అనుబంధం ఎ: మోర్మన్ గ్రంథము సత్యమని ఆత్మ ఏవిధంగా నాకు సాక్ష్యమిచ్చును? రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020(2020)
“అనుబంధం ఎ,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు
అనుబంధం ఎ:
మోర్మన్ గ్రంథము సత్యమని ఆత్మ ఏవిధంగా నాకు సాక్ష్యమిచ్చును?
మోర్మన్ గ్రంథము చదివే వారందరికి మొరోనై ఇచ్చిన వాగ్దానము గురించి మీరు వినియుండవచ్చును : “ఒక వేళ మీరు యధార్థహృదయముతో, నిజమైన ఉద్దేశముతో, క్రీస్తునందు విశ్వాసము కలిగి అడిగిన యెడల ఆయన దానియొక్క సత్యమును పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా మీకు తెలియజేయును” (మొరోనై 10:4) కానీ “పరిశుద్ధాత్మ యొక్క శక్తితో” సత్యమును తెలుసుకొనుట అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతుంది అని మీరు ఎలా తెలుసుకోగలరు?
మనం ఒకరితో ఒకరు మాట్లాడుకొనే మార్గం కాకుండా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే మార్గాలుఎన్నో వేరే ఉన్నాయి అని గుర్తు పెట్టుకోవడం వలన మనకు సహాయపడవచ్చు. కానీ ఆత్మను గుర్తించడానికి పరలోకమందున్న మీ తండ్రి మీకు సహాయపడాలనుకొంటున్నారు. ఆయన మీకు మోర్మన్ గ్రంథాన్ని ఇచ్చారు, ఎంతో మంది నమ్మ దగిన సేవకులు ప్రభువు మాటగా వారి అనుభూతులను వివరించారు.
ఉదాహరణకు, “మిక్కిలి నిమ్మళమైన స్వరముతో,” ప్రభువు తనతో మాట్లాడేనని నీఫై అతని సోదరులకు చెప్పెను, అది వారి చెవులతో వినే స్వరముగా ఉండనవసరం లేదు. నిజానికి, నీఫై తన సహోదరులు “స్పర్శజ్ఞానమును కోల్పోయారని” మరియు “తన మాటలను అనుభూతి చెందలేక పోతున్నారని” చెప్పెను. (1 నీఫై 17:45 ఏటవాలు అక్షరములు జతచేయబడ్డాయి). ఈనస్ అతని ప్రార్థనకు సమాధానం “ప్రభువు స్వరము” “[అతను] మనసులోకి వచ్చుచున్నదని” వివరించెను (ఈనస్1:10). సమృద్ధి దేశములో పునరుత్థానము చెందిన యేసు ప్రత్యక్షమైనప్పుడు పరలోకమునుండి వచ్చిన స్వరమును వర్ణించిన ఈ మాటలను పరిగణించండి: “అది కఠినమైన స్వరముకాదు లేక బిగ్గర స్వరము కాదు; ఐనప్పటికి, … వారి ఆత్మకు కూడా గ్రుచ్చుకొని, వారి హృదయములు దహించునట్లు చేసెను” (3 నీఫై 11:3).
వీటిలాగే మీరు అనుభూతి చెంది ఉంటారు, లేదా మీ అనుభూతి వేరేగా ఉండవచ్చు. పరిశుద్ధాత్మ చాలా విధాలుగా సంభాషించును, మరియు బయల్పాటు ఒక్కొక్కరికి ఒక్కోవిధముగా వస్తుంది. ఆత్మ మన జీవితంలో ఉన్నప్పుడు, అయన యొక్క ప్రభావం మన అందరి పై చాలా విధాలుగా ఉంటుంది. అపొస్తలుడైన పౌలు “ఆత్మ యొక్క ఫలములు”— “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వీకము, ఆశానిగ్రహము” వంటి అనేకమైన వాటి యొక్క భావాలని చెప్పెను. (గలతియులకు 5:22–23)
పరిశుద్ధాత్మ గురించి మోర్మన్ గ్రంథము నుండి మరికొన్ని బోధనలు మరియు ఉదాహరణలు ఇక్కడ ఉన్నాయి. వాటిని చదువుతూ ఉన్నప్పుడు, మీరు గుర్తించే దానికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉందని, మోర్మన్ గ్రంథము నిజంగా దేవుని వాక్యని సాక్ష్యము చెప్తుందని మీరు కనుగొంటారు.
