రండి, నన్ను అనుసరించండి
మే 18–24. మోషైయ 25–28: “వారు దేవుని యొక్క జనులని పిలువబడిరి”


“మే 18–24. మోషైయ 25–28: ‘వారు దేవుని యొక్క జనులని పిలువబడిరి,’” రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020 (2020)

“మే 18–24. మోషైయ 25–28, “రండి, నన్ను అనుసరించండి—వ్యక్తులు మరియు కుటుంబాల కొరకు: మోర్మన్ గ్రంథము 2020

చిత్రం
ఆల్మా మరియు మోషైయ కుమారులకు దేవదూత ప్రత్యక్షమగుట

గారీ ఎల్. కాప్ చేత చిన్నవాడైన ఆల్మా పరివర్తన

మే 18–24.

మోషైయ 25–28

“వారు దేవుని యొక్క జనులని పిలువబడిరి”

“ప్రభువు యొక్క స్వరము [ఆల్మాకు] వచ్చిన,” తరువాత “అతడు వాటిని కలిగియుండునట్లు” (మోషైయ 26:14, 33) ప్రభువు అతనికి చెప్పిన సంగతులను వ్రాసెను. ఆల్మా యొక్క మాదిరిని మీరు ఎలా అనుసరిస్తారు?

మీ మనోభావాలను నమోదు చేయండి

దాదాపు మూడు తరములు వేర్వేరు ప్రాంతాలలో నివసించిన తరువాత, నీఫైయులు మరలా ఒకే జనముగా ఉన్నారు. లింహై జనులు, ఆల్మా యొక్క జనులు, మరియు మోషైయ యొక్క జనులు—నీఫై వంశమునుండి రాని జారహేమ్ల యొక్క జనులు కూడ —ఇప్పుడు అందరు “నీఫైయులతో లెక్కింపబడిరి” (మోషైయ 25:13). వారిలో అనేకమంది ఆల్మా స్థాపించిన సంఘము యొక్క సభ్యులు కావాలని కూడ కోరుకున్నారు. “క్రీస్తు యొక్క నామమును తమపై తీసుకొనుటకు కోరిన వారు” అందరూ బాప్తీస్మము పొందారు, “వారు దేవుని యొక్క జనులని పిలువబడిరి” (మోషైయ 25:23–24). సంవత్సరాల వివాదము మరియు దాస్యము తరువాత, చివరికి నీఫైయులు శాంతిగల సమయమును ఆనందించగలిగినట్లు అనిపించింది.

కాని త్వరలోనే, అవిశ్వాసులు పరిశుద్ధులను హింసించుట ప్రారంభించారు. దీనిని మరిముఖ్యంగా గుండె కోతగా చేసింది ఏమిటంటే, ఈ అవిశ్వాసులలో అనేకులు విశ్వాసుల యొక్క స్వంత పిల్లలు —“యువతరము” ఉన్నారు (మోషైయ 26:1 ), వీరిలో మోషైయ యొక్క కుమారులు మరియు ఆల్మా యొక్క ఒక కుమారుడు ఉండుటయే. తరువాత ఒక అద్భుతము జరిగింది, మరియు ఆ అద్భుతము యొక్క వృత్తాంతము తరములుగా వేదన చెందిన తల్లిదండ్రులకు నిరీక్షణ ఇవ్వబడింది. కానీ ఆల్మా యొక్క పరివర్తన తప్పిపోయిన పిల్లల యొక్క తల్లిదండ్రుల కొరకైన మాత్రమే కాదు. నిజమైన పరివర్తన ఒక అద్భుతము, అది ఒక విధంగా లేక మరొక విధానములో, మనందరికీ సంభవించాల్సిన అవసరమున్నది.

చిత్రం
వ్యక్తిగత అధ్యయన చిహ్నము

వ్యక్తిగత లేఖన అధ్యయనము కొరకు ఉపాయములు

మోషైయ 26:1–6

నా స్వంత విశ్వాసము మరియు సాక్ష్యము కొరకు నేను బాధ్యుడను.

రాజైన బెంజిమెన్ ప్రసంగము విన్న వారు అద్భుతమైను పరివర్తన అనుభవించారు (మోషైయ 5:1–7 చూడండి), కానీ పరివర్తన వ్యక్తిగతమైన అనుభవము, అది ఒకరి పిల్లలకు వారసత్వముగా అందించబడదు. మనమందరము యేసు క్రీస్తు యొక్క సువార్తకు మన స్వంత పరివర్తనను అనుభవించాలి. అవిశ్వాసుల నీఫైయుల యొక్క “యువతరము” గురించి మోషైయ 26:1–6 లో మీరు చదివినప్పుడు, వారి అవిశ్వాసము యొక్క పర్యవసానములను గమనించండి. మీరు క్రీస్తు నొద్దకు తీసుకొనిరావాలని మీరు కోరిన జనుల గురించి కూడ మీరు ఆలోచించవచ్చు. మీ పరివర్తన వారికి మీరు ఇవ్వలేకపోయినా, వారు విశ్వాసమును కనుగొనుటకు వారికి సహాయపడుటకు మీరు చేయగల విషయాలను ఆత్మ మెల్లగా చెప్పవచ్చు. మోషైయ 25–28లో ఆల్మా, ఇతర సంఘ సభ్యులు యువతరముకు ఎలా సహాయపడ్డారో మీరు చదివినప్పుడు, మీకు అదనపు ఆలోచనలు రావచ్చు.

