చేతి పుస్తకములు మరియు పిలుపులు
ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలను ఉపయోగించుట


ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలను ఉపయోగించుట,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023)

ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలను ఉపయోగించుట,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలను ఉపయోగించుట

ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు అనేది General Handbook: Serving in The Church of Jesus Christ of Latter-day Saints [ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవ చేయుట] నుండి చాలా ముఖ్యమైన సూచనల సంకలనం. ఇది ఎలాంటి నాయకుల కొరకు అంటే:

  • వారి ప్రాధాన్య భాషలో పూర్తి చేతిపుస్తకము ఇంకా అందుబాటు లేని వారి కొరకు.

  • ప్రధాన చేతిపుస్తకము యొక్క సంగ్రహము చేయబడిన అనువాదం నుండి ప్రయోజనం పొందగలిగే వారి కొరకు.

ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలలో ఉపయోగించిన అధ్యాయం, విభాగం మరియు ఉపవిభాగం యొక్క సంఖ్య పూర్తి ప్రధాన చేతిపుస్తకములో ఉపయోగించిన సంఖ్యతో సరిపోలుతుంది. ఇది సులభంగా సరిచూసుకొనుటకు మరియు వాటి మధ్య సరిపోల్చడానికి అనుమతిస్తుంది.

ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలలోని సంఖ్యలు కొన్నిసార్లు పూర్తి చేతిపుస్తకములోని విభాగాలు లేదా ఉపవిభాగాల సంఖ్యలను దాటవేస్తాయి. ఎందుకనగా సంగ్రహము చేయబడిన ఈ చేతిపుస్తకము పూర్తి చేతిపుస్తకము నుండి అత్యంత ముఖ్యమైన విషయమును మాత్రమే కలిగి ఉంది.

ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు చాలామంది నాయకులు తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలను అందించినప్పటికీ, అది పరిష్కరించని లేదా పూర్తిగా సమాధానం ఇవ్వని కొన్ని ప్రశ్నలను నాయకులు కలిగి ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో, నాయకులు వారు ఉపయోగించగల భాషలో అందుబాటులో ఉంటే పూర్తి ప్రధాన చేతిపుస్తకమును చూడవచ్చు. మార్గదర్శకత్వం కోసం నాయకులు వారిపై అధ్యక్షత్వము వహించు అధికారిని సంప్రదించవచ్చు.

ఆయన పిల్లల కొరకు రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో మీరు ఆయనతో చేరినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.

ప్రథమ అధ్యక్షత్వము మరియు పన్నెండుమంది అపొస్తలుల సమూహము