“19. సంగీతము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“19. సంగీతము,”ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
19.
సంగీతము
19.1
సంఘములో సంగీతము యొక్క ఉద్దేశ్యం
పవిత్ర సంగీతం యేసు క్రీస్తుపై విశ్వాసాన్ని పెంచుతుంది. అది ఆత్మను ఆహ్వానిస్తుంది మరియు సిద్ధాంతాన్ని బోధిస్తుంది. అది భక్తి భావాన్ని సృష్టిస్తుంది, సభ్యులను ఏకం చేస్తుంది మరియు పరలోక తండ్రిని, యేసు క్రీస్తును ఆరాధించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది.
19.2
గృహములో సంగీతము
తన ప్రవక్తల ద్వారా, ప్రభువు వ్యక్తులు మరియు కుటుంబాలను వారి దైనందిన జీవితాల్లో ఉద్ధరించే సంగీతాన్ని ఉపయోగించమని ప్రోత్సహించారు.
సంఘ సంగీతం యొక్క రికార్డింగులు క్రింది వనరుల నుండి అందుబాటులో ఉన్నాయి:
-
పవిత్ర సంగీత యాప్
-
సువార్త గ్రంథాలయ యాప్
-
వద్ద CDలు store.ChurchofJesusChrist.org
19.3
సంఘ సమావేశాలలో సంగీతము
19.3.1
సంఘ సమావేశాల కోసం సంగీతాన్ని ప్రణాళిక చేయడం
ఆరాధన సేవల కోసం సంగీతాన్ని ప్రణాళిక చేయడానికి వార్డు మరియు స్టేకు సంగీత సమన్వయకర్తలు యాజకత్వ నాయకులతో కలిసి పని చేస్తారు. వారు సమావేశాలలో ఆరాధనా స్ఫూర్తిని పెంచే సంగీతాన్ని ఎంచుకుంటారు.
19.3.2
సంస్కార సమావేశములో సంగీతము
సంస్కార సమావేశములో సంగీతం సమావేశాన్ని ఆరంభించడానికి మరియు ముగించడానికి మరియు సంస్కార నిర్వహణకు ముందు సమ్మేళన కీర్తనలు పాడడాన్ని కలిపి ఉంటుంది. సంస్కార కీర్తన సంస్కారమును లేదా రక్షకుని త్యాగాన్ని సూచించాలి.
సమావేశానికి ముందు సభ్యులు సమకూడినప్పుడు ప్రారంభ సంగీతం వాయించబడుతుంది. ముగింపు ప్రార్థన తర్వాత, సభ్యులు సమావేశం నుండి బయటకు వెళ్లేటప్పుడు ముగింపు సంగీతం వాయించబడుతుంది.
ఒక సంస్కార సమావేశంలో సమావేశం మధ్యలో పాడే అదనపు సమ్మేళన కీర్తన కూడా ఉండవచ్చు—ఉదాహరణకు, ఇవ్వబడే సందేశాల మధ్యలో.
19.3.3
తరగతులు మరియు ఇతర వార్డు సమావేశాలలో సంగీతం
వారి బోధనను మెరుగుపరచడానికి కీర్తనలు మరియు ఇతర పవిత్ర సంగీతాన్ని ఉపయోగించమని నాయకులు బోధకులను ప్రోత్సహిస్తారు.
19.3.6
సంగీత వాయిద్యాలు
ప్రత్యక్ష వాయిద్యాలు సాధారణంగా ప్రారంభ మరియు ముగింపు సంగీతం కోసం మరియు సంఘ సమావేశాలలో కీర్తనకి తోడుగా ఉపయోగించబడతాయి. అవి ఎక్కడ అందుబాటులో ఉన్నా మరియు సభ్యులు వాటిని ఎక్కడ వాయించగలిగినా, ఆర్గాన్‌లు మరియు పియానోలు ప్రామాణిక వాయిద్యాలు. బిషప్రిక్కులు సమ్మేళన గానంతో పాటుగా, ప్రారంభ మరియు ముగింపు సంగీతం కోసం మరియు ఇతర సంగీత ఎంపికలలో ఇతర వాయిద్యాలను ఉపయోగించడాన్ని ఆమోదించవచ్చు.