సిద్ధాంతము మరియు నిబంధనలు 68:25–29 కూడా చూడండి.

మోషైయ 26:6–39

దేవుని యొక్క విశ్వాసులైన సేవకులు ఆయన చిత్తమును వెదకుతారు.

కొన్నిసార్లు ఆల్మా వంటి నాయకులు ఎల్లప్పుడు సరైన దానిని చేయుట ఎరిగియున్నారని మనము అనుకుంటాము. మోషైయ 26 లో సంఘములో ఆల్మా ఎన్నడూ వ్యవహరించని ఒక సమస్యను గూర్చి మనము చదువుతాము, మరియు “దేవుని దృష్టిలో తాను పొరపాటు చేయుదునేమోయని ఆయన భయపడెను” (మోషైయ 26:13). ఈ పరిస్థితిలో ఆల్మా ఏమి చేసెను? (మోషైయ 26:13–14, 33–34, 38–39 చూడండి). మీ కుటుంబములో లేక మీ సంఘ సేవలో కష్టమైన సమస్యలతో మీరు ఎలా వ్యవహరించాలో ఆల్మా యొక్క అనుభవము ఏమి సూచిస్తుంది?

ఆల్మాకు దేవుడు బయల్పరచిన సత్యములను వరసగా వ్రాయుట కూడ ఆసక్తికరమైనది, అవి మోషైయ 26:15–32 లో కనుగొనబడినవి. ఈ సత్యములలో కొన్ని ఆల్మా యొక్క ప్రశ్నకు నేరుగా వచ్చిన స్పందనగా లేదని గమనించండి. ప్రార్ధన మరియు వ్యక్తిగత బయల్పాటును పొందుట గురించి ఇది మీకేమి సూచింస్తుంది?

మోషైయ 27:8–37

పురుషులు, స్త్రీలందరు తిరిగి జన్మించాలి.

చిన్నవాడైన ఆల్మాకు ఒక ఆత్మీయ పునర్జన్మ అవసరమని స్పష్టమైనది, ఏలయనగా, అతడు, మోషైయ కుమారులు “మిక్కిలి దుష్టులైన పాపులైయుండిరి,” వారు “దేవుని యొక్క సంఘమును నాశనము చేయుటకు” (మోషైయ 28:4; 27:10) వెళ్లియుండెను. కానీ ఆల్మా పరివర్తన చెందిన వెంటనే, పరివర్తన లభ్యమగునని —మరియు ప్రతీఒక్కరికి —ఆవశ్యకమైనదని ఆల్మా సాక్ష్యమిచ్చెను: “సమస్త మనుష్య జాతి … తిరిగి జన్మించవలెనని,” “ఆశ్చర్యపడవద్దు,” అని ఆయన చెప్పెను (మోషైయ 27:25; ఏటవాలు అక్షరాలు జోడించబడినవి). అవును, దానిలో మీరు కూడా ఉన్నారు.

మోషైయ 27:8–37 లో కనుగొనబడిన ఆల్మా యొక్క అనుభవమును మీరు చదివినప్పుడు, అతని స్థానములో మిమ్మల్ని మీరు ఉంచటానికి ప్రయత్నించవచ్చు. మీరు సంఘాన్ని నాశనము చేయటానికి ప్రయత్నించటం లేదు, కానీ మీ గురించి మార్చుకోవాల్సిన విషయాలను గూర్చి మీరు నిశ్చయముగా ఆలోచించవచ్చు. ఆల్మా తండ్రి వలె, మిమ్మల్ని ఎవరు బలపరుస్తున్నారు మరియు “అధిక విశ్వాసముతో” మీ కొరకు ప్రార్ధిస్తున్నారు? “దేవుని యొక్క శక్తి మరియు అధికారమును గూర్చి (మిమ్మల్ని) ఒప్పించుటకు” ఏ అనుభవాలు సహాయపడినవి?మోషైయ 27:14 మీరు “జ్ఞాపకము చేసుకొనునట్లు” మీకు లేక మీ కుటుంబానికి ప్రభువు చేసిన “గొప్ప క్రియలు” ఏవి? (మోషైయ 27:16). తిరిగి జన్మించుట అనగా అర్ధమేమిటో చిన్నవాడైన ఆల్మా యొక్క మాటలు మరియు క్రియల నుండి మీరేమి నేర్చుకోవచ్చు? ఇటువంటి ప్రశ్నలు తిరిగి జన్మించు ప్రక్రియలో మీ అభివృద్ధిని లెక్కించుటకు మీకు సహాయపడవచ్చు.

