రండి, నన్ను అనుసరించండి
డిసెంబర్ 21–27. క్రిస్మస్: “తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును”


“డిసెంబర్ 21–27. క్రిస్మస్: “తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“డిసెంబర్ 21–27. క్రిస్మస్,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
యోసేపు, మరియ, మరియు పశువుల తొట్టెలో యేసు

వాల్టర్ రేని చేత ఇదిగో, దేవుని గొఱ్ఱెపిల్ల

డిసెంబర్ 21–27

క్రిస్మస్

“తన జనులను విమోచించుటకు ఆయన లోకములోనికి వచ్చును”

ఈ క్రిస్మస్ సమయము మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పుట్టుక కొరకు కృతజ్ఞతను వ్యక్తపరచుట మరియు పర్యాలోచన చేయుటకు సమయము. ఆయన పుట్టుకను మరియు జీవితంను మీరు చదివి, ధ్యానించినప్పుడు, ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథమును మీరు అధ్యయనం చేయుట ఆయన లోక రక్షకుడనే మీ సాక్ష్యమును ఎలా బలపరచిందో ఆలోచించుము. మీకు వచ్చే భావనలను వ్రాసియుంచుము.

మీ మనోభావాలను నమోదు చేయండి

నీఫై నుండి మొరోనై వరకు, ప్రతీ మోర్మన్ గ్రంథ ప్రవక్త గ్రంథములోని శీర్షిక పేజి లో సంక్షిప్తపరచబడిన పరిశుద్ధ ఉద్దేశ్యమునకు కట్టుబడియున్నారు: “[సమస్త జనులను] యేసే క్రీస్తని ఒప్పించుట.” ఒక ప్రవక్త ఆయనను మర్త్యత్వమునకు ముందు ఆత్మగా చూసెను, మరియు మరొకరు ఆయన పుట్టుకను, పరిచర్యను ఒక దర్శనములో చూసాడు. ఒకరు ఒక గోడపైన నిలబడి, ఆయన పుట్టుక, ఆయన మరణము యొక్క సూచనలు ప్రకటించారు, మరొకరు ఆయన చేతులు, పాదములు, మరియు ప్రక్కన తాకుతూ ఆయన పునరుత్థానము చెందిన శరీరమును యెదుట మోకరించారు. వారందరు ఈ ముఖ్యమైన సత్యమును ఎరుగుదురు: “మనుష్యుడు రక్షింపబడ గలిగిన ఏ ఇతర మార్గము లేక సాధనము లేదు, కేవలము రాబోవు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారానే, … లోకమును విమోచించుటకు ఆయన వచ్చును” (హీలమన్ 5:9 ).

కనుక ఈ క్రిస్మస్ సమయంలో, ప్రపంచమంతటా విశ్వాసులు ఆయన కుమారుని పంపుటలో దేవుని మంచితనమును మరియు దేవుని ప్రేమను వేడుక చేసుకొన్నప్పుడు, మోర్మన్ గ్రంథము క్రీస్తుయందు మీ విశ్వాసమును ఎలా బలపరచిందో ధ్యానించుము. ఆయన పుట్టుక గురించి మీరు ఆలోచించినప్పుడు, ఆయన ఎందుకు వచ్చారు మరియు ఆయన రాకడ మీ జీవితాన్ని ఎలా మార్చిందో లోతుగా ధ్యానించుము. తరువాత మీరు క్రిస్మస్ యొక్క నిజమైన సంతోషమును–యేసు క్రీస్తు మీకిచ్చే వరమును మీరు అనుభవించగలరు.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

1 నీఫై 11:13–36; మోషైయ 3:5–10; హీలమన్ 14:1–13; 3 నీఫై 1:4–22

నా రక్షకునిగా ఉండుటకు యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చారు.

