“22. తాత్కాలిక అవసరాలను అందించడం మరియు స్వావలంబనను పెంపొందించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).
“22. తాత్కాలిక అవసరాలను అందించడం మరియు స్వావలంబనను పెంపొందించడం,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు
22.
తాత్కాలిక అవసరాలను అందించడం మరియు స్వావలంబనను పెంపొందించడం
22.0
పరిచయము
సంఘ సభ్యులు “ఒకరి భారములు ఒకరు భరించుటకు, … దుఃఖించు వారితో దుఃఖపడుటకు, … ఆదరణ యొక్క అవసరములో ఉన్నవారిని ఆదరించుటకు” (మోషైయ 18:8–9) నిబంధన చేస్తారు.
సంఘ సభ్యులు శ్రద్ధగా పని చేయడం ద్వారా మరియు ప్రభువు సహాయంతో వారి స్వంత స్వావలంబనను బలోపేతం చేసుకోవాలని కూడా ఉపదేశించబడ్డారు. స్వావలంబన అనేది మనకు మరియు కుటుంబానికి జీవితంలోని ఆధ్యాత్మిక మరియు తాత్కాలిక అవసరాలను అందించే సామర్థ్యం, నిబద్ధత మరియు కృషి.
వ్యక్తిగత మరియు కుటుంబ ప్రయత్నాలు
22.1
స్వావలంబనను పెంపొందించడం
ప్రభువు సహాయంతో, సభ్యులు ఈ క్రింది మార్గాల్లో స్వావలంబనను పెంపొందించుకుంటారు:
-
ఆధ్యాత్మిక, శారీరక మరియు భావోద్వేగ బలాన్ని పెంపొందించుకోవడం.
-
విద్య మరియు ఉపాధి పొందడం.
-
తాత్కాలిక సంసిద్ధతను మెరుగుపరచడం.
22.1.4
తాత్కాలిక సంసిద్ధత
లేఖనాలు సిద్ధపడటం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తాయి (యెహెజ్కేలు 38:7; సిద్ధాంతము మరియు నిబంధనలు 38:30 చూడండి). సభ్యులు తమను, తమ కుటుంబాలను మరియు ఇతరులను అవసరమైన సమయాల్లో చూసుకోవడానికి సిద్ధంగా ఉండాలని సలహా ఇవ్వబడ్డారు.
సభ్యులు తమ ఆర్థిక సంసిద్ధతను ఈ విధంగా పెంచుకుంటారు:
-
దశమభాగాలు మరియు అర్పణలు చెల్లించడం (మలాకీ 3:8–12 చూడండి).
-
సాధ్యమైనంత వరకు రుణాన్ని తీర్చివేయడం మరియు మానుకోవడం.
-
ఆదాయవ్యయాలను అంచనా వేయడం మరియు దానికి లోబడి జీవించడం.
-
భవిష్యత్తు కోసం పొదుపు చేయడం.
-
తమకు మరియు తమ కుటుంబాలకు సమకూర్చుకోవడంలో సహాయపడడానికి తగిన విద్యను పొందడం (22.3.3 చూడండి).
సంసిద్ధత అనేది అత్యవసర సమయంలో ప్రాథమిక అవసరాలను ఎలా తీర్చాలనే దానికి ప్రణాళికను వృద్ధి చేయడాన్ని కూడా కలిపియుంటుంది. ఆహారం, నీరు మరియు ఇతర అవసరాల యొక్క స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక సరఫరా రెండింటినీ ఏర్పాటు చేయడానికి సభ్యులు ప్రోత్సహించబడ్డారు.
22.2
తాత్కాలిక మరియు భావోద్వేగ అవసరాలలో ఉన్నవారికి పరిచర్య చేయండి
“ఒకరినొకరు ప్రేమించుకొనుటకు … పరిచర్య చేసుకొనుటకు మరియు … సహాయము అవసరమైన వారికి సహాయము చేయుటకు” ప్రభువు యొక్క శిష్యులు బోధించబడ్డారు (మోషైయ 4:15–16). ఇతరులను రక్షకుడు చూసే విధంగా చూడడానికి సభ్యులు కృషి చేస్తారు, వారి ప్రత్యేక బలాలు మరియు అవసరాలను అర్థం చేసుకుంటారు. ఈ అవసరాలలో ఆహారం, దుస్తులు, నివాసం, విద్య, ఉపాధి, శారీరక ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సు ఉండవచ్చు.