మోషైయ 5:6–9; ఆల్మా 36; “Conversion,” Gospel Topics, topics.ChurchofJesusChrist.org కూడా చూడండి.

చిత్రం
చిన్నవాడైన ఆల్మా తన తండ్రి ఇంటికి మోసుకొనిపోబడ్డాడు.

వాల్టర్ రేని చేత అతని తండ్రి సంతోషించును

మోషైయ 27:14, 19–24

దేవుడు నా ప్రార్ధనలు ఆలకించి, ఆయన చిత్తప్రకారము వాటికి జవాబిచ్చును.

పెద్దవాడైన ఆల్మా యొక్క పరిస్థితిలో ఉన్న ఒక తండ్రి లేక తల్లిని మీరు ఎరిగిన వారి కుమారుడు లేక కుమార్తె నాశనకరమైన ఎంపికలు చేయవచ్చు. లేక మీరే ఆ తండ్రి లేక తల్లి కావచ్చు. మీకు నిరీక్షణను ఇచ్చునట్లు మోషైయ 7:14, 19–24 లో మీరు కనుగొన్నదేమిటి? ఇతరుల తరఫును మీ ప్రార్ధనలను ఈ వచనాలు ఎలా ప్రభావితం చేస్తాయి?

చిత్రం
కుటుంబ అధ్యయన చిహ్నము

కుటుంబ లేఖన అధ్యయనము మరియు కుటుంబ గృహ సాయంకాలము కొరకు ఉపాయములు

మీ కుటుంబముతో మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు, మీ కుటుంబ అవసరాలను తీర్చుటకు ఏ సూత్రాలను నొక్కి చెప్పాలో మరియు చర్చించాలో తెలుసుకొనుటకు ఆత్మ మీకు సహాయపడగలదు. ఇక్కడ కొన్ని ఉపాయములు ఇవ్వబడ్డాయి.

మోషైయ 25:5–11

జెనిఫ్ యొక్క జనులు మరియు ఆల్మా యొక్క జనుల నివేదికలను మోషైయ వారికి చదివినప్పుడు అతని జనులు ఎలా భావించారు? మీరు చదవగల నివేదికలు ఏవైనా మీ కుటుంబము వ్రాసి ఉంచిందా? మీ నివేదికలను చేర్చుటకు లేక మీ స్వంత వాటిని ఉంచుట మీరు ప్రారంభించవచ్చు. (భవిష్యత్ తరములు కలిపి) మీ కుటుంబము “మిక్కిలి గొప్ప సంతోషముతో నింపబడుటకు” మరియు “దేవుని తక్షణపు మంచితనము” గురించి నేర్చుకొనుటకు సహాయపడునట్లు మీరు దేనిని చేరుస్తారు? మోషైయ 25:8, 10

మోషైయ 25:16

ప్రభువు వారిని దాస్యము నుండి విడిపించాడని జ్ఞాపకము ఉంచుకొనుట లింహై జనులకు ఎందుకు ముఖ్యమైనది? మనము జ్ఞాపకముంచుకోవాల్సినట్లు ప్రభువు మన కొరకు చేసినదేమిటి?

మోషైయ 26:29–31; 27:35

ఈ వచనముల ప్రకారము, క్షమాపణ పొందుటకు ఒక వ్యక్తి ఏమి చేయాలి?

మోషైయ 27:21–24

ఈ వచనాలు చదివినప్పుడు, మీ కుటుంబము ప్రార్ధించి, ఉపవాసముండగల ఎవరైనా ఒకరి గురించి ఆలోచించండి.

మోషైయ 27–28

ఈ అధ్యాయములలో వృత్తాంతములను మీ కుటుంబము దృశ్యీకరించుటకు సహాయపడుటకు, చేర్చబడిన జనుల యొక్క చిత్రములను గీయమని వారిని మీరు ఆహ్వానించవచ్చు మరియు వృత్తాంతమును తిరిగి చెప్పుటకు చిత్రములను ఉపయోగించండి. లేక వారు వృత్తాంతమును నటించుటను ఆనందించవచ్చు; ఆల్మా మరియు మోషైయ కుమారులు అనుభవించిన మార్పును వారు ఎలా చిత్రీకరించగలరు?

పిల్లలకు బోధించే మరిన్ని ఉపాయముల కోసం, రండి, నన్ను అనుసరించండి—ప్రాథమిక కొరకు లో ఈ వారం సారాంశం చూడండి.

మన బోధనను మెరుగుపరచుట

కళను ఉపయోగించండి. Gospel Art Book మరియు Media Library on ChurchofJesusChrist.org మీ కుటుంబము భావనలు లేక ఘటనలు దృశ్యీకరించుటకు సహాయపడునట్లు అనేక చిత్రములు మరియు వీడియోలను కలిగియున్నది.

చిత్రం
చిన్నవాడైన ఆల్మాకు దేవదూత ప్రత్యక్షమగుట

కెవిన్ కీలి చేత చిన్నవాడైన ఆల్మాకు దేవదూత ప్రత్యక్షమగుట యొక్క దృష్టాంతము

ముద్రించు