రండి, నన్ను అనుసరించండి
నవంబర్ 9–15. ఈథర్ 1–5: “అవిశ్వాసము యొక్క ఆ తెరను చించుము”


“నవంబర్ 9–15. ఈథర్ 1–5: ‘అవిశ్వాసము యొక్క ఆ తెరను చించుము’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“నవంబర్ 9–15. ఈథర్ 1-5,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

అరణ్యము గుండా జెరెడీయులు ప్రయాణించుట

ఆల్బిన్ వెసెల్కా చేత జెరెడీయులు బాబేలును విడిచి వెళ్లుట

నవంబర్ 9–15

ఈథర్ 1–5

“అవిశ్వాసము యొక్క ఆ తెరను చించుము”

ఈథర్ గ్రంథము జెరెడీయుల యొక్క నివేదిక, వారు నీఫైయులకు శతాబ్ధాలకు ముందుగా వాగ్దాన దేశము చేరుకున్నారు. మోర్మన్ గ్రంథములో ఈథరు గ్రంథమును చేర్చుటకు దేవుడు మొరోనైను ప్రేరేపించాడు, ఎందుకనగా అది మన కాలమునకు సంబంధించినది. అది మీ జీవితానికి సంబంధించినదని మీరు ఎలా భావిస్తున్నారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

దేవుని మార్గాలు మనకంటె గొప్పవన్నది నిజము కాగా, మనము ఎల్లప్పుడు ఆయన చిత్తమునకు అప్పగించుకోవాలి, ఆయన మనము ఆలోచించమని, మరియు మనకై మనం చేయాలని కూడ ప్రోత్సహించును. అది జెరెడ్ మరియు అతడి సహోదరుడు నేర్చుకొన్న ఒక పాఠము. ఉదాహరణకు, “సమస్త భూమి కన్న శ్రేష్ఠమైన ఒక దేశము” ఒక క్రొత్త దేశానికి ప్రయాణించే ఆలోచన జెరెడ్ యొక్క మనస్సులో ప్రారంభమైనట్లు కనబడుతుంది, మరియు ప్రభువు “కనికరము చూపెను” మరియు మనవిని అనుగ్రహించడానికి ఇలా చెప్పుతూ వాగ్దానమిచ్చాడు, “ఈ దీర్ఘకాలము నీవు నాకు మొర్రపెట్టియున్నావు, కాబట్టి ఆ విధముగా నేను నీకు చేసెదను” (ఈథర్ 1:38–43 చూడుము). వారి వాగ్దాన దేశమునకు వారిని తీసుకొనివెళ్లే పడవలలో ఎంత చీకటిగా ఉందో జెరెడ్ యొక్క సహోదరుడు గ్రహించినప్పుడు, ఒక పరిష్కారము సూచించమని ప్రభువు అతడిని ఆహ్వానించినప్పుడు, మనము సాధారణంగా ఆయనను అడిగే ప్రశ్నను అడిగారు: “నేను ఏమి చేయవలెనని కోరుచున్నారు?” (ఈథర్ 2:23). అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఆజ్ఞాపించాలని మనము ఆశించరాదని ఈ సందేశము కనబడుతున్నది. మన స్వంత ఆలోచనలు మరియు అభిప్రాయాలను మనము ఆయనతో పంచుకోగలము, మరియు ఆయన వింటారు, ఆయన నిర్ధారణను ఇస్తారు లేక మరొకవిధంగా మనకు సలహా ఇస్తారు. కొన్నిసార్లు మనము వెదకే దీవెనల నుండి మనల్ని వేరు చేసే ఏకైక విషయము మన స్వంత “అవిశ్వాసము యొక్క తెర,” మరియు మనము “ఆ తెరను చించినప్పుడు,” ఈథర్ 4:15, ప్రభువు మనకోసం చేయుటకు సమ్మతించే దాని చేత మనము ఆశ్చర్యపడవచ్చు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఈథర్ 1:33–43

నేను ప్రభువుతో మొర్రపెట్టినప్పుడు, ఆయన నాపైన కనికరము కలిగియున్నారు.

