రండి, నన్ను అనుసరించండి
ఆగష్టు 17–23. హీలమన్ 1–6: “మన విమోచకుని యొక్క బండ”


“ఆగష్టు 17–23. హీలమన్ 1–6: ‘మన విమోచకుని యొక్క బండ,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“ఆగష్టు 17–23. హీలమన్ 1–6,” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు:2020

చిత్రం
రాళ్ళపై ఎగిసిపడుతున్న అలలు

ఆగష్టు 17–23

హీలమన్ 1–6

“మన విమోచకుని యొక్క బండ”

ఈ సంగ్రహములోని సూత్రములు హీలమన్ 1–6 యొక్క మీ అధ్యయనానికి మార్గనిర్దేశం చేయడంలో సహాయపడతాయి, కానీ అవి మిమ్మల్ని పరిమితం చేయనివ్వవద్దు. మీరు నేర్చుకోవాల్సిన సత్యములకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపించును.

మీ మనోభావాలను నమోదు చేయండి

నీఫైయులు మరియు లేమనీయుల మధ్య విజయాలు మరియు విషాదాంతాలు రెండిటిని హీలమన్ గ్రంథము నమోదు చేస్తుంది. అది “నీఫైయుల యొక్క జనుల మధ్య గంభీరమైన సంకటము” (హీలమన్ 1:1) తో మొదలౌతుంది, మరియు ఆ గ్రంథము అంతటా కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనము రాజకీయ సమస్య, దొంగల ముఠాలు, ప్రవక్తలను తిరస్కరించుట, గర్వము, మరియు దేశమంతటా అపనమ్మకము గురించి చదువుతాము. అయితే నీఫై మరియు లీహైల వంటి మాదిరులను కూడా మనము కనుగొంటాము, “జనుల యొక్క అధిక తగ్గింపు గల భాగము” (హీలమన్ 3:34 ), వారు బ్రతికియుండుట మాత్రమే కాదు కానీ ఆత్మీయంగా వర్ధిల్లారు. వారు దానిని ఎలా చేసారు? వారి నాగరికత క్షీణించి, పడిపోతున్నప్పుడు వారు ఎలా బలంగా ఉన్నారు? దయ్యము “(మన) పైన కొట్టుటకు”“బలమైన గాలివాన ” పంపినప్పుడు, మన జీవితాలను “మనుష్యులు వారి కట్టిన పడిపోని ఆ పునాది, … దేవుని కుమారుడైన క్రీస్తే, మన విమోచకుని యొక్క బండపైన” (హీలమన్ 5:12) కట్టుట ద్వారా అదేవిధంగా మనలో ఎవరైనా బలముగా నిలిచియుండగలము.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

హీలమన్ 1–6

గర్వము నన్ను ఆత్మ మరియు ప్రభువు యొక్క బలమునుండి వేరు చేయును.

హీలమన్ 1–6మీరు చదివినప్పుడు—మోర్మన్ గ్రంథము అంతటా—నీఫైయుల యొక్క ప్రవర్తనలో ఒక విధానమును మీరు గమనించవచ్చు: నీఫైయులు నీతిమంతులుగా ఉన్నప్పుడు, దేవుడు వారిని దీవించును అప్పుడు వారు వర్థిల్లుతారు. కొంత సమయము తరువాత, నాశనము మరియు బాధ అనుభవించుటకు నడిపించు ఎంపికలు చేస్తూ, వారు గర్విష్ఠులు మరియు దుష్టులవుతారు. తరువాత వారు తగ్గించుకొని, పశ్చాత్తాపపడుటకు ప్రేరేపించబడతారు, మరియు దేవుడు వారిని మరోసారి దీవించును. ఆ విధానము దానికదే చాలా తరచుగా పునరావృతం అగును కొందరు దానిని “గర్వపు చక్రము,” అని పిలుస్తారు.

చిత్రం
గర్వపు చక్రము

“గర్వపు చక్రము.”

మీరు చదివినప్పుడు ఈ చక్రము యొక్క మాదిరుల కొరకు చూడండి. మీరు వాటిని కనుగొన్నప్పుడు మాదిరులను గుర్తించుటకు మీరు కోరవచ్చు. ఈ మాదిరి గ్రహించుటకు మీకు సహాయపడుటకు కొన్ని ప్రశ్నలు ఇక్కడున్నాయి మరియు అది మీకు ఎలా వర్తిస్తుందో చూడండి.