22.2.1
ప్రభువు యొక్క గిడ్డంగి
తాత్కాలిక అవసరాలు ఉన్నవారికి సహాయం చేయడానికి సంఘములో అందుబాటులో ఉన్న అన్ని వనరులను ప్రభువు యొక్క గిడ్డంగి అంటారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 82:18–19 చూడండి). అవసరమైన వారికి సహాయం చేయడానికి సభ్యులు అందించే సమయం, ప్రతిభ, కనికరము, వస్తువులు మరియు ఆర్థిక వనరులు వీటిలో ఉన్నాయి.
ప్రతీ వార్డు మరియు స్టేకులో ప్రభువు యొక్క గిడ్డంగి ఉంటుంది. వార్డు మరియు స్టేకు సభ్యులు అందించే జ్ఞానం, నైపుణ్యాలు మరియు సేవ ద్వారా తరచుగా వ్యక్తులు మరియు కుటుంబాలు వారి అవసరాలకు పరిష్కారాలను కనుగొనడంలో నాయకులు సహాయపడగలరు.
22.2.2
ఉపవాసము మరియు ఉపవాస కానుకల చట్టము
ప్రభువు తన ప్రజలను దీవించడానికి మరియు అవసరమైన వారికి సేవ చేయడానికి ఒక మార్గాన్ని అందించడానికి ఉపవాసము మరియు ఉపవాస కానుకల చట్టాన్ని స్థాపించారు. సభ్యులు ఉపవాస చట్టాన్ని జీవిస్తున్నప్పుడు ప్రభువుకు దగ్గరగా ఎదుగుతారు మరియు ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకుంటారు. (యెషయా 58:6–12; మలాకీ 3:8–12 చూడండి.)
ఉపవాసం ఎప్పుడైనా చేయవచ్చు. అయితే, సభ్యులు సాధారణంగా నెలలో మొదటి విశ్రాంతిదినమును ఉపవాస దినంగా పాటిస్తారు. ఉపవాస దినము సాధారణంగా క్రింది వాటిని కలిగి ఉంటుంది:
-
ప్రార్థన
-
24 గంటల సమయం ఆహారం మరియు పానీయాలు లేకుండా ఉండడం (శారీరకంగా సామర్థ్యం ఉంటే)
-
ఉదారమైన ఉపవాస కానుకను ఇవ్వడం
ఉపవాస కానుక అనేది అవసరమైన వారికి సహాయం చేయడానికి ఇచ్చే విరాళం. సభ్యులు ఉపవాసం ఉన్నప్పుడు, కనీసం వారు తినని భోజనం విలువకు సమానమైన కానుకను ఇవ్వమని ఆహ్వానించబడ్డారు.
సభ్యులు తమ ఉపవాస కానుకను మరియు పూర్తి చేసిన దశమభాగము మరియు ఇతర అర్పణల ఫారంను బిషప్పు లేదా అతని సలహాదారుల్లో ఒకరికి ఇవ్వవచ్చు. కొన్ని ప్రాంతాలలో, వారు తమ విరాళాలను ఆన్లైన్లో కూడా ఇవ్వవచ్చు.
నాయకుని ప్రయత్నాలు
22.3
స్వావలంబనను పెంపొందించడానికి మరియు అవసరమైన వారికి పరిచర్య చేయడానికి నమూనా
22.3.1
అవసరంలో ఉన్నవారిని వెతికి పట్టుకోవడం
అవసరంలో ఉన్నవారిని వారిని వెతికి పట్టుకుని, శ్రద్ధ చూపే పవిత్రమైన బాధ్యత బిషప్పుకు ఉంది. (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:112 చూడండి). ఈ బాధ్యతలో బిషప్పుకు సహాయం చేయడంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్న ఇతరులు:
-
పరిచర్య చేయు సహోదరులు మరియు సహోదరీలు.
-
ఉపశమన సమాజ మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు.
-
బిషప్పు యొక్క సలహాదారులు.
-
వార్డు సలహాసభలోని ఇతర సభ్యులు.
