చేతి పుస్తకములు మరియు పిలుపులు
14. ఒంటరి సభ్యులు


“14. ఒంటరి సభ్యులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“14. ఒంటరి సభ్యులు,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

మాట్లాడుకుంటున్న జనులు

14.

ఒంటరి సభ్యులు

14.0

పరిచయము

వివాహం చేసుకోని లేదా విడాకులు తీసుకున్న లేదా వితంతువులు అయిన స్త్రీ పురుషులు సంఘ సభ్యత్వంలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్నారు. యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం ద్వారా అందరూ నిరీక్షణను కనుగొనడం చాలా ముఖ్యం (ఈథర్ 12:4 చూడండి). అటువంటి నిరీక్షణను పెంపొందించుకోవడానికి క్రింది నిత్య సత్యాలు సహాయపడగలవు:

  • సువార్త నిబంధనలను పాటించడంలో విశ్వాసపాత్రంగా ఉన్న ప్రతి ఒక్కరికీ ఉన్నతస్థితికి అవకాశం ఉంటుందని లేఖనాలు మరియు కడవరి దిన ప్రవక్తలు ధృవీకరిస్తున్నారు.

  • ఉన్నతస్థితి యొక్క దీవెనలు ఇవ్వబడే ఖచ్చితమైన సమయం మరియు విధానం అన్నీ బయలుపరచబడలేదు. అయితే అవి హామీ ఇవ్వబడ్డాయి (మోషైయ 2:41 చూడండి).

  • ప్రభువు కోసం వేచి ఉండటం అనేది ఆయన పట్ల నిరంతర విధేయత మరియు ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుంది (యెషయా 64:4 చూడండి).

  • దేవుడు తన పిల్లలందరికీ నిత్యజీవాన్ని అందజేస్తారు. రక్షకుని యొక్క దయతో కూడిన క్షమాపణకు అర్హత పొంది, ఆయన ఆజ్ఞలను పాటించే వారందరూ నిత్యజీవాన్ని పొందుతారు. (మోషైయ 26:30; మొరోనై 6:8 చూడండి.)

  • ఈ హామీలపై విశ్వాసం యేసు క్రీస్తుపై విశ్వాసంలో పాతుకుపోయింది. ఆయన దయతో, మర్త్యత్వానికి సంబంధించిన అన్ని విషయాలు సరిచేయబడ్డాయి (ఆల్మా 7:11–13 చూడండి).

వారి వారి వార్డులలో మరియు స్టేకులలో రక్షణ యొక్క కార్యములో సభ్యులందరి సహాయం ప్రభువుకు అవసరం (1 కొరింథీయులకు 12:12–27 చూడండి). ఆత్మ నిర్దేశించినట్లుగా, ఒంటరి సభ్యులు నాయకత్వం మరియు బోధనా స్థానాలకు పిలువబడతారు.

ఈ అధ్యాయంలో:

  • “ఒంటరి సభ్యులు” అనేది ప్రస్తుతం వివాహం చేసుకోని సంఘములోని పెద్దలందరినీ సూచిస్తుంది.

  • “ఒంటరి వయోజనులు” అనేది 18–30 సంవత్సరాల వయస్సు గల వారిని సూచిస్తుంది.

  • “ఒంటరి పెద్దలు” అనేది 31 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల వారిని సూచిస్తుంది.

14.1

భౌగోళిక విభాగంలోని ఒంటరి సభ్యులు

14.1.1

స్టేకు నాయకత్వము

14.1.1.2

స్టేకు ఒంటరి వయోజన మరియు ఒంటరి పెద్దల కమిటీలు

స్టేకు అధ్యక్షత్వము ఒంటరి వయోజన కమిటీని ఏర్పాటు చేస్తుంది.

స్టేకు అధ్యక్షత్వము ఒంటరి పెద్దల కమిటీని కూడా ఏర్పాటు చేయవచ్చు.

కమిటీలు స్నేహం ద్వారా, రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనే అవకాశాల ద్వారా సభ్యులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి (14.2 చూడండి).

