రండి, నన్ను అనుసరించండి
నవంబర్ 16-22. ఈథర్ 6–11: “చెడు అంతము చేయబడవలెను”


“నవంబర్ 16-22. ఈథర్ 6–11: ‘చెడు అంతము చేయబడవలెను’”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“నవంబర్ 16-22. ఈథర్ 6–11,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
సముద్రముపై జెరెడీయుల నౌకలు

లోతులలో నుండి నేను మిమ్ములను తిరిగి పైకి తెచ్చెదను, జోనతన్ ఆర్థర్ క్లార్క్ చేత

నవంబర్ 16–22

ఈథర్ 6–11

“చెడు అంతము చేయబడవలెను”

జెరెడీయుల వృత్తాంతము గురించి మాట్లాడుతూ, “ఈ వృత్తాంతము నందు వ్రాయబడిన విషయములను జనులందరు తెలుసుకొనుట అవసరమైయున్నది” (మోషైయ 28:19) అని మొరోనై వ్యాఖ్యానించెను. మీరు ఈథర్ 6–11 చదువుతున్నప్పుడు దీనిని మనస్సులో ఉంచుకోండి. ఈ విషయాలు మీకు మరియు మీరు ప్రేమించేవారికి ఎందుకు అవసరమైనవి—లేక ప్రయోజనకరమైనవి?

మీ మనోభావాలను నమోదు చేయండి

జెరెడీయులు నాశనము చేయబడిన వందల సంవత్సరాల తర్వాత, వారి ప్రాచీన నాగరికత యొక్క శిధిలాలను నీఫైయులు కనుగొన్నారు. ఈ శిధిలాల మధ్య ఒక అద్భుతమైన వృత్తాంతమున్నది—“మేలిమి బంగారము”తో చేయబడి, “చెక్కడములతో నిండియున్న” పలకలు (మోషైయ 8:9). ఈ వృత్తాంతము ముఖ్యమైనదని నీఫైయుల రాజైన లింహై గుర్తించగలిగాడు: “నిస్సందేహముగా ఈ పలకల యందు ఒక గొప్ప మర్మము ఉన్నది,” (మోషైయ 8:19) అని అతడన్నాడు. నేడు ఈ వృత్తాంతము యొక్క సంగ్రహమును మీరు కలిగియున్నారు, అది మీ భాషలో అనువదించబడింది, మరియు అది ఈథర్ గ్రంథముగా పిలువబడుతుంది. నీఫైయులు చదవడానికి “అపరిమితముగా కోరుకొనిన” అదే గ్రంథము నుండి ఇది వస్తుంది, మరియు వారు దానిని చదివినప్పుడు, “వారు దుఃఖముతో నిండిరి, అయినప్పటికీ అది వారికి అధిక జ్ఞానమును ఇచ్చెను మరియు దాని యందు వారు సంతోషించిరి” (మోషైయ 28:12, 18). జెరెడీయుల ఎదుగుదల మరియు విషాదకరమైన పతనము గురించి మీరు చదివినప్పుడు, అనేక బాధాకరమైన క్షణాలను మీరు కనుగొంటారు. కానీ, ఈ చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోగల ఆనందాన్ని విస్మరించకండి. ఏదేమైనప్పటికీ, మొరోనై వ్రాసినట్లుగా, “ఈ సంగతులు మీకు చూపబడుట దేవుని యందు వివేకమైయున్నది” (ఈథర్ 8:23), ఎందుకనగా మనము జెరెడీయుల వైఫల్యాలు మరియు విజయాల నుండి నేర్చుకోగలిగినట్లయితే, “చెడు అంతము చేయబడగలదు, మరియు … నరుల సంతానము యొక్క హృదయములపైన సాతానుకు ఎట్టి అధికారములేనట్టి సమయము రాగలదు” (ఈథర్ 8:26).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఈథర్ 6:1–12

నా వాగ్దానదేశము వైపు ప్రభువు నన్ను నడిపించును.