కృతజ్ఞత మరియు ఆనందం
ప్రవక్త లీహై ఒక అద్భుతమైన దర్శనాన్ని చూడడంతో మోర్మన్ గ్రంథము ప్రారంభమవుతుంది. ఆ దర్శనంలో, అతను ఒక గ్రంథం ఇచ్చి చదవమని చెప్పారు. “ఆయన చదువుతూ ఉండగా,” “అతనిలో దేవుని ఆత్మ నిండిపోయి ఉందని” ఆ వృత్తాంతము చెప్తుంది. ఈ అనుభూతులు దేవుని యొక్క “శక్తి, మంచితనం, మరియు దయ,” కొరకు ఆయనను స్తుతించడానికి లీహైని ప్రేరేపించాయి మరియు లీహై యొక్క “ఆత్మ ఆనందించెను మరియు అతని పూర్ణహృదయము నింపబడెను.” (1 నీఫై 1:12, 14–15).
మీరు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతిని చెందారా? ఎప్పుడైనా మోర్మన్ గ్రంథము చదవడం వలన మీ మనసు కృతజ్ఞతతో, దేవుని యొక్క మంచితనం మరియు దయతో నిండినదా? మోర్మన్ గ్రంథములో ఉదాహరించిన భాగాలు మీ ఆత్మకు సంతోషం కలిగించాయా? ఈ భావాలు ఆత్మ యొక్క ప్రభావము వలన కలిగినవి, మరియు మీరు చదువుతున్న వాక్యాలు దేవుని నుండి వచ్చినవని మరియు ఆయన సత్యాన్ని బోధిస్తున్నాయని మీకు సాక్ష్యమిస్తుంది.
మారిన ఒక హృదయము
యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం గురించి గొప్ప ఉపన్యాసం బోధించిన తరువాత ( మోషైయ 2–4 చూడండి), “ప్రజలు అయన చెప్పినమాటలు నమ్మారా లేదా” తెలుసుకోవాలి అని రాజైన బెంజిమెన్ అనుకున్నారు. వారు అతని సందేశాన్ని నమ్ముతున్నామని చెప్పారు. ఎందుకు? “సర్వశక్తిమంతుడైన ప్రభువు యొక్క ఆత్మను బట్టి మేము చెడు చేయుటకు ఇక ఏ మాత్రము కోరిక లేక నిరంతరము మంచి చేయుటకు కోరిక కలిగియుండునట్లు ఆ ఆత్మ మా యందు లేక మా హృదయములందు ఒక గొప్ప మార్పు కలుగజేసెను” మోషైయ 5:1–2).
మోర్మన్ గ్రంథము చదివినప్పుడు మీ మనసులో మీరు అలాంటిది ఒకటి గ్రహించి ఉండవచ్చు. ఉదాహరణకు, పాపము నుండి మరలి లేదా ఎవరికైనా ఏదో ఒక దయగల పనిచేసి ఉత్తమమైన వ్యక్తిగా ఉండుటకు మీరు ప్రేరేపించబడి యుండవచ్చును. ఈ గ్రంథము దేవునిచేత ప్రేరేపించబడిందని తెలుసుకొనుటకు మీరు వెతుకుతున్న ఆత్మీయ సాక్ష్యము ఇదే. మోర్మన్ భోధించిన, “మంచి చేయుటకు, దేవుని ప్రేమించుటకు మరియు ఆయనను సేవించుటకు ఆహ్వానించి పురిగొల్పు ప్రతి సంగతి దేవుని వలన ప్రేరేపింపబడినది” (మొరోనై 7:13; 2 నీఫై 33:4, 10; ఆల్మా 19:33; ఈథర్ 4:11–12 కూడా చూడండి).
