“అక్టోబర్ 19–25. 3 నీఫై 27–4 నీఫై: ‘అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“అక్టోబర్ 19–25. 3 నీఫై 27–4 నీఫై,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
అక్టోబర్ 19–25
3 నీఫై 27–4 నీఫై
“అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు”
వారు అనుభవించిన విషయాలను వ్రాయమని ప్రభువు తన శిష్యులను ఆజ్ఞాపించారు (3 నీఫై 27:23–24 చూడండి). మీరు చదివినప్పుడు, మీకు కలిగిన ఆత్మీయ అనుభవాలను వ్రాయండి.
మీ మనోభావాలను నమోదు చేయండి
యేసు క్రీస్తు యొక్క బోధనలు కేవలం ధ్యానించదగిన అందమైన వేదాంతం కాదు. అవి దానికి మించినవి—అవి మన జీవితాలను మార్చడానికి ఉద్దేశించబడినవి. రక్షకుని సువార్త ఎంత ఎక్కువగా జనులను మార్చగలదో వివరిస్తూ, 4 నీఫై గ్రంథము దీనికి ఒక అమోఘమైన మాదిరిని అందిస్తుంది. యేసు యొక్క క్లుప్త పరిచర్యను అనుసరించి, నీఫైయులు మరియు లేమనీయుల మధ్య గల శతాబ్దాల వివాదము ముగింపు వచ్చింది. కలహము మరియు గర్వమునకు పేరొందిన రెండు దేశాలు “ఒక్కటిగా, క్రీస్తు యొక్క సంతానముగా” (4 నీఫై 1:17) మారిపోయిరి, మరియు వారు “అన్ని వస్తువులను వారి మధ్య ఉమ్మడిగా కలిగియుండిరి” (4 నీఫై1:3). “దేవుని ప్రేమ … జనుల హృదయములలో గలదు,” మరియు “దేవుని హస్తము చేత సృష్టించబడిన జనులందరి మధ్య అంతకంటే సంతోషము కలిగిన జనులుండలేరు” (4 నీఫై 1:15–16). ఈ విధంగా రక్షకుని బోధనలు నీఫైయులు మరియు లేమనీయులను మార్చివేసాయి. అవి మిమ్మల్ని ఏవిధంగా మారుస్తున్నాయి?
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
యేసు క్రీస్తు యొక్క సంఘము ఆయన పేరున పిలువబడుతుంది.
రక్షకుని శిష్యులు దేశమంతటా ఆయన సంఘాన్ని స్థాపించడం మొదలుపెట్టినప్పుడు, ఒక ప్రశ్న ఎదురైంది, కొద్దిమందికి అది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు—సంఘము యొక్క పేరు ఏమైయుండాలి? (3 నీఫై 27:1–3 చూడండి). 3 నీఫై 27:4–12 లో రక్షకుని జవాబు నుండి ఈ పేరు యొక్క ప్రాముఖ్యత గురించి మీరేమి నేర్చుకుంటారు? 1838లో ఈనాటి ఆయన సంఘము యొక్క పేరును ప్రభువు బయల్పరిచారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 115:4 చూడండి). ఆ పేరులో ప్రతి పదాన్ని ధ్యానించండి. మనం ఎవరమో, మనం ఏమి నమ్ముతామో మరియు మనమెలా ప్రవర్తించాలో తెలుసుకోవడానికి ఈ పదాలు ఎలా మనకు సహాయపడతాయి?
Russell M. Nelson, “The Correct Name of the Church,” Ensign or Liahona, Nov. 2018, 87–80; M. Russell Ballard, “The Importance of a Name,” Ensign or Liahona, Nov. 2011, 79–82 కూడా చూడండి.
నేను నా కోరికలను శుద్ధిచేసుకున్నప్పుడు, నేను మరింత విశ్వాసముగల శిష్యుడనవుతాను.
ఆయన తన శిష్యులను అడిగినట్లుగా, “నా నుండి మీరు ఏమి కోరుచున్నారు” అని రక్షకుడు మిమ్మల్ని అడిగితే మీరేమి చెప్తారు? (3 నీఫై 28:1). మీరు 3 నీఫై 28:1–11 లో రక్షకుని యొక్క శిష్యుల అనుభవం గురించి చదువుతున్నప్పుడు, దీని గురించి ఆలోచించండి. ఆయన ప్రశ్నకు వారి జవాబుల నుండి శిష్యుల హృదయాలలో గల కోరికల గురించి మీరేమి నేర్చుకుంటారు? అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ బోధించారు: “మన నిత్య గమ్యాన్ని సాధించడానికి, ఒక నిత్యజీవిగా కావడానికి అవసరమైన సద్గుణాలను మనం కోరుకుంటాము మరియు అందుకోసం పనిచేస్తాము. … మనం (యేసు క్రీస్తు) వలె కావాలని కోరుకుంటాము” (“Desire,” Ensign or Liahona, May 2011, 44–45). మీ హృదయపు కోరికలను మరింత నీతివంతమైనవిగా చేయడానికి మీరేమి చేయగలరు? (ముగ్గురు శిష్యుల “శరీరాలపై తేబడిన మార్పు” గురించి మరింత సమాచారం కోసం 3 నీఫై 28:37 and “Translated Beings,” Guide to the Scriptures, scriptures.ChurchofJesusChrist.org చూడండి)
యేసు క్రీస్తు మరియు ఆయన సువార్తకు పరివర్తన చెందడం, ఐక్యత మరియు సంతోషానికి దారితీస్తుంది.