22.3.2
సభ్యుల స్వల్పకాలిక అవసరాలను అంచనా వేయడంలో మరియు పరిష్కరించడంలో సహాయపడండి
సభ్యులు తమ స్వంత ప్రయత్నాల ద్వారా మరియు సమీప బంధువుల నుండి సహాయం ద్వారా వారి ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది సరిపోనప్పుడు, సభ్యులకు ఈ క్రింద ఉన్న ఇతర వనరుల నుండి సహాయం అవసరం కావచ్చు:
-
ప్రభుత్వ మరియు సాంఘిక వనరులు (22.12 చూడండి).
-
సంఘ సహాయం.
సంఘ సహాయంలో ఆహారం, ఆరోగ్యరక్షణ వస్తువులు, దుస్తులు, ఇంటి అద్దె లేదా ఇతర ప్రాథమిక అవసరాలు వంటి స్వల్పకాలిక అవసరాలకు సహాయం ఉండవచ్చు. ఈ అవసరాలకు ప్రతిస్పందించడానికి బిషప్పులు ఉపవాస కానుకలను ఉపయోగించవచ్చు. బిషప్పు యొక్క ఆదేశాలు అందుబాటులో ఉన్న చోట, బిషప్పులు సాధారణంగా ఆహారం మరియు ఇతర ప్రాథమిక వస్తువులను అందించడానికి వాటిని ఉపయోగిస్తారు (“నాయకుడు మరియు గుమాస్తా వనరులు [ఎల్ సి ఆర్]” లో బిషప్పుల ఆదేశాలు మరియు సూచనలు చూడండి).
22.3.3
సభ్యులు దీర్ఘకాలిక స్వావలంబనను పెంపొందించడంలో సహాయపడండి
దీర్ఘకాలిక సవాళ్ళను పరిష్కరించడానికి సభ్యులకు కొనసాగుతున్న మద్దతు అవసరం కావచ్చు. విద్య, వృత్తిపరమైన శిక్షణ లేదా ఇతర వనరులు వారికి స్వావలంబనను పెంపొందించడంలో సహాయపడగలవు మరియు వారి దీర్ఘకాలిక అవసరాలను తీర్చగలవు.
స్వావలంబన ప్రణాళిక వారి బలాలు మరియు అవసరాలను గుర్తించడంలో సభ్యులకు సహాయపడుతుంది. ఇది ఉపయోగకరమైన వనరులను గుర్తించడంలో కూడా వారికి సహాయపడుతుంది. సంఘ సహాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రతిసారీ ఈ ప్రణాళికను ఉపయోగించాలి.
22.3.4
భావోద్వేగ అవసరాలలో ఉన్నవారికి పరిచర్య చేయండి
చాలామంది సభ్యులు భావోద్వేగ సవాళ్ళను ఎదుర్కొంటారు. ఈ సవాళ్ళలో సభ్యులకు సహాయం చేయడానికి పరిచర్య చేసే సహోదర సహోదరీలు మరియు వార్డు నాయకులు సాధనంగా ఉండగలరు.
22.4
సంఘ సహాయాన్ని అందించడానికి సూత్రాలు
ప్రభువు సహాయంతో, సభ్యులు తమకు మరియు తమ కుటుంబాలకు సమకూర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.
సంఘ సహాయం అనేది సభ్యులు స్వతంత్రతను అభివృద్ధి చేయడంలో సహాయపడడానికి ఉద్దేశించబడింది, ఆధారపడడానికి కాదు. అందించబడిన ఏ సహాయమైనా స్వావలంబన కలిగియుండడానికి వారి ప్రయత్నాలలో సభ్యులను బలోపేతం చేయాలి.
22.4.1
వ్యక్తిగత మరియు కుటుంబ బాధ్యతను ప్రోత్సహించండి
వ్యక్తులు మరియు కుటుంబాలు వారి స్వంత తాత్కాలిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం ప్రాథమిక బాధ్యత కలిగి ఉంటారని నాయకులు బోధిస్తారు.