వెలిగించబడిన మనస్సు
జోరామీయులు “[అతని] మాటలపై ఒక ప్రయోగం చేసి” ఆయన యొక్క సాక్షం నిజమేనా అని తెలుసుకొనుటకు ఆల్మా సహాయం చేయాలనుకున్నప్పుడు, ఆయన దేవుని మాటలను ఒక విత్తనంతో పోల్చారు: “ఇప్పుడు మీ హృదయమందు ఒక విత్తనము నాటబడునట్లు మీరు స్థలమిచ్చిన యెడల, అది ఒక నిజమైన విత్తనము లేక ఒక మంచి విత్తనమైన యెడల, మీరు ప్రభువు యొక్క ఆత్మను ఎదిరించునట్లు మీ అవిశ్వాసము ద్వారా దానిని బయటికి పడవేయని యెడల, అది మీ రొమ్ములలో వ్యాకోచించుటకు మొదలుపెట్టును మరియు మీరు వ్యాకోచించున్నఈ కదలికలను అనుభవించినప్పుడు మీతో మీరు ఇట్లు చెప్పుట మొదలుపెట్టుదురు—ఇది తప్పక ఒక మంచి విత్తనము లేక వాక్యము మంచిదై యుండవచ్చును, ఏలయనగా అది నా ఆత్మను విస్తరింపజేయుటకు మొదలుపెట్టెను. అది నా అవగాహనను ప్రకాశవంతం చేయుటకు మొదలుపెట్టెను. అవును, అది నాకు రుచికరముగా ఉండుటకు మొదలుపెట్టెను.” (అల్మా 32:27–28).
మోర్మన్ గ్రంథములోని మాటలు మీ జీవితాన్ని ప్రభావితం చేసి, మీ ఎంపికలను నడిపించుటకు అనుమతిస్తే మీ హృదయంలో వాటికి మీరు “స్థలమిస్తారు“ . మరియు ఈ మాటలు “[మీ] ఆత్మను విస్తరింపజేస్తాయి” మరియు “[మీ] అవగాహనను ప్రకాశవంతం చేస్తాయి”? మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని మీరు గ్రహించవచ్చు. మీరు ఇతరుల పట్ల మరింత ప్రేమగా మరియు పారదర్శంకగా ఉన్నట్లు భావించవచ్చు. మీరు విషయాలను మరి ముఖ్యంగా ఆత్మీయ విషయాలు—మీ మనస్సులో ఒక కాంతి ప్రకాశిస్తున్నట్లుగా—బాగా అర్థం చేసుకుంటున్నారని మీరు గమనించవచ్చు. మోర్మన్ గ్రంథములో బోధించిన సిద్ధాంతం “రుచికరమైనది” అని మీరు అంగీకరించవచ్చు. ఆల్మా ప్రకటించినట్లుగా, సత్యము యొక్క ఆత్మీయ సాక్ష్యమును మీరు పొందారని అర్థం చేసుకోవడానికి ఇటువంటి భావాలు మీకు సహాయపడతాయి: “ఓ అప్పుడు, ఇది వాస్తవము కాదా? ఏలయనగా అది వెలుగైయున్నది మరియు వెలుగైనదేదైనను మంచిది. ఏలయనగా అది వివేచింపబడగలదు, కావున అది మంచిదని మీరు తెలుసుకొనవలెను”అల్మా 32:35).
మీరు ఆశ్చర్యపోనవసరం లేదు
ఇవి ఆత్మ మాట్లాడే కొన్ని మార్గాలు. ఇంకా చాలా ఉన్నాయి. ఆత్మ యొక్క స్వరాన్ని వినడానికి అవకాశాల కోసం వెతుకుతూ ఉండండి, మరియు మీరు అతని కొనసాగుతున్న, మోర్మన్ గ్రంథము యొక్క నిజాయితీకి సాక్ష్యంగా నిలుస్తారు.
అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ వాగ్దానం చేసారు: “ఏది నిజం అనే దాని గురించి మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిని సురక్షితంగా నమ్మాలో అని మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మోర్మన్ గ్రంథము దేవుని వాక్యమని, జోసెఫ్ స్మిత్ ప్రవక్త అని మరియు ఇది ప్రభువు యొక్క సంఘమని వ్యక్తిగత బయల్పాటు ద్వారా మీ స్వంత సాక్ష్యాన్ని మీరు పొందవచ్చు. ఇతరులు ఏమి చెప్పినా, చేసినా, నిజం గురించి మీ హృదయానికి, మనసుకు పుట్టుకొచ్చే సాక్ష్యాన్ని ఎవ్వరూ తీసుకెళ్లలేరు” (“సంఘం కొరకు ప్రకటన, మన జీవితాల కొరకు ప్రకటన,” ఎన్‌సైన్ లేదా లియహోనా, మే 2018, 95).