రండి, నన్ను అనుసరించండి
అక్టోబర్ 26–నవంబర్ 1. మోర్మన్ 1–6: “పశ్చాత్తాపము పొందుటకు … అందరినీ నేను ఒప్పించగలుగ వలెనని నేను కోరుచున్నాను”


అక్టోబర్ 26–నవంబర్ 1. మోర్మన్ 1–6: ‘పశ్చాత్తాపము పొందుటకు … అందరినీ నేను ఒప్పించగలుగ వలెనని నేను కోరుచున్నాను,’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“అక్టోబర్ 26–నవంబర్ 1. మోర్మన్ 1–6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
బంగారు పలకలపై వ్రాస్తున్న మోర్మన్

పలకలను సంక్షిప్తపరుస్తున్న మోర్మన్, టామ్ లోవెల్ చేత

అక్టోబర్ 26–నవంబర్ 1

మోర్మన్ 1–6

“పశ్చాత్తాపము పొందుటకు … అందరినీ నేను ఒప్పించగలుగ వలెనని నేను కోరుచున్నాను”

మీరు మోర్మన్ 1–6 చదివినప్పుడు, మోర్మన్ మాదిరి నుండి మీరు నేర్చుకొనేదానిని ధ్యానించండి. మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారో నమోదు చేయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

నీఫైయుల మధ్య అతడు చూసిన రక్తపాతము మరియు దుష్టత్వము యొక్క “భయంకరమైన దృశ్యము” యొక్క “సంపూర్ణ వృత్తాంతమును” మోర్మన్ మన నుండి తప్పించెను (మోర్మన్ 2:18; 5:8). కానీ, నీతిమంతులైన జనులు ఎంత వరకు పతనం కాగలరో మనకు గుర్తుచేయడానికి మోర్మన్ 1–6 లో అతడు నమోదు చేసినది మనకు చాలు. అంతటా వ్యాపించిన దుష్టత్వము మధ్య అలసిపోయి, నిరాశ చెందినందుకు ఏ ఒక్కరు మోర్మన్ ను నిందించలేరు. అయినప్పటికీ అతడు చూసి, అనుభవించిన దానంతటా దేవుని యొక్క గొప్ప కనికరము యొక్క జ్ఞానమును మరియు దానిని పొందుటకు గల మార్గము పశ్చాత్తాపమే అను అతని దృఢవిశ్వాసమును అతడు ఎన్నడూ కోల్పోలేదు. పశ్చాత్తపపడేందుకు అతడి అభ్యర్థన ఆహ్వానములను మోర్మన్ యొక్క స్వంత జనులు నిరాకరించినప్పటికీ, అతడు ఒప్పించవలసిన ప్రేక్షకులనేకులు ఉన్నారని అతడికి తెలుసు. “ఇదిగో, నేను భూదిగంతములన్నిటికీ వ్రాయుచున్నాను,” అని ఆయన ప్రకటించెను. దాని అర్థము, ఆయన మీకు వ్రాసెను (మోర్మన్ 3:17–20 చూడండి). నేడు అతడు మీకిచ్చే సందేశము, వారి రోజులలో నీఫైయులను రక్షించగలిగిన అదే సందేశము: ఠయేసు క్రీస్తు యొక్క సువార్తను విశ్వసించుము. … పశ్చాత్తాపము పొంది, క్రీస్తు యొక్క న్యాయపీఠము యెదుట నిలుచుటకై సిద్ధపడుము” (మోర్మన్ 3:21–22).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోర్మన్ 1

నా చుట్టూ దుష్టత్వమున్నప్పటికీ నేను నీతిమంతునిగా జీవించగలను.

మోర్మన్ యొక్క మొదటి అధ్యాయము నుండి మొదలుకొని, మోర్మన్ మరియు అతని చుట్టూ ఉన్న జనుల మధ్య గొప్ప తేడాలను మీరు గమనిస్తారు. మీరు మోర్మన్ 1 చదివినప్పుడు, మోర్మన్ యొక్క గుణాలు మరియు కోరికలు అతని జనుల వాటి నుండి ఎంత భిన్నంగా ఉన్నాయో ఆలోచించండి. అతనికి మరియు వారికి వచ్చిన పర్యవసానాలను గమనించండి (14–15 వచనాలలో మీరు ఒక ఉదాహరణను కనుగొంటారు). దుష్టలోకములో నీతిగా జీవించడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా మీరేమి నేర్చుకుంటారు?

మీరు మోర్మన్ 2–6 చదివినప్పుడు, అతని చుట్టూ చెడు ప్రభావాలున్నప్పటికీ మోర్మన్ ఏ విధంగా పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు నందు తన విశ్వాసాన్ని ప్రదర్శించాడనే దానిని చూడడం కొనసాగించండి.

