రండి, నన్ను అనుసరించండి
అనుబంధం బి: “స్పష్టమైన మరియు ప్రశస్థమైన సత్యాలు”


“అనుబంధం బి: ’స్పష్టమైన మరియు ప్రశస్థమైన సత్యాలు’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“అనుబంధం బి,”రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

అనుబంధం బి

”స్పష్టమైన మరియు ప్రశస్థమైన సత్యాలు”

చివరి రోజులలో, సిద్ధాంతం లేదా దేవుని నిత్య సత్యము గురించి విస్తృతమైన గందరగోళం ఉన్న సమయంలో మోర్మన్ గ్రంథము బయటకు రావడానికి సిద్ధము చెయ్యబడింది. నీఫై ముందుగా చూసినవిధంగా, ఈ గ్రంథము యొక్క దైవిక ఉద్దేశములో ఒక భాగము ఏమిటంటే, “[బైబిల్] గురించి సత్యాన్ని స్థిరపరచుట,” శతాబ్ధాలుగా కోల్పోబడిన “స్పష్టమైన మరియు ప్రశస్థమైన సత్యాలు తెలియజేయుట”, మరియు “సమస్త వంశములు, భాషలు మరియు జనులకు దేవుని యొక్క గొఱ్ఱెపిల్ల శాశ్వతుడైన తండ్రి యొక్క కుమారుడనియు, మరియు లోక రక్షకుడనియు తెలియజేయుట”(1 నీఫై 13:40).

భ్రష్టత్వ కాలములో కోల్పోబడిన నిత్య సత్యాలను మోర్మన్ గ్రంథము బయలుపరుస్తుంది మరియు బైబిల్లో బోధించబడిన అనేక సత్యాలకు రెండవ, స్పష్టమైన సాక్ష్యమును జోడిస్తుంది. వాటిలోని కొన్ని సత్యాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీరు మోర్మన్ గ్రంథమును చదువుతున్నప్పుడు ఇవి మరియు ఇతర స్పష్టమైన మరియు ప్రశస్థమైన సత్యాల కోసం వెతకండి.

దైవసమూహము

  • పరలోక తండ్రి, యేసు క్రీస్తు మరియు పరిశుద్ధాత్మ వేర్వేరు వ్యక్తులు కాని ఉద్దేశము ఒకటే ( 3 నీఫై 11:32, 36 చూడండి).

  • పునరుత్థానం చెందిన రక్షకుడు స్పర్శనీయమైన శరీరం ఉంది ( 3 నీఫై 11:10–17 చూడండి).

దైవసమూహము గురించి అదనపు లేఖనాలు 2 నీఫై 31:6–8ఈథర్ 12:41

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము

  • యేసు క్రీస్తు మన పాపాలు మరియు కష్టాల కొరకు బాధపడెను కాబట్టి మనకు ఎలా సహాయం చేయాలో ఆయనకు తెలుసు (ఆల్మా 7:11–13చూడండి).

  • యేసు క్రీస్తు కృప ద్వారా మనం పరిపూర్ణంగా మారవచ్చు (మొరోనై 10:32–33చూడండి).

రక్షకుని ప్రాయశ్చిత్తం గురించి అదనపు లేఖనాలు: 1 నీఫై 10:62 నీఫై 2:6–9: జేకబ్ 4:11–12; మోషైయ 3:1–19; ఆల్మా 34:8–16

రక్షణ ప్రణాళిక

  • ఆదాము హవ్వల పతనము పరలోక తండ్రి ప్రణాళికలో ముఖ్యమైన భాగం ( 2 నీఫై 2:22–27చూడండి).

  • కర్తృత్వమును ఉపయోగించడానికి మనకు వ్యతిరేకత అవసరం ( 2 నీఫై 2:11–16 చూడండి).

  • మన క్రియలను బట్టి, మన హృదయ వాంఛలను బట్టి తీర్పు తీర్చబడతాము (ఆల్మా 41:3–7 చూడండి ).

  • “అగ్ని గంధకముల సరస్సు” అనేది పశ్చాత్తాపపడనివారి వేదనకు ప్రతీక (2 నీఫై 9:16–19; మోషైయ 3:24–27 చూడండి).

