రండి, నన్ను అనుసరించండి
డిసెంబర్ 7–13. మొరోనై 7–9: “క్రీస్తు నిన్ను పైకి లేపును గాక”


“డిసెంబర్ 7–13. మొరోనై 7–9: ‘క్రీస్తు నిన్ను పైకి లేపును గాక,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“డిసెంబర్ 7–13. మొరోనై 7–9,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

బంగారు పలకలపై వ్రాస్తున్న నీఫై

మినర్వా కె. టీచర్ట్ (1888–1976), మొరోనై: చివరి నీఫైయుడు, 1949–1951, కృత్రిమ చెక్కమీద తైలవర్ణ చిత్రం, 34¾ x 47 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయ ఆర్ట్ మ్యూజియం, 1969

డిసెంబర్ 7–13

మొరోనై 7–9

“క్రీస్తు నిన్ను పైకి లేపును గాక”

మీరు మొరోనై 7–9 చదివినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణలను వినండి మరియు ఆయన మీకిచ్చిన సందేశాలను నమోదు చేయండి. మీరు తెలుసుకోవలసినవి మరియు మీరు చేయవలసినవి రెండూ అతడు మీకు బోధించగలడు.

మీ మనోభావాలను నమోదు చేయండి

నేడు మోర్మన్ గ్రంథముగా మనకు తెలిసిన గ్రంథాన్ని తన చివరి మాటలతో ముగించడానికి ముందు మొరోనై తన తండ్రియైన మోర్మన్ నుండి మూడు సందేశాలను పంచుకున్నాడు: “క్రీస్తు యొక్క సమాధానకరమైన శిష్యులకు” ఒక ప్రసంగము (మొరోనై 7:3) మరియు మొరోనైకు మోర్మన్ వ్రాసిన రెండు లేఖలు. ఆయన కాలము మరియు మన కాలము యొక్క సమస్యల మధ్య పోలికలను ఆయన ముందుగానే చూసినందువలన బహుశా మొరోనై ఈ సందేశాలను మోర్మన్ గ్రంథంలో చేర్చెను. ఈ మాటలు వ్రాయబడినప్పుడు, నీఫై జనులందరు త్వరితగతిన విశ్వాస భ్రష్టత్వములోనికి పడిపోతూ ఉన్నారు. వారిలో అనేకులు “ఒకరిపట్ల ఒకరు తమ ప్రేమను పోగొట్టుకొనియున్నారు” మరియు “మంచిదైనది తప్ప, ప్రతిదానియందు” ఆనందించారు (మొరోనై 9:5, 19). మరియు నిరీక్షణ అనగా అర్థము లోకము యొక్క సమస్యలను నిర్లక్ష్యం చేయడం లేదా అమాయకంగా ఉండడం కాదని మనకు బోధిస్తూ—మొరోనై ఇంకను నిరీక్షణకు కారణం కనుగొన్నాడు; దానర్థము, పరలోక తండ్రి మరియు యేసు క్రీస్తు యందు విశ్వాసము కలిగియుండడం, వారి శక్తి గొప్పది మరియు ఆ సమస్యల కంటే అధిక శాశ్వతమైనది. దానర్థము “ప్రతి మంచి సంగతిని పట్టుకొని యుండడం” (మొరోనై 7:19). దానర్థము యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము, “ఆయన మహిమ మరియు నిత్యజీవపు నిరీక్షణ నీ మనస్సునందు నిత్యము నిలిచియుండునట్లు” (మొరోనై 9:25) అనుమతించుట. మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క మహిమకరమైన దినము వరకు, “సమస్త నీతి యొక్క శతృవును జయించుట(కు) … (మనము) నిర్వహించవలసిన పనిని” (మొరోనై 9:6) మానకుండా చేయడమని దానర్థము.

వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మొరోనై 7:12–20

మంచి చెడుల మధ్య తీర్పుతీర్చడానికి క్రీస్తు యొక్క వెలుగు నాకు సహాయపడుతుంది.