చిత్రం
నీఫైయులు మరియు లేమనీయులు ఒకరితో ఒకరు యుద్ధము చేయుట

యుద్ధము, జార్జ్ కొక్కో చేత

మోర్మన్ 2:10–15

దైవచిత్తానుసారమైన దుఃఖము నిజమైన మరియు శాశ్వతమైన మార్పుకు దారితీస్తుంది.

మోర్మన్ తన జనుల దుఃఖమును చూసినప్పుడు, వారు పశ్చాత్తాపపడతారని అతడు ఆశించాడు. కానీ “వారి విచారము పశ్చాత్తాపమునకు కాదు” (మోర్మన్ 2:13)—నిజమైన మార్పునకు దారితీసే దైవచిత్తానుసారమైన దుఃఖము వంటిది కాదది (2 కొరింథీయులకు 7:8–11 చూడండి). బదులుగా, నీఫైయులు ప్రాపంచిక దుఃఖమును అనుభవించారు (మోర్మన్ 2:10–11 చూడండి). దైవచిత్తానుసారమైన దుఃఖమునకు ప్రాపంచిక దుఃఖమునకు మధ్య తేడాని గ్రహించడానికి, ఈ రెండు రకాల దుఃఖాల గురించి మోర్మన్ 2:10–15 నుండి మీరు నేర్చుకున్న దానిని మీరు నమోదు చేయగలిగేలా ఒక పట్టిక తయారు చేయడం గురించి ఆలోచించండి. మీ పట్టిక ఈ విధంగా కనబడవచ్చు:

దైవచిత్తానుసారమైన దుఃఖము

ప్రాపంచిక దుఃఖము

దైవచిత్తానుసారమైన దుఃఖము

యేసు నొద్దకు రమ్ము (14వ వచనము)

ప్రాపంచిక దుఃఖము

దేవునిని శపించుట (14వ వచనము)

దైవచిత్తానుసారమైన దుఃఖము

ప్రాపంచిక దుఃఖము

దైవచిత్తానుసారమైన దుఃఖము

ప్రాపంచిక దుఃఖము

మీరు నేర్చుకున్న దానిని మీరు ధ్యానించినప్పుడు, పాపమును జయించి, మరింతగా పరలోక తండ్రి మరియు రక్షకుని వలె అగుటకు మీ ప్రయత్నాలను అది ఏ విధంగా ప్రభావితం చేయగలదో ఆలోచించండి.

Dieter F. Uchtdorf, “You Can Do It Now!” కూడా చూడండి. Ensign or Liahona, Nov. 2013, 55–57.

మోర్మన్ 3:3, 9

నా జీవితంలో దేవుని హస్తాన్ని నేను ఎల్లప్పుడూ అంగీకరించాలి.

నీఫైయులలో తాను చూసిన ఒక బలహీనతను మోర్మన్ నమోదు చేసాడు: ప్రభువు వారిని దీవించిన విధానాలను గుర్తించడంలో వారు విఫలమయ్యారు. “దేవుని దయను గుర్తించి, జ్ఞాపకముంచుకోవడానికి మార్గాలు కనుగొనమని అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ మనల్ని అభ్యర్థించారు. … ఈ ప్రశ్నలు అడుగుతూ ప్రార్థించి, ధ్యానించమన్నారు: కేవలం నా కోసం దేవుడు ఒక సందేశాన్ని పంపెనా? నా జీవితంలో లేక నా పిల్లల జీవితాల్లో ఆయన హస్తాన్ని నేను చూసానా? … మనలో చాలామంది ఇంకను గుర్తించిన దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు, దీవిస్తారని నేను సాక్ష్యమిస్తున్నాను” (“O Remember, Remember,” Ensign or Liahona, Nov. 2007, 67, 69).

మీరు మోర్మన్ 3:3, 9 చదివినప్పుడు, మీ జీవితంలో దేవుడి ప్రభావాన్ని మీరెలా ఒప్పుకుంటున్నారో మీరు ధ్యానించవచ్చు. ఆయన ప్రభావాన్ని మీరు ఒప్పుకున్నప్పుడు, ఏ దీవెనలు వస్తాయి? ఆయనను ఒప్పుకోకపోవడం వలన కలిగే పర్యవసానాలేవి? (మోర్మన్ 2:26 చూడండి).

మోర్మన్ 5:8–24; 6:16–22

నన్ను చేర్చుకోవడానికి యేసు క్రీస్తు చేతులు చాచి నిలబడతారు.