క్రిస్మస్ సమయంలో రక్షకుని యొక్క పుట్టుక వృత్తాంతమును చదవటం సంప్రదాయమైనది, కానీ ఈ పరిశుద్ధ సంఘటన గూర్చి కదిలించే ప్రవచనాలను మోర్మన్ గ్రంథములో కూడ మీరు కనుగొనవచ్చు. ఉదాహరణకు, రక్షకుని పుట్టుక మరియు పరిచర్య గురించి ప్రవచనాలు 1 నీఫై 11:13–36; మోషైయ 3:5–10; హీలమన్ 14:1–13; మరియు 3 నీఫై 1:4–22 లో కనుగొనబడినవి. ఈ లేఖనాలను చదివినప్పుడు మరియు ఆయన పుట్టుకను గూర్చి సూచనల యొక్క సాధ్యమైన భావాలను లోతుగా ధ్యానించినప్పుడు యేసు క్రీస్తు గురించి మీకు కలిగే అభిప్రాయాలేమిటి? ప్రాచీన అమెరికాలోని ఈ ప్రవక్తల సాక్ష్యములు క్రీస్తును, ఆయన మిషనును గూర్చి మీ సాక్ష్యములను ఎలా బలపరచును?

మత్తయి 1:18–25; ఆల్మా 16:16 కూడా చూడండి.

2 నీఫై 2:6; ఆల్మా 7:7–13; 11:40; హీలమన్ 5:9; 14:16–17

యేసు క్రీస్తు సమస్త మానవాళి యొక్క విమోచకుడు.

ఆయన ప్రాయశ్చిత్త త్యాగము లేకపోతే యేసు క్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకోవటానికి మనకు ఏ కారణముండేది కాదు, దాని ద్వారా ఆయన మనల్ని పాపము మరియు మరణము నుండి రక్షించును, బాధలలో మనల్ని ఓదార్చును, మరియు “ఆయనలో పరిపూర్ణులము” (మొరోనై 10:32) అగుటకు మనకు సహాయపడును. ఈ సంవత్సరం మిమ్మల్ని విమోచించుటకు రక్షకుని యొక్క శక్తి గురించి మోర్మన్ గ్రంథము నుండి మీరేమి నేర్చుకున్నారు? ఏవైన వృత్తాంతములు లేక బోధనలు మీకు ప్రత్యేకమైనవిగా కనబడుతున్నాయా? రక్షకుని యొక్క విమోచించు మిషను గురించి మీకు బోధించే క్రింది మాదిరులను పరిశీలించుము: 2 నీఫై 2:6; ఆల్మా 7:7–13; 11:40; and హీలమన్ 5:9; 14:16–17. మీ కృతజ్ఞతను చూపడానికి మీరు ఏమి చేయటానికి ప్రేరేపించబడ్డారు ? (Christmas.ComeuntoChrist.org మీరు ప్రారంభించడానికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి.)

1 నీఫై 6:4; 19:18; 2 నీఫై 25:23, 26; 33:4, 10

మోర్మన్ గ్రంథము యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిస్తుంది.

“యేసు క్రీస్తు యొక్క మరియొక సాక్ష్యము” మోర్మన్ గ్రంథానికి ఉపశీర్షిక కంటే ఎక్కువ; అది దాని యొక్క దైవిక ఉద్దేశ్యమును గూర్చి ఒక వ్యాఖ్యానము. క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుటకు మోర్మన్ గ్రంథాము యొక్క మిషను గురించి క్రింది లేఖనాలనుండి మీరు నేర్చుకొనే దానిని ధ్యానించుము: 1 నీఫై 6:4; 19:18; మరియు 2 నీఫై 25:23, 26; 33:4, 10.

మోర్మన్ గ్రంథము అధ్యయనం చేయుట మిమ్మల్ని క్రీస్తుకు దగ్గరగా ఎలా తెచ్చిందో ఒక దినచర్య పుస్తకాన్ని వ్రాయడానికి ఆలోచించండి. క్రింది ప్రేరేపణలు సహాయపడవచ్చు:

  • “ఈ సంవత్సరం రక్షకుని గురించి నేను నేర్చుకొన్న క్రొత్త విషయము …”

  • “[రక్షకుని గురించి వచనాలను] చదవటం నేను ఉన్న విధానమును … మార్చింది”

  • “మోర్మన్ గ్రంథములో నాకిష్టమైన వ్యక్తి [లేక వృత్తాంతము] రక్షకుడు … అని నాకు బోధించెను”