  • నీఫైయుల మధ్య గర్వము యొక్క ఏ నిదర్శనములను మీరు చూసారు? (ఉదాహరణకు హీలమన్ 3:33–34; 4:11–13 చూడండి). మీలో అదేవిధమైన గర్వపు మాదిరులను మీరు చూసారా?

  • గర్వము మరియు దుష్టత్వము యొక్క పర్యవసానములేమిటి? (హీలమన్ 4:23–26{ చూడండి). దీనమనస్సు మరియు పశ్చాత్తాపము యొక్క పర్యవసానములేమిటి? (హీలమన్ 3:27–30, 35; 4:14–16 చూడండి).

  • హీలమన్ తన కుమారులు జ్ఞాపకముంచుకోవాలని కోరినది ఏమిటి? (హీలమన్ 5:4–12 చూడండి). ఈ సత్యాలను జ్ఞాపకముంచుకొనుట మీరు గర్విష్ఠులుగా అవ్వకుండా ఉండుటకు మీకు ఏవిధంగా సహాయపడును?

డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “Pride and the Priesthood,” Ensign లేదా Liahona, నవం. 2010, 55–58 కూడా చూడండి.

హీలమన్ 3:24–35

దేవునికి నా హృదయాన్ని అర్పించినప్పుడు నేను పరిశుద్ధపరచబడగలను.

హీలమన్ 3 లో, సంఘము చాలా వృద్ధి చెంది, ఆశీర్వదించబడిన సమయమును మోర్మన్ వివరించెను, దానికి నాయకులు కూడ ఆశ్చర్యపడ్డారు (24–32 వచనములు చూడండి). చివరకు కొందరు జనులు గర్విష్ఠులైరి, ఇతరులు “బలముగా మరియు వారి తగ్గింపునందు బలముగా ఎదిగిరి, . . వారి హృదయముల యొక్క పవిత్రపరచబడు మరియు శుద్ధివరకు కూడ” (హీలమన్ 3:35 ) ఎదిగారు. వచనములు 34–35 లో ఎక్కువ వినయముగల జనులు పరిశుద్ధపరచబడుటకు ఏమి చేసారో గమనించండి. మీరు ఎక్కువ పరిశుద్ధపరచబడుటకు ఈ విషయాలు మీకు ఎలా సహాయపడతాయి? లేఖన దీపిక (scriptures.ChurchofJesusChrist.org) పరిశుద్ధపరచబడుట ను “యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా పాపము నుండి స్వేచ్చగా చేయబడి, శుద్ధి చేయబడి, స్వచ్ఛంగా, మరియు పరిశుద్ధముగా మారు ప్రక్రియగా,” నిర్వచించును. ఈ శిష్యుల యొక్క మాదిరులను అనుసరించుటకు మీరు ఏమి చేయుటకు ప్రేరేపించబడ్డారు? మీ హృదయమును దేవునికి లోబరచుటకు మీరేమి చేస్తున్నారు?

హీలమన్ 5:14–52

“(నేను) పొందిన నిదర్శనముల యొక్క గొప్పతనము” చేత నా విశ్వాసము బలపరచబడింది.

వారి విశ్వాసముతో ప్రయాసపడు వారితో ఒకసారి ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలండ్ చెప్పారు: “మోర్మన్ గ్రంథము ‘సాక్ష్యముల యొక్క గొప్పతనము’ అని పిలుచుట వలన మీకు ఉన్నదని మీరనుకొనే దానికంటే ఎక్కువ విశ్వాసమును మీరు కలిగియున్నారు” [హీలమన్ 5:50]. … సువార్తను జీవించుట వలన కలిగే ఫలము ప్రతీచోటా కడవరి-దిన పరిశుద్ధుల జీవితాలలో కనిపిస్తుంది” (“Lord, I Believe,” Ensign or Liahona, మే 2013, 94). ఈ వచనములు మీరు చదివినప్పుడు, ప్రభువు మీకిచ్చిన సాక్ష్యములను గూర్చి ఆలోచించండి. ఉదాహరణకు, మీరు ప్రభువు యొక్క స్వరమును ఖచ్చితంగా వినియుండక పోవచ్చు, కానీ “మీ ఆత్మను లోతుగా చొచ్చుకొనిపోవు” నట్లు పరిశుద్ధాత్మ నుండి “ఒక గుసగుస” మీరు అనుభవించారు?హీలమన్ 5:30 సిద్ధాంతము మరియు నిబంధనలు 88:66 కూడ చూడండి. బహుశా మీరు చీకటిలో ఉండి, గొప్ప విశ్వాసముతో దేవునికి మొర్రపెట్టారు, మరియు “చెప్పలేని సంతోషముతో నింపబడ్డారు” (హీలమన్ 5:40–47). క్రీస్తు మరియు ఆయన సువార్తయందు మీ విశ్వాసమును బలపరచిన ఇతర అనుభవాలేవి?

