రండి, నన్ను అనుసరించండి
డిసెంబర్ 14–20. మొరోనై 10: “క్రీస్తు నొద్దకు రమ్ము మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము”


“డిసెంబర్ 14–20. మొరోనై 10: ‘క్రీస్తు నొద్దకు రమ్ము మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020(2020)

“డిసెంబర్ 14–20. మొరోనై 10,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
యేసు నీఫైయులకు ప్రత్యక్షమగుట

గారీ ఎల్. కాప్ చేత మీకు తెలుసునట్లు

డిసెంబర్ 14-20

మొరోనై 10

“క్రీస్తు నొద్దకు రమ్ము మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము”

మీరు మోర్మన్ గ్రంథమును చదవటం పూర్తి చేసినప్పుడు, అది సత్యమని పరిశుద్ధాత్మ నుండి ఒక క్రొత్తగా చేయబడిన సాక్ష్యమును కోరుటకు ఆలోచించుము. మీరు చేసినప్పుడు, మీరు పొందే మనోభావాలను వ్రాయండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

మోర్మన్ గ్రంథము “ప్రభువు యొక్క మృదు కనికరములు, ఆయన ఏర్పరచుకొనిన వారందరి మీద, వారి యొక్క విశ్వాసమును బట్టి” 1 నీఫై 1:20 అని చూపుటకు నీఫై యొక్క వాగ్దానముతో ప్రారంభించును. మొరోనై గ్రంథములను “ముద్ర వేయుటకు” సిద్ధపరచినప్పుడు అతడి నుండి అదేవిధమైన సందేశముతో గ్రంథము ముగించబడును: “ప్రభువు ఎంత కనికరము కలిగియుండెనో జ్ఞాపకము చేసుకొనుము” (మొరోనై 10:2–3). మోర్మన్ గ్రంథములో నమోదు చేయబడిన అనేక దయల గురించి మాత్రమే మనం ఆలోచించినప్పటికీ, ఇది మన గురించి ఆలోచించడానికి ఎక్కువ అవకాశాన్ని ఇస్తుంది. మీ మనస్సులోనికి ఏ మాదిరులు వస్తాయి? అరణ్యము గుండా మరియు గొప్ప జలముల మీదుగా లీహై కుటుంబాన్ని దేవుడు నడిపించిన కనికరమైన విధానమును, ఈనస్సు ఆత్మ క్షమాపణ కొరకు ఆకలిగొన్నప్పుడు అతడికి ఆయన చూపిన మృదు కనికరములు, లేక ఎవరైతే దాని నిర్భయమైన రక్షకులలో ఒకరిగా మారిన, సంఘానికి పరమ విరోధియైన ఆల్మాకు ఆయన చూపిన కనికరము, మీరు ఆలోచించవచ్చు. లేక పునరుత్థానుడైన రక్షకుడు జనులను వారి రోగులను స్వస్థపరచి మరియు వారి చిన్న పిల్లలను ఆశీర్వదించినప్పుడు జనులకు చూపిన కనికరమునకు మీ ఆలోచనలు మరలవచ్చు. బహుశా అతి ముఖ్యమైనది, ఇది మీపట్ల “ప్రభువు ఎంత కనికరము కలిగియుండెనో” మీకు జ్ఞాపకము చేయగలదు, ఏలయనగా మోర్మన్ గ్రంథము యొక్క ఉద్దేశాలలో ఒకటి మనలో ప్రతీఒక్కరం దేవుని యొక్క కనికరమును పొందుట—మొరోనై యొక్క వీడ్కోలు మాటలలో స్పష్టంగా ఒక ఆహ్వానము వ్యక్తపరచబడింది, “క్రీస్తు నొద్దకు రమ్ము మరియు ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము” (మొరోనై 10:32).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మొరోనై 10:3–7

పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా నేను సత్యమును తెలుసుకోగలను.

