రండి, నన్ను అనుసరించండి
అనుబంధం సి: ముగ్గురు సాక్షులు


“అనుబంధం సి: ముగ్గురు సాక్షులు” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“అనుబంధం సి,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

అనుబంధం సి:

ముగ్గురు సాక్షులు

మొరోనై దేవదూత మొదటిసారి జోసెఫ్ స్మిత్ సందర్శించిన సమయం నుండి 1829 వరకు—ఐదు సంవత్సరాలకు పైగా—బంగారు పలకలను చూడడానికి అనుమతి ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి జోసెఫ్. ఇది అతడు ప్రజలను మోసం చేస్తున్నాడని నమ్మే వారి నుండి తీవ్రమైన విమర్శలు మరియు హింసలకు దారితీసింది. అతడు మోర్మన్ గ్రంథము అనువదించినప్పుడు, దేవుడు ఇతరులు కూడా పలకలను చూడడానికి అనుమతి ఇచ్చెనని మరియు అప్పుడు వాళ్ళు కూడా “గ్రంథము యొక్క సత్యానికి మరియు దానిలోని విషయాలకు సాక్ష్యమిస్తారని” జోసెఫ్ తెలుసుకున్నప్పుడు అతడు పొందిన ఆనందాన్ని ఊహించుకోండి(2 నీఫై 27:12–14; 2 నీఫై 11:3; ఈథర్ 5:2–4 చూడండి).

జూన్ 1829లో, ఆలీవర్ కౌడరీ, డేవిడ్ విట్మర్, మరియు మార్టిన్ హారిస్ ముగ్గురు సాక్షులుగా ఉండడానికి అనుమతి కోరారు, వారి గురించి మోర్మన్ గ్రంథములో ప్రవచించబడింది. దేవుడు వారి కోరికను మన్నించారు (సి&ని 17 చూడండి) మరియు పలకలను చూపించుటకు ఒక దేవదూతను పంపించెను. ఈ మనుషులు ముగ్గురు సాక్షులు అయ్యారు, మరియు వారి రాతపూర్వక సాక్ష్యాలు మోర్మన్ గ్రంథములోని ప్రతి కాపీలోను ఉంటుంది.1

ముగ్గురు సాక్ష్యాలు ఎందుకు అంత ఆసక్తికరమైనవో అధ్యక్షులు డాలిన్ హెచ్. ఓక్స్ విరించారు: “మోర్మన్ గ్రంథములో ముగ్గురు సాక్షుల యొక్క సాక్ష్యాలు మిక్కిలి బలమైనవిగా నిలుస్తాయి. వారి సాక్ష్యం తప్పై ఉంటే త్యజించడానికి లేదా ఏదైనా సరికానిది అయినట్లయితే వివరాలతో దానిని సరిదిద్దటానకి ఈ ముగ్గురిలో ప్రతి ఒక్కరికి తగిన కారణం మరియు అవకాశం ఉంది. అందరికీ తెలిసినట్లుగా,సంఘము యొక్క ఇతర నాయకులతో విభేదాలు లేదా అసూయల కారణంగా, ఈ ముగ్గురు సాక్షులలో ప్రతి ఒక్కరు వారి సాక్ష్యం ప్రచురించిన ఎనిమిది సంవత్సరాల తరువాత యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము నుండి బహిష్కరించబడ్డారు. మోసపూరిత ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి ఉమ్మడి ఆసక్తి లేకుండా, ముగ్గురూ తమ వేర్వేరు మార్గాల్లో వెళ్ళారు. బహిష్కరణకు గురైన 12 నుండి 50 సంవత్సరాల వరకు వారి జీవితము యొక్క అంతము వరకు—ఈ సాక్షులలో ఒకరు కూడా ఆయన ప్రచురించిన సాక్ష్యం నుండి తప్పుకోలేదు లేదా దాని నిజాయితీపై అనుమానం కలిగించే దేనిని చెప్పలేదు.”2

వారి జీవితకాలం ముగిసే వరకు, ఈ ముగ్గురు సాక్షులు మోర్మన్ గ్రంథము యొక్క సాక్ష్యానికి వారి విశ్వాసంలో స్థిరంగా ఉన్నారు.

