చేతి పుస్తకములు మరియు పిలుపులు
3. యాజకత్వ సూత్రాలు


“3. యాజకత్వ సూత్రాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“3. యాజకత్వ సూత్రాలు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

దేవాలయం దగ్గర నడుస్తున్న కుటుంబము

3.

యాజకత్వ సూత్రాలు

3.0

పరిచయము

యాజకత్వము అనేది దేవుని యొక్క అధికారము మరియు శక్తి. “నరునికి అమర్త్యత్వమును, నిత్యజీవమును ఇచ్చుట” (మోషే 1:39) అనే ఆయన కార్యమును యాజకత్వము ద్వారా పరలోక తండ్రి నెరవేరుస్తారు. ఈ కార్యమును నిర్వహించడానికి సహాయం చేయడానికి దేవుడు భూమిపై నున్న తన కుమారులు, కుమార్తెలకు అధికారాన్ని, శక్తిని అనుగ్రహిస్తారు (1వ అధ్యాయము చూడండి).

3.2

యాజకత్వము యొక్క దీవెనలు

నిబంధనలు మరియు యాజకత్వ విధుల ద్వారా, ఆయన పిల్లలందరికి దేవుడు గొప్ప దీవెనలు లభ్యమయ్యేలా చేస్తారు. వాటిలో ఈ దీవెనలు ఉన్నాయి:

  • బాప్తిస్మము మరియు యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘములో సభ్యత్వము.

  • పరిశుద్ధాత్మ వరము.

  • సంస్కారములో పాలుపొందుట.

  • సంఘ పిలుపులు మరియు నియామకాల్లో సేవ చేయడానికి అధికారము మరియు శక్తి.

  • గోత్రజనక దీవెనలు మరియు స్వస్థత, ఆదరణ, నడిపింపు యొక్క ఇతర యాజకత్వ దీవెనలు పొందుట.

  • దేవాలయంలో దేవుని శక్తితో వరమివ్వబడుట.

  • నిత్యత్వము కొరకు ఒకరి కుటుంబ సభ్యులతో ముద్రింపబడుట.

  • నిత్యజీవము యొక్క వాగ్దానము.

3.3

మెల్కీసెదెకు యాజకత్వము మరియు అహరోను యాజకత్వము

సంఘములో, యాజకత్వము రెండు భాగాలను కలిగియుంది: మెల్కీసెదెకు యాజకత్వము మరియు అహరోను యాజకత్వము (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:1 చూడండి).

3.3.1

మెల్కీసెదెకు యాజకత్వము

మెల్కీసెదెకు యాజకత్వము అనేది “దేవుని కుమారుని క్రమముననుసరించిన పరిశుద్ధ యాజకత్వము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:3). ఈ శక్తి చేత దేవుని కుమారులు మరియు కుమార్తెలు ఆయన వలె కాగలరు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–21; 132:19–20 చూడండి).

ఈ అధికారము ద్వారా, సంఘ నాయకులు సంఘము యొక్క ఆధ్యాత్మిక కార్యములన్నిటిని నడిపిస్తారు మరియు నిర్వహిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:18 చూడండి).

స్టేకు అధ్యక్షుడు స్టేకులో అధ్యక్షత్వం వహించే ప్రధాన యాజకుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:8, 10 చూడండి; ఈ చేతిపుస్తకంలో 6వ అధ్యాయము కూడా చూడండి). బిషప్పు వార్డులో అధ్యక్షత్వం వహించే ప్రధాన యాజకుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:17 చూడండి; ఈ చేతిపుస్తకంలో 7వ అధ్యాయము కూడా చూడండి).

మెల్కీసెదెకు యాజకత్వము యొక్క స్థానాలు మరియు బాధ్యతల గురించి సమాచారము కొరకు, 8.1 చూడండి.

3.3.2

అహరోను యాజకత్వము

అహరోను యాజకత్వము అనేది “మెల్కీసెదెకు యాజకత్వమునకు … అనుబంధము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:14). అది ఈ తాళపుచెవులను కలిగియున్నది:

  • దేవదూతల పరిచర్య.

  • పశ్చాత్తాపము యొక్క సువార్త.

  • పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మముతో కలిపి బాహ్యవిధులను నిర్వహించుట.

(సిద్ధాంతము మరియు నిబంధనలు 13:1; 84:26–27; 107:20 చూడండి.)

బిషప్పు వార్డులో అహరోను యాజకత్వానికి అధ్యక్షుడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:15 చూడండి).