నేటి ప్రపంచము ప్రభావితం చేసే సందేశాలతో నిండియుంది; ఏవి ఒప్పో, ఏవి తప్పో మనమెలా చెప్పగలము? మొరోనై 7 లోని మోర్మన్ మాటలు, “పొరపాటుగా తీర్పు తీర్చకుండా” (మొరోనై 7:18) ఉండేందుకు మనం ఉపయోగించగల అనేక సూత్రాలను మనకిస్తాయి. మీరు మొరోనై 7:12–20 చదివినప్పుడు, ఏది మిమ్మల్ని దేవుడికి దగ్గరగా తెస్తుందో మరియు ఏది తీసుకురాదో తెలుసుకోవడానికి మీకు సహాయపడగలిగే సత్యాల కోసం చూడండి. ఈ వారం మీరు ఎదుర్కొనే సందేశాలు మరియు అనుభవాలను విశ్లేషించి, అవి మిమ్మల్ని మంచి చేయడానికి ఆహ్వానిస్తూ, పురికొల్పుతున్నాయో లేదో నిర్థారించడంలో మీకు సహాయపడేందుకు మీరు ఈ సత్యాలను ఉపయోగించవచ్చు (మొరోనై 7:13 చూడండి).

Judging Others,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org; Bible Dictionary, “Light of Christ” కూడా చూడండి.

మొరోనై 7:20–48

క్రీస్తు నందు విశ్వాసము ద్వారా నేను “ప్రతి మంచి సంగతిని పట్టుకొని” యుండగలను.

మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం గురించి బోధించిన తర్వాత, మోర్మన్ ఒక ప్రశ్న అడిగాడు, అది నేటికి తగినట్లున్నది: “ప్రతి మంచి సంగతిని పట్టుకొనియుండుట ఎట్లు సాధ్యము?”—ప్రత్యేకించి అపవాది శోధనలు చాలా ప్రలోభపెడుతున్నప్పుడు (మొరోనై 7:20). 7 వ అధ్యాయములో మిగిలిన భాగమంతటా మోర్మన్ సమాధానము కనుగొనబడగలదు. మీరు 20–48 వచనాలు చదివినప్పుడు, యేసు క్రీస్తు మూలంగా మీరు కలిగియున్న “ప్రతి మంచి సంగతిని” గుర్తించడానికి మీకు సహాయపడే సత్యాల కోసం చూడండి. ఆయన యందు విశ్వాసము కలిగియుండడం, మంచి విషయాలను వెదకడానికి మీకెలా సహాయపడుతుంది? మరింత మంచి విషయాలను మీరెలా “పట్టుకొని“ యుండగలరు?

విశ్వాస ప్రమాణాలు 1:13 కూడా చూడండి.

మొరోనై 7:44–48

“దాతృత్వము, క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమయైయున్నది.”

అధ్యక్షులు డాల్లిన్ హెచ్. ఓక్స్ గమనించారు: “దాతృత్వము ఎన్నటికీ విఫలము కాదు మరియు చెప్పుకోదగిన అతి మంచి కార్యాలన్నిటి కంటే దాతృత్వము గొప్పది అనడానికి కారణము … దాతృత్వము, ‘క్రీస్తు యొక్క శుద్ధమైన ప్రేమ’ (మొరో. 7:47) అనేది ఒక పని కాదు, కానీ ఒక పరిస్థితి లేదా స్థితి. … దాతృత్వము అనేది ఒకరు కాగలిగినది” (“The Challenge to Become,” Ensign, Nov. 2000, 34). మీరు మొరోనై 7:44–48 చదివినప్పుడు, దాతృత్వము గురించి మోర్మన్ వర్ణనను గుర్తించండి మరియు పరిశుద్ధాత్మ నుండి చెరగని ముద్రలను వినండి; మీరు వృద్ధిచెందగల విధానాలను కనుగొనడంలో అతడు మీకు సహాయపడగలడు. దాతృత్వమనే బహుమానాన్ని పొందడానికి మనకు విశ్వాసము మరియు నిరీక్షణ ఎందుకు అవసరము?

మొరోనై 9:9

నా పవిత్రత మరియు సుగుణము నా నుండి తీసుకోబడగలదా?

నీఫైయుల యొక్క భయంకరమైన పాపముల గురించి మోర్మన్ వర్ణన, లైంగిక దాడి లేక హింస యొక్క బాధితులు పవిత్రత చట్టమును అతిక్రమించారని కొందరు తప్పుగా అనుకోవడానికి దారితీసింది. అయినప్పటికీ, అది సరికాదని ఎల్డర్ రిఛర్డ్ జి. స్కాట్ స్పష్టం చేసారు. “మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఇతరుల యొక్క అతిక్రమణ, వావి వరసలు లేని, వక్రబుద్ధి గల చర్యలు మిమ్మల్ని తీవ్రంగా బాధించినప్పుడు, దానికి మీరు బాధ్యులు కారని మరియు మీరు తప్పు చేసినట్లుగా భావించరాదని నేను గంభీరంగా సాక్ష్యమిస్తున్నానని” ఆయన బోధించారు (“Healing the Tragic Scars of Abuse,” Ensign, May 1992, 32).