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

1 నీఫై 11:13–23; మోషైయ 3:5–10; హీలమన్ 14:1–13; 3 నీఫై1:4–22

1 నీఫై 11:13–23; మోషైయ 3:5–10; హీలమన్ 14:1–13; మరియు 3 నీఫై 1:4–22 లో క్రీస్తు యొక్క పుట్టుక మరియు పరిచర్యను గూర్చి వృత్తాంతములను మీరు చదివినప్పుడు వారు విన్న దాని చిత్రములను గీయుట పిల్లలు ఆనందించవచ్చు. తరువాత మీ పిల్లలు వారు గీసిన చిత్రములను ఉపయోగిస్తూ వృత్తాంతములను తిరిగి చెప్పవచ్చు.

“ఆయనే బహుమానము”

ఆయన కుమారుని పంపుట ద్వారా పరలోక తండ్రి మనకిచ్చిన వరముపై దృష్టిసారించుటకు మీ కుటుంబానికి సహాయపడుటకు, యేసు క్రీస్తు యొక్క చిత్రమును ఒక క్రిస్మస్ బహుమతిగా చుట్టుము. కుటుంబ సభ్యులు వారు పొందిన లేక పొందాలని ఆశిస్తున్న ఇష్టమైన క్రిస్మస్ బహుమానాలను గూర్చి మాట్లాడవచ్చు. తరువాత వారు క్రిస్మస్ చిత్రమును విప్పి, ఆయన మనకు ఎంత ప్రశస్తమైన బహుమానముగా ఎలా ఉన్నాడో చర్చించవచ్చు. “ఆయనే బహుమానము” వీడియో (ChurchofJesusChrist.org) ఈ క్రిస్మస్ కుటుంబముగా రక్షకుని యొక్క బహుమానమును ఎలా గుర్తించి, హత్తుకొని, మరియు పంచుకోగలరో చర్చించుటకు మీకు సహాయపడవచ్చు.

వారు రక్షకునికి ఇవ్వాలని కోరే ఒక “బహుమానము” గురించి ఆలోచించుట నుండి కూడ ప్రయోజనము పొందవచ్చు, అవి ఇతరులకు దయ కలిగియుండుటకు లేక ఒక చెడు అలవాటును జయించుటకు పని చేయుటకు ప్రయత్నము చేయుట వంటివి. కుటుంబ సభ్యులు వారి ఆలోచనలు వ్రాసి, వాటిని ఒక బహుమతిగా చుట్టి, రక్షకుని చిత్రము చుట్టూ ఉంచమని కుటుంబ సభ్యులను ఆహ్వానించుటకు ఆలోచించుము.

క్రిస్మస్ ఆత్మ

క్రీస్తు యొక్క ఆత్మను అనుభూతి చెందుటకు క్రిస్మస్‌కు నడిపించే దినాలలో మీ కుటుంబము చేయగల ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయుట సరదాగా ఉండవచ్చు. (ఉపాయముల కొరకు, Christmas.ComeuntoChrist.org చూడుము.)

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

చర్య తీసుకోవడానికిచ్చిన ఆహ్వానాలపై విచారణ చేయండి. “చర్య తీసుకోవడానికిచ్చిన ఆహ్వానాలపై మీరు విచారణ చేస్తున్నప్పుడు, మీరు వారిపట్ల శ్రద్ధచూపుతున్నారని మరియు సువార్త వారి జీవితాలను దీవిస్తున్నదని (మీ కుటుంబ సభ్యులకు) మీరు చూపండి. వారి అనుభవాలను పంచుకోవడానికి కూడా మీరు వారికి అవకాశాలనివ్వండి, అది వారి నిబద్ధతను బలపరుస్తుంది మరియు సువార్తను జీవించడంలో ఒకరికొకరు సహకరించుకోవడానికి వారిని అనుమతిస్తుంది” (Teaching in the Savior’s Way, 35).

చిత్రం
ఒక దేవదూత నీఫైకు ఒక దర్శనములో కన్యయైన మరియను చూపుట

జూడిత్ ఎ. మెహర్ చేత కన్యకయైన మరియ నీఫై యొక్క దర్శనము

ముద్రించు