సముద్రము గుండా జెరెడీయుల ప్రయాణాన్ని మర్త్యత్వము గుండా మీ ప్రయాణంతో మీరు పోల్చినట్లయితే, మీరు ఆత్మీయ అంతర్దృష్టులను కనుగొనగలరు. ఉదాహరణకు, జెరెడీయుల నౌకలలోని రాళ్ళ వలె మీ మార్గాన్ని వెలిగించడానికి ప్రభువు ఏమి అందించారు? నౌకలు లేక “వాగ్దానదేశము వైపు వీచు” గాలులు దేనిని సూచిస్తున్నాయి? (ఈథర్ 6:8). ప్రయాణానికి ముందు, ప్రయాణమందు మరియు తర్వాత జెరెడీయుల చర్యల నుండి మీరేమి నేర్చుకుంటారు? మీ వాగ్దానదేశము వైపు ప్రభువు మిమ్మల్ని ఏవిధంగా నడిపిస్తున్నారు?

చిత్రం
జెరెడీయులు జంతువులతో పాటు ప్రయాణించుట

మినర్వా. కె. టీచర్ట్ (1888–1976), ఆసియా అంతటా జెరెడీయుల ప్రయాణము, 1935, కృత్రిమ చెక్కమీద తైలవర్ణచిత్రము, 35 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయ ఆర్ట్ మ్యూజియమ్.

ఈథర్ 6:5–18, 30; 9:28–35; 10:1–2

నేను వినయముగా ఉన్నప్పుడు ప్రభువు నన్ను దీవిస్తారు.

గర్వము మరియు దుష్టత్వము ప్రబలమైయున్నట్లు జెరెడీయుల చరిత్రలో కనిపించినప్పటికీ, ఈ అధ్యాయాలలో—ప్రత్యేకించి ఈథర్ 6:5–18, 30; 9:28–35; మరియు 10:1–2 లో వినయము యొక్క మాదిరులు కూడా ఉన్నాయి. క్రింది ప్రశ్నలను ధ్యానించడం ఈ మాదిరుల నుండి నేర్చుకోవడానికి మీకు సహాయపడగలదు: ఈ పరిస్థితులలో ఈ జెరెడీయులు ఎందుకు తమనుతాము తగ్గించుకున్నారు? వారి అణకువను చూపడానికి వారేమి చేసారు? ఫలితంగా వారేవిధంగా దీవించబడ్డారు? కొన్ని సందర్భాలలో, అణకువగా ఉండడానికి జనులు వారి పరిస్థితుల చేత బలవంతము చేయబడ్డారని గమనించండి. వినయంగా ఉండేందుకు బలవంతము చేయబడుటకు (మోషైయ 4:11–12; ఆల్మా 32:14–18 చూడండి) బదులుగా, ఇష్టపూర్వకంగా ”ప్రభువు యెదుట వినయముగా నడచుటకు” (ఈథర్ 6:17) మీరేమి చేయగలరో ఆలోచించండి.

Humility,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

ఈథర్ 7–11

నీతిమంతులైన నాయకులు తాము నడిపించే జనులను దీవిస్తారు.

ఈథర్ యొక్క 7–11 అధ్యాయాలు కనీసం 28 తరాల సమాచారమిస్తాయి. ఇంత చిన్న స్థలములో ఎక్కువ వివరాలు ఇవ్వలేకపోయినప్పటికీ, ఒక నమూనా త్వరగా ఉద్భవిస్తుంది: నీతివంతమైన నాయకత్వము దీవెనలకు మరియు వృద్ధికి దారితీస్తుంది, అలాగే దుష్ట నాయకత్వము చెర మరియు నాశనమునకు దారితీస్తుంది.

క్రిందివి ఈ అధ్యాయాలలో చెప్పబడిన రాజులలో కేవలం కొద్దిమంది పేర్లు. సంబంధిత వచనాలను చదవండి మరియు వారి మాదిరుల నుండి—నాయకత్వము గురించి—అనుకూలమైనవి, ప్రతికూలమైనవి ఏవి మీరు నేర్చుకోగలరో చూడండి. మీరలా చేసినప్పుడు, మీ ఇంటిలో, మీ సమాజంలో, మీ సంఘ పిలుపులో మరియు మొదలైన వాటిలో ఇతరులను నడిపించడానికి లేదా ప్రభావితం చేయడానికి మీకు గల అవకాశాల గురించి ఆలోచించండి.

ఈథర్ 8:7–26

రహస్య కూడిక అనగానేమి?