మొరోనై 9:25–26

నా పరిస్థితులతో సంబంధం లేకుండా, క్రీస్తునందు నేను సంతోషము కలిగియుండగలను.

తాను చూసిన దుష్టత్వమును వివరించిన తర్వాత, మోర్మన్ తన కుమారునితో బాధపడరాదని చెప్పాడు. నిరీక్షణ గురించి మోర్మన్ యొక్క సందేశములో ఏది మీ మనస్సున ముద్రవేస్తున్నది? మీ దృష్టిలో క్రీస్తు “(మిమ్మల్ని) పైకి లేపడమనగా” అర్థమేమిటి? క్రీస్తు యొక్క ఏ సద్గుణాలు మరియు ఆయన సువార్త యొక్క ఏ సూత్రాలు “మీ మనస్సు నందు నిలిచి,” మీకు నిరీక్షణనిస్తున్నాయి? (మొరోనై 9:25).

Dieter F. Uchtdorf, “The Hope of God’s Light,” Ensign or Liahona, May 2013, 70, 75–77 కూడా చూడండి.

కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మొరోనై 7:5–11

మొరోనై 7:5–11 ప్రకారం, సరైన కారణాల కోసం సరైన పనులు చేయడం ఎందుకు ముఖ్యము? మనము “యధార్థమైన ఉద్దేశము”తో ప్రార్థిస్తున్నామని మరియు దేవుని ఆజ్ఞలకు లోబడియున్నామని మనకెలా తెలుస్తుంది? (6వ వచనము).

మొరోనై 7:12–19

మన సమయాన్ని మనమెలా గడుపుతున్నాము మరియు మనం ఎవరితో గడుపుతున్నామనే దాని గురించి మంచి ఎంపికలను చేయడానికి మోర్మన్ యొక్క సలహా మనకేవిధంగా ఉపయోగపడగలదు? “మంచి చేయుటకు, దేవుని ప్రేమించుటకు మరియు ఆయనను సేవించుటకు” (మొరోనై 7:13) వారిని ఆహ్వానించే సంగతులను మీ ఇంటిలో వెదకి, వాటిని “పట్టుకొని” (మొరోనై7:19) లేదా పట్టుకొని ఉండమని మీరు కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. వారు కనుగొన్న మంచి విషయాల కొరకు వారిని మెచ్చుకోండి.

మొరోనై 7:29

ఈ వచనము చదివిన తర్వాత, వారు చూసిన అద్భుతాలు లేక వారి జీవితాల్లో దేవుని హస్తాన్ని చూసిన ఇతర విధానాల గురించి కుటుంబ సభ్యులు మాట్లాడవచ్చు.

మొరోనై 8:5–26

చిన్న పిల్లలకు బాప్తీస్మమిస్తున్న నీఫైయులు యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము గురించి ఏమి తప్పుగా అర్థం చేసుకున్నారు? మోర్మన్ బోధనల నుండి ప్రాయశ్చిత్తము గురించి మనమేమి నేర్చుకుంటాము?

మొరోనై 8:16–17

“పరిపూర్ణమైన ప్రేమ” కలిగియుండడం అనగా అర్థమేమిటి? అది భయాన్ని జయించడానికి మనకెలా సహాయపడుతుంది? సత్యాన్ని ధైర్యంగా బోధించడానికి అది మనకెలా సహాయపడుతుంది? మనం దానిని ఎలా వృద్ధిచేయగలము?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

ఆత్మను ఆహ్వానించడానికి, సిద్ధాంతమును బోధించడానికి సంగీతాన్ని ఉపయోగించండి. “[మనల్ని] ఎక్కువ ఆధ్యాత్మికత వైపు తరలించడానికి సంగీతానికి అనంతమైన శక్తులు ఉన్నాయి” (“First Presidency Preface,” Hymns, x). ప్రేమ గురించి ఒక పాట, మొరోనై 7:44–48 లో దాతృత్వము గురించి కుటుంబ చర్చను అధికం చేయగలదు.

యేసు క్రీస్తు

రక్షకుడైన క్రీస్తు యొక్క ఛాయాచిత్రము, హీన్రిచ్ హాఫ్మన్ చేత