చేతి పుస్తకములు మరియు పిలుపులు
25. వార్డు మరియు స్టేకులో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము


“25. వార్డు మరియు స్టేకులో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు (2023).

“25. వార్డు మరియు స్టేకులో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము,” ప్రధాన చేతిపుస్తకము నుండి ఎంపికలు

దేవాలయము

25.

వార్డు మరియు స్టేకులో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము

25.0

పరిచయము

దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము అనేది నిత్యత్వము కోసం కుటుంబాలను ఏకం చేయడానికి మరియు ముద్రవేయడానికి సాధనం (మత్తయి 16:19 చూడండి). ఈ కార్యము వీటిని కలిగి ఉంటుంది:

మరింత సమాచారం “దేవాలయాలు” మరియు“కుటుంబ చరిత్ర” (సువార్త అంశాలు, topics.ChurchofJesusChrist.org) వద్ద లభ్యమవుతుంది.

25.1

దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యములో సభ్యుడు మరియు నాయకుడు పాల్గొనడం

సంఘ సభ్యులకు తమ కుటుంబాలను నిత్యత్వము కోసం ఏకం చేయడంలో సహాయపడే హక్కు మరియు బాధ్యత ఉంది. దేవాలయ విధులను పొందినప్పుడు వారు నిబంధనలను చేయడానికి తమనుతాము సిద్ధం చేసుకుంటారు మరియు వారు ఆ నిబంధనలను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు.

దేవాలయ విధులు పొందకుండా మరణించిన తమ బంధువులను గుర్తించమని సంఘ సభ్యులు ప్రోత్సహించబడ్డారు. అప్పుడు సభ్యులు ఆ బంధువుల తరఫున విధులను నిర్వహిస్తారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 128:18 చూడండి). ఆత్మ లోకంలో, మరణించిన వ్యక్తులు వారి కోసం చేసిన విధులను అంగీకరించడానికి లేదా తిరస్కరించడానికి ఎంచుకోవచ్చు.

25.1.1

దేవాలయ హాజరు కొరకు వ్యక్తిగత బాధ్యత

దేవాలయంలో ఎప్పుడు మరియు ఎంత తరచుగా ఆరాధన చేయాలో సభ్యులు స్వయంగా నిర్ణయిస్తారు. నాయకులు దేవాలయ హాజరు కోసం వంతులు లేదా నివేదించే వ్యవస్థలను ఏర్పాటు చేయరు.

25.2

వార్డులో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యమును నిర్వహించడం

25.2.1

బిషప్రిక్కు

వారు వార్డు యొక్క దేవాలయము మరియు కుటుంబ చరిత్ర ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తుండగా, బిషప్రిక్కు పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములతో సమన్వయం చేసుకుంటారు. ఈ నాయకులు క్రమం తప్పకుండా సలహాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

బిషప్రిక్కు‌కి వార్డులో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము కోసం క్రింది బాధ్యతలు కూడా ఉన్నాయి:

  • దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము యొక్క సిద్ధాంతం మరియు దీవెనలు సంఘములో బోధించబడుతున్నాయని నిర్ధారించుకోవడం.

  • వార్డు సలహాసభ మరియు వార్డు యువజన సలహాసభ సమావేశాలలో దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యము సమన్వయం చేయబడిందని నిర్ధారించుకోవడం.

  • దేవాలయ సిద్ధపాటు పాఠ్యక్రమాల నిర్వహణను పర్యవేక్షించడం (25.2.8 చూడండి).

  • దేవాలయ సిఫారసులను జారీ చేయడం (26వ అధ్యాయం చూడండి).

25.2.2

పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు

పెద్దల సమూహము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములు వార్డులో రోజువారీ దేవాలయం మరియు కుటుంబ చరిత్ర ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తారు (8.2.4 మరియు 9.2.4 చూడండి). బిషప్పు సమన్వయంతో వార్డు సలహాసభతో కలిసి ఈ ప్రయత్నాలకు నాయకత్వం వహించడానికి వారు కలిసి పని చేస్తారు.

ఈ నాయకులకు ఈ క్రింది బాధ్యతలు ఉన్నాయి:

  • దేవాలయ విధులను పొందడానికి మరియు దేవాలయ నిబంధనలను చేయడానికి సిద్ధపడేందుకు సభ్యులకు సహాయం చేయడం.

  • వారి పరిస్థితులు అనుమతించినంత తరచుగా దేవాలయంలో ఆరాధించమని సభ్యులను ప్రోత్సహించడం.

  • వారి పూర్వీకుల గురించి తెలుసుకోవడానికి మరియు వారి తరఫున దేవాలయ విధులను నిర్వహించడానికి సభ్యులను ప్రోత్సహించడం.

  • వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడి కార్యమును నడిపించడం. ఈ నాయకుడు పిలువబడకపోతే, పెద్దల సమూహ అధ్యక్షత్వములోని సభ్యుడు ఈ పాత్రను పూర్తి చేస్తాడు (25.2.3 చూడండి).

పెద్దల సమూహ అధ్యక్షుడు మరియు ఉపశమన సమాజ అధ్యక్షురాలు ప్రతీఒక్కరు అధ్యక్షత్వ సభ్యులొకరిని వార్డులో దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యమును నడిపించడంలో సహాయపడేందుకు నియమిస్తారు. ఈ రెండు అధ్యక్షత్వముల సభ్యులు కలిసి పని చేస్తారు. వారు వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సమన్వయ సమావేశాలకు హాజరవుతారు (25.2.7 చూడండి).

25.2.3

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడు

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడిని పిలవాలో లేదో నిర్ణయించడానికి బిషప్రిక్కు స్టేకు అధ్యక్షుడితో సంప్రదింపులు జరుపుతారు. ఈ వ్యక్తి మెల్కీసెదెకు యాజకత్వము కలిగి ఉండాలి.

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడు పెద్దల సమూహ అధ్యక్షత్వము మరియు ఉపశమన సమాజ అధ్యక్షత్వములకు వారి దేవాలయం మరియు కుటుంబ చరిత్ర బాధ్యతలలో మద్దతు ఇస్తారు. అతను ఈ క్రింది బాధ్యతలను కూడా కలిగి ఉన్నాడు:

  • వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సమన్వయ సమావేశాలను నడిపించడం (25.2.7 చూడండి).

  • వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సలహాదారులకు సూచనలివ్వడం. దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యములో సభ్యులకు సహాయం చేయడానికి వారి ప్రయత్నాలను సమన్వయం చేయడం.

  • సువార్త నేర్చుకునే వారికి, క్రొత్త సభ్యులకు మరియు తిరిగి వచ్చే సభ్యులకు దేవాలయము మరియు కుటుంబ చరిత్ర కార్యములో నిమగ్నమవ్వడానికి సహాయపడేందుకు వార్డు మిషను నాయకుడు మరియు సువార్తికులతో కలిసి పని చేయడం.

25.2.4

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సలహాదారులు

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సలహాదారులు వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడు లేదా ఈ పాత్రను పూరించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుని ఆధ్వర్యంలో పనిచేస్తారు. బిషప్రిక్కు ఈ సభ్యులను సేవ చేయడానికి పిలుస్తారు. పెద్దలు మరియు యౌవనులు పిలువబడవచ్చు.

సలహాదారులకు ఈ క్రింది బాధ్యతలు ఉంటాయి:

  • తమ పూర్వీకులను కనుగొనడం మరియు వారి తరఫున దేవలయ విధులను చేయడం వంటి దీవెనలను అనుభవించడంలో సభ్యులకు సహాయపడడం.

  • దేవాలయ విధులను పొందడానికి మరియు దేవాలయ నిబంధనలను చేయడానికి సిద్ధపడేందుకు సభ్యులకు సహాయం చేయడం.

  • దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సమన్వయ సమావేశాలలో పాల్గొనడం (25.2.7 చూడండి).

25.2.7

వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సమన్వయ సమావేశాలు

సంక్షిప్త అనధికారిక వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సమన్వయ సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయి. ఒక వార్డు దేవాలయం మరియు కుటుంబ చరిత్ర నాయకుడు పిలువబడితే, అతను ఈ సమావేశాలను నిర్వహిస్తాడు. లేనిచో, ఈ పాత్రను పూరించే పెద్దల సమూహ అధ్యక్షత్వ సభ్యుడు నిర్వహిస్తాడు.

ఆహ్వానించబడే ఇతరులు:

  • ఉపశమన సమాజ మరియు పెద్దల సమూహ అధ్యక్షత్వములలో నియమించబడిన సభ్యులు.

  • యాజకుల సమూహములో సహాయకుడు.

  • పెద్ద వయస్సుగల యువతుల తరగతికి చెందిన అధ్యక్షత్వ సభ్యురాలు.

  • దేవాలయం మరియు కుటుంబ చరిత్ర సలహాదారులు.

ఈ సమావేశాల ఉద్దేశ్యం:

  • కోరిన విధంగా నిర్దిష్ట వార్డు సభ్యులకు వారి దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యములో ఎలా సహాయం చేయాలో ప్రణాళిక చేయడం.