ఇద్దరు లేక ఎక్కువమంది వారి దుష్టకార్యాలను రహస్యంగా ఉంచడానికి కుట్రపన్నినప్పుడు, వారు ఒక రహస్య కూడికలో చిక్కుకున్నారు. వారు తరచు అధికారం లేక ధనం కొరకైన కోరిక చేత ప్రేరేపించబడతారు. ఈథర్ 8:7–18 లో వివరించబడిన రహస్య కూడికలకు అదనంగా, హీలమన్ 1:9–12; 2:2–11; 6:16–30; మరియు మోషే 5:29–33 లో ఇతర మాదిరులు కనుగొనబడగలవు. ఈథర్ 8:18–26 లో, రహస్య కూడికల పర్యవసానాలను మొరోనై వివరించాడు (ఈథర్ 9:4–12) మరియు వాటికి సహకరించవద్దని మనల్ని హెచ్చరించాడు.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఈథర్ 6:2–12

వాగ్దానదేశానికి జెరెడీయుల ప్రయాణాన్ని నటించి చూపడాన్ని మీ కుటుంబము ఆనందిస్తుందా? మీరు నౌకను సూచించడానికి ఒక చీకటి గదిని మరియు మెరిసే రాళ్ళను సూచించడానికి ఫ్లాష్ లైట్లను ఉపయోగించవచ్చు. అవి “సముద్రపు లోతులలో ముంచివేయబడతాయని” (ఈథర్ 6:6) తెలిసినప్పటికీ, నౌకలలోకి వెళ్ళడం ద్వారా జెరెడీయులు ప్రభువు యందు తమ విశ్వాసాన్ని ఎలా చూపారనే దాని గురించి మీరు మాట్లాడవచ్చు. 9 వ వచనము చదివిన తర్వాత, కుటుంబ సభ్యులు నచ్చిన స్తుతి కీర్తనలను పంచుకొని, వాటిని కలిసి పాడవచ్చు. మన గృహాలు ఏవిధంగా జెరెడీయుల నౌకలతో పోల్చబడగలవు? ప్రభువు మన కుటుంబాన్ని ఏ వాగ్దాన దేశం వైపు నడిపిస్తున్నారు?

ఈథర్ 6:22–23

ఈ వారమంతా మీ కుటుంబము, చెర గురించి జెరెడ్ యొక్క సహోదరుని ప్రవచనాత్మక హెచ్చరిక ఏ విధంగా నెరవేర్చబడిందో గమనించగలరు. మన సంఘ నాయకులు మనకిచ్చిన హెచ్చరికలేవి? వారి సలహాను విస్మరించడం ఏవిధంగా చెరకు దారితీస్తుంది?

ఈథర్ 8:23–26

ఈ వచనాల ప్రకారం, రహస్య కూడికల గురించి “ఈ విషయాలను” వ్రాయుటకు మొరోనై ఎందుకు ఆజ్ఞాపించబడ్డాడు? (ఈథర్ 8:23). 26వ వచనము లో వివరించబడిన దీవెనలు పొందడానికి మనకు సహాయపడేలా ఈథర్ గ్రంథము నుండి మనమేమి నేర్చుకున్నాము?

ఈథర్ 9:11

మన కోరికలు మన ఎంపికలను ఏవిధంగా ప్రభావితం చేస్తాయి? మనము దేవుని విషయాలను కోరుకున్నామని నిశ్చయపరిచేందుకు ఒక కుటుంబంగా మనమేమి చేయగలము?

ఈథర్ 11:8

పశ్చాత్తాపపడిన వారిపట్ల ప్రభువు యొక్క దయ గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి, మీరు మోషైయ 26:29–30; 29:18–20; ఆల్మా 34:14–16; లేక మొరోనై 6:8 చదువవచ్చు. బహుశా కుటుంబ సభ్యులు లేఖనముల నుండి లేక వారి స్వంత జీవితాల నుండి దేవుని దయకు సంబంధించిన మాదిరులను పంచుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీరు నేర్చుకునే దానిపై పనిచేయండి. సువార్తను నేర్చుకోవడమనేది చదవడం మరియు ధ్యానించడాన్ని మించినది. లేఖనములలోని సత్యాలపై పనిచేయడం ద్వారా తరచు మనం ఎక్కువగా నేర్చుకుంటాము (యోహాను 7:17 చూడండి). ఈథర్ 6–11 లో మీరు చదివిన దానిని అన్వయించడానికి మీరేమి చేస్తారు?

చిత్రం
సముద్రముపైన జెరెడీయుల నౌకలు

జెరెడీయుల నౌకలు, గారీ ఎర్నెస్ట్ స్మిత్ చేత

ముద్రించు