రండి, నన్ను అనుసరించండి
సెప్టెంబర్ 28–అక్టోబర్ 11. 3 నీఫై 17–19: “ఇదిగో నా సంతోషము సంపూర్ణమాయెను”


“సెప్టెంబర్ 28–అక్టోబర్ 11. 3 నీఫై 17–19: ‘ఇదిగో నా సంతోషము సంపూర్ణమాయెను,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“సెప్టెంబర్ 28–అక్టోబర్ 11. 3 నీఫై 17–19: “ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020

యేసు నీఫైయులకు ప్రత్యక్షమగుట

గారీ ఎల్.కాప్ చేత ఆయన ముఖము యొక్క కాంతి వారిపై ప్రకాశించెను

సెప్టెంబర్ 28–అక్టోబర్ 11

3 నీఫై 17–19

“ఇదిగో నా సంతోషము సంపూర్ణమాయెను”

3 నీఫైలో ముందు అధ్యాయములు రక్షకుని మాటలపై ప్రధానంగా దృష్టిసారించియుండగా, అధ్యాయములు 17–19 జనుల మధ్య ఆయన పరిచర్య మరియు బోధనలను వివరించును. మీరు ఈ అధ్యాయములు చదివినప్పుడు, రక్షకుని గురించి ఆత్మ మీకు ఏమి బోధించును?

మీ మనోభావాలను నమోదు చేయండి

యేసు క్రీస్తు సమృద్ధి దేశములో పరిచర్య చేస్తూ, ఆయన సువార్తను బోధిస్తూ, ఆయన పునరుత్థానము చెందిన గుర్తులను చూచుటకు మరియు ముట్టుకొనుటకు ఒక అవకాశమును జనులకిస్తూ, మరియు తానే వాగ్దానము చేయబడిన రక్షకునిగా సాక్ష్యమిస్తూ ఆ రోజును గడిపెను. ఇప్పుడు ఆయన బయలుదేరి వెళ్లు సమయము వచ్చింది. ఆయన తన తండ్రి వద్దకు తిరిగి వెళ్లాల్సిన అవసరమున్నది, మరియు ఆయన బోధించిన దానిని ధ్యానించుటకు జనులకు సమయము అవసరమని ఆయన ఎరుగును. మరుసటి రోజు తిరిగి వస్తానని వాగ్దానమిస్తూ, ఆయన వారి ఇండ్లకు సమూహమును పంపారు. కానీ ఎవరూ వెళ్లలేదు. వారేమి భావిస్తున్నారో వారు చెప్పలేదు, కానీ యేసు దానిని గ్రహించగలిగెను: ఆయన “మరికొంతసేపు వారితో నిలిచియుండుటకు” (3 నీఫై 17:5) వారు ఆశించారు. ఆయనకు చేయటానికి ఇతర ముఖ్యమైన విషయాలున్నాయి, కానీ కనికరము చూపే అవకాశము సౌకర్యముగల సమయంలో ఎల్లప్పుడు రాదు, కనుక యేసు జనులతో ఇంకాస్త సమయం ఉన్నారు. తరువాత జరిగినది బహుశా లేఖనములో వ్రాయబడిన పరిచర్యలో మిక్కిలి కనికరముగల మాదిరి. అక్కడ హాజరమైన వారు మాత్రమే అది వర్ణింపలేనిదని చెప్పగలరు (నీఫై 17:16–17{ చూడండి). ప్రణాళిక చేయబడని ఆత్మీయ క్రుమ్మరింపును యేసు తానే ఈ సాధారణమైన మాటలతో సంక్షిప్తపరచెను: “ఇదిగో నా సంతోషము సంపూర్ణమాయెను” (3 నీఫై 17:20)

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

3 నీఫై 17

రక్షకుడు పరిచర్య చేయుటకు నా పరిపూర్ణమైన మాదిరి.

అక్కడ దాదాపు 2,500 జనులున్నారని మనకు తెలుసు (3 నీఫై 17:25 చూడండి), వారు 3 నీఫై 11–18 లో వ్రాయబడినట్లుగా, క్రీస్తు యొక్క మొదటి సందర్శనను అనుభవించారు. అయినప్పటికినీ రక్షకుడు వ్యక్తిగతంగా పరిచర్య చేయుటకు ఒక విధానము కనుగొనెను. ఈ అధ్యాయములో రక్షకుని మాదిరి నుండి పరిచర్య గురించి మీరేమి నేర్చుకున్నారు? ఆయన పరిచర్య చేసిన అవసరతలేమిటి? మీరు ఇతరులకు పరిచర్య చేయుటకు ఆయన మాదిరి మీకు ఎలా సహాయపడగలదో ధ్యానించండి.