సంఘ సహాయాన్ని అందించే ముందు, బిషప్పు (లేదా అతను నియమించిన మరొక నాయకుడు లేదా సభ్యుడు) వారి స్వంత అవసరాలను తీర్చడానికి వారు ఏ వనరులను ఉపయోగిస్తున్నారో సభ్యులతో సమీక్షిస్తారు.
22.4.2
ఆవశ్యకమైన అవసరాల కోసం తాత్కాలిక సహాయాన్ని అందించండి
సంఘ సహాయం యొక్క లక్ష్యం సభ్యులు స్వావలంబనగా మారడానికి ప్రయత్నిస్తుండగా, వారి ప్రాథమిక అవసరాలను తాత్కాలికంగా తీర్చడం.
బిషప్పులు మంచి విచక్షణతో వ్యవహరించాలి మరియు అందించిన సహాయం యొక్క మొత్తాన్ని, వ్యవధిని పరిగణనలోకి తీసుకునేటప్పుడు ఆధ్యాత్మిక నిర్దేశాన్ని వెదకాలి. ఆధారపడడాన్ని సృష్టించకుండా వారు కనికరంగా మరియు ఉదారంగా ఉండాలి.
22.4.3
నగదు కంటే వనరులు లేదా సేవలను అందించండి
వీలైతే, బిషప్పు నగదు ఇవ్వకుండా ఉండాలి. బదులుగా, అతను సభ్యులకు కిరాణా సరుకులను లేదా సేవలను అందించడానికి ఉపవాస కానుకలు లేదా బిషప్పుల ఆదేశాలను ఉపయోగించాలి. అప్పుడు సభ్యులు ఇతర అవసరాలకు చెల్లించడానికి వారి స్వంత డబ్బును ఉపయోగించవచ్చు.
ఇది సరిపోనప్పుడు, బిషప్పు అత్యవసరమైన బిల్లులను తాత్కాలికంగా చెల్లించడానికి ఉపవాస కానుకలను ఉపయోగించడం ద్వారా సహాయం చేయవచ్చు (22.5.2 చూడండి).
22.4.4
పని లేదా సేవా అవకాశాలను ప్రతిపాదించండి
సహాయం పొందిన వారిని తమ సామర్థ్యం మేరకు పని చేయడానికి లేదా సేవ చేయడానికి బిషప్పులు ఆహ్వానిస్తారు. ఇది సభ్యులు గౌరవ భావాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది. ఇది వారి స్వావలంబన సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
22.4.5
సంఘ సహాయం గురించి సమాచారాన్ని గోప్యంగా ఉంచండి
సంఘ సహాయం అవసరమయ్యే సభ్యులకు సంబంధించిన సమాచారాన్ని బిషప్పు మరియు ఇతర వార్డు నాయకులు గోప్యంగా ఉంచుతారు. ఇది సభ్యుల గోప్యత మరియు గౌరవాన్ని కాపాడుతుంది.
22.5
సంఘ సహాయాన్ని అందించడానికి విధానాలు
ఆహారం మరియు ఇతర ప్రాథమిక వస్తువుల కోసం ఉపవాస కానుకలు లేదా బిషప్పుల ఆదేశాల ద్వారా సహాయం అందించేటప్పుడు సంఘ నాయకులు ఈ విభాగంలో వివరించిన విధానాలను అనుసరించాలి.
22.5.1
సంఘ సహాయం గ్రహీతలకు సంబంధించిన విధానాలు
22.5.1.1
వార్డు సభ్యులకు సహాయం
సాధారణంగా, సంఘ సహాయం పొందిన సభ్యులు వార్డు సరిహద్దుల్లో నివసించాలి మరియు వార్డులో వారి సభ్యత్వ రికార్డును కలిగి ఉండాలి. సభ్యుడు క్రమం తప్పకుండా సంఘ సమావేశాలకు హాజరవుతున్నాడా లేదా సంఘ ప్రమాణాలను అనుసరిస్తున్నాడా అనే దానితో సంబంధం లేకుండా సహాయం అందించబడవచ్చు.
22.5.1.2
బిషప్పులు మరియు స్టేకు అధ్యక్షులకు సహాయం
బిషప్పు తనకు లేదా తన కుటుంబానికి బిషప్పు యొక్క ఆదేశాన్ని లేదా ఉపవాస కానుకలను ఉపయోగించడానికి లేదా ఆమోదించడానికి ముందు స్టేకు అధ్యక్షుని యొక్క వ్రాతపూర్వక ఆమోదం అవసరం.