పియానో, ఆర్గాన్ లేదా సహకార వాద్యకారుడు అందుబాటులో లేకుంటే, రికార్డింగులను ఉపయోగించవచ్చు (19.2 చూడండి).
19.3.7
గాయకబృందాలు
19.3.7.1
వార్డు గాయకబృందాలు
తగినంత మంది సభ్యులు ఉన్న చోట, వార్డులు క్రమం తప్పకుండా సంస్కార సమావేశంలో పాడే గాయక బృందాలను ఏర్పాటు చేయవచ్చు.
వార్డు గాయక బృందంతో పాటు, కుటుంబాలు మరియు స్త్రీలు, పురుషులు, యౌవనులు లేదా పిల్లల సమూహాలు సంఘ సమావేశాలలో పాడటానికి ఆహ్వానించబడవచ్చు.
19.4
వార్డులో సంగీత నాయకత్వం
19.4.1
బిషప్రిక్కు
వార్డు సంగీతం కొరకు బిషప్పు బాధ్యుడు. అతను తన సలహాదారుల్లో ఒకరికి ఈ బాధ్యతను అప్పగించవచ్చు.
19.4.2
వార్డు సంగీత సమన్వయకర్త
వార్డు సంగీత సమన్వయకర్త బిషప్రిక్కు ఆధ్వర్యంలో పనిచేస్తారు. అతను లేదా ఆమెకు ఈ క్రింది బాధ్యతలు ఉన్నాయి:
-
సంగీత విషయాలపై బిషప్రిక్కు మరియు ఇతర వార్డు నాయకులకు వనరుగా ఉండడం.
-
సంస్కార సమావేశాల కోసం సంగీతాన్ని ప్రణాళిక చేయడానికి బిషప్రిక్కుతో కలిసి పని చేయడం (19.3.1 మరియు 19.3.2 చూడండి).
-
బిషప్రిక్కు కోరినట్లుగా, వార్డు సంగీత పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను సిఫార్సు చేయడం. ఈ పిలుపులలో సేవ చేసే వారికి దిశానిర్దేశం చేయడం, అవసరమైన విధంగా మద్దతు, సూచన మరియు శిక్షణను అందజేయడం.
19.4.3
అదనపు పిలుపులు
బిషప్రిక్కు క్రింది పిలుపులలో సేవ చేయడానికి సభ్యులను పిలవవచ్చు.
19.4.3.1
వార్డు సంగీత నాయకుడు
సంగీత నాయకుడు సంస్కార సమావేశాల కోసం మరియు కోరిన విధంగా ఇతర వార్డు సమావేశాల కోసం సమ్మేళన కీర్తనలను నిర్వహిస్తారు.
19.4.3.2
వార్డు సహకార వాద్యకారుడు
వార్డు సహకార వాద్యకారుడు సంస్కార సమావేశము మరియు ఇతర వార్డు సమావేశాలలో కోరిన విధంగా ప్రారంభ మరియు ముగింపు సంగీతాన్ని, సహవాయిద్యాలను అందిస్తారు.
19.7
అదనపు విధానాలు మరియు మార్గదర్శకాలు
19.7.2
సమావేశమందిర వాయిద్యాలను సాధన, వ్యక్తిగత బోధన మరియు పఠనం కొరకు వాడటం
సహేతుకమైన ప్రత్యామ్నాయం లేనప్పుడు, సమావేశ మందిరములోని పియానోలు మరియు ఆర్గాన్‌లను సాధన కొరకు, చెల్లించిన వ్యక్తిగత బోధన కోసం మరియు సమావేశ మందిరమును ఉపయోగించే విభాగాల సభ్యులతో కూడిన పఠనాలకు ఉపయోగించడానికి యాజకత్వ నాయకులు అధికారం ఇవ్వవచ్చు.