నీఫైయులు మోర్మన్ యొక్క బోధనలను నిరాకరించారు, కానీ అతని గ్రంథము మిమ్మల్ని ప్రభావితం చేస్తుందని అతడు నిరీక్షణ కలిగియున్నాడు. మీరు మోర్మన్ 5:8–24 మరియు 6:16–22 చదివినప్పుడు, పాపము యొక్క పర్యవసానాల గురించి మీరేమి నేర్చుకుంటారు? మీరు పాపము చేసినప్పటికీ, మీ పట్ల పరలోక తండ్రి మరియు యేసు యొక్క భావాల గురించి ఈ వాక్యభాగాల నుండి మీరేమి నేర్చుకుంటారు? యేసు క్రీస్తు చేతులు చాచి మిమ్మల్ని చేరుకోవాలనుకున్నప్పుడు మీరెలా భావించారు? ఫలితముగా ఏమి చేయాలని మీరు ప్రేరేపించబడ్డారు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మోర్మన్ 1:2

“శీఘ్రంగా గమనించడం” అనగా అర్ధమేమిటి? “Quick to Observe” (Ensign, Dec. 2006, 30–36) ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ యొక్క వ్యాసంలో మీరు అంతర్దృష్టులను కనుగొనవచ్చు. శీఘ్రంగా గమనించగలగే వరం మోర్మన్ కు ఏ విధంగా ఒక దీవెనైంది? అది మనకు ఏ విధంగా దీవెన కాగలదు?

మోర్మన్ 1:1–6, 15; 2:1–2

వారు చిన్నవారైనప్పటికీ, వారు గొప్ప ఆత్మీయ సుగుణాలను, శక్తిని వృద్ధిచేయగలరని మీ కుటుంబంలోని పిల్లలు గ్రహిస్తున్నారా? మోర్మన్ యొక్క మాదిరి వారికి సహాయపడగలదు. మోర్మన్ 1:1–6, 15 మరియు 2:1–2 లో ఇవ్వబడిన వయస్సు మరియు సంఘటనలను ఉపయోగిస్తూ, మోర్మన్ యొక్క బాల్యము మరియు యౌవనము యొక్క కాలపట్టిక తయారు చేయడం గురించి ఆలోచించండి. మోర్మన్ యొక్క గుణాలు మరియు అనుభవాలను మీరు చర్చిస్తున్నప్పుడు, మిమ్మల్ని మరియు చుట్టూ ఉన్న ఇతరులను ప్రేరేపించేలా మీ పిల్లలు కలిగియున్న సుగుణాలను ఎత్తి చూపండి.

మోర్మన్ 2:18–19

అతడు జీవించిన లోకమును వర్ణించడానికి మోర్మన్ ఏ పదాలను ఉపయోగించెను? అతని చుట్టూ దుష్టత్వమున్నప్పటికీ, ఏ విధంగా అతడు నిరీక్షణను నిలుపుకొనెను? మన కుటుంబము ఆ విధంగా ఎలా చేయగలదు?

మోర్మన్ 3:12

వారు దుష్టులైనప్పటికీ, తన చుట్టూ ఉన్న జనుల గురించి మోర్మన్ ఎలా భావించెను? అతడు కలిగియున్నటువంటి ప్రేమను వృద్ధిచేయడానికి మనమేమి చేయగలము?

మోర్మన్ 5:2

మనం శ్రమపడుతున్నప్పుడు, పరలోక తండ్రిని పిలవడానికి మనమెందుకు సందేహిస్తాము? మరింతగా పరలోక తండ్రి పైన ఆధారపడేందుకు మనమేమి చేయగలము?

మోర్మన్ 5:16–18

“గాలి యెదుట పొట్టువలే తరుమబడియుండుట” (16వ వచనము) అనగా అర్థమేమిటో మీ కుటుంబము ఊహించుకోవడానికి సహాయపడేందుకు, ఒక కాగితాన్ని చిన్న ముక్కలుగా చింపి, కుటుంబ సభ్యులు వాటిని చుట్టూ ఊదేలా చేయండి. పొట్టు అనగా విత్తనం పైన ఉండే పొర అని, అది గాలికి ఎగిరిపోయేంత తేలికగా ఉంటుందని వారికి వివరించండి. “లోకమందు క్రీస్తు మరియు దేవుడు లేకయుండుట” (16వ వచనము) అనేది గాలిలో పొట్టువలె ఎట్లున్నది?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

స్పష్టమైన మరియు సరళమైన సిద్ధాంతాన్ని బోధించండి. ప్రభువు యొక్క సువార్త దాని సరళత్వములో అందమైనది (సిద్ధాంతము మరియు నిబంధనలు 133:57 చూడండి). మితిమీరిన పాఠాలతో మీ కుటుంబానికి వినోదం కలిగించాలని ప్రయత్నించడం కంటే, మీరు బోధించేది స్వచ్ఛమైన మరియు సరళమైన సిద్ధాంతంపై కేంద్రీకరించబడేలా చూడండి.

చిత్రం
నీఫైయులు మరియు లేమనీయుల యుద్ధభూమిని గమనిస్తున్న మోర్మన్

మోర్మన్ యొక్క అద్భుతమైన గ్రంథము, జోసెఫ్ బ్రిక్కీ చేత

ముద్రించు