ఈ సమావేశాలు వ్యక్తిగతంగా లేదా దూరము‌గా నిర్వహించబడవచ్చు. ఫోన్ కాల్‌లు, టెక్స్ట్‌లు మరియు ఈ-మెయిల్‌లతో సహా ఇతర మార్గాల్లో కూడా సమన్వయం జరగవచ్చు.

25.2.8

దేవాలయ సిద్ధపాటు పాఠ్యక్రమం

దేవాలయ విధులను పొందినప్పుడు సభ్యులు నిబంధనలను చేయడానికి సిద్ధం కావడానికి బిషప్పు యొక్క నిర్దేశంలో దేవాలయ సిద్ధపాటు పాఠ్యక్రమము నిర్వహించబడవచ్చు. ఈ పాఠ్యక్రమాలు సాధారణ ఆదివారం సమావేశాలలో కాకుండా సభ్యులకు అనుకూలమైన సమయంలో నిర్వహించబడతాయి. వాటిని సమావేశమందిరములో లేదా గృహములో నిర్వహించవచ్చు.

పాఠ్యక్రమమును నిర్వహించడానికి పాఠాలు మరియు సూచనలు Endowed from on High: Temple Preparation Seminar Teacher’s Manual లో ఉన్నాయి. పాల్గొనేవారికి Preparing to Enter the Holy Temple ప్రతులు ఇవ్వబడతాయి. వ్యక్తిగత అధ్యయనం మరియు పాఠ్య వనరుల కోసం temples.ChurchofJesusChrist.org చూడండి.

25.4

కుటుంబ చరిత్ర వనరులు

25.4.1

My Family: Stories That Bring Us Together [నా కుటుంబం: మమ్మల్ని ఒకచోట చేర్చే కథలు]

My Family: Stories That Bring Us Together [నా కుటుంబం: మమ్మల్ని ఒకచోట చేర్చే కథలు] బంధువులను, పూర్వీకులను కనుగొనడంలో మరియు వారి వివరాలను సేకరించడంలో వ్యక్తులకు సహాయపడతాయి. దేవాలయ విధుల కోసం ఇంటి పేర్లను సిద్ధం చేయడంలో సభ్యులకు ఈ చిన్నపుస్తకం సహాయపడుతుంది.

చిన్నపుస్తకాన్ని ChurchofJesusChrist.org వద్ద డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భౌతిక ప్రతులను store.ChurchofJesusChrist.org వద్ద ఆర్డరు చేయవచ్చు.

25.4.2

FamilySearch.org and FamilySearch Apps

FamilySearch.org దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యము కోసం సంఘము యొక్క వెబ్‌సైట్. ఇది వినియోగదారులకు ఇలా సహాయపడగలదు:

  • వంశవృక్ష సంబంధాలను మరియు బంధుత్వములను నిర్మించడానికి.

  • పూర్వీకులను, వారి కథలను కనుగొనడానికి.

  • కుటుంబ కథలు, ఛాయాచిత్రాలు మరియు చరిత్రలను పంచుకోవడానికి మరియు సంరక్షించడానికి.

  • దేవాలయ విధుల కోసం ఇంటి పేర్లను సిద్ధం చేయడానికి.

FamilySearch Tree app మరియు FamilySearch Memories app ప్రజలు మొబైల్ పరికరాల నుండి దేవాలయం మరియు కుటుంబ చరిత్ర కార్యములో పాల్గొనేలా చేస్తాయి.

25.5

దేవాలయ సిబ్బందిని సిఫార్సు చేయడం మరియు పిలవడం

25.5.1

దేవాలయ సిబ్బందిని సిఫార్సు చేయడం

సమర్థవంతమైన దేవాలయ సిబ్బంది ఈ క్రింది మార్గాల్లో గుర్తించబడతారు:

  • బిషప్పు లేదా మరొక వార్డు నాయకుడు గుర్తించిన సభ్యులు

  • సేవ చేయడం గురించి బిషప్పు‌ను సంప్రదించే సభ్యులు

  • దేవాలయ అధ్యక్షుడు, దేవాలయ సంరక్షకురాలు లేదా మరొక దేవాలయ నాయకుడు సిఫార్సు చేసిన సభ్యులు

  • సువార్తసేవకు సిద్ధమవుతున్న లేదా దాని నుండి ఇటీవల తిరిగి వచ్చిన సభ్యులు (24వ అధ్యాయం చూడండి)

Recommend Temple Worker tool ఉపయోగించి సమర్థవంతమైన దేవాలయ సిబ్బంది పేర్లు సమర్పించబడతాయి. ఈ సాధనం బిషప్పు‌లు, స్టేకు అధ్యక్షులు మరియు దేవాలయ అధ్యక్షులకు అందుబాటులో ఉంటుంది.