రండి, నన్ను అనుసరించండి
జూలై 13–19. ఆల్మా 32–35: “ఈ వాక్యమును మీ హృదయములలో నాటుకొనవలెను”


“జూలై 13–19. ఆల్మా 32–35: ‘ఈ వాక్యమును మీ హృదయములలో నాటుకొనవలెను’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“జూలై 13–19. ఆల్మా 32–35: “ఈ వాక్యమును మీ హృదయములలో నాటుకొనవలెను” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము: 2020

చిత్రం
బిడ్డ చేతిలో విత్తనము

జూలై 13–19

ఆల్మా 32–35

“ఈ వాక్యమును మీ హృదయములలో నాటుకొనవలెను”

మీరు ఆల్మా 32–35 చదివినప్పుడు మీరు పొందిన ఆత్మీయ భావనలు నమోదు చేయండి. మీరు నేర్చుకొన్న దాని వలన ఏమి చేయటానికి ప్రేరేపించబడ్డారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

జోరమీయులకు, ప్రార్థన ఆలోచనారహహితమైనది, సర్వసాధారణమైన ఆచరణ, అది కేవలము వారానికి ఒకసారి మాత్రమే జరిగేది. అది అనేకమంది జనులు చూసే చోట నిలబడుటను కలిగియున్నది మరియు వ్యర్ధమైన, గర్వమైన మాటలు పునరావృతమైనవి. బహుశా దారుణమైనది ఏమిటంటే, జోరమీయులకు యేసు క్రీస్తుపై విశ్వాసము లేదు—ఆయన ఉనికిని కూడా నిరాకరించారు—మరియు పేదవారిని హింసించారు (ఆల్మా 31:9–25 చూడండి). వ్యతిరేకంగా, బాహ్యముగా వ్యక్తపరచబడిన దానికంటే ప్రార్థన మన హృదయాలలోని ఉద్దేశాలతో ఎక్కువ సంబంధము కలిగియున్నదని ఆల్మా మరియు అమ్యులేక్ ధైర్యముగా బోధించారు. అవసరతలో ఉన్నవారి పట్ల కనికరము చూపుటకు అది నడిపించని యెడల, అది “వ్యర్ధము, మరియు ఏమియు ప్రయోజనము ఉండదు” (ఆల్మా 34:28). మరిముఖ్యమైనది, అది ఆయన తన “అనంతమైన మరియు నిత్యమైన బలి” (ఆల్మా 34:10) ద్వారా విమోచనను ఇచ్చు యేసు క్రీస్తునందు విశ్వాసమును వ్యక్తపరచుటను కలిగియున్నది. ఆల్మా వివరించినట్లుగా, అటువంటి విశ్వాసము, వినయము మరియు “విశ్వసించుటకు ఒక కోరిక” (ఆల్మా 32:27) వలన కలిగినది. అది ఒక వృక్షము వలే క్రమముగా ఎదుగును, మరియు స్థిరమైన పోషణ అవసరమగును. ఆల్మా 32–35 మీరు చదివినప్పుడు, మీ స్వంత విశ్వాసము మరియు ప్రార్థనలను మీరు పరిశీలించవచ్చు; మీరు ఎప్పుడైన జోరమీయుని వంటి వైఖరులు అనుభవించారా? యేసు క్రీస్తునందు మీ విశ్వాసమును మీరు ఎలా పోషిస్తారు, ఆవిధంగా అది “నిత్య జీవమునకు పైకి లేచు ఒక వృక్షము వలే నుండును”? (ఆల్మా 32:41).

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

ఆల్మా 32:1–16

నేను తగ్గింపును కలిగి ఉండటానికి ఎంచుకుంటాను.

పేదవారైన జోరమీయులు తగ్గింపుగల వారని, మరియు “వాక్యమును వినుటకు ఒక సిద్ధపాటులో ఉన్నారు” అని ఆల్మా గ్రహించెను (ఆల్మా 32:6). మీరు ఆల్మా 32:1–16 చదివినప్పుడు, దేవుని వాక్యమును వినుటకు ఎలా సిద్ధపడాలో ఆలోచించండి.

ఏ అనుభవాలు మిమ్మల్ని తగ్గించుకొనేలా చేసాయి? ఎక్కువ తగ్గింపును కలిగియుండుటకు మీరేమి చేసారు? తగ్గింపు కలిగియుండుటకు బలవంతము చేయబడుట కంటే మేలుగా దీనత్వమును ఎలా ఎంపిక చేయవచ్చో ఈ వచనాలు మీకు బోధిస్తాయి. ఉదాహరణకు, “లోకము యొక్క వస్తువుల విషయములో వారు పేదవారు” మరియు “హృదయమందు కూడ దీనులు” మధ్య తేడా ఏమిటి? (3వ వచనము). “వాక్యమును బట్టి (మిమ్మల్ని) తగ్గించుకొనుట“ అనగా అర్ధమేమిటి?14వ వచనము

Humility,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

ఆల్మా 32:17–43; 33–34

నా హృదయములో ఆయన వాక్యమును నాటి, పోషించుట ద్వారా యేసు క్రీస్తునందు విశ్వాసమును నేను సాధన చేస్తాను.

