్ష్యములను ఏర్పరచగలదు.
3 నీఫై 13:19–21
ఈ వచనాలు మీ కుటుంబము దేనికి విలువిస్తుందో ఒక చర్చను ప్రేరేపించవచ్చు. పరలోకములో సంపదలు కూర్చుకొనకుండా ఆపివేయు భూమి మీద కొన్ని సంపదలు ఉన్నాయా? నిత్య విలువగల సంపదలను గూర్చి మీ కుటుంబ సభ్యులకు జ్ఞాపకం చేయునట్లు మీ గృహములో వస్తువులను కనుగొనుటకు నిధి వెదకుటకు కుటుంబమును నడిపించుట ద్వారా ఈ విషయమును మీరు బలపరచవచ్చు.
3 నీఫై 14:7–11
చిన్న పిల్లలు 3 నీఫై 14:8–9, చేత ప్రేరేపించబడిన, ఒక ఆటను ఆనందించగలరు, దానిలో వారు దేనికొరకైన అడగవచ్చు మరియు పూర్తిగా భిన్నమైన దానిని పొందవచ్చు. ఆయన ఈ మాదిరిని పంచుకున్నప్పుడు మన పరలోకమందున్న తండ్రి గురించి మనము ఏమి తెలుసుకోవాలని రక్షకుడు కోరుతున్నాడు?
3 నీఫై 14:15–20
జోసెఫ్ స్మిత్, లేక ప్రస్తుత సంఘ అధ్యక్షులు నిజమైన ప్రవక్త అని తెలుసుకొనుటకు ఏ “మంచి ఫలము” మనకు సహాయపడుతుంది?
3 నీఫై 14:24–27
ఈ వచనములలో ఉపమానమును దృశ్యీకరించుటకు మీ కుటుంబానికి మీరు సహాయపడగల విధానములను గూర్చి ఆలోచించండి. బహుశా కుటుంబ సభ్యులు బొమ్మలు గీయవచ్చు, నటించవచ్చు, లేక గట్టి మరియు ఇసుక పునాదులపై వస్తువులను కట్టవచ్చు.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సాారాంశం చూడండి.