రండి, నన్ను అనుసరించండి
నవంబర్ 30–డిసెంబర్ 6. మొరోనై 1–6: “వారిని సరియైన మార్గమందు ఉంచుటకు”


“నవంబర్ 30–డిసెంబర్ 6. మొరోనై 1-6: ‘వారిని సరియైన మార్గమందు ఉంచుటకు,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“నవంబర్ 30–డిసెంబర్ 6. మొరోనై 1-6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
మోర్మన్ యొక్క నీళ్ల వద్ద ఆల్మా జనులకు బాప్తీస్మమిచ్చుట

మినెర్వా కె. టైచెర్ట్ (1888–1976), మోర్మన్ యొక్క నీళ్ల వద్ద ఆల్మా జనులకు బాప్తీస్మమిచ్చుట, 1949-1951, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రలేఖనము, 35 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, 1969.

నవంబర్ 30–డిసెంబర్ 6.

మొరోనై 1–6

“వారిని సరియైన మార్గమందు ఉంచుటకు”

“భవిష్యత్తులో ఏదో దినమందు … విలువ కలిగి” (మొరోనై 1:4) యుండునని అతడు ఆశిస్తున్న దానిని మొరోనై వ్రాసాడు. మొరోనై 1–6 లో మీరు కనుగొన్నది ఏది మీకు విలువ కలిగియున్నది? మీరు కనుగొన్న దానిని వ్రాయుము, మరియు అది విలువైనదిగా కనుగొనే మరొకరితో కూడా దానిని పంచుకోవడానికి ఆలోచించుము.

మీ మనోభావాలను నమోదు చేయండి

తన తండ్రి యొక్క నీఫైయుల నివేదికను పూర్తి చేసి మరియు జెరడీయుల నివేదికను సంగ్రహించిన తరువాత, మొరోనై తన నివేదికను కాపాడే కార్యము నెరవేర్చబడిందని మొదట అనుకున్నాడు (మొరోనై 1:1 చూడుము). పూర్తిగా నాశనము చేయబడిన రెండు దేశముల గురించి ఇంకా ఏమి చెప్పాలి? కానీ మొరోనై మన కాలములను చూసాడు (మోర్మన్ 8:35 చూడుము), మరియు “భవిష్యత్తులో ఏదో దినమందు … బహుశ అవి విలువ కలిగి యుండునేమోయని, మరికొద్ది సంగతులను వ్రాయుటకు” (మొరోనై 1:4) అతడు ప్రేరేపించబడ్డాడు. యాజకత్వ విధులు మరియు సాధారణంగా మతము గురించి కలవరమును దానితోపాటు తెస్తూ, విస్తృతమైన విశ్వాసభ్రష్టత్వము రాబోతున్నదని అతడు ఎరుగును. “విశ్వాసము యొక్క కర్త మరియు ముగించువాడు అయిన క్రీస్తు యొక్క యోగ్యతలపైన మాత్రమే ఆనుకొనుచూ, … [ఒకరినొకరిని] సరైన మార్గములో ఉంచుటకు” (మొరోనై 6:4) సంస్కారము, బాప్తీస్మము, పరిశుద్ధాత్మ యొక్క వరమును ఇచ్చుట, మరియు సహ విశ్వాసులతో సమావేశమయ్యే దీవెనలు గురించి అతడు అందుకే స్పష్టపరచే వివరాలను ఇచ్చియుండవచ్చు. అతడు “మరికొద్ది సంగతులను వ్రాయునట్లు” (మొరోనై 1:4) మొరోనై ప్రాణాన్ని కాపాడినందుకు కృతజ్ఞత కలిగియుండుటకు ఇటువంటి విలువైన పరిజ్ఞానములు మనకు కారణము ఇస్తాయి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మొరోనై 1

యేసు క్రీస్తు యొక్క శిష్యులు వ్యతిరేకతను లక్ష్యపెట్టకుండా విశ్వాసనీయంగా నిలిచియుంటారు.

కొందరు జనులకు, సౌలభ్యము మరియు సౌకర్యముగల సమయాలలో విశ్వసనీయంగా ఉండుట సులభమైనది. యేసు క్రీస్తు యొక్క శిష్యులుగా, మనము శ్రమలు మరియు వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు కూడా విశ్వాసంగా నిలిచియుండాలి. మొరోనై 1 మీరు చదివినప్పుడు, ప్రభువుకు మరియు అతడి పిలుపుకు మొరోనై విశ్వాసంగా ఉండుట గురించి మిమ్మల్ని ప్రేరేపించేది ఏమిటి? ఆయన మాదిరిని మీరు ఎలా అనుసరించగలరు?