ఆలీవర్ కౌడరీ

సంఘములో తిరిగి బాప్తిస్మం తీసుకున్న తరువాత మరియు అతని మరణానికి కొంతకాలం ముందు, ఆలీవర్ ఇంగ్లాండ్‌లో ఒక మిషన్‌కు సేవ చేయడానికి మిస్సోరీలోని రిచ్మండ్ గుండా వెళుతున్నసువార్త పరిచారకుడైన, ఎల్డర్ జాకబ్ గేట్స్‌ను కలిసెను. మోర్మన్ గ్రంథము గురించి తన సాక్ష్యము చెప్పమని ఆలీవర్‌ను ఎల్డర్ గేట్స్ అడిగాడు. ఆలివర్ యొక్క ప్రతిచర్యను ఎల్డర్ గేట్స్ కుమారుడు వివరించాడు:

“అతనిని ప్రశ్నించడం ఆలివర్ను చాలా లోతుగా తాకినట్లు అనిపించింది. అతను ఒక్క మాట కూడా సమాధానం ఇవ్వలేదు, కానీ తన సులభమైన కుర్చీలోంచి లేచి, పుస్తకములు పెట్టే అల్మారా వద్దకు వెళ్లి, మోర్మన్ గ్రంథము యొక్క మొదటి ప్రతిని తీసుకొని, ముగ్గురు సాక్షుల సాక్ష్యాల పేజిని తెరచి, అతను దాదాపు ఇరవై సంవత్సరాల ముందు తన పేరును సంతకం చేసిన పదాలను చాలా గంభీరంగా చదివెను. నా తండ్రి వైపు చూసి ఆయన ఇలా అన్నారు: ‘జేకబ్, నేను మీతో చెప్పినదాన్ని గుర్తుంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను చనిపోతున్నాను, మీకు అబద్ధం చెప్పడం వల్ల నాకు ఏమి లాభం? ఈ మోర్మన్ గ్రంథము దేవుని బహుమతి మరియు శక్తి ద్వారా అనువదించబడిందని నాకు తెలుసు అని ’ఆయన అన్నారు.’ నా కళ్ళు చూశాయి, నా చెవులు విన్నాయి, నా అవగాహన తాకబడింది, నేను సాక్ష్యమిచ్చినది నిజమని నాకు తెలుసు. అది కల కాదు, మనసు యొక్క వ్యర్థమైన ఊహకాదు—అది నిజం’”3

డేవిడ్ విట్మర్

తన తరువాతి సంవత్సరాల్లో, డేవిడ్ విట్మర్ మోర్మన్ గ్రంథము యొక్క సాక్ష్యాలను ఖండించాడని వచ్చిన పుకార్ల గురించి తెలుసుకున్నాడు. ఈ ఆరోపణలకు ప్రతిస్పందనగా, స్థానిక వార్తాపత్రికలో ప్రచురించబడిన ఒక లేఖలో డేవిడ్ తన సాక్ష్యాన్ని పునరుద్ఘాటించాడు,రిచ్‌మండ్ కన్జర్వేటర్:

“ప్రపంచం సత్యాన్ని తెలుసుకోవటానికి, జీవితపు సూర్యాస్తమయంలో ఉన్న నేను, దేవుని భయంతో అందరికి ఒకేసారి, ఈ బహిరంగ ప్రకటన చేయమని నేను కోరుకుంటున్నాను:

“ముగ్గురు సాక్షులలో ఒకరిగా, ఆ గ్రంథంలో ఇంతకాలం ప్రచురించబడిన ఆ సాక్ష్యాన్ని, లేదా దానిలోని ఏ భాగాన్ని నేను ఎప్పుడైనా ఖండించలేదు. నన్ను బాగా తెలిసిన వారికి, నేను ఎప్పుడూ ఆ సాక్ష్యానికి కట్టుబడి ఉన్నానని బాగా తెలుసు. అదే విషయంలో నా ప్రస్తుత అభిప్రాయాలను ఎవ్వరూ తప్పుదారి పట్టించలేరు లేదా అనుమానించలేరు, అప్పుడు నేను చేసిన మరియు ప్రచురించినట్లుగా, నా ప్రకటనలన్నిటిలో సత్యాన్ని నేను మళ్ళీ ధృవీకరిస్తున్నాను.

