“నవంబర్ 23–29. ఈథర్ 12-15: ‘విశ్వాసము ద్వారా అన్ని సంగతులు నెరవేరబడును,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)
“నవంబర్ 23–29. ఈథర్ 12–15,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020
నవంబర్ 23–29
ఈథర్ 12–15
“విశ్వాసము ద్వారా అన్ని సంగతులు నెరవేరబడును”
ప్రేరేపణలను వ్రాయుట ఇంకా బయల్పాటును పొందడానికి ఆహ్వానించును మరియు మీ సాక్ష్యమును బలపరచును. అది మీ ప్రేరేపణలను జ్ఞాపకము చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో ఇతరులతో వాటిని పంచుకోవడానికి కూడ మీకు సహాయపడుతుంది.
మీ మనోభావాలను నమోదు చేయండి
జెరెడీయులకు ఈథర్ యొక్క ప్రవచనాలు “గొప్ప మరియు ఆశ్చర్యకరమైనవి” (ఈథర్ 12:5). అతడు “మనుష్యుని యొక్క ఆరంభము నుండి అన్ని సంగతులను చెప్పెను” (ఈథర్ 13:2). అతడు “క్రీస్తు యొక్క దినములను” మరియు కడవరి దిన క్రొత్త యెరూషలేమును ముందుగా చూసాడు. అతడు “ఒక మేలైన లోకము, అవును, దేవుని యొక్క కుడిచేతి వైపున ఒక స్థలము కొరకు కూడ నిరీక్షించును” (ఈధర్ 12:4). కానీ జెరడీయులు అతడి మాటలను తిరస్కరించారు, ఈరోజు దేవుని యొక్క సేవకుల ప్రవచనాలను జనులు తిరస్కరించే అదే కారణము వలన,—“వారు వాటిని [చూడ] లేదు కనుక” (ఈథర్ 12:5). అవిశ్వాసులైన జనులకు “గొప్ప మరియు అద్భుతమైన విషయాలను” గూర్చి ప్రవచించుట ఈథర్‌కు విశ్వాసము అవసరమైనట్లుగా మనము చూడలేని సంగతులను గూర్చి వాగ్దానములు లేక హెచ్చరికలను నమ్మడానికి విశ్వాసము అవసరము. ప్రభువు “వ్రాయుటలో అతడి బలహీనతను” తీసుకొని మరియు దానిని బలముగా మారుస్తాడని (ఈథర్ 12:23–27 చూడుము) నమ్మడానికి మొరోనైకు విశ్వాసము అవసరమైంది. ఇటువంటి విశ్వాసమే మనల్ని “నిశ్చయమును మరియు నిలకడగా ఎల్లప్పుడు, సత్‌క్రియలలో వృద్ధి పొందుచూ, దేవునిని మహిమపరచుటకు నడిపించబడునట్లు చేయును” (ఈథర్ 12:4). మరియు ఈ రకమైన విశ్వాసము ద్వారానే “అన్ని సంగతులు నెరవేరబడును” (ఈథర్ 12:3).
వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు
యేసు క్రీస్తునందు విశ్వాసము బలమైన అద్భుతాలకు నడిపించును.
ఈరోజు అనేకమంది జనులు, ఈథర్ కాలములోని జెరెడీయుల వలె, వారు దేవుడు మరియు ఆయన శక్తియందు నమ్మకముందు నిదర్శనము చూడాలని కోరుతున్నారు. అయినప్పటికినీ, మొరోనై ఇలా బోధించెను, “విశ్వాసము నిరీక్షింపబడిన మరియు చూడలేని సంగతులు” మరియు మీ “విశ్వాసము యొక్క పరీక్ష తర్వాత వరకు మీరు ఎట్టి సాక్ష్యమును పొందరు” (ఈథర్ 12:6).