మొరోనై 2–6

ప్రభువు ఆజ్ఞాపించినట్లుగా యాజకత్వపు విధులు నిర్వహించబడాలి.

ఆయన మర్త్య పరిచర్యయందు, రక్షకుడు పరిశుద్ధ విధులను పొంది, నిర్వహించారు, అవి బాప్తీస్మము వంటిది (మత్తయి 3:13–17; జోసెఫ్ స్మిత్ అనువాదము, యోహాను 4:1–3 చూడుము [in the Bible appendix]), యాజకత్వ విధి (మార్కు 3:13–19), మరియు సంస్కారము (మత్తయి 26:26–28 చూడుము). అయినప్పటికినీ, గొప్ప విశ్వాసభ్రష్టత్వము వలన, నేడు అనేకమంది జనులు విధులు ఎలా నిర్వహించబడాలి—మరియు అవి అసలు అవసరమా కాదా అని కలవరపడుతున్నారు. మొరోనై 2–6 లో, మొరోనై కొన్ని యాజకత్వ విధులను గూర్చి ముఖ్యమైన వివరాలను అందించారు, అది ఆ గందరగోళములో కొన్నింటిని తొలగించడానికి సహాయపడుతుంది. ఈ అధ్యాయాలలో విధులను గూర్చి మీరు నేర్చుకొన్నప్పుడు మీకు కలిగే ప్రేరేపణలేవిటి? మీరు నేర్చుకోవడానికి సహాయపడటానికి మీరు అడిగే కొన్ని ప్రశ్నలు ఇక్కడున్నాయి:

నిర్ధారణ (మొరోనై 2; 6:4).మొరోనై 2:2 లో రక్షకుని యొక్క సూచనలు నిర్ధారణ యొక్క విధి గురించి మీకు ఏమి బోధిస్తున్నాయి? “పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా, పైన పని చేయబడి, శుద్ధి చేయబడిన” అనగా అర్ధమేమిటని మీరు అనుకుంటున్నారు? (మొరోనై 6:4

యాజకత్వ విధి (మొరోనై 3)యాజకత్వమునకు నియమించబడుటకు సిద్ధపడుటకు సహాయపడునట్లు ఈ అధ్యాయములో మీరు కనుగొనేదేమిటి? ఒక విధిని నెరవేర్చుటకు ఎవరికైనా సహాయపడునట్లు మీరు కనుగొనేదేమిటి?

సంస్కారము (మొరోనై 4–5; 6:6).సంస్కార ప్రార్ధనలలో వాగ్దానములను గమనించుము (మొరోనై 4:3; 5:2 చూడుము), మరియు మీ వాగ్దానములను నిలుపుకోవడానికి మీరు చేసే దానిని లోతుగా ఆలోచించుము. సంస్కారములో మీరు పాల్గొన్నప్పుడు ఎక్కువ శక్తివంతంగా ఆత్మ యొక్క ప్రభావాన్ని ఆహ్వానించడానికి మీరు ఏమి చేయగలరు?

బాప్తీస్మము (మొరోనై 6:1–3)మీరు బాప్తీస్మము పొందిన తరువాత కూడ, ఈ వచనాలలో బాప్తీస్మము కొరకు ఇవ్వబడిన అర్హతలను తీర్చుటను కొనసాగించుటకు మీరు ఏమి చేయగలరు? యేసు క్రీస్తు యొక్క సంఘ సభ్యునిగా ఉండుట అనగా అర్ధమేమిటో ఈ వచనాలు మీకు ఏమి సూచిస్తున్నాయి?

మీరు నేర్చుకొన్న దానిపై ఆధారపడి, ఈ విధులు కోసం ఆలోచించి, పాల్గొని, లేక ఇతరులను సిద్ధపరచుట గురించి మీరు ఆలోచించే విధానాలను మీరు ఎలా మార్చగలరు? ఈ విధులు “క్రీస్తు యొక్క ఆజ్ఞల ప్రకారము … ఇవ్వబడుట” ఎందుకు ముఖ్యమైనది?? (మొరోనై 4:1)

Ordinances,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
యువతి ఒక దీవెన పొందుట

విధులు ఎలా నిర్వహించబడాలో యేసు బోధించాడు.

మొరోనై 6:4–9

యేసు క్రీస్తు యొక్క శిష్యులు ఒకరినొకరి ఆత్మల సంక్షేమాన్ని చూస్తారు.