“‘వినడానికి చెవి ఉన్నవాడు, విననివ్వండి,’ అది భ్రమ కాదు! వ్రాసినది వ్రాయబడింది మరియు చదివినవాడు అతనికి అర్థం చేసుకోనివ్వండి.”4

మార్టిన్ హారిస్

ఆలీవర్ కౌడరీ మాదిరిగా, మార్టిన్ హారిస్ కొంతకాలం సంఘాన్ని విడిచిపెట్టాడు, కాని చివరికి తిరిగి బాప్తిస్మం తీసుకున్నాడు. తన తరువాతి సంవత్సరాల్లో, అతను మోర్మన్ గ్రంథ ప్రతిని తన చంకలో పెట్టుకొని, వినే వారందరికీ దాని నిజాయితీకి సాక్ష్యమిచ్చాడని అంతరికి తెలుసు: “మోర్మన్ గ్రంథము నిజంగా సత్యమని నాకు తెలుసు. మరియు మనుషులందరు ఆ గ్రంథము యొక్క సత్యాన్ని ఖండించినప్పటికీ, అలా చెయ్యడానికి నేను ధైర్యం చేయను. నా గుండె స్థిరపడింది. దేవా, నా హృదయం స్థిరపడింది! నాకు తెలిసిన దానికన్నా ఇంకా ఎక్కువగా లేదా ఖచ్చితంగా నేను తెలుసుకోలేను.”5

మార్టిన్ యొక్క పరిచయస్తుడైన జార్జ్ గాడ్ఫ్రే ఇలా వ్రాశాడు: “ఆయన మరణానికి కొన్ని గంటల ముందు … మోర్మన్ గ్రంథము ముందుకు రావడం గురించి చెప్పబడిన మరియు వ్రాయబడిన విషయాలలో కొంచెమైనా కపటము మరియు మోసము ఉందని ఎప్పుడైనా భావించలేదా అని నేను [మార్టిన్] ని అడిగాను, మరియు అతను ఎప్పటిలాగే సమాధానం ఇచ్చాడు … మరియు ఇలా అన్నాడు: ‘మోర్మన్ గ్రంథము నకిలీది కాదు. నాకు తెలిసినది నాకు తెలుసు. నేను చూసినదాన్ని చూశాను మరియు నేను విన్నదాన్ని విన్నాను. వేటినుండి మోర్మన్ గ్రంథము వ్రాయబడిందో ఆ బంగారు పలకలను నేను చూశాను. నాకు మరియు ఇతరులకు ఒక దూత ప్రత్యక్షమై ఆ గ్రంథము యొక్క యాధార్థత గురించి సాక్ష్యము చెప్పెను ఒకవేళ నేను అసత్య ప్రమాణం చేసి, నేను ఇప్పుడు కలిగియున్న సాక్ష్యానికి అసత్యముగా ప్రమాణం చేసి ఉంటే, నేను ధనవంతుడ్ని అయ్యి ఉండేవాడ్ని కాని నేను ఇంతకుముంది చెసినట్లు, ఇప్పుడు చేస్తున్నదానికంటే వేరుగా సాక్ష్యము చెప్పలేను ఎందుకంటే ఈ విషయాలు సత్యమైనవి.’”6

“ఆయనకు ఎంతమంది శ్రేష్టమనిపించిన అంతమంది సాక్షులు”

సంఘములో మరియు వెలుపల వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకొన్నప్పుడు ముగ్గురు సాక్షుల సాక్ష్యాలు చాలా మనోహరమైనవి.7 అన్ని పరిస్థితులలో, ఆలీవర్, డేవిడ్, మరియు మార్టిన్ వారు అనుభవించిన వాటికి సాక్ష్యమివ్వడం మరియు మోర్మన్ గ్రంథము దేవుని బహుమతి మరియు శక్తి ద్వారా అనువదించబడిందని సాక్ష్యమివ్వడం ఎప్పుడూ ఆపలేదు. మరియు వారు మాత్రమే కాదు.

పురాతన నీఫై ఇలా ప్రకటించెను “ప్రభువైన దేవుడు గ్రంథము యొక్క మాటలను జరిగించుటకు బయలుదేరును; మరియు ఆయనకు ఎంతమంది శ్రేష్టమనిపించిన అంతమంది సాక్షుల ద్వారా ఆయన తన వాక్యమును స్థాపించును” (2 నీఫై 27:14). ప్రవక్తయైన జోసెఫ్ స్మిత్ మరియు ముగ్గురు సాక్షులతో పాటు, పలకలను చూడటానికి ప్రభువు మరో ఎనిమిది మంది సాక్షులను కూడా ఎన్నుకున్నారు. వారి సాక్ష్యం కూడా మోర్మన్ గ్రంథము యొక్క ప్రతి కాపీలో ఉంది. ఆలీవర్, డేవిడ్ , మరియు మార్టిన్‌ల మాదరిగా ఈ ఎనిమిదిమంది సాక్షులు మోర్మన్ గ్రంథము గురించి వారి సాక్ష్యాలకు మరియు బంగారు పలకల గురించి వారి సాక్ష్యమునకు యధార్థముగా ఉన్నారు.