అహరోను యాజకత్వము యొక్క స్థానాలు మరియు బాధ్యతల గురించి సమాచారము కొరకు, 10.1.3 చూడండి.

3.4

యాజకత్వ అధికారము

యాజకత్వ అధికారము అనేది దేవునికి ప్రాతినిధ్యం వహించడానికి మరియు ఆయన నామములో పనిచేయడానికి గల అధికారము. సంఘములో, యాజకత్వ అధికారము మొత్తము యాజకత్వ తాళపుచెవులను కలిగియున్న వారి మార్గదర్శకత్వం క్రింద వినియోగించబడుతుంది.

3.4.1

యాజకత్వ తాళపుచెవులు

యాజకత్వ తాళపుచెవులు అనగా దేవుని పిల్లల తరఫున యాజకత్వ ఉపయోగాన్ని నడిపించే అధికారము.

3.4.1.1

యాజకత్వ తాళపుచెవులను కలిగియున్న వారు

భూమి మీద దేవుని రాజ్యానికి సంబంధించిన తాళపుచెవులన్నిటిని ప్రభువు తన అపొస్తలులలో ప్రతీఒక్కరికి అనుగ్రహించారు. జీవించియున్న దీర్ఘకాలిక అపొస్తలుడు, సంఘము యొక్క అధ్యక్షుడైన వ్యక్తికి మాత్రమే యాజకత్వ తాళపుచెవులన్నిటిని వినియోగించడానికి భూమిపై అధికారమున్నది (సిద్ధాంతము మరియు నిబంధనలు 81:1–2; 107:64–67, 91–92; 132:7 చూడండి).

సంఘము యొక్క అధ్యక్షుని మార్గదర్శకత్వం క్రింద యాజకత్వ నాయకులకు తాళపుచెవులు ఇవ్వబడ్డాయి, తద్వారా వారి బాధ్యతాయుత ప్రాంతాల్లో వారు అధ్యక్షత్వము వహించగలరు. ఈ నాయకులలో ఉన్నవారు:

  • స్టేకు మరియు జిల్లా అధ్యక్షులు.

  • బిషప్పులు మరియు శాఖాధ్యక్షులు.

  • మెల్కీసెదెకు మరియు అహరోను యాజకత్వ సమూహపు అధ్యక్షులు.

  • దేవాలయ అధ్యక్షులు.

  • మిషను అధ్యక్షులు మరియు సువార్తికుల శిక్షణా కేంద్ర అధ్యక్షులు.

ఈ నాయకులు వారి పిలుపులలో ప్రత్యేకపరచబడినప్పుడు యాజకత్వ తాళపుచెవులను పొందుతారు.

స్థానిక యాజకత్వ నాయకులకు సలహాదారులు లేదా సంఘ నిర్మాణాల అధ్యక్షులతో పాటు ఇతరులెవ్వరికి యాజకత్వ తాళపుచెవులు ఇవ్వబడవు. సంఘ నిర్మాణాల అధ్యక్షులు యాజకత్వ తాళపుచెవులు కలిగియున్న వారి మార్గదర్శకత్వం క్రింద అధ్యక్షత్వం వహిస్తారు (4.2.4 చూడండి).

3.4.1.2

ప్రభువు కార్యమునకు క్రమము

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము ఒక క్రమమైన పద్ధతిలో సాధించబడేలా యాజకత్వ తాళపుచెవులు నిశ్చయపరుస్తాయి (సిద్ధాంతము మరియు నిబంధనలు 42:11; 132:8 చూడండి). యాజకత్వ తాళపుచెవులు కలిగియున్న వారు తమ బాధ్యతాయుత ప్రాంతాల్లో ప్రభువు కార్యమును నిర్దేశిస్తారు. ఈ అధ్యక్షత్వము వహించు అధికారము నాయకుని పిలుపుకు సంబంధించిన నిర్దిష్టమైన బాధ్యతల కొరకు మాత్రమే చెల్లుతుంది. యాజకత్వ నాయకులు వారి పిలుపుల నుండి విడుదల చేయబడినప్పుడు, వారు ఇకపై ఈ తాళపుచెవులను కలిగియుండరు.