ఈథర్ 1:33–43 జెరెడ్ యొక్క సహోదరుని యొక్క మూడు ప్రార్ధనలను గూర్చి చెప్పును. ఈ ప్రార్ధనలకు ప్రభువు యొక్క స్పందన నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? ప్రార్ధనయందు ఆయనకు మీరు మొర్రపెట్టినప్పుడు ప్రభువు యొక్క కనికరమును మీరు అనుభవించినప్పటి సమయము గురించి ఆలోచించుము. ఈ అనుభవమును మీరు వ్రాసి, మీ సాక్ష్యమును వినుట అవసరమైన వారెవరితోనైనా దానిని పంచుకోవడానికి కోరవచ్చు.

ఈథర్ 2; 3:1–6; 4:7–15

నా జీవితంలో బయల్పాటును నేను పొందగలను.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ చెప్పారు: “బయల్పాటును పొందటానికి మీ ఆత్మీయ సామర్ధ్యమును పెంచుకోమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. … పరిశుద్ధాత్మ యొక్క వరమును ఆనందించుటకు అవసరమైన ఆత్మీయ కార్యము చేయడానికి ఎంపిక చేయుము మరియు ఎక్కువ తరచుగా, ఎక్కువ స్పష్టంగా ఆత్మ యొక్క స్వరమును వినుము” (“సంఘము కోసం బయల్పాటు, మన జీవితాల కోసం బయల్పాటు,” Ensign or Liahona, May 2018, 96).

ఈథర్ 2; 3:1–6; మరియు 4:7–15, వ్యక్తిగత బయల్పాటును ఎలా వెదకాలో గ్రహించుటకు మీకు సహాయపడునట్లు మీరు కనుగొనే సత్యములేవి? జెరెడ్ యొక్క సహోదరునికి గల ప్రశ్నలు లేక చింతలను మరియు వాటి గురించి అతడు చేసిన దానిని ఒక రంగులో మీరు గుర్తించవచ్చు, మరియు ప్రభువు అతడికి ఎలా సహాయపడ్డాడు మరియు ఆయన చిత్తమును తెలియజేసాడో మరొక రంగులో గుర్తించవచ్చు. జెరెడ్ యొక్క సహోదరుడు ప్రభువుతో సంభాషించిన విధానము గురించి మీకు ఎక్కువ ఆసక్తి కలిగించినదేమిటి మరియు మీ జీవితంలో బయల్పాటును పొందే సామర్ధ్యము ఎలా హెచ్చించుకోవాలో దీని నుండి మీరు నేర్చుకున్నదేమిటి?

ఈథర్ 2:16–25

నా “గొప్ప ఆగాథమును,” దాటుటకు ప్రభువు నన్ను సిద్ధపరచును.

వాగ్దాన దేశమునకు వెళ్లుటకు, జెరెడీయులు పెద్ద ఆటంకమును ఎదుర్కొన్నారు: “గొప్ప ఆగాథమును,” ఈథర్ 2:25 దాటుట. “గొప్ప ఆగాథమును, వాక్యభాగము కొన్నిసార్లు మన శ్రమలు మరియు సవాళ్లు ఎలా ఉంటాయో వివరించుటకు సరైన విధానము కావచ్చు. కొన్నిసార్లు, జెరెడీయుల విషయంలో ఆవిధంగా ఉన్నది, మన స్వంత “గొప్ప ఆగాథమును,” దాటుట మనకోసం దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుట. ఈథర్ 2:16–25 లో మీ జీవితానికి పోలికలను మీరు చూసారా? మీ సవాళ్ల కోసం ప్రభువు మిమ్మల్ని ఎలా సిద్ధపరిచాడు? భవిష్యత్తులో మీరు ఏమి చేయాలో సిద్ధపరచడానికి ఇప్పుడు ఏమి చేయమని ఆయన మిమ్మల్ని అడుగుతున్నాడు?

ఈథర్ 3

నేను దేవుని స్వరూపములో సృష్టించబడ్డాను.

షీలెమ్ కొండపై, జెరెడ్ యొక్క సహోదరుడు దేవుని గురించి, తన గురించి ఎక్కువగా నేర్చుకున్నాడు. దేవుని యొక్క ఆత్మీయ, శారీర స్వభావము గురించి ఈథర్ 3 నుండి మీరు ఏమి నేర్చుకుంటారు? మీ దైవిక గుర్తింపు మరియు సాధ్యతను గ్రహించుటకు ఈ సత్యములు మీకు ఎలా సహాయపడతాయి?

సముద్ర తీరముపై స్త్రీ, ఇద్దరు పిల్లలు ఆడుకోవటం

మనము దేవుని సంతానమై యున్నాము.

