రండి, నన్ను అనుసరించండి
నవంబర్ 2–8. మోర్మన్ 7–9: “మీరు ఇక్కడున్నట్టు నేను మీతో మాట్లాడుచున్నాను”


“నవంబరు 2–8. మోర్మన్ 7–9: ‘మీరు ఇక్కడున్నట్టు నేను మీతో మాట్లాడుచున్నాను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“నవంబరు 2–8. మోర్మన్ 7–9,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

బంగారు పలకలపై వ్రాస్తున్న మొరోనై

డేల్ కిల్‌బర్న్ చేత బంగారు పలకలపై వ్రాస్తున్న మొరోనై

నవంబర్ 2–8

మోర్మన్ 7–9

“మీరు ఇక్కడున్నట్టు నేను మీతో మాట్లాడుచున్నాను”

కడవరి దినాలలో జీవిస్తున్న వారిని వారి నివేదిక ప్రేరేపిస్తుందని మోర్మన్ మరియు మొరోనై విశ్వాసము కలిగియుండిరి. మోర్మన్ 7–9 మీరు చదివినప్పుడు, మీరు నేర్చుకొన్న దానిని మీరు ఎలా అన్వయించాలో దాని గురించి మీకు కలిగే భావనలను వ్రాయుము.

మీ మనోభావాలను నమోదు చేయండి

దుష్ట లోకములో ఒంటరిగా ఉండుట ఎలా ఉంటుందో మోర్మన్ మరియు మొరోనై ఎరుగుదురు. అతని తండ్రి చనిపోయి, నీఫైయులు నాశనమైన తరువాత మొరోనైకు ఒంటరితనం ప్రత్యేకంగా తీవ్రమైనది. “నేను ఒక్కడినే మిగిలియున్నాను,” అతడు వ్రాసెను. “నేను ఏ స్నేహితులను లేకయున్నాను, లేక పోవుటకు ఏ స్థలము లేదు” (మోర్మన్ 8:3, 5). విషయాలు నిరాశాజనకంగా ఉండవచ్చు, కానీ మొరోనై రక్షకుని గూర్చి తన సాక్ష్యమందు “ప్రభువు యొక్క నిత్య సంకల్పములు కొనసాగును,” (మోర్మన్ 8:22) అనే తన జ్ఞానమందు నిరీక్షణను కనుగొన్నాడు. ఆ నిత్య సంకల్పములందు మోర్మన్ గ్రంథము చేత వహించబడే ముఖ్యమైన పాత్రను మొరోనై ఎరుగును—ఇప్పుడు అతడు శ్రద్ధగా పూర్తి చేస్తున్న నివేదిక, ఒకరోజు “అంధకారములోనుండి బయటికి ప్రకాశించును,” మరియు అనేకమంది జనులను “క్రీస్తు యొక్క జ్ఞానమునకు,” తెచ్చును (మోర్మన్ 8:16; 9:36). ఈ వాగ్దానములందు మొరోనై యొక్క విశ్వాసము ఈ గ్రంథమును భవిష్యత్తు పాఠకులకు ప్రకటించుటకు అతనికి సాధ్యము చేసింది, “మీరు ఇక్కడున్నట్టు నేను మీతో మాట్లాడుచున్నాను” మరియు “మీరు నా మాటలను కలిగియుందురని నేనెరుగుదును,” (మోర్మన్ 8:35; 9:30). ఇప్పుడు మనము అతడి మాటలను కలిగియున్నాము, మరియు ప్రభువు యొక్క కార్యము కొనసాగును, కొంతవరకు ఎందుకనగా మోర్మన్ మరియు మొరోనై, వారు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, వారి మిషనుకు యదార్ధముగా నిలిచియున్నారు.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోర్మన్ 7

నేను యేసు క్రీస్తునందు నమ్మాలి మరియు ఆయన సువార్తను “గట్టిగా పట్టుకోవాలి.”