విలియం ఇ. మెక్లెలిన్ సంఘము యొక్క మొదటి పరివర్తన చెందినవారిలో ఒకడు మరియు అతనికి వ్యక్తిగతంగా మోర్మన్ గ్రంథము యొక్క సాక్షులలో చాలా మంది తెలుసు. విలియం చివరికి సంఘాన్ని విడిచిపెట్టాడు, కాని అతను సాక్షుల నుండి విన్న ఆసక్తికరమైన సాక్ష్యాలచేత తీవ్రంగా ప్రభావితం చెయ్యబడ్డాడు.

“ఇప్పుడు నేను అడుగుతున్నాను,” అని మెక్లెలిన్ తన జీవిత చివరలో వ్రాశాడు, “ఇంత హేతుబద్ధమైన మరియు గంభీరమైన సాక్ష్యాలను కలిగి ఉన్న నమ్మకమైన సాక్షుల సమూహంతో నేను ఏమి చేస్తాను? ఈ వ్యక్తులు వారి జీవితంలో ప్రధాన దశలో ఉన్నప్పుడు, దేవదూత యొక్క దర్శనాన్ని చూశారు మరియు ప్రజలందరికీ వారి సాక్ష్యాలను చెప్పారు. మరియు ఎనిమిది మంది పలకలను చూసి, వాటిని చేతులలోనికి తీసుకున్నారు. అందువల్ల ఈ వ్యక్తులకు వారు సానుకూలంగా నిజమని ప్రకటించిన విషయాలు తెలుసు. అది కూడా వారు చిన్నతనంలోనే జరిగింది మరియు ఇప్పుడు పెద్దయ్యాక వారు అదే విషయాలు ప్రకటిస్తారు.”8

ముగ్గురు సాక్షులు చూసినట్లు మేము బంగారు పలకలను చూడనప్పటికి, మేము వారి సాక్ష్యాల నుండి బలాన్ని పొందగలము. వారి ప్రతిష్టలను సవాలు చేసినప్పుడు మరియు వారి సాక్ష్యాల కారణంగా వారి భద్రత మరియు ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ, ఈ చిత్తశుద్ధి గల పురుషులు ధైర్యంగా వారి సాక్ష్యానికి చివరి వరకు యధార్థంగా ఉన్నారు.

  1. పరిశుద్ధులు: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల కథ, సం. 1, సత్యము యొక్క ప్రమాణము, 1815–1846 (2018), 73–75 లో వారి అనుభవం గురించి చదవండి.

  2. డాలిన్ హెచ్. ఓక్స్, “సాక్షి: మార్టిన్ హారిస్,” ఎన్‌సైన్, మే 1999, 36.

  3. జాకోబ్ ఎఫ్. గేట్స్, “జాకోబ్ గేట్స్ యొక్క సాక్ష్యము” అభివృద్ధి యుగం, మార్చి 1912, 418–19.

  4. లిండన్ డబ్ల్యూ. కుక్, ఈడి., డేవిడ్ విట్మర్ ఇంటర్వ్యూలు: పునఃస్థాపన సాక్షి (1991), 79.

  5. మిచెల్ కె. షెఫర్‌లో, “పురుషుల సాక్ష్యము: విలియం ఇ. మెక్‌లెలిన్ మరియు మోర్మన్ గ్రంథము యొక్క సాక్షులు,”బివైయు అధ్యయనాలు,సం. 50, no. 1 (2011), 108; క్యాపిటలైజేషన్ ప్రామాణికరించబడింది.

  6. జార్జ్ గాడ్ఫ్రే, “మార్టిన్ హారిస్ యొక్క సాక్ష్యం” (ప్రచురించని చేతివ్రాతలు), ఎల్డిన్ రిక్స్ మోర్మన్ గ్రంథ సాక్ష్యుల యొక్క కేసు (1961), 65–66 లో ఉదహరించబడింది.

  7. ఉదాహరణకు, పరిశుద్ధులు 1:182–83 చూడండి.

  8. షెఫర్‌లో, “పురుషుల సాక్ష్యం,” 110.

ముద్రించు