ఈథర్ 3:6–16

ప్రభువును చూసిన మొదటి వ్యక్తి జెరెడ్ యొక్క సహోదరుడా?

జెరెడ్ యొక్క సహోదరునికి ముందు ఇతర ప్రవక్తలకు దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనెను (ఉదాహరణకు, మోషే 7:4, 59 చూడుము), అయితే ప్రభువు అతడితో ఇలా ఎందుకు చెప్పారు? (“మనుష్యునికి నేను ఎన్నడూ ప్రత్యక్షపరచుకోలేదు”)ఈథర్ 3:15). ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాల్లండ్ ఈ సాధ్యమైన వివరణను ఇచ్చారు: “క్రీస్తు జెరెడ్ యొక్క సహోదరునితో ఇలా చెప్పుతున్నారు, ‘నేను ఎన్నడూ ఈ విధానములో, నా ఉల్లంఘన లేకుండా, చూచు వాని విశ్వాసము వలన పూర్తిగా ఏ వ్యక్తికి నన్ను ప్రత్యక్షపరచుకోలేదు’” (Christ and the New Covenant [1997], 23).

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఈథర్ 1:34–37

ఇతరుల కోసం ప్రార్ధన చేయుట గురించి ఈ వచనముల నుండి మనము ఏమి నేర్చుకోగలము? ప్రార్ధన గురించి ఏ ఇతర సత్యాలను ఈ వచనాలు ఉదహరిస్తాయి?

ఈథర్ 2:16–3:6

మన సమస్యలు మరియు ప్రశ్నలకు జవాబులను ఎలా కనుగొనాలో జెరెడ్ యొక్క సహోదరుడు యొక్క మాదిరి మనకు ఏమని బోధించును? ప్రభువు నుండి జవాబులను మీరు వెదకి, పొందినప్పటి అనుభవాలను కుటుంబ సభ్యులు పంచుకోవచ్చు.

ఈథర్ 4:11–12

ఈ వచనాలు చదివిన తరువాత, మీ కుటుంబాన్ని ప్రభావితం చేసే ప్రతీరోజు చేసే విషయాలను కుటుంబ సభ్యులు కాగితాలపై వ్రాయవచ్చు మరియు వాటిని ఒక గిన్నెలో ఉంచవచ్చు (సినిమాలు, పాటలు, ఆటలు, లేక జనులు వంటివి). తరువాత వారు వారు ఒకరి తరువాత ఒకరు ఒకటి ఎంపిక చేసుకొని అది “మంచి చేయుటకు [వారిని] ప్రోత్తహించునా” (ఈథర్ 4:12) లేదా అని చర్చించవచ్చు. మీ కుటుంబము ఏ మార్పులు చేయడానికి ప్రేరేపించబడింది?

ఈథర్ 5

ఒక పెట్టెలో ఒక వస్తువు లేక ఒక తినుబండారమును దాచవచ్చు మరియు ఒక కుటుంబ సభ్యుడిని లోపలికి చూడమని ఆహ్వానించుము మరియు అది ఏమిటో ఊహించుటకు సహాయపడే ఆధారాలను మిగిలిన కుటుంబ సభ్యులకు ఇవ్వుము. మీరు ఈథర్ 5 కలిసి చదివినప్పుడు, ఆయన కార్యములో ప్రభువు సాక్షులను ఉపయోగించుట ఎందుకు ముఖ్యమైనదో చర్చించుము. ఇతరులతో మోర్మన్ గ్రంథమును గూర్చి మన సాక్ష్యమును మనము ఎలా పంచుకోగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. “అనధికారిక బోధనా క్షణాలు త్వరగా గడిచిపోతాయి, కనుక అవి కలిగినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమైనది. … ఉదాహరణకు, చేయడానికి ఒక కష్టమైన నిర్ణయంగల ఒక యౌవనస్తుడు వ్యక్తిగత బయల్పాటును ఎలా పొందాలో నేర్చుకోవడానికి సిద్ధపడియుండవచ్చు” (Teaching in the Savior’s Way, 16).

జెరెడ్ యొక్క సహోదరుని సమక్షంలో యేసు ఆరు రాళ్లను తాకుట

మార్కస్ ఆలాన్ విన్సం చేత నీవు దీనికంటె ఎక్కువ చూసావా?