3వ అధ్యాయము
పెద్దలు హస్తనిక్షేపణము ద్వారా యాజకులను, బోధకులను నియమించుదురు. సుమారు క్రీ. శ. 401–421 సం.
1 సంఘము యొక్క పెద్దలని పిలువబడిన శిష్యులు, యాజకులను మరియు బోధకులను నియమించిన విధానమిది—
2 వారు క్రీస్తు యొక్క నామమందు తండ్రికి ప్రార్థన చేసిన తరువాత, వారిపై తమ చేతులనుంచి ఇట్లు చెప్పిరి:
3 పశ్చాత్తాపమును మరియు అంతము వరకు ఆయన నామమందు విశ్వాసము కలిగియుండుటను బట్టి యేసు క్రీస్తు ద్వారా వచ్చు పాప క్షమాపణను ప్రకటించుటకు, యేసు క్రీస్తు యొక్క నామమందు నేను నిన్ను ఒక యాజకునిగా నియమించుచున్నాను (ఒకవేళ అతడు బోధకుడు అయిన యెడల, నేను నిన్ను ఒక బోధకునిగా నియమించుచున్నాను). ఆమేన్.
4 మనుష్యుల కొరకు దేవుని యొక్క బహుమానములను, పిలుపులను బట్టి వారు ఈ మాదిరిగా యాజకులను, బోధకులను నియమించిరి; మరియు వారిలోనున్న పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి, వారు వారిని నియమించిరి.