22.5.1.4
సంఘ సభ్యులు కాని వ్యక్తులకు సహాయం
సంఘములో సభ్యులు కాని వ్యక్తులు సాధారణంగా సహాయం కోసం స్థానిక సాంఘిక వనరులకు సూచించబడతారు. అరుదైన సందర్భాలలో, ఆత్మచే మార్గనిర్దేశం చేయబడినట్లుగా, బిషప్పు వారికి ఉపవాస కానుకలు లేదా బిషప్పు యొక్క ఆదేశాలతో సహాయం చేయవచ్చు.
22.5.2
ఉపవాస కానుకలను ఉపయోగించడంపై విధానాలు
22.5.2.1
వైద్య లేదా ఇతర ఆరోగ్య సంరక్షణ
ప్రతి సంఘ ప్రాంతము వైద్య, దంత లేదా మానసిక ఆరోగ్య ఖర్చులను చెల్లించడానికి ఉపవాస కానుకలను ఉపయోగించడం కోసం ఆమోద పరిమితులను ఏర్పాటు చేసింది.
ఆమోద మొత్తాలు మరియు మార్గదర్శకాల కోసం, “Use of Fast Offerings for Medical Expenses [వైద్య ఖర్చుల కోసం ఉపవాస కానుకలను ఉపయోగించడం]” చూడండి.
22.5.2.3
ఉపవాస కానుకలు తిరిగి చెల్లించడం
సభ్యులు సంఘము నుండి పొందే ఉపవాస కానుకల సహాయాన్ని తిరిగి చెల్లించరు.
22.5.2.4
వార్డు ఉపవాస కానుకల ఖర్చు మొత్తాలు
బిషప్పులు వార్డు సభ్యుల కోసం ఉపవాస కానుకల సహాయాన్ని వార్డులో సేకరించిన విరాళాల మొత్తానికి పరిమితం చేయవలసిన అవసరం లేదు.
22.5.3
చెల్లింపులు చేయడంపై విధానాలు
వీలైతే, వస్తువులు మరియు సేవలను అందించే వ్యాపారాలకు నేరుగా చెల్లింపులు చేయాలి.
22.5.4
బిషప్పు లేదా స్టేకు అధ్యక్షుడికి ప్రయోజనం చేకూర్చే చెల్లింపులపై విధానాలు
ఉపవాస కానుకలతో సభ్యులకు సహాయాన్ని అందించేటప్పుడు, బిషప్పు తనకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూర్చే విధంగా వస్తువులు లేదా సేవలకు చెల్లించడానికి నిధులను ఉపయోగించకూడదు.
సభ్యునికి ఉపవాస కానుకతో చేసే చెల్లింపు స్టేకు అధ్యక్షుడికి లేదా అతను కలిగి ఉన్న వ్యాపారానికి ప్రయోజనం చేకూర్చినట్లయితే, ప్రాంతీయ అధ్యక్షత్వ ఆమోదం అవసరం.
22.6
వార్డు నాయకుల పాత్రలు
22.6.1
బిషప్పు మరియు అతని సలహాదారులు
తాత్కాలిక అవసరాలు ఉన్నవారిని వెదకడానికి మరియు శ్రద్ధ వహించడానికి బిషప్పుకు దైవిక ఆదేశం ఉంది (సిద్ధాంతము మరియు నిబంధనలు 84:112 చూడండి). అతను ఈ పనిలో ఎక్కువ భాగాన్ని ఉపశమన సమాజము మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములకు అప్పగిస్తాడు. అయితే, కొన్ని విధులను బిషప్పు మాత్రమే నిర్వహిస్తారు. ఉదాహరణకు, బిషప్పు:
-
అందించబడిన తాత్కాలిక సహాయం యొక్క రకం, మొత్తం మరియు వ్యవధిని నిర్ణయిస్తారు.
-
ఆహారం మరియు ఇతర ప్రాథమిక వస్తువుల కోసం ఉపవాస కానుకల సహాయాన్ని (22.4 మరియు 22.5 చూడండి) మరియు బిషప్పుల ఆదేశాలను (22.13 చూడండి) ఆమోదిస్తారు.