ఆరాధించుట గురించి జోరమీయుల ప్రశ్నలకు స్పందనగా ఒక విత్తనమును నాటుట గురించి ఆల్మా ఎందుకు మాట్లాడాడని మీరనుకుంటున్నారు? ఆల్మా మాట్లాడిన విత్తనము ఏది? (ఆల్మా 32:28; 33:22–23 చూడండి). మీరు ఆల్మా 32:17–43 చదివినప్పుడు, యేసు క్రీస్తునందు మరియు ఆయన వాక్యమందు విశ్వాసమును ఎలా సాధన చేయాలో గ్రహించుటకు మీకు సహాయపడు మాటలు మరియు వాక్యభాగములను గమనించండి. విశ్వాసము అనగా ఏమిటి మరియు ఏది విశ్వాసము కాదు అనుదాని గురించి మీరు ఏమి నేర్చుకున్నారు? తరువాత, 33–44 అధ్యాయములు మీరు చదివినప్పుడు, “(మేము) విత్తనమును ఎలా నాటగలము?” జోరమీయుల ప్రశ్నకు జవాబుల కొరకు వెదకండి (ఆల్మా 33:1).

ఆల్మా 32–34 అధ్యయనము చేయుటకు మరొక విధానము ఇక్కడున్నది: ఒక విత్తనము యొక్క ఎదుగుదలలో వేర్వేరు దశలను సూచించు చిత్రమును గీయండి. మీ హృదయములో వాక్యమును ఎలా నాటి, పోషించాలో గ్రహించుటకు మీకు సహాయపడునట్లు, ఆల్మా 32:28–43 నుండి మాటలతో ప్రతీ చిత్రము యొక్క భాగము గుర్తించండి.

మత్తయి 13:3–8, 18–23; హెబ్రీయులకు 11; Neil L. Andersen, “Faith Is Not by Chance, but by Choice,” Ensign or Liahona, Nov. 2015, 65–68; “Faith in Jesus Christ,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

ఆల్మా 33:2–11; 34:17–29

ఏ సమయములోనైనా, ఎక్కడైనా, ప్రార్థనయందు నేను దేవునిని ఆరాధించగలను.

ఆరాధన మరియు ప్రార్థన గురించి ఆల్మా మరియు అమ్యులేక్ సలహా జోరమీయులకు కలిగియున్న ప్రత్యేక అపార్ధములను సరిదిద్దుటకు ఉద్దేశించబడినది (ఆల్మా 31:13–23 చూడండి). కాని వారు బోధించిన సత్యములు ప్రార్ధన మరియు ఆరాధించుట గురించి బాగా అర్ధము చేసుకొనుటకు మనలో ఎవరికైనా సహాయపడగలవు. ఆల్మా 33:2–11 మరియు 34:17–29 లో ప్రార్థన గురించి మీరు కనుగొన్న సత్యముల యొక్క జాబితాను చేయవచ్చు. ఆ జాబితా ప్రక్కన, ఈ సత్యములు సరిదిద్దగల ప్రార్థన గురించి సాధ్యమైన తప్పుడు భావనల జాబితా చేయండి (ఆల్మా 31:12–23 చూడండి). ఈ వచనముల నుండి మీరు నేర్చుకున్న విషయాలు మీరు ప్రార్ధించి మరియు ఆరాధించు విధానమును ఏవిధంగా ప్రభావితం చేస్తాయి?

ఆల్మా 33:3–17

జీనోస్ మరియు జీనోక్ ఎవరు?

పాత నిబంధన కాలములలో యేసు క్రీస్తును గూర్చి సాక్ష్యమిచ్చిన ప్రవక్తలు జీనోస్ మరియు జీనోక్, కానీ వారి బోధనలు పాత నిబంధనలో కనబడవు. నీఫైయులు ఈ ప్రవక్తల బోధనలకు ప్రవేశము కలిగియున్నారు, బహుశా ఎందుకనగా అవి లేబన్ నుండి నీఫై పొందిన ఇత్తడి పలకలందు చేర్చబడినవి. 1 నీఫై 19:10–12; జేకబ్ 5:1; మరియు హీలమన్ 8:19–20 లో కూడా అవి చెప్పబడినవి.