రక్షణ ప్రణాళిక గురించి అదనపు లేఖనాలు: 2 నీఫై 9:11–26; ఆల్మా 22:12–14; 34:31–35; 42:1–26

భ్రష్టత్వము మరియు పునఃస్థాపన

  • దుష్టత్వము మరియు అపనమ్మకముల వలన గొప్ప భ్రష్టత్వము సంభవించింది (మోర్మన్ 8:28, 31–41 చూడండి).

  • మోర్మన్ గ్రంథము బైబిల్లో బోధించిన సత్యాలను స్థిరపరుస్తుంది (1 నీఫై 13:19–41; 2 నీఫై 3:12 చూడండి).

  • క్రీస్తు సంఘము ఆయన పేరు మీద పిలువబడాలి (3 నీఫై 27:3–9చూడండి).

భ్రష్టత్వము గురించి అదనపు లేఖనాలు: 1 నీఫై 13:1–9, 24–29; 2 నీఫై 27–28

పునఃస్థాపన గురించి అదనపు లేఖనాలు: 1 నీఫై 14:7–12; 22:7–11; 2 నీఫై 3:7–24; 25:17–18

ప్రవక్తలు మరియు బయల్పాటు

  • ప్రవక్తలందరూ యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చారు (మోషైయ 13:33–35చూడండి).

  • ఆత్మీయ సత్యం యొక్క జ్ఞానం పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది (ఆల్మా 5:45–47 చూడండి).

  • దేవుని వాక్యమంతా బైబిల్లో లేదు (2 నీఫై 29:10–13 చూడండి).

  • దేవుని నుండి బయల్పాటు మన కాలంలో ఆగిపోలేదు (మొరోనై 9:7–9 చూడండి).

ప్రవక్తల గురించి అదనపు లేఖనాలు: 1 నీఫై 22:1–2; మోషైయ 8:16–18; హీలమన్ 13:24–33

బయల్పాటు గురించి అదనపు లేఖనాలు: జేకబ్ 4:8; ఆల్మా 12:9–11; 17:2–3; మొరోనై 10:5

యాజకత్వము

  • యాకత్వము కలిగినవారు లోకము పునాది వేయబడినప్పటినుండి పిలువబడి, సిద్ధపరచబడ్డారు (ఆల్మా 13:1–3 చూడండి).

  • సువార్త ప్రకటించడానికి ఒక వ్యక్తి దేవుని నుండి అధికారాన్ని పొందాలి (మోషైయ 23:17 చూడండి).

యాజకత్వం గురించి అదనపు లేఖనాలు: మోషైయ 18:17–20; ఆల్మా 13; హీలమన్ 10:7

విధులు మరియు నిబంధనలు

విధుల గురించి అదనపు గ్రంథాలు: మోసియా 18:8–17; 21:33–35; అలమా 13:16; 3 నీఫై 18:1–11; మొరోని 2–6; 8:4–26

నిబంధనల గురించి అదనపు లేఖనాలు: 2 నీఫై 11:5; మోషైయ 5:1–9; ఆల్మా 24:17–18

వివాహం మరియు కుటుంబం

  • భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకోవాలి (జేకబ్ 3:5–7 చూడండి).

  • తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభువు నందు పెంచాలి (1 నీఫై 7:1 చూడండి).

వివాహం మరియు కుటుంబం గురించి అదనపు లేఖనాలు: 1 నీఫై 1:1; 2 నీఫై 25:26; జేకబ్ 2:23–28; ఈనస్ 1:1మోషైయ 4:14–15; 3 నీఫై 18:21

ఆజ్ఞలు

  • ప్రభువు తన ఆజ్ఞలను నెరవేర్చడానికి మనకు ఒక మార్గాన్ని సిద్ధం చేయును (1 నీఫై 3:7 చూడండి).

  • దేవుడు తన ఆజ్ఞలను పాటిస్తే మనలను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసారు మోషైయ 2:22–24 చూడండి).

ఆజ్ఞల గురించి అదనపు లేఖనాలు: 1 నీఫై 17:3; 22:30–31; ఆల్మా 37:13, 35; 50:20

ముద్రించు