14.1.2

వార్డు నాయకత్వము

14.1.2.1

బిషప్రిక్కు

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో ఒంటరి సభ్యులను నిమగ్నం చేయడానికి బిషప్రిక్కు కీలకం. వారు ఒంటరి సభ్యుల కోసం అర్థవంతమైన పిలుపులు మరియు నియామకాలను గుర్తించడానికి వార్డు సలహాసభతో కలిసి పని చేస్తారు. వారు ఒంటరి తల్లిదండ్రుల అవసరాలను గుర్తించి, సహాయం చేయడానికి కృషి చేస్తారు.

  • బిషప్రిక్కు సభ్యుడొకరు ప్రతీ ఒంటరి వయోజనుడిని కనీసం సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటారు.

  • బిషప్రిక్కు ఒక వార్డు ఒంటరి వయోజన కమిటీని ఏర్పాటు చేయవచ్చు.

14.1.2.2

ఒంటరి వయోజనుల కొరకు నియమించబడిన పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వ సభ్యులు

పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షులు ప్రతీ ఒక్కరు ఒంటరి వయోజనులకు మద్దతు ఇవ్వడానికి తమ అధ్యక్షత్వములో ఒక సభ్యుడిని నియమించవచ్చు. ఈ అధ్యక్షత్వ సభ్యులు ఒంటరి వయోజనుల బలాలను తెలుసుకుంటారు మరియు వారి అవసరాలను తీర్చడంలో సహాయం చేస్తారు.

పెద్దల సమూహ అధ్యక్షుడు మరియు ఉపశమన సమాజ అధ్యక్షురాలు ఈ ప్రయత్నాలపై వార్డు సలహాసభ సమావేశంలో నివేదించవచ్చు.

14.1.2.3

ఒంటరి వయోజన నాయకులు

చాలామంది ఒంటరి వయోజనులు ఉన్న వార్డులో, బిషప్రిక్కు ఒంటరి వయోజన పురుషుడిని మరియు స్త్రీని ఒంటరి వయోజన నాయకులుగా పిలువవచ్చు. వారి బాధ్యతలలో ఇవి ఉన్నాయి:

  • రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనేందుకు ఒంటరి వయోజనులకు సహాయం చేయడం (14.2 చూడండి).

  • స్టేకు ఒంటరి వయోజనుల కమిటీలో సేవ చేయడం.

  • వార్డు ఒంటరి వయోజన కమిటీ ఒకటి ఏర్పడితే దానికి నాయకత్వం వహించడం.

  • పెద్దల సమూహ అధ్యక్షత్వము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వముతో క్రమం తప్పకుండా కలుసుకోవడం. ఈ సమావేశాలలో, వారు ఒంటరి వయోజనుల బలాలు మరియు వారి అవసరాలను తీర్చడంలో ఎలా సహాయపడాలనే దానిపై చర్చిస్తారు. వారు ఒంటరి వయోజనులకు పరిచర్య చేయడంపై కూడా దృష్టిసారిస్తారు.

14.2

రక్షణ మరియు ఉన్నతస్థితి యొక్క కార్యములో పాల్గొనడం

14.2.1

యేసు క్రీస్తు సువార్తను జీవించడం

14.2.1.1

గృహ సాయంకాలము మరియు సువార్త అధ్యయనం

పాల్గొనాలనుకునే నాయకులు లేదా సభ్యులు ఒంటరి పెద్దల కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గృహ సాయంత్ర బృందాలను మరియు ఒంటరి వయోజనుల కోసం ఇతర బృందాలను నిర్వహించవచ్చు.

14.2.1.3

ప్రోత్సాహ కార్యక్రమాలు

వార్డు లేదా స్టేకు నాయకుల ఆధ్వర్యంలో, ఒంటరి వయోజనులు వారి కోసం ప్రత్యేకంగా ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయవచ్చు మరియు పాల్గొనవచ్చు. ఉదాహరణలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • దేవాలయ సందర్శనలు.

  • కుటుంబ చరిత్ర కార్యము.

  • సువార్తను పంచుకోవడం.

  • సమాజ సేవ.

  • సంగీత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు.

  • క్రీడలు.

స్టేకు నాయకుల ఆధ్వర్యంలో, ఒంటరి పెద్దలు స్టేకు స్థాయిలో ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలను ప్రణాళిక చేయవచ్చు.