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు వేటి గురించి చర్చించాలో తెలుసుకోవడానికి ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి:

హీలమన్ 3:27–30

ప్రవక్త మోర్మన్ పవిత్ర గ్రంథములను సంగ్రహించినప్పుడు, అప్పుడప్పుడు ముఖ్యమైన సత్యములను నొక్కిచెప్పుటకు ఆయన “అని మనము చూడగలము” అనే వాక్యభాగమును ఉపయోగించెను. హీలమన్ 3:27–30 లో మనము ఏమి చూడాలని ఆయన కోరెను? ఈ వారము మీ అధ్యయనము అంతటా, మీ కుటుంబ సభ్యులు “అని మనము చూడగలము” వాక్యభాగమును వారు ఎలా పూర్తి చేయగలరో వారిని అడుగుటకు మీరు అప్పుడప్పుడు విరామం ఇవ్వవచ్చు. వారు నొక్కిచెప్పాలని కోరిన సత్యములేవి?

హీలమన్ 5:6–7

అధ్యక్షులు జార్జ్ అల్బెర్ట్ స్మిత్ యొక్క మరణించిన తాతయైన జార్జ్ ఎ. స్మిత్ కలలో ఆయనకు కనబడి ఇలా అడిగారు, “నా పేరుతో నీవు ఏమిచేసావో తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.” అధ్యక్షులు స్మిత్ జవాబిచ్చారు, “మీరు సిగ్గుపడాల్సినట్లుగా మీ పేరుతో నేను ఎన్నడూ ఏదీ చేయలేదు” (in Teachings of Presidents of the Church: George Albert Smith [2011], xxvi). హీలమన్ 5:6–7 చదివిన తరువాత, బహుశా మీరు రక్షకునితో కలిపి, మనము వహించే పేర్లను జ్ఞాపకముంచుకొనుట మరియు గౌరవించుట గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు.

హీలమన్ 5:12

ఒక “నిశ్చయమైన పునాది” కలిగియుండుట అనగా అర్ధమేమిటో మీ కుటుంబము దృశ్యీకరించుటకు సహాయపడుటకు, బహుశా కలిసి మీరు ఒక చిన్న నిర్మాణమును కట్టవచ్చు మరియు వేర్వేరు రకాల పునాదులపై దానిని ఉంచవచ్చు. మీరు దానిపై నీటిని చల్లుట ద్వారా, మరియు గాలిని కల్పించుటకు ఒక ఫ్యాన్ లేక హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించుట ద్వారా “బలమైన గాలివాన” సృష్టించవచ్చు. అది వేర్వేరు పునాదులపై ఉన్నప్పుడు, నిర్మాణానికి ఏమి జరిగింది? మన జీవితాలలో యేసు క్రీస్తు “నిశ్చయమైన పునాది” గా ఎలా ఉన్నారు?

హీలమన్ 5:29–33

మన జీవితాలలో దేవుని యొక్క స్వరమును గుర్తించుటతో మనకు కలిగిన అనుభవాలేవి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

వ్యక్తిగత అధ్యయనము మెరుగుపరచుట

మీతో మీరు సహనము కలిగియుండండి. విశ్వాసము యొక్క పునాది ఒక్కొక్కసారి ఒక్కొక్క భాగము కట్టబడును. నిర్ధిష్టమైన సిద్ధాంతాలు ఇప్పుడు గ్రహించుట కష్టమైనవిగా మీరు కనుగొన్న యెడల, సహనము కలిగియుండండి. విశ్వాసము సాధన చేయుట మరియు శ్రద్ధగా అధ్యయనము చేయుట ద్వారా యేసు క్రీస్తుపై మీ పునాదిని మీరు కట్టినప్పుడు ఆ జ్ఞానము వచ్చునని విశ్వసించండి.

చిత్రం
చెరలో నీఫై మరియు లీహై

© The Book of Mormon for Young Readers, బ్రయా షాక్రాఫ్ట్ చేత నీఫై మరియు లీహై అగ్ని స్తంభము చేత చుట్టబడెను; అనుకరించబడదు

ముద్రించు