“0. సమీక్ష,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“0. సమీక్ష,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
0.
సమీక్ష
0.0
పరిచయము
“కాబట్టి, ఇప్పుడు ప్రతి మనుష్యుడు తన బాధ్యతను నేర్చుకొని అతడు నియమించబడిన స్థానములో పూర్తి శ్రద్ధతో పనిచేయవలెను” (సిద్ధాంతము మరియు నిబంధనలు 107;99) అని ప్రభువు బోధించారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో ఒక నాయకుడిగా, మీరు మీ పిలుపు యొక్క బాధ్యతలను నేర్చుకోవడంలో మరియు నెరవేర్చడంలో మీకు సహాయపడడానికి వ్యక్తిగత బయల్పాటును వెదకాలి.
లేఖనాలను మరియు కడవరి దిన ప్రవక్తల బోధనలను అధ్యయనం చేయడం, మీ బాధ్యతలను అర్థం చేసుకోవడానికి మరియు నెరవేర్చడానికి మీకు సహాయపడుతుంది. దేవుని యొక్క మాటలను మీరు అధ్యయనం చేస్తున్నప్పుడు, మీరు ఆత్మ యొక్క ప్రభావాన్ని మరింతగా గ్రహిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:85 చూడండి)
ఈ చేతిపుస్తకంలోని సూచనలను అధ్యయనం చేయడం ద్వారా మీరు మీ బాధ్యతలను కూడా నేర్చుకుంటారు. ఆత్మ యొక్క నడిపింపు కోసం వెదికేటప్పుడు అన్వయించడానికి సూత్రాలు, విధానాలు మరియు పద్ధతులపై అవగాహనను అందించేందుకు ఈ సూచనలు ఉపయోగించబడినట్లయితే అవి బయల్పాటును ఆహ్వానించగలవు.
0.1
చేతిపుస్తకం
ప్రధాన చేతిపుస్తకము: యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘములో సేవ చేయుట ప్రధాన మరియు స్థానిక సంఘ నాయకులకు మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
ఈ చేతిపుస్తకములోని శీర్షికలు మరియు ఉపశీర్షికలు అంశాలను సులభంగా కనుగొనడానికి మరియు సూచించడానికి అంకెలు వేయబడ్డాయి. ఉదాహరణకు, దేవాలయములో ఎవరు ముద్ర వేయబడవచ్చు అనే దాని గురించి సూచన 27.3.1 లో అందించబడింది. సంఖ్య 27 అధ్యాయాన్ని సూచిస్తుంది, సంఖ్య 3 ఆ అధ్యాయంలోని విభాగాన్ని సూచిస్తుంది మరియు సంఖ్య 1 ఉపవిభాగాన్ని సూచిస్తుంది.
0.2
అనుసరణ మరియు ఐచ్ఛిక వనరులు
అన్ని స్టేకులు మరియు వార్డులు ఒకే అవసరాలను కలిగియుండవు.
సభ్యుల అవసరాలను తీర్చడానికి ఏ మార్గదర్శకాలు మరియు ఐచ్ఛిక వనరులను ఉపయోగించాలనే దాని గురించి నాయకులు ప్రేరేపణను కోరుకుంటారు.
0.4
సూచనల గురించి ప్రశ్నలు
లేఖనాలు, సజీవ ప్రవక్తల మాటలు లేదా ఈ చేతిపుస్తకములో ప్రస్తావించబడని ప్రశ్నలు తలెత్తినప్పుడు, మార్గదర్శకత్వం కోసం సంఘ సభ్యులు దేవునితో వారి నిబంధనలపై, వారి స్థానిక నాయకుల సలహాపై మరియు ఆత్మ యొక్క ప్రేరణపై ఆధారపడాలి.
ఈ చేతిపుస్తకములోని సమాచారం గురించి లేదా అది పరిష్కరించని సమస్యల గురించి నాయకులకు ప్రశ్నలు ఉంటే, వారు తమపై అధ్యక్షత్వము వహించు అధికారిని సంప్రదిస్తారు.
0.5
పరిభాష
మరోలా సూచించిన చోట తప్ప:
-
ఈ చేతిపుస్తకములో బిషప్పు మరియు బిషప్రిక్కు అనే పదాలు శాఖాధ్యక్షులు మరియు శాఖాధ్యక్షత్వములను కూడా సూచిస్తాయి. స్టేకు అధ్యక్షుడు మరియు స్టేకు అధ్యక్షత్వము అనే పదాలు జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షత్వములను కూడా సూచిస్తాయి. జిల్లా అధ్యక్షుల అధికారం స్టేకు అధ్యక్షుల అధికారానికి ఎలా భిన్నంగా ఉంటుందనే సారాంశం కొరకు, 6.3 చూడండి.
-
వార్డులు మరియు స్టేకులకు సంబంధించిన సూచనలు సాధారణంగా శాఖలు, జిల్లాలు మరియు మిషనులకు కూడా వర్తిస్తాయి.
-
ఆదివారానికి సంబంధించిన సూచనలు స్థానికంగా విశ్రాంతిదినము ఏ రోజున పాటించబడుతుందో దానికి వర్తిస్తాయి.
-
యూనిట్ అనే పదం వార్డులు మరియు శాఖలను సూచిస్తుంది.
-
తల్లిదండ్రులకు సంబంధించిన సూచనలు సాధారణంగా చట్టపరమైన సంరక్షకులకు కూడా వర్తిస్తాయి.
బిషప్పు మరియు శాఖాధ్యక్షుడు పిలుపులు అధికారం మరియు బాధ్యతలలో సమానం కాదు, అదేవిధంగా స్టేకు అధ్యక్షుడు మరియు జిల్లా అధ్యక్షుడు పిలుపులు సమానం కాదు. బిషప్పు అనేది యాజకత్వములో ఒక స్థానము మరియు ఆ నియామకము ప్రథమ అధ్యక్షత్వము ద్వారా మాత్రమే అధికారం పొందుతుంది. స్టేకు అధ్యక్షులు, ప్రధాన అధికారులు మరియు ప్రాంతీయ డెబ్బదుల చేత పిలువబడతారు.
0.6
సంఘ ప్రధాన కార్యాలయం లేదా ప్రాంతీయ కార్యాలయమును సంప్రదించుట
ఈ చేతిపుస్తకములోని కొన్ని అధ్యాయాలలో సంఘ ప్రధాన కార్యాలయం లేదా ప్రాంతీయ కార్యాలయమును సంప్రదించడానికి అవసరమైన సూచనలు ఉన్నాయి. సంఘ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించాలనే సూచన సంయుక్త రాష్టాలు మరియు కెనడాలో ఉన్న వారికి వర్తిస్తుంది. ప్రాంతీయ కార్యాలయమును సంప్రదించాలనే సూచన సంయుక్త రాష్టాలు మరియు కెనడా వెలుపల ఉన్న వారికి వర్తిస్తుంది.