యేసు నీఫైయుల పిల్లలను దీవించుట

గారీ ఎల్. కాప్ చేత మీ చిన్నవారిని చూడుడి

3 నీఫై 17:13–22; 18:15–25; 19:6–9, 15–36

ఎలా ప్రార్థించాలో రక్షకుడు మనకు బోధించెను.

రక్షకుడు మీ కొరకు ప్రార్థించుటను వినుట ఎలా ఉంటుందో ఊహించండి. మీ తరఫున ఆయన ఏమి చెప్పును? ఈ అధ్యాయాలలో ఆయన బోధనలు మరియు ప్రార్థనలు మీకు ఒక ఆలోచనను ఇవ్వవచ్చు. మీరు చదివినప్పుడు, మీ స్వంత ప్రార్థనలు ఎక్కువ అర్ధవంతమైనవిగా చేయునట్లు క్రీస్తు యొక్క మాదిరినుండి మీరేమి నేర్చుకోగలరు? మీ జీవితములో ప్రార్థన నుండి ఏ దీవెనలు మీరు చూసారు?

3 నీఫై 18:1-12

నేను సంస్కారమును తీసుకొన్నప్పుడు నేను ఆత్మీయంగా పోషింపబడతాను.

3 నీఫై 18:1–12 మీరు చదివినప్పుడు, సంస్కారము తీసుకొనుట మీరు ఆత్మీయంగా “పోషింపబడుటకు” (3 నీఫై 18:3–5, 9; 3 నీఫై 20:1–9 కూడా చూడండి) ఎలా సహాయపడుతుందో ధ్యానించండి. ఉదాహరణకు, మీరు సంస్కారము తీసుకొన్నప్పుడు వ్యక్తిగత ఆలోచనను ప్రేరేపించుటకు ప్రశ్నల జాబితాను మీరు చేయవచ్చు, అవి “రక్షకుడు మరియు నా కొరకు ఆయన త్యాగము గురించి నేనేవిధంగా భావిస్తున్నాను?” “ఆయన త్యాగము నా అనుదిన జీవితమును ఎలా ప్రభావితం చేస్తున్నది?” లేక “ఒక శిష్యునిగా నేను ఏది బాగా చేస్తున్నాను, మరియు నేను దేనిని మెరుగుపరుచుకోవాలి?” వంటివి.

అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ నుండి ఈ మాటలు మీరు ఆత్మీయంగా పోషించబడుటకు సంస్కారము సహాయపడగల ఒక విధానము మీరు ధ్యానించుటకు సహాయపడవచ్చు: “సంస్కార విధియందు మీ జీవితమును మీరు పరిశీలించినప్పుడు, మీ ఆలోచనలు మీరు చేసిన తప్పుపై మాత్రమే కాదు కానీ మీరు సరైనది చేసిన విషయాలపై కూడా కేంద్రీకరించాలి—పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు మిమ్మల్ని బట్టి సంతోషించినట్లు మీరు భావించినప్పుడు క్షణములు. ఈ విషయాలు చూచుటకు మీకు సహాయపడుటకు దేవునిని అడుగుటకు కూడా ఒక క్షణము మీరు తీసుకోవచ్చు. … నేను దీనిని చేసినప్పుడు, నేనింకా పరిపూర్ణముగా లేనప్పటికినీ, నేను నిన్నటికంటే ఈ రోజు మెరుగ్గా ఉన్నానని ఆత్మ నాకు అభయమిచ్చింది. రక్షకుని వలన, నేను రేపు ఇంకా మెరుగ్గా ఉండగలనని, ఇది నాకు విశ్వాసమిచ్చింది” (“Always Remember Him,” Ensign, Feb. 2018, 5).

3 నీఫై 18:36–37; 19:6–22

యేసు క్రీస్తు యొక్క శిష్యులు పరిశుద్ధాత్మ యొక్క వరమును వెదకుతారు.