ఈథర్ 12 లో “విశ్వాసము” అనే మాటను మీరు కనుగొనే ప్రతీసారి గమనించి, విశ్వాసము గురించి మీరు నేర్చుకొన్న దానిని వ్రాయుము. ఇటువంటి ప్రశ్నలకు జవాబుల కోసం వెదకుము: విశ్వాసము అనగా ఏమిటి? విశ్వాసము-నిండిన జీవితము యొక్క ఫలములేవి? “మీ విశ్వాసము యొక్క పరీక్ష తర్వాత” (ఈథర్ 12:6) మీరు పొందిన సాక్ష్యములను గూర్చి మీ ఆలోచనలు కూడ మీరు వ్రాయవచ్చు.
హెబ్రీయులకు 11; ఆల్మా 32 కూడ చూడుము.
యేసు క్రీస్తు మనకు “ఒక అధిక శ్రేష్టమైన నిరీక్షణను” ఇచ్చును.
విశ్వాసము గురించి లోతైన అంతర్‌జ్ఞానములకు అదనముగా, ఈథర్ 12 నిరీక్షణ గురించి చెప్పడానికి అధికమును కూడ కలిగియున్నది—”నిరీక్షణ” పదము కనబడిన ప్రతీసారి మీరు గుర్తించవచ్చు. నిరీక్షణ మీకు ఏ అర్ధమును కలిగియున్నది? “ఒక మేలైన లోకము కొరకు నిరీక్షించుటకు” ఈథర్‌కు గల కారణములేవి? (ఈథర్ 12:2–5 చూడుము). యేసు క్రీస్తు యొక్క సువార్త మీకు “అధిక శ్రేష్టమైన నిరీక్షణ” ఎలా ఇచ్చింది? (ఈథర్ 12:32).
మొరోనై 7:40–41; Dieter F. Uchtdorf, “The Infinite Power of Hope,” Ensign or Liahona, Nov. 2008, 21–24; Preach My Gospel, 117 కూడ చూడుము.
యేసు క్రీస్తు బలహీనమైన విషయాలు బలమైనవిగా చేయగలడు.
మొరోనై యొక్క శక్తివంతమైన రచనలు మనము చదివినప్పుడు, “వ్రాయుటలో తన బలహీనత” గురించి అతడు చింతించిన దానిని మరియు అతడి మాటలను బట్టి జనులు ఎగతాళి చేస్తారని భయపడిన దానిని మరచిపోవడం సులభమైనది (ఈథర్ 12:23–25 చూడుము). అయితే, ఆయన దీనులకు “బలహీనమైన సంగతులను బలమైనవిగా చేయుదునని” (27 వచనము) దేవుడు వాగ్దానమిచ్చాడు, మరియు మొరోనై రచనలలోని ఆత్మీయ శక్తి ప్రభువు ఈ వాగ్దానమును నెరవేర్చెననుటకు నమ్మదగిన సాక్ష్యము.
ఈథర్ 12:23–29, చదివిన తరువాత, మీ బలహీనతలు గుర్తించడానికి దేవుడు సహాయపడి, అవి ఉన్నప్పటికినీ మిమ్మల్ని బలపరచిన సమయాలను ధ్యానించుము. ప్రస్తుతం మీరు ప్రయాసపడుతున్న బలహీనతలను గూర్చి ఆలోచించడానికి ఇది కూడా మంచి సమయము. ప్రభువు యెదుట మిమ్మల్ని తగ్గించుకోవడానికి మరియు “బలహీనమైన సంగతులను బలమైనవిగా చేయుదునని” ఆయన వాగ్దానమును పొందడానికి మరియు ఆయనయందు విశ్వాసమును చూపడానికి బదులుగా మీరు ఏమి చేయాల్సినవసరమున్నది ? (ఈథర్ 12:27).
