రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 3–9. ఆల్మా 43–52: “క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగ నిలిచియుండుము”


“ఆగష్టు 3–9. ఆల్మా 43–52: “క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగ నిలిచియుండుము,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఆగష్టు 3–9. ఆల్మా 43–52,“ రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: 2020

చిత్రం
మొరోనై మరియు స్వేచ్ఛ యొక్క ధ్వజము

స్వేచ్ఛ యొక్క దీవెనల కొరకు, స్కాట్ ఎమ్. స్నో చేత

ఆగష్టు 3–9

ఆల్మా 43–52

“క్రీస్తు యొక్క విశ్వాసమందు నిలకడగ నిలిచియుండుము”

ఆల్మా 43–52లో వివరించబడిన సంఘటనలు ప్రత్యేకంగా మీకు సంబంధించినవిగా కనబడకపోవచ్చు. సమస్త లేఖనములో ఉన్నట్లుగా, ప్రభువు మీకొరకు ఒక సందేశాన్ని కలిగియున్నారు. దానిని ప్రార్థనాపూర్వకంగా వెదకండి.

మీ మనోభావాలను నమోదు చేయండి

ఆల్మా అధ్యాయము 43 యొక్క ప్రారంభమందు—“నీఫైయులు మరియు లేమనీయుల మధ్య యుద్ధముల యొక్క వృత్తాంతమునకు తిరిగి వెళ్ళెదను” ఈ మాటలను మనము చదివినప్పుడు—అతడు పలకలపై పరిమితమైన స్థలమును కలిగియున్నప్పుడు ఈ యుద్ధ వృత్తాంతములను మోర్మన్ ఎందుకు చేర్చెనా అని ఆశ్చర్యపడటం సహజమే (మోర్మన్ యొక్క మాటలు 1:5 చూడండి). కడవరి దినములలో మనము అనేక యుద్ధములు కలిగియుండుట యధార్ధము, కానీ యుద్ధ వ్యూహము మరియు విషాదము యొక్క వర్ణనలకు మించి ఆయన మాటలలో విలువ ఉన్నది. ఆయన మాటలు ప్రతీరోజు చెడు శక్తులకు వ్యతిరేకంగా మనము పోరాడుచున్న యుద్ధము, “మనమందరం చేర్చబడిన” (Hymns, no. 250), యుద్ధము కొరకు కూడ మనల్ని సిద్ధపరచును. ఈ యుద్ధము చాలా వాస్తవమైనది, మరియు ఫలితం మన నిత్య జీవితాలను ప్రభావితం చేస్తుంది. నీఫైయుల వలే, మనము “ఒక శ్రేష్ఠమైన హేతువు చేత ప్రేరేపించబడ్డాము,” అది “మన దేవుడు, మన మతము, స్వేచ్ఛ, మన శాంతి, మరియు మన [కుటుంబాలు].” మొరోనై దీనిని “క్రైస్తవుల యొక్క హేతువు” అని పిలిచెను, అదే హేతువు కొరకు ఈరోజు మనం పోరాడుతున్నము (ఆల్మా 43:45; 46:12, 16).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 43–52

మోర్మన్ గ్రంథములోని యుద్ధములు చెడుకు వ్యతిరేకంగా నేను చేయు యుద్ధములను గూర్చి నాకు బోధిస్తాయి.

మీ వ్యక్తిగత ఆత్మీయ యుద్ధములకు సమాంతరాల కొరకు మీరు వెతికినట్లైతే నీఫైయులకు మరియు లేమనీయులకు మధ్య యుద్ధములను గూర్చి చదువుట మీకు ఎక్కువ అర్ధవంతమైనవిగా ఉండవచ్చు. ఆల్మా 43–52 మీరు చదివినప్పుడు, నీఫైయులు చేసింది ఏది వారిని సఫలము (లేక విఫలము) చేసిందో గమనించండి. తరువాత మీ ఆత్మీయ యుద్ధములు గెలుచుటకు మీకు సహాయపడుటకు మీరు నేర్చుకొన్న దానిని ఎలా ఉపయోగించాలో ధ్యానించండి. క్రింది వంటి వచనాలను మీరు అధ్యయనము చేసినప్పుడు, నీఫైయుల యొక్క మాదిరిని మీరు ఎలా అనుసరించగలరో మీ ఆలోచనలు వ్రాయండి:

లేమనీయులు మరియు నీఫైయుల అసమ్మతివాదులు నీఫైయులను ఓడించటానికి ఎలా ప్రయత్నించారో కూడ గమనించండి. అపవాది మిమ్మల్ని ముట్టడి చేయటానికి ఎలా ప్రయత్నిస్తాడో ఈ విషయాలు మిమ్మల్ని హెచ్చరించగలవు. మీరు అధ్యయనము చేసినప్పుడు, అదేవిధాలుగా సాతాను మిమ్మల్ని ఎలా ముట్టడి చేస్తాడో వ్రాయండి.