-
సభ్యుల స్వావలంబన ప్రణాళికలను వ్యక్తిగతంగా సమీక్షిస్తారు. అతను అవసరమైన విధంగా ఆ ప్రణాళికల గురించి తెలుసుకోవడానికి ఇతర వార్డు నాయకులను నియమిస్తాడు.
బిషప్పు మరియు అతని సలహాదారులు క్రింది బాధ్యతలను కలిగి ఉన్నారు:
-
(1) తాత్కాలిక మరియు భావోద్వేగ అవసరాలు ఉన్నవారి పట్ల శ్రద్ధ వహించడం మరియు (2) స్వావలంబనను పెంపొందించడానికి సంబంధించిన సూత్రాలు మరియు దీవెనలను బోధించడం (22.1 చూడండి).
-
ఉపవాస చట్టాన్ని బోధించడం మరియు ఉదారంగా ఉపవాస కానుకలను ఇవ్వమని సభ్యులను ప్రోత్సహించడం (22.2.2 చూడండి).
-
ఉపవాస కానుకల సేకరణ మరియు లెక్కింపును పర్యవేక్షించడం (34.3.2 చూడండి).
22.6.2
ఉపశమన సమాజ మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు
బిషప్పు ఆధ్వర్యంలో, ఉపశమన సమాజ మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములు వార్డులో అవసరమైన వారిని చూసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు (8.2.2 మరియు 9.2.2 చూడండి). ఈ నాయకులు వార్డు సభ్యులకు ఇలా బోధిస్తారు:
-
అవసరాలలో ఉన్నవారికి పరిచర్య చేయండి.
-
ఉపవాస చట్టాన్ని జీవించండి.
-
స్వావలంబనను పెంపొందించుకోండి.
-
వ్యక్తిగత మరియు కుటుంబ సంసిద్ధతను పెంచుకోండి.
22.6.3
పరిచర్య చేయు సహోదరులు మరియు సహోదరీలు
ఆధ్యాత్మిక మరియు తాత్కాలిక అవసరాలకు సహాయం చేయడం తరచుగా పరిచర్య చేయు సహోదరులు మరియు సహోదరీల ద్వారా ప్రారంభమవుతుంది (21.1 చూడండి). వారు సేవ చేసే వారి అవసరాలను వారి పెద్దల సమూహ లేదా ఉపశమన సమాజ అధ్యక్షత్వములకు పరిచర్య మౌఖికాలలో మరియు ఇతర సమయాల్లో వారు నివేదిస్తారు. గోప్యమైన అవసరాలను వారు నేరుగా బిషప్పుతో పంచుకోవచ్చు.
22.7
వార్డు సలహాసభ యొక్క పాత్ర
వార్డు సలహాసభ యొక్క ముఖ్యపాత్ర ఏమిటంటే, అవసరమైన వారిని చూసుకోవడానికి మరియు వారు స్వావలంబన సాధించడంలో సహాయపడడానికి ప్రణాళిక చేయడం (4.4 చూడండి). పరిచర్య మౌఖికాల నుండి మరియు అవసరంలో ఉన్న వారితో వారి స్వంత వ్యక్తిగత పరిచయాల నుండి లభించిన సమాచారంపై ఆధారపడి సలహాసభ సభ్యులు ఈ ప్రణాళికలను చేస్తారు. సభ్యుల అవసరాలను చర్చించడంలో, గోప్యతను అభ్యర్థించే వారి కోరికలను సలహాసభ గౌరవిస్తుంది.
22.8
వార్డు యువజన సలహాసభ యొక్క పాత్ర
వార్డు యువజన సలహాసభ యొక్క పాత్ర ఏమిటంటే, యేసు క్రీస్తు యొక్క పవిత్ర అనుచరులుగా మారడంలో యౌవనులకు సహాయం చేయడం (29.2.6 చూడండి).
బిషప్రిక్కు యొక్క మార్గదర్శకత్వంలో, వార్డు యువజన సలహాసభ వారి వార్డులో మరియు సమాజములో అవసరమైన వారికి సేవ చేయడానికి మార్గాలను ప్రణాళిక చేస్తుంది.