ఆల్మా 34:30–41

“ఈ జీవితము దేవునిని కలుసుకొనుటకు … సిద్ధపడు సమయమైయున్నది.“

మీరు ఆల్మా 34:30–41 చదివినప్పుడు, మీరు ఎలా“ఈ జీవితములో ఉండగానే [మీ] సమయమును మెరుగుపరచుకొంటారో” (33వ వచనము) ఆలోచించండి. దేవునిని కలుసుకొనుటకు సిద్ధపడుటకు పశ్చాత్తాపము మరియు సహనము మీకు ఎలా సహాయపడతాయి? మీరు వాయిదా వేస్తున్నవి, మీరు చేయాల్సిన మార్పులు ఏవైనా ఉన్నాయా? మీరు పొందే ఏ ఆత్మీయ ప్రేరేపణలు ఏవైనా అమలు చేయుటకు నిశ్చయపరచుకొనండి.

ఆల్మా 12:24; Larry R. Lawrence, “What Lack I Yet?Ensign or Liahona, Nov. 2015, 33–35 కూడా చూడండి.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

ఆల్మా 32:9–11; 33:2–11; 34:38–39

మనము ఆదివారము మాత్రమే ఆరాధించుటకు మరియు ప్రార్ధించుటకు అనుమతించబడిన యెడల ఎలా ఉంటుంది? మీరు ఈ వచనాలు కలిసి చదివినప్పుడు, ప్రతీరోజు వారు ఎలా ఆరాధించగలరు మరియు వారు ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారో కుటుంబ సభ్యులు చర్చించవచ్చు.

ఆల్మా 32:28–43

ఒక వృక్షము యొక్క చిత్రము ఈ సారాంశముతో ఇవ్వబడింది; ఈ వచనములలో ఆల్మా యొక్క మాటలను వర్ణించేందుకు మీరు దానిని ఉపయోగించవచ్చు. లేక మీ కుటుంబము వేర్వేరు దశలలో ఎదుగుతున్న మొక్కలను చూడటానికి నడిచి వెళ్లవచ్చు మరియు మన విశ్వాసముతో ఎదుగుతున్న మొక్కను పోలుస్తున్న ఆల్మా 32 నుండి వచనములు చదువండి. ప్రతీ కుటుంబ సభ్యులు ఒక విత్తనమును నాటి, అది ఎదుగుటకు సహాయపడుటకు చేయాల్సిన దానిని చర్చించవచ్చు. రాబోయే వారములలో మీ విత్తనాలను మీరు పరిశీలించవచ్చు మరియు మన సాక్ష్యములను నిరంతరము పోషించాల్సిన అవసరమును ఒకరినొకరు జ్ఞాపకము చేసుకొనండి.

ఆల్మా 33:2–11; 34:17–29

మన వ్యక్తిగత మరియు కుటుంబ ప్రార్ధనలను మనము ఎలా మెరుగుపరచుకొనగలమో ఈ వచనాలు ఏమి సూచిస్తాయి?

ఆల్మా 34:31

మనము పశ్చాత్తాపపడినప్పుడు, మనము విమోచన ప్రణాళిక యొక్క దీవెనలు “వెంటనే” అనుభవించుట మనము ప్రారంభించామని మనకు చూపిన అనుభవాలేవి?

ఆల్మా 34:33–35

వాయిదా వేయుట అనగా అర్ధమేమిటో మీ కుటుంబానికి తెలుసా? ఎవరైనా ఒకరు వాయిదా వేసిన మాదిరులను మరియు దాని చెడు పర్యవసానములను పంచుకోవచ్చు. “[మన] పాపముల కొరకు పశ్చాత్తాపపడు దినమును వాయిదా వేయుట” అనగా అర్ధమేమిటి?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకులో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

చిత్రములను గీయండి. లేఖనముల నుండి వారు నేర్చుకొన్నప్పుడు మీరు కుటుంబ సభ్యులను చిత్రీకరించనియ్యండి. ఉదాహరణకు, వారు అధ్యయనము చేసినప్పుడు ఒక విత్తనము ఒక వృక్షముగా ఎదుగుటను చిత్రించుటను వారు ఆనందించవచ్చు ఆల్మా 32.

చిత్రం
ఒక వృక్షముపై ఫలము

“దానిని పోషించుటలో వాక్యము యెడల మీ శ్రద్ధ, మీ విశ్వాసము మరియు మీ సహనమును బట్టి, … ఇదిగో, చివరికి మీరు దాని ఫలమును కోయుదురు, అది మిక్కిలి శ్రేష్టమైనది” (ఆల్మా 32:42).

ముద్రించు