ఇటీవల మీరు చేసిన ప్రార్థన గురించి ఆలోచించండి. మీ లోతైన కోరికలను గూర్చి మీ ప్రార్థనలు మీకేమి బోధిస్తాయి? రక్షకుని సమక్షములో ఒక రోజు గడిపిన తరువాత, సమూహము “అధికముగా కోరిక కలిగిన దాని కొరకు వారు ప్రార్థన చేసిరి”—పరిశుద్ధాత్మ యొక్క వరము (3 నీఫై 19:9). ఈ లేఖన భాగములను మీరు చదివినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కొరకు మీ స్వంత కోరికను ధ్యానించండి. పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును వెదకుట గురించి మీరేమి నేర్చుకున్నారు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

3 నీఫై 17

కుటుంబముగా ఈ అధ్యాయము చదివినప్పుడు, ఈ సంఘటనలను ప్రత్యక్షంగా అనుభవించినట్లుగా ఊహించుటకు ఎప్పటికప్పుడు మీ కుటుంబాన్నిఆహ్వానించుటకు క్షణంసేపు ఆగుటకు పరిగణించండి. ఉదాహరణకు, “స్వస్థపరచబడుటకు రక్షకుని వద్దకు ఏ బాధలను మీరు తీసుకొనివస్తారు?” వంటి ప్రశ్నలు మీరు అడగవచ్చు. “మీ తరఫున ఆయన ఏమని ప్రార్థన చేయాలని మీరు కోరతారు?” లేక “ఏ ప్రియమైన వారిని ఆయన దీవించాలని మీరు కోరతారు?” ఈ అధ్యాయము చదువుట యేసు చేసినట్లుగా, వ్యక్తిగతంగా మీ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించుటకు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.

3 నీఫై 18:1–12

సంస్కారములో పాల్గొనుట ద్వారా “పోషించబడుట” అనగా అర్ధమేమిటి, మరియు మనము దానిని ఎలా అనుభూతిచెందుతాము? సంస్కారము యొక్క విధిని యేసు మనకు ఎందుకు ఇచ్చారో 5–7 వచనములు నుండి మనము ఏమి నేర్చుకుంటాము?

3 నీఫై 18:17–21

ప్రార్థన యొక్క ఉద్దేశ్యము గురించి ఈ వచనముల నుండి మనము ఏమి నేర్చుకుంటాము? వ్యక్తిగతంగా మరియు కుటుంబముగా, రెండిటిలో మన ప్రార్థనల యొక్క ఆత్మీయ శక్తిని మనము ఎలా మెరుగుపరచగలము?

3 నీఫై 18:25; 19:1–3.

సువార్త ద్వారా మనము కుటుంబము అనుభవించినది, మన చుట్టూ ఉన్న ప్రతీఒక్కరు కూడా అనుభవించాలని మనము కోరుకునేదేమిటి? సువార్తలో మనము కనుగొన్నదానిని వారు కూడా“ముట్టుకొని మరియు చూచునట్లు” (3 నీఫై18:25) ఈ వచనములలో జనుల యొక్క మాదిరిని మనము ఎలా అనుసరించగలము మరియు ఇతరులను క్రీస్తు నొద్దకు తెచ్చుటకు “మిక్కిలి ప్రయాసపడగలము?” (3 నీఫై 19:3)

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

ఆత్మ మీ అధ్యయనమును నడిపించనియ్యండి. ప్రతీరోజు మీరు నేర్చుకోవాల్సిన విషయాల వైపు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించగలదు. మీరు సాధారణంగా చదివేదానికి భిన్నమైన విధానములో వేరే విషయమును చదువుటకు లేక అధ్యయనము చేయుటకు అవి సూచించినట్లు కనబడినప్పటికినీ కూడా, ఆయన ప్రేరేపణలకు సున్నితంగా ఉండండి. ఉదాహరణకు, 3 నీఫై 18లో సంస్కారము గురించి మీరు చదివినప్పుడు, మీరు ప్రణాళిక చేసిన దానికంటే ఎక్కువ సమయము గడుపుటకు ఆత్మ మిమ్మల్ని ప్రేరేపించవచ్చు.

యేసు మరియు నీఫైయుల పిల్లలను చుట్టుముట్టిన దేవదూతలు

వాల్టర్ రేని చేత పరలోకములు తెరవబడుట వారు చూసారు