3.4.2

యాజకత్వ అనుగ్రహము మరియు నియామకము

యాజకత్వ తాళపుచెవులు కలిగియున్న వారి మార్గదర్శకత్వం క్రింద, సంఘము యొక్క యోగ్యులైన పురుష సభ్యులకు అహరోను యాజకత్వము మరియు మెల్కీసెదెకు యాజకత్వము అనుగ్రహించబడుతుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:14–17 చూడండి). సరియైన యాజకత్వము అనుగ్రహించబడిన తర్వాత, ఆ వ్యక్తి ఆ యాజకత్వములో పరిచారకుడు లేదా ఎల్డరు వంటి ఒక స్థానానికి నియమించబడతాడు. యాజకత్వము కలిగియున్న ఒకరు ఆ స్థానము యొక్క హక్కులు మరియు విధుల ప్రకారము యాజకత్వాన్ని వినియోగిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 107:99 చూడండి).

యాజకత్వ అనుగ్రహము మరియు నియామకము గురించి అధిక సమాచారము కొరకు 8.1.1 మరియు 18.10 చూడండి.

3.4.3

సంఘములో సేవ చేయడానికి యాజకత్వ అధికారము యొక్క అప్పగింత

3.4.3.1

ప్రత్యేకపరచుట

యాజకత్వ తాళపుచెవులు కలిగియున్న వారి మార్గదర్శకత్వం క్రింద స్త్రీ పురుషులు ప్రత్యేకపరచబడినప్పుడు, ఆ పిలుపులో పనిచేయడానికి దేవుని నుండి వారికి అధికారమివ్వబడుతుంది. వారు ఒక పిలుపు నుండి విడుదల చేయబడినప్పుడు, దానితో సంబంధం ఉన్న అధికారాన్ని ఇకపై వారు కలిగియుండరు.

సేవ చేయడానికి ప్రత్యేకపరచబడిన సంఘ సభ్యులందరికి వారి పిలుపులలో పనిచేయడానికి దైవిక అధికారం మరియు బాధ్యత ఇవ్వబడుతుంది. ఉదాహరణకు:

  • వార్డు ఉపశమన సమాజ అధ్యక్షురాలిగా బిషప్పు చేత ప్రత్యేకపరచబడిన ఒక స్త్రీకి వార్డులో ఉపశమన సమాజము యొక్క పనిని నడిపించే అధికారము ఇవ్వబడుతుంది.

పిలువబడి, ప్రత్యేకపరచబడిన వారందరు వారిపై అధ్యక్షత్వము వహించే వారి మార్గదర్శకత్వము క్రింద సేవచేస్తారు (3.4.1.2 చూడండి).

3.4.3.2

నియామకము

అధ్యక్షత్వము వహించు సంఘ నాయకులు నియామకం ద్వారా అధికారాన్ని అప్పగించగలరు. స్త్రీ పురుషులు ఈ నియామకాలను పొందినప్పుడు, పనిచేయడానికి దేవుని నుండి వారికి అధికారమివ్వబడుతుంది. ఉదాహరణకు:

  • స్టేకు సమావేశాల్లో అధ్యక్షత్వం వహించడానికి మరియు ప్రాంతాల్లో వ్యవహరించడానికి నియమించబడిన డెబ్బదులకు ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము అధికారాన్ని అప్పగిస్తారు.

  • పరిచర్య చేయు సహోదరులు మరియు పరిచర్య చేయు సహోదరీలుగా సేవ చేయడానికి సంఘ సభ్యులకు అధికారము అప్పగించబడింది.

నియామకము ద్వారా అప్పగించబడిన అధికారము నిర్దిష్టమైన బాధ్యతలకు మరియు నియామక వ్యవధికి పరిమితమైనది.

3.4.4

యాజకత్వ అధికారాన్ని న్యాయవంతంగా వినియోగించుట

నీతి యందు మాత్రమే ఈ అధికారము ఉపయోగించబడగలదు (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:36 చూడండి). ప్రేరేపణ, దీర్ఘ శాంతము, మృదుత్వము, సాత్వికము, ప్రేమ మరియు దయతో ఇది వినియోగించబడుతుంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 121:41–42 చూడండి).

యాజకత్వ అధికారమును వినియోగించేవారు ఇతరులపై తమ ఇష్టాన్ని బలవంతంగా రుద్దరు. స్వార్థపూరిత ఉద్దేశాల కొరకు వారు దీనిని ఉపయోగించరు.