ఈ వచనాలను మీరు లోతుగా ధ్యానించినప్పుడు ఎల్డర్ నీల్ ఎ. మాక్స్‌వెల్ నుండి క్రింది పరిజ్ఞానము సహాయకరంగా ఉండవచ్చు : లేఖనాలలో “మనుష్యుని ‘బలహీనత,’ మనము చదివినప్పుడు ఈ పదము … మనము మానవులం కనుక మనకున్న బలహీనతను దానిలో మాంసము ఆత్మపై కలిగియున్న నిరంతర ప్రభావము (ఈథర్ 12:28–29). అయినప్పటికినీ అదేవిధమైన బలహీనతలు, మన ప్రత్యేకమైన వ్యక్తిగత బలహీనతలు, మనము జయించడానికి ఆశించబడుతున్నాము (సిద్ధాంతము మరియు నిబంధనలు 66:3; జేకబ్ 4:7)” (Lord, Increase Our Faith [1994], 84 చూడుము).
“Grace,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.
ప్రవక్తలను తిరస్కరించుట ఆత్మీయమైన అపాయమును తెచ్చును.
జెరెడీయులకు రాజుగా ఉండుట, చారిత్రాత్మకంగా, ప్రమాదకరమైన స్థానం. ఇది ప్రత్యేకంగా కొరియాంటమర్‌కు నిజమైనది, “బలమైన మనుష్యులు … అతడిని నాశనము చేయుటకు కోరిన” (ఈథర్ 13:15–16) అనేకులుండిరి. ఈథర్ 13:15–22 లో, తనను తాను కాపాడుకోవడానికి కొరియాంటమర్ చేసిన దానిని మరియు బదులుగా ఏమి చేయమని అతడికి ఈథర్ సలహా ఇచ్చాడో గమనించుము. మిగిలిన ఈథర్ గ్రంథమును చదివినప్పుడు, ప్రవక్తలను తిరస్కరించుట వలన పర్యవసానాలను ధ్యానించుము. “ప్రభువు యొక్క ఆత్మ వారితో పోరాడుట [మానివేసియుండినప్పుడు]“ జనులకు ఏమి జరిగింది? (ఈథర్ 15:19).
కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు
మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.
ఈథర్ 12:7–22
ఈ వచనాలు మీరు కలిసి చదివినప్పుడు, మోర్మన్ గ్రంధములో మీరు చదివిన విశ్వాసము యొక్క ప్రేరేపించే మాదిరులలో కొన్నిటిని సమీక్షించవచ్చు. మీ కుటుంబ చరిత్ర లేక మీ స్వంత జీవితాలలో విశ్వాసము యొక్క మాదిరులను గూర్చి ఒక చర్చకు ఇది నడిపించగలదు—మీరు ఇదివరకు వ్రాయని యెడల ఈ అనుభవాలను వ్రాయడానికి ఆలోచించుము.
ఈథర్ 12:27
ప్రభువు మనకు బలహీనతలను ఎందుకు ఇస్తారు? “బలహీనమైన సంగతులను బలమైనవిగా” చేయుటలో మన వంతు ఏమిటి? రక్షకుని యొక్క భాగము ఏమిటి?
ఈథర్ 12:41
“యేసును … వెదకుటకు” మీ పిల్లలకు మీరు బోధించుటకు ఏదైన సరదా విధానము ఉన్నదా? యేసు యొక్క చిత్రమును దాచి చిత్రమును “వెదకి,” కనుగొనమని మీ కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. మనము యేసును ఎలా వెదకగలము, మరియు మనము ఆయన కనుగొన్నప్పుడు మనము ఎలా దీవించబడ్డాము?
ఈథర్ 13:13–14; 15:19, 33–34
మోర్మన్, మొరోనై యొక్క అనుభవాలతో ఈథర్ యొక్క అనుభవాన్ని పోల్చుట ఆసక్తికరంగా ఉండవచ్చు (మోర్మన్ 6; 8:1–10 చూడుము). అవి ఒకేవిధంగా ఎలా ఉన్నాయి? నాశనమునకు నీఫైయుల మార్గము జెరెడీయుల మార్గముతో ఎలా పోలికగా ఉన్నది? (మొరోనై 8:28తో ఈథర్ 15:19 పోల్చుము). వారికి జరిగిన దానిని తప్పించుకోవడానికి మనకు సహాయపడగలుగునట్లు మనము నేర్చుకొనే సత్యములేవి?
పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.