మొరోనై 10:3–7 లోవాగ్దానము ప్రపంచమంతటా మిలియన్ల జనుల జీవితాలను మార్చివేసింది. అది మిమ్మల్ని ఎలా మార్చింది? మోర్మన్ గ్రంథమును గూర్చి మీరు సాక్ష్యమును పొందటానికి లేక బలపరచడానికి కోరినప్పటికిని, మొరోనై యొక్క ఆహ్వానము మీకు అన్వయిస్తుంది. మీరు మొరోనై 10:3–7 చదివినప్పుడు, గతములో మీరు చేసిన దానికంటే ఎక్కువ జాగ్రత్తగా చదవటానికి ఆలోచించుము. ఈ ప్రశ్నలు అడుగుతూ, ప్రతీ వాక్యభాగమును మీరు పరిశీలించవచ్చు: దీని అర్ధమేమిటి? నేను దీనిని సరిగా ఎలా చేయగలను? దీనితో నాకు ఎటువంటి అనుభావలు కలిగాయి? మోర్మన్ గ్రంథము యొక్క యధార్ధతను గూర్చి పరిశుద్ధాత్మ నాకు ఎలా బయల్పరచింది?

మోర్మన్ గ్రంథమును గూర్చి మీ సాక్ష్యమును వినాల్సిన అవసరమున్న ఒకరి గురించి కూడ ఆలోచించుము. అతడు లేక ఆమె స్వంత సాక్ష్యమును వెదకుటకు ఆ వ్యక్తికి మీరు ఎలా సహాయపడతారు?

మొరోనై 10:8–25

“దేవుని యొక్క బహుమానమును నిరాకరించవద్దు.”

ఒక వ్యక్తి “దేవుని యొక్క బహుమానమును నిరాకరించే” అనేక విధానములున్నాయి ( మొరోనై 10:8). ఈ వరములు ఇంకా ఉన్నాయా అని కొందరు జనులు నిరాకరించవచ్చు. ఇతరులు వారికి ఆత్మీయ వరములు ఉన్నాయని నిరాకరించవచ్చు కానీ వాటిని ఇతరులలో గుర్తించవచ్చు. ఇంకను మిగిలిన వారు కేవలము వాటిని నిర్లక్ష్యం చేయుట లేక వాటిని వృద్ధి చేయుటకు విఫలమగుట ద్వారా వారి బహుమానాలను నిరాకరించవచ్చు.

మీరు మొరోనై 10:8–25 చదివినప్పుడు, మీ ఆత్మీయ వరములను కనుగొనుటకు సహాయపడే సత్యముల కొరకు వెదకుము మరియు వాటిని మిమ్మల్ని, ఇతరులను దీవించుటకు గొప్ప శక్తితో వాటిని ఉపయోగించుము. మీకివ్వబడిన దేవుని యొక్క వరములను గూర్చి పరిజ్ఞానములను లేక మీరు వెదకాలని ఆయన కోరుతున్న వరములను గూర్చి వెదకుము. “ప్రతి మంచి బహుమానము క్రీస్తు నుండి వచ్చునని జ్ఞాపకము చేసుకొనుట” ఎందుకు ముఖ్యమైనది? (మొ(రోనై 10:18).

ఎల్డర్ జాన్ సి. పింగ్రీ జూ.: “అయితే మన బహుమానాలను మనము ఎలా తెలుసుకోగలుగుతాము? మన గోత్రజనకుని దీవెనను మనము చదవవచ్చు, మనల్ని బాగా ఎరిగిన వారిని అడగవచ్చు, మరియు మనము సహజంగా దేనిని బాగా చేయగలం మరియు ఆనందించగలమో వ్యక్తిగతంగా గుర్తించగలము. అతి ముఖ్యమైనది, మనము దేవునిని అడగవలెను (యాకోబు 1:5; సిద్ధాంతము మరియు నిబంధనలు 112:10 చూడుము). ఆయనే వాటిని మనకు ఇచ్చారు కనుక, ఆయన మన బహుమానాలను ఎరుగును” (“I Have a Work for Thee,” Ensign or Liahona, Nov. 2017, 33).

Guide to the Scriptures, “Gifts of the Spirit,” scriptures.ChurchofJesusChrist.org చూడండి.

మొరోనై 10:30–33

యేసు క్రీస్తు యొక్క కృప ద్వారా నేను పరిపూర్ణముగా చేయగలను.