మోర్మన్ 7 లో కనుగొనబడిన, మోర్మన్ యొక్క చివరిగా వ్రాయబడిన మాటలు, కడవరి-దిన వారసులకు ప్రసంగించబడింది, కానీ అవి మనందరి కోసం సత్యములను కలిగియున్నవి. యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి మోర్మన్ సందేశము మీకేమి బోధిస్తుంది? మోర్మన్ తన రచనలను ముగించడానికి ఈ సందేశాన్ని ఎందుకు ఎన్నుకొన్నాడు?

మోర్మన్ 7:8–10; 8:12–22; 9:31–37

మోర్మన్ గ్రంథము గొప్ప విలువ కలిగియున్నది.

అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ఇలా అడిగారు: “మీరు వజ్రాలు లేక కెంపులు లేక మోర్మన్ గ్రంథము ఇవ్వబడిన యెడల, మీరు దేనిని ఎంపిక చేస్తారు? నిజాయితీగా, మీకు ఏది గొప్ప విలువ కలిగియున్నది?” (“మోర్మన్ గ్రంథము: అది లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది?ఎన్‌సైన్ లేదా లియహోనా, నవం. 2017, 61).

వారు దాచిన నివేదిక మన కాలములో గొప్ప విలువ కలిగియున్నదని మోర్మన్ మరియు మొరోనై ఎరుగుదురు, కనుక వారు దానిని సిద్ధపరచడానికి మరియు కాపాడటానికి గొప్ప త్యాగాలను చేసారు. మోర్మన్ 7:8–10; 8:12–22; మరియు 9:31–37, మీరు చదివినప్పుడు, మన కాలములో నివేదిక ఎందుకు విలువైనదో ఆలోచించుము. 1 నీఫై 13:38–41; 2 నీఫై 3:11–12; మరియు సిద్ధాంతము మరియు నిబంధనలు 33:16; 42:12–13 లో అదనపు పరిజ్ఞానములను మీరు కనుగొనవచ్చు. మోర్మన్ గ్రంథము గొప్ప విలువ గలదని తెలుసుకొనుటకు ఏ అనుభవాలు మీకు సహాయపడ్డాయి?

వివిధ భాషలలో మోర్మన్ గ్రంథ ప్రతులు

మోర్మన్ గ్రంథము యొక్క ప్రవక్తల రచనలు మనకు అన్వయిస్తాయి.

మోర్మన్ 8:26–41; 9:1–30

మోర్మన్ గ్రంథము మన కాలము కొరకు వ్రాయబడింది.

మోర్మన్ గ్రంథము బయటకు వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో యేసు క్రీస్తు మొరోనైకు చూపించారు (మోర్మన్ 8:34–35 చూడుము), మరియు మొరోనై చూచినది మన కాలం కొరకు ధైర్యముగల హెచ్చరికలు చేయుటకు అతడిని నడిపించింది. మీరు మోర్మన్ 8:26–41 మరియు 9:1–30 చదివినప్పుడు, మీ జీవితంలో ఈ వైఖరులు మరియు క్రియల యొక్క సూచనలు ఏవైనా ఉన్నయామో ధ్యానించుము. మీరు భిన్నంగా ఏమి చేయవచ్చు?

ఉదాహరణకు, మోర్మన్ 9:1–30 మన కాలములో అతడు ముందుగా చూచిన యేసు క్రీస్తునందు విస్తృతమైన నమ్మకము లేకపోవడానికి స్పందనగా మొరోనై యొక్క సందేశము కలిగియున్నది. క్రింది దాని గురించి అతని మాటలనుండి మీరు నేర్చుకొన్న దానిని వ్రాయుటకు ఆలోచించుము:

  • క్రీస్తునందు నమ్మకం లేకపోవుట వలన పర్యవసానాలు (1–6, 26 వచనాలు)

  • దేవుని యొక్క బయల్పాటు మరియు అద్బుతాలందు నమ్ముట యొక్క ప్రాముఖ్యత (7–20 వచనాలు)

  • మన కోసం మొరోనై సలహా (21–30 వచనాలు)

పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తుకు దగ్గరగా ఇతరులను తెచ్చుటకు మీకు సహాయపడునట్లు మీరు ఏమి నేర్చుకున్నారు?