మనమందరం “[మన] స్వంత రక్షణను జరిగించుకొనుట” మోర్మన్ 9:27 సత్యము కాగా, సహ విశ్వాసులతో “తరచుగా కూడు(కొనుట)” “సరియైన మార్గములో” (మొరోనై 6:4–5) మనల్ని ఉంచుటకు సహాయపడగలదని కూడా మొరోనై బోధించాడు. మొరోనై 6:4–9 మీరు చదివినప్పుడు, “క్రీస్తు సంఘము యొక్క జనుల మధ్య లెక్కింపబడియుండుట” మొరోనై 6:4{ నుండి వచ్చే దీవెనలను ధ్యానించుము. మీరు ఒక నాయకుడు లేక పాల్గొనేవారు అయినప్పటికినీ, సంఘమందు మీకు, ఇతరులకు కలిగే అనుభవాలు మొరోనై వర్ణించిన విధంగా ఎక్కువగా కావడానికి మీరు ఎలా సహాయపడగలరు?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మొరోనై 1; మొరోనై 6:3

“క్రీస్తును నిరాకరించుట” అనగా అర్థమేమిటి? మొరోనై 1:2–3. “ఆయనను అంతము వరకు సేవించుటకు మన నిశ్చయమును” మనము ఎలా చూపగలము? (మొరోనై 6:3). ఆయనను సేవించుటకు ఈ నిశ్చయమును కలిగి, మీరు ఎరిగిన జనుల యొక్క మాదిరులను పంచుకొనుము.

మొరోనై 4:3; మొరోనై 5:2

ఒక కుటుంబముగా సంస్కార ప్రార్ధనలు చదువుట సంస్కారమును ఎక్కువ భక్తిగా చూచుట గురించి ఒక చర్చకు నడిపించవచ్చు. బహుశా కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా వారికి అర్ధవంతమైనవి ఈ ప్రార్ధనలనుండి వాక్యభాగాలను చర్చించవచ్చు. వారు ఈ వాక్యభాగాలను గూర్చి వారి ఆలోచనలు కూడ వ్రాయవచ్చు లేక రక్షకుని గురించి ఆలోచించుటకు వారికి సహాయపడే చిత్రమును గీయవచ్చు. ఆయనపై వారి ఆలోచనలు దృష్టిసారించుటకు వారికి సహాయపడుటకు వారు వ్రాసిన దానిని లేక గీసిన బొమ్మను సంస్కార సమావేశమునకు తీసుకొనిరావచ్చు. సంస్కారము గురించి మరియు రక్షకుని త్యాగము గురించి మీరు ఎలా భావిస్తున్నారో మీ కుటుంబానికి చెప్పుము.

మొరోనై 6:1–4

“విరిగిన హృదయము మరియు నలిగిన మనస్సు” కలిగియుండుట అనగా అర్ధమేమిటి? (మొరోనై 6:2). ఇది మనము బాప్తీస్మము కొరకు సిద్ధపడుటకు మనకు ఎలా సహాయపడుతుంది? మనము బాప్తీస్మము పొందిన తరువాత అది మనకు ఎలా సహాయపడుతుంది?

మొరోనై 6:4–9

ఈ వచనాలు ప్రకారము, “క్రీస్తు సంఘము యొక్క జనుల మధ్య లెక్కింపబడి” యుండుట వలన కలిగే కొన్ని దీవెనలు ఏవి? (మొరోనై 6:4). మనకు సంఘము ఎందుకు అవసరము?

మొరోనై 6:8

పశ్చాత్తాపము గురించి ఈ వచనము మీకు ఏమని బోధిస్తుంది? “నిజమైన ఉద్దేశము” తో క్షమాపణ వెదకుట అనగా అర్ధమేమిటి? (మొరోనై 6:8). క్షమాపణ గురించి ఒక పాట పాడుటకు ఆలోచించుము, అవి “Help Me, Dear Father” (Children’s Songbook, 99).

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

దేవుని ప్రేమ యొక్క నిదర్శనము కనుగొనుము. అధ్యక్షులు ఎం. రస్సెల్ బ్యాలర్డ్ ఇలా బోధించారు, “సువార్త అంటే ప్రేమ యొక్క సువార్త—దేవుని పట్ల ప్రేమ మరియు ఒకరినొకరు కొరకు ప్రేమ” (“God’s Love for His Children,” Ensign, May 1988, 59). మీరు లేఖనాలను చదివినప్పుడు, మీ కోసం, ఆయన పిల్లలందరి కోసం దేవుని ప్రేమ యొక్క నిదర్శనాలను వ్రాయడానికి లేక గుర్తించడానికి ఆలోచించుము.

చిత్రం
ఒక గుహలో మొరోనై దాగుకొనుట

జార్జ్ కొక్కొ చేత గుహలో మొరోనై,

ముద్రించు