“యేసు క్రీస్తు సువార్తను జీవించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“యేసు క్రీస్తు సువార్తను జీవించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
16.
యేసు క్రీస్తు సువార్తను జీవించడం
రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క దేవుని కార్యము దైవికంగా నియమించబడిన నాలుగు బాధ్యతలపై దృష్టి పెడుతుంది (1.2 చూడండి). వీటిలో మొదటిది యేసు క్రీస్తు సువార్తను జీవించడం. ఇలా చేసినప్పుడు మనం సువార్తను జీవిస్తాము:
-
యేసు క్రీస్తు నందు విశ్వాసమును సాధన చేయడం.
-
రోజూ పశ్చాత్తాపపడడం.
-
మనము రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క విధులను పొందినప్పుడు దేవునితో నిబంధనలు చేయడం.
-
ఆ నిబంధనలను పాటించడం ద్వారా అంతము వరకు సహించడం.
సువార్తను జీవించడం రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యము యొక్క ఇతర అంశాలను కలిగి ఉంటుంది.