“క్రీస్తు నొద్దకు రమ్ము” అనిన మొరోనై యొక్క హితబోధ ఆయనను గూర్చి నేర్చుకొనుట లేక ఆయనను గూర్చి ఎక్కువ తరచుగా ఆలోచించుట లేక ఆయన ఆజ్ఞలను పాటించుటకు తీవ్రంగా ప్రయత్నించినప్పుడు కూడ, ఈ విషయాలు ముఖ్యమైనవి అయినప్పటికినీ, అధికమును కలిగియున్నది. అయితే, సాధ్యమైన మిక్కిలి సంపూర్ణమైన భావనలో క్రీస్తునొద్దకు వచ్చుటకు—ఆయన ఉన్నట్లుగా మారుటకు ఇది ఒక ఆహ్వానము. మీరు మొరోనై 10:30–33 చదివినప్పుడు, “ప్రతి మంచి బహుమానమును పట్టుకొనవలెనని,” ”సమస్త భక్తిహీనత నుండి మీకై, మీరు నిరాకరించుకొని,” మరియు అవును, “ఆయనలో పరిపూర్ణుడవు కమ్ము” (ఏటవాలు అక్షరములు జోడించబడినవి) వంటివి, క్రీస్తు నొద్దకు సంపూర్ణంగా వచ్చుట అనగా అర్ధమేమిటో గ్రహించుటకు మీకు సహాయపడే వాక్యభాగాలను గమనించుము.

ఇది ఎలా సాధ్యము? మొరోనై 10:30–33 లో జవాబుల కొరకు చూడుము. ఎక్కువ సంపూర్ణంగా “క్రీస్తు నొద్దకు వచ్చుటకు, ఆయనలో పరిపూర్ణుడవు” అగుటకు మీరు ఏమి చేయాలని ఆత్మ మీకు చెప్పుచున్నది?

ఓంనై 1:26; Guide to the Scriptures, “Perfect,” scriptures.ChurchofJesusChrist.org చూడుము.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మొరోనై 10

మొరోనై ఉపయోగించిన హెచ్చరించుట మాట కొరకు వెదకుతూ, ఈ అధ్యాయమును కలిసి చదువుము. మొరోనై హెచ్చరిస్తున్న దానిని—లేక మనము చేయాలని—బలముగా ప్రోత్సహిస్తున్న దానిని గుర్తించుము లేక జాబితా చేయుము. అతడి హెచ్చరికలను అనుసరించుటకు మనము ఏమి చేయగలము?

మొరోనై 10:3

మనము ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథమును చదివినప్పుడు ప్రభువు యొక్క కనికరము గురించి మనము నేర్చుకొన్నదేమిటి? ప్రభువు మన కుటుంబానికి ఎలా కనికరముగా ఉన్నారు?

మొరోనై 10:3–5

ఈ వచనాలు చదివిన తరువాత, మోర్మన్ గ్రంథము సత్యమని వారు ఎలా తెలుసుకోగలిగారో పంచుకోమని కుటుంబ సభ్యులను మీరు అడగవచ్చు. “Search, Ponder, and Pray” (Children’s Songbook, 109) వంటిది, సత్యము కొరకు వెదకుట గురించి ఒక పాటను పాడుటకు ఆలోచించుము. ఒక కుటుంబ దినచర్య పుస్తకంలో వారి సాక్ష్యములను వ్రాయమని కూడ కుటుంబ సభ్యులను మీరు ఆహ్వానించవచ్చు.

మొరోనై 10:8–18

బహుమతులను స్వీకరించుట గురించి ఆలోచించుటకు క్రిస్మస్ సహజమైన సమయము. బహుశా కుటుంబ సభ్యులు మొరోనై 10:9–16 లో చెప్పబడిన “దేవుని యొక్క బహుమానములు” సూచించు బహుమానాలను ఒకరినొకరి కొరకు చుట్టవచ్చు. ఈ బహుమానాలు క్రీస్తునుండి వచ్చు మిగిలిన మంచి బహుమానాలను కూడ సూచించవచ్చు, అవి వారు ఒకరినొకరిలో చూసేవి.

మొరోనై 10:27–29, 34

కుటుంబ సభ్యులు “గొప్ప యెహోవా యొక్క ప్రీతికరమైన న్యాయపీఠము యెదుట [అతడిని] కలుసుకొన్నప్పుడు” మొరోనైకు చెప్పాలని వారు కోరిన దాని పంచుకోవచ్చు.

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

యేసు క్రీస్తు కొరకు చూడండి. మోర్మన్ గ్రంధము—మరియు సమస్త లేఖనముయొక్క ఉద్దేశము—యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చుట. మొరోనై 10 లో యేసు క్రీస్తు గురించి మీరు నేర్చుకొన్నదేమిటి? ఆయన వద్దకు వచ్చుటకు మీరు ఏమి చేయటానికి ప్రేరేపించబడ్డారు?

చిత్రం
మొరోనై బంగారు పలకలను సమాధి చేయుట

జాన్ మాక్‌నాటన్ చేత మొరోనై పలకలను సమాధి చేయుట

ముద్రించు