  • ఆల్మా 43:8 జారహెమ్న తన జనులకు కోపము రేకిత్తుంచుటకు ప్రయత్నించాడు, ఆవిధంగా అతడు వారిపై అధికారము కలిగియుండగలడు. (నేను ఇతరులతో కోపంగా ఉన్నప్పుడు, నాపై సాతానుకు అధికారం ఇస్తాను.)

  • ఆల్మా 43:29 నీఫైయులను దాస్యములోనికి తేవాలని లేమనీయులను కోరారు.

  • ఆల్మా 46:10

  • ఆల్మా 47:10–19

చిత్రం
నీఫైయులు లేమనీయులతో పోరాడుట

మినర్వా. కె. టైచెర్ట్ (1888–1976), నీఫైయుల పట్టణము యొక్క రక్షణ,1935, కృత్రిమ చెక్కపై తైలవర్ణ చిత్రలేఖన, 36 x 48 అంగుళాలు. బ్రిగమ్ యంగ్ విశ్వవిద్యాలయము ఆర్ట్ మ్యూజియమ్.

ఆల్మా 46:11–28; 48:7–17

మొరోనైవలే విశ్వాసముగా ఉండుటకు నేను ప్రయాసపడినప్పుడు, నేను రక్షకుని వలే ఎక్కువగా ఉండగలను.

రక్షకుని వలే మరింతగా అగుటకు మరియు మీ జీవితంలో అపవాది యొక్క శక్తిని తగ్గించుటకు మీరు కోరుతున్నారా? “మొరోనై వలే” అగుటకు ఒక విధానం ఏమిటంటే ఆల్మా 48:17 లో ఉపదేశాన్ని అనుసరించడం. ఆల్మా 43–52 అధ్యాయాలలో మరి ముఖ్యంగా 46:11–28లో మరియు 48:7–17 లో వివరించబడిన మొరోనై లక్షణాలు మరియు క్రియలకు శ్రద్ధ వహించండి. ఈ “శక్తిగల మనుష్యుని” గురించి మిమ్మల్ని ఏది ఆకట్టుకుంటుంది? ఆయన వంటి లక్షణాలు మరియు క్రియలు మీ జీవితంలో దయ్యము యొక్క శక్తిని ఎలా బలహీనపరచగలదు? మొరోనై యొక్క మాదిరిని అనుసరించుటకు మరియు రక్షకుని వలే మరింతగా మారుటకు మీరేమి చేయుటకు ప్రేరేపించబడుచున్నారో ధ్యానించండి.

ఆల్మా 47

సాతాను మనల్ని కొంచెం కొంచెం శోధిస్తాడు మరియు మోసగిస్తాడు.

మనలో చాలామంది పెద్ద పాపాలు చేయడానికి లేదా పెద్ద అబద్ధాలను నమ్మడానికి సమ్మతించరని సాతానుకు తెలుసు. కాబట్టి, మనము అంగీకరిస్తామని అతడు అనుకున్న సాధ్యమైన అనేకమైన చిన్న పాపములుగా కనబడే వాటికి మనల్ని నడిపించుటకు— అతడు మోసపూరితమైన అబద్ధాలను మరియు శోధనలను ఉపయోగిస్తాడు. నీతిగా జీవించడం వలన కలిగే భద్రత నుండి మనం దూరముగా తొలగిపోయే వరకు అతడు దీనిని చేయుట కొనసాగిస్తాడు.

ఆల్మా 47లో కనుగొనబడిన, లెహోంటిని అమలిక్యా మోసగించిన వృత్తాంతములో ఈ విధానమును మీరు కనుగొనవచ్చు. మీరు అధ్యయనము చేసినప్పుడు, ఎల్డర్ రాబర్ట్ డి. హేల్స్ చేత వివరించబడినట్లుగా సాతాను మిమ్మల్ని మోసగించుటకు ఎలా ప్రయత్నిస్తున్నాడో ధ్యానించండి:

“మోసగాడైన అమలిక్యా లెహోంటిని ‘క్రిందికి రమ్మని‘ మరియు తనని కలుసుకోమని పురికోల్పాడు. కానీ లెహోంటి ఎత్తైన స్థలమును వదలి వచ్చినప్పుడు, అతడు చనిపోయేంతవరకు ‘కొంచెము కొంచెము,’ విషమివ్వబడ్డాడు, మరియు అతడి సైన్యము అమలిక్యా స్వాధీనమైంది (ఆల్మా 47 చూడండి). వాదనలు మరియు నిందల ద్వారా, కొందరు జనులు ఉన్నతమైన స్థలమును వదలివేయుటకు మనల్ని ఒప్పిస్తారు. ఉన్నతమైన స్థలమున్న చోట వెలుగు ఉండును. … అది క్షేమకరమైన స్థలము” (“Christian Courage: The Price of Discipleship,” Ensign or Liahona, Nov. 2008, 74).