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మోర్మన్ 7:5–7, 10; 9:11–14

పరలోక తండ్రి యొక్క ప్రణాళిక గురించి మరియు మనకు ఒక రక్షకుడు ఎందుకు అవసరమో ఈ వచనాలు మనకు ఏమి బోధిస్తున్నాయి?

మోర్మన్ 7:8–10

ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథమును గూర్చి మన అధ్యయనంలో మనము నేర్చుకొన్నది ఏది బైబిల్ యందు మన విశ్వాసమును బలపరచడానికి సహాయపడింది? చర్చను ప్రారంభించడానికి, అదేవిధమైన సత్యములను బోధించే మోర్మన్ గ్రంథము మరియు బైబిలు నుండి లేఖనాలలో కొన్నిటిని మీరు కలిసి చదవవచ్చు, అవి ఆల్మా 7:11–13 మరియు యెషయా 53:3–5 లేక 3 నీఫై 15:16–24 మరియు యోహాను 10:16.

మోర్మన్ 8:1–9

మొరోనై మాదిరి ఒంటరిగా ఉండుట ఎలా అనిపిస్తుంది? అతడు నెరవేర్చిన కార్యము గురించి మనల్ని ఆకట్టుకొనేది ఏమిటి?

మోర్మన్ 8:12, 17–21; 9:31

కుటుంబముగా ఈ వచనాలు చదవడానికి ఆలోచించుము, తరువాత ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాల్లండ్ చేత క్రింది వ్యాఖ్యానమును చదువుము: “ఆయన పరిపూర్ణుడైన అద్వితీయ కుమారుని విషయములో తప్ప, అసంపూర్ణులైన జనులతో దేవుడు ఎప్పుడూ పనిచేయాల్సి వచ్చింది. … మీరు అసంపూర్ణతను చూసినప్పుడు, పరిమితి దేవుని యొక్క దైవత్వములో లేదు” అని జ్ఞాపకముంచుకొనుము (“Lord, I Believe,” Ensign or Liahona, May 2013, 94). మోర్మన్ గ్రంథము వ్రాసిన వారిని కలిపి, ఇతరులలోని అసంపూర్ణతలపై దృష్టిసారించుట ఎందుకు అపాయకరమైనది?

మోర్మన్ 8:36–38

యేసు క్రీస్తు నామమును మనపైకి తీసుకొనుటకు అనగా అర్ధమేమిటి? యేసు క్రీస్తు యొక్క నామమును అతడు లేక ఆమెపై తీసుకొనుటకు మనము ఎందుకు సిగ్గుపడరాదు? రక్షకుని గూర్చి మన సాక్ష్యములందు మనము ధైర్యముగా ఎలా ఉండగలము?

మోర్మన్ 9:16–24

సైన్సు ప్రయోగము లేక తయారీ విధానమును విజయవంతంగా చేయడానికి కొన్ని పదార్ధములు అవసరము. కుటుంబముగా మోర్మన్ 9:16–24 చదవకముందు ఒక ప్రయోగము చేయుటకు లేక ఇష్టమైనది తయారు చేయుటకు ఆలోచించుము. వచనాలు (ప్రత్యేకంగా 20–21 వచనాలు) మీరు చదివినప్పుడు, అద్భుతాలను సాధ్యపరచుటకు అవసరమైన “పదార్ధములు,” కొరకు వెదకుము. మన చుట్టూ ప్రపంచంలో మరియు మన కుటుంబములో మనము చూసే అద్భుతములు ఏవి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

సంఘ అధికారిక వనరులను సూచించుము. మీరు సువార్త ప్రశ్నలు కలిగియున్న యెడల, జవాబుల కోసం శ్రేష్టమైన ఆధారాలు ప్రార్ధన, లేఖనాలు, జీవిస్తున్న ప్రవక్తల మాటలు, మరియు ఇతర సంఘ అధికారిక ప్రచురణలు (Teaching in the Savior’s Way, 17–18, 23–24 చూడుము).

మోర్మన్ బంగారు పలకలను సంగ్రహించుట

జాన్ మాక్‌‌నాటన్ చేత మోర్మన్ పలకలను సంగ్రహించుట