రక్షకుని దర్శనము తరువాతి సంవత్సరాలలో జీవించడం ఎలా ఉండియుండవచ్చో మీరు ఊహించగలరా? చాలాకాలము—దాదాపు 200 సంవత్సరాలపాటు ఈ దైవిక సమాధానాన్ని జనులు ఎలా నిలుపుకున్నారు? మీరు 4 నీఫై 1:1–18 చదివినప్పుడు, ఈ దీవెనకరమైన జీవితాన్ని అనుభవించడానికి జనులు చేసిన ఎంపికలను గుర్తించడం లేక పేర్కొనడం గురించి ఆలోచించండి.
4 నీఫై లో జనులు చేసినట్లుగా, అధిక ఐక్యత మరియు సంతోషంతో జీవించడానికి మీ కుటుంబము, వార్డు లేక సంఘానికి సహాయపడేందుకు మీరేమి చేయగలరో ధ్యానించండి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి యేసు క్రీస్తు యొక్క ఏ బోధనలను మీరు మరింత సంపూర్ణంగా జీవించగలరు? ఈ బోధనలు గ్రహించి, జీవించడానికి ఇతరులకు సహాయపడేందుకు మీరేమి చేయగలరు?
దుష్టత్వము, విభజనకు మరియు బాధకు దారితీస్తుంది.
బాధాకరంగా, 4 నీఫై లో వివరించబడిన సీయోను సమాజము (మోషే 7:18 కూడా చూడండి) క్రమముగా విడదీయబడింది. మీరు 4 నీఫై 1:19–49 చదివినప్పుడు, ఈ సమాజము ముక్కలవడానికి కారణమైన వైఖరులు మరియు ప్రవర్తనల కోసం చూడండి. మీలో ఈ వైఖరులు మరియు ప్రవర్తనలకు సంబంధించి ఏవైనా చిహ్నములను మీరు చూస్తున్నారా?
“Chapter 18: Beware of Pride,” Teachings of Presidents of the Church: Ezra Taft Benson (2014), 229–40 కూడా చూడండి.
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
3 నీఫై 27:13–21
“నా సువార్త” అని ఆయన చెప్పినప్పుడు, రక్షకుని ఉద్దేశాన్ని బాగా గ్రహించడానికి ఈ వచనాలు కుటుంబ సభ్యులకు సహాయపడగలవు. ఈ వచనాలను చదివి, చర్చించిన తర్వాత, సువార్త అంటే ఏమిటో ఒక్క వాక్యంలో సంక్షిప్తపరచమని మీరు ప్రతి కుటుంబసభ్యుని అడగవచ్చు.
3 నీఫై 27:23–26
మనం వ్యక్తిగతంగా లేక ఒక కుటుంబంగా—“చూచిన మరియు వినిన” విషయాలను నమోదు చేయడంలో మనమెలా చేస్తున్నాము? ఆత్మీయ విషయాలను నమోదు చేయడం ఎందుకు ముఖ్యము?
3 నీఫై 27:30–31
ఈ వచనాలలో రక్షకుడు వివరించిన ఆనందాన్ని అర్థం చేసుకోవడానికి కుటుంబ సభ్యులకు సహాయపడేందుకు మీరు ఒక ఆట ఆడవచ్చు, అందులో కుటుంబ సభ్యులు దాగుకొని ఉండగా మరొక కుటుంబ సభ్యుడు వారిని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. “వారిలో ఒక్కడును తప్పిపోకుండునట్లు” ప్రతి కుటుంబ సభ్యుని కనుగొనడం ఎందుకు ముఖ్యమైనదనే దాని గురించి సంభాషణకు ఇది దారితీస్తుంది. సువార్తలో బలంగా నిలిచియుండేందుకు లేక వారు విడిచివెళ్ళినట్లయితే తిరిగి వచ్చేందుకు మన కుటుంబ సభ్యులకు మనమెట్లు సహాయపడగలము?
3 నీఫై 28:17–18, 36–40
ముగ్గురు నీఫైయుల శిష్యులకు జరిగిన మార్పు గురించి మొత్తము అతడు గ్రహించనప్పుడు మోర్మన్ యొక్క మాదిరి నుండి మనమేమి నేర్చుకోగలము? ఒక సువార్త సూత్రం గురించి మొత్తము మనం గ్రహించనప్పుడు మనమేమి చేయగలము? అధ్యక్షులు డిటర్ ఎఫ్. ఉక్డార్ఫ్ బోధించారు: “దేవుడు మీ గురించి శ్రద్ధ చూపుతారు. ఆయన వింటారు, మరియు మీ వ్యక్తిగత ప్రశ్నలకు ఆయన జవాబిస్తారు. మీ ప్రార్థనలకు జవాబులు ఆయన స్వంత విధానములో, ఆయన స్వంత సమయంలో వస్తాయి, కాబట్టి ఆయన స్వరమును వినడాన్ని మీరు నేర్చుకోవాలి” (“Receiving a Testimony of Light and Truth,” Ensign or Liahona, Nov. 2014, 21).
4 నీఫై 1:15
మీ ఇంటిలో వివాదాన్ని తగ్గించడానికి, బహుశా ఈ వారం ఒకరితో ఒకరు మరింత ప్రేమగా ఉండాలని కుటుంబ సభ్యులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవచ్చు. వారం పూర్తయిన తర్వాత, మీ పురోగతిని కలిసి సమీక్షించండి మరియు ఎక్కువ ప్రేమను చూపడం మీ కుటుంబాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందో చర్చించండి.
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.