2 నీఫై 26:22; 28:21–22 కూడా చూడండి.

ఆల్మా 50–51

ఐకమత్యము క్షేమమును తెచ్చును.

ఆల్మా 50 యొక్క ప్రారంభములో వ్రాయబడిన పరిస్థితులలో, లేమనీయులకు నీఫైయులకు వ్యతిరేకంగా ఎటువంటి అవకాశం లేనట్లు అనిపించింది. ఆయుధము, కోటలను పటిష్ఠపరచుటు, మరియు నీఫైయుల ఏకమైన ప్రయత్నాలు జయింపశక్యము కానట్లుగా వారిని చేసాయి (ఆల్మా 49:28–30 మరియు 50:17–20 చూడండి). కానీ త్వరలో లేమనీయులు మొరోనై పటిష్టపరచిన వాటితో కలిపి—వారి పట్టణాలలో అనేకమును స్వాధీనపరచుకొన్నారు (ఆల్మా 51:26–27 చూడండి). ఇది ఎలా జరిగింది? ఈ అధ్యాయాలను మీరు చదివినప్పుడు జవాబుల కొరకు చూడండి (ప్రత్యేకంగా ఆల్మా 51:1–12 చూడండి). మీరు, మీ కుటుంబము కొరకు ఈ వృత్తాంతము కలిగియున్న హెచ్చరికలు ఏవో ధ్యానించండి.

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 45:2–8

ఈ వచనాలు కలిసి చదువుట హీలమన్‌తో ఆల్మా చేసినట్లుగా, ఒకరితో ఒకరు సువార్త సంభాషణలు జరుపుటకు, మీ కుటుంబము ప్రేరేపించబడవచ్చు.

ఆల్మా 46:12–22

స్వేచ్ఛ యొక్క ధ్వజము నీఫైయులు దేవుని ఆజ్ఞలను పాటించుటకు మరియు వారి విశ్వాసమును కాపాడుకొనుటకు ప్రేరేపించింది. అదేవిధంగా చేయుటకు మనల్ని ఏది ప్రేరేపిస్తుంది? బహుశా మీ కుటుంబము ప్రతీరోజు దేవుని ఆజ్ఞలను పాటించుటకు మీకు జ్ఞాపకము చేయు మాటలు లేక చిత్రములు గల మీ స్వంత స్వేచ్ఛా ధ్వజమును —ఒక జెండాను లేక పతాకమును చేయవచ్చు.

ఆల్మా 48:7–9; 49:1–9; 50:1–6

మీ కుటుంబము నీఫైయులు కోటలను పటిష్ఠపరచుట గురించి నేర్చుకొన్నప్పుడు, అపవాదికి వ్యతిరేకంగా మీ కుటుంబమును ఎలా బలపరచవచ్చో మీరు చర్చించవచ్చు. కుర్చీలు మరియు దుప్పట్లు వంటి వస్తువులతో కోటను నిర్మించుటను పిల్లలు ఆనందించవచ్చు, లేక నీఫైయుల కోటలు ఎలా ఉంటాయో వారు ఊహించిన దానిని బొమ్మగీయవచ్చు.

ఆల్మా 51:1–12

మనము వివాదము కలిగియున్నప్పుడు మన కుటుంబము లోపల ఏమి జరుగుతుందో ఈ వచనాలు మనకేమి బోధిస్తాయి? మన ఐక్యతను మనము ఎలా హెచ్చించగలము?

పిల్లలకు బోధించు మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాధమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనమును మెరుగుపరచుట

మీరు అధ్యయనము చేసినప్పుడు ప్రశ్నలు అడగండి. మీరు లేఖనాలను అధ్యయనము చేసినప్పుడు, మీరు చదివిన దాని ద్వారా ఎంత బాగా దానిని మీరు జీవిస్తున్నారో ధ్యానించుటకు సహాయపడగల ప్రశ్నలను మీకై మీరు అడగండి.

చిత్రం
స్వేచ్ఛ యొక్క ధ్వజమును మొరోనై పట్టుకొనుట

లారీ కాన్రాడ్ విన్‌బర్గ్ చేత స్వేచ్ఛ యొక్క ధ్వజము

ముద్రించు