3.5

యాజకత్వ శక్తి

ఏ శక్తి ద్వారా దేవుడు తన పిల్లలను దీవిస్తారో అదే యాజకత్వ శక్తి. దేవుని యొక్క యాజకత్వ శక్తి—స్త్రీలు మరియు పురుషులు—సంఘ సభ్యులందరికి ఆయనతో చేసిన నిబంధనలను వారు పాటించినప్పుడు స్థిరంగా ప్రవహిస్తుంది. సభ్యులు యాజకత్వ విధులను పొందినప్పుడు వారు ఈ నిబంధనలు చేస్తారు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:19–20 చూడండి.)

సభ్యులు పొందగల యాజకత్వ శక్తి యొక్క దీవెనలలో ఇవి ఉన్నాయి:

  • వారి జీవితాల కొరకు నడిపింపు.

  • కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు ఎలా సేవ చేయాలో తెలుసుకోవడానికి ప్రేరేపణ.

  • సవాళ్ళను సహించడానికి, జయించడానికి బలము.

  • వారి సామర్థ్యాలను హెచ్చించడానికి ఆత్మ యొక్క వరములు.

  • వారు చేయాలని నియమించబడిన, ప్రత్యేకపరచబడిన లేదా ఇవ్వబడిన పనిని ఎలా నెరవేర్చాలో తెలుసుకోవడానికి బయల్పాటు.

  • మరింతగా యేసు క్రీస్తు మరియు పరలోక తండ్రి వలె మారడానికి సహాయము మరియు బలము.

3.5.1

నిబంధనలు

నిబంధన అనేది దేవునికి మరియు ఆయన పిల్లలకు మధ్య ఒక పవిత్ర వాగ్దానము. దేవుడు నిబంధన కొరకు షరతులను ఇస్తారు మరియు ఆయన పిల్లలు ఆ షరతులకు లోబడతామని అంగీకరిస్తారు. ఆయన పిల్లలు నిబంధనను నెరవేర్చినప్పుడు వారిని దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తారు.

తమ నిబంధనలను పాటించడంలో అంతము వరకు సహించే వారందరు నిత్యజీవాన్ని పొందుతారు (2 నీఫై 31:17–20; సిద్ధాంతము మరియు నిబంధనలు 14:7 చూడండి).

వ్యక్తులు సువార్త యొక్క విధులను పొందినప్పుడు నిబంధనలు చేయడానికి సిద్ధపడేందుకు తల్లిదండ్రులు, సంఘ నాయకులు మరియు ఇతరులు వారికి సహాయపడతారు. తాము చేసే నిబంధనలను అతడు లేదా ఆమె అర్థం చేసుకున్నారని వారు నిశ్చయపరుస్తారు. ఒక వ్యక్తి ఒక నిబంధన చేసిన తర్వాత, దానిని పాటించడానికి వారు అతడు లేదా ఆమెకు సహాయపడతారు. (మోషైయ 18:8–11, 23–26 చూడండి.)

3.5.2

విధులు

విధి అనేది యాజకత్వ అధికారము చేత నిర్వహించబడే ఒక పవిత్ర కార్యము.

అనేక విధులలో, వ్యక్తులు దేవునితో నిబంధనలు చేస్తారు. ఉదాహరణలలో బాప్తిస్మము, సంస్కారము, వరము మరియు వివాహ ముద్రణ విధి ఉన్నాయి.

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులు నిత్యజీవానికి ఆవశ్యకమైనవి. మరింత సమాచారము కొరకు, 18.1 చూడండి.

3.6

యాజకత్వము మరియు గృహము

స్త్రీలు, పురుషులు మరియు పిల్లలు—తమ నిబంధనలను పాటించే సంఘ సభ్యులందరు—తమను మరియు తమ కుటుంబాలను బలపరచుకోవడానికి వారి గృహాలలో దేవుని యొక్క యాజకత్వ శక్తితో దీవించబడతారు (3.5 చూడండి). వారి వ్యక్తిగత జీవితాల్లో మరియు కుటుంబాలలో రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యమును చేయడంలో ఈ శక్తి సభ్యులకు సహాయపడుతుంది (2.2 చూడండి).

మెల్కీసెదెకు యాజకత్వము కలిగియున్న పురుషులు కుటుంబ సభ్యులకు నడిపింపు, స్వస్థత మరియు ఓదార్పును అందించడానికి యాజకత్వ దీవెనలు ఇవ్వగలరు. అవసరమైనప్పుడు, సంఘ సభ్యులు ఈ దీవెనలను బంధువులు, పరిచర్య చేయు సహోదరులు లేదా స్థానిక సంఘ నాయకుల నుండి కూడా కోరవచ్చు.