సర్వసభ్య సమావేశము
అంగీకరించుటకు, అనుసరించుటకు తగ్గించుకొనుట
2023 అక్టోబరు సర్వసభ్య సమావేశము


అంగీకరించుటకు, అనుసరించుటకు తగ్గించుకొనుట

దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉండాలంటే తగ్గింపు తప్పనిసరైనది.

ఆల్మా ఐదవ అధ్యాయములో, ఆత్మపరిశీలన చేసే ప్రశ్న అడగబడింది: “ఈ సమయమును మరణించుటకు మీరు పిలువబడిన యెడల మీయందు మీరు తగినంతగా తగ్గింపు కలిగియన్నారని మీరు చెప్పగలరా?”1 దేవుని సన్నిధికి తిరిగి వెళ్ళడానికి మనము సిద్ధంగా ఉండాలంటే తగ్గింపు తప్పనిసరి అని ఆ ప్రశ్న సూచిస్తుంది.

మనం తగినంత వినయంగా ఉన్నామని ఆలోచించడానికి మనమందరం ఇష్టపడతాము, కానీ ఈ జీవితంలో కొన్ని అనుభవాలు ప్రకృతిసంబంధియైన గర్వముగల పురుషుడు లేదా స్త్రీ తరచుగా మనలోపల బ్రతికియున్నాడని మనం గ్రహించునట్లు చేస్తాయి

సంవత్సరాల క్రితం, మా ఇద్దరు కుమార్తైలు ఇంకా మాతో ఇంట్లోనే ఉన్నప్పుడు, నేను పని చేస్తున్న కంపెనీలో నేను అధికారిగా ఉన్న వ్యాపార విభాగాన్ని వారికి, నా భార్యకు చూపించాలని నేను నిర్ణయించుకున్నాను.

నా అసలు ఉద్దేశ్యం ఏమిటంటే, మా ఇంటిలా కాకుండా, నన్ను ప్రశ్నించకుండా ప్రతిఒక్కరు నేను అడిగిన పనిని ఖచ్చితంగా చేసే ప్రదేశాన్ని వారికి చూపించడం. మేము మొదటి ద్వారము సమీపించినప్పుడు, అది సాధారణంగా నా కారు సమీపించగానే యాంత్రికంగా తెరవబడుతుంది, ఈసారి అది తెరవబడకపోవడం నేను ఆశ్చర్యపడ్డాను. బదులుగా, నా జీవితంలో నేను ముందు ఎన్నడూ చూడని ఒక సెక్యూరిటీ గార్డు కారు వద్దకు వచ్చి, నా కంపెనీ గుర్తింపు ఐడీ చూపించమని నన్ను అడిగాడు.

నేను నా కారుతో లోపలికి వెళ్లడానికి నాకు ఎప్పుడూ గుర్తింపు అవసరం లేదని అతడితో చెప్పాను, తరువాత అచ్చమైన గర్వముగల ప్రశ్నను అతడిని అడిగాను: “నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా?”

దానికతడు “సరే, మీ దగ్గర మీ కంపెనీ గుర్తింపు లేనందున, మీరు ఎవరో నాకు తెలియదు, మరియు నేను ఈ గేట్‌లో ఉన్నప్పుడు సరైన గుర్తింపు లేకుండా మీరు ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు” అని జవాబిచ్చాడు.

నేను రేర్ వ్యూ అద్దమువైపు చూసి నా కుమార్తైల స్పందనను చూడాలనుకున్నాను, కానీ నా కుమార్తైలు ఆ క్షణంలో ప్రతి క్షణమును ఆస్వాదిస్తున్నారని నేనెరుగుదును! నా ప్రక్కనున్న నా భార్య నా ప్రవర్తనను అనుమతించనట్లు తన తలను ఊపింది. నా చివరి ప్రత్యమ్నాయం గార్డుకు క్షమాపణ చెప్పి, అతడిని సరిగా చూడనందుకు చాలా విచారిస్తున్నానని చెప్పుట. “మీరు క్షమించబడ్డారు,” “కాని కంపెనీ గుర్తింపు ఐడి లేకుండా, మీరు ఈరోజు లోపలికి రాలేరు,” అని అతడు అన్నాడు.

తరువాత ఈ విలువైన పాఠమును నేర్చుకొని నా గుర్తింపు ఐడి తేవడానికి నేను నెమ్మదిగా ఇంటికి తిరిగి వెళ్ళాను: మనము వినయంగా ఉండకూడదని నిర్ణయించుకున్నప్పుడు, చివరికి మనం అవమానించబడతాము.

సామెతలలో మనము కనుగొంటాము, “ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనొందును.”2 వినయమును వృద్ధి చేయడానికి బదులుగా, మనము సువార్త యొక్క భావనలో నిజముగా దాని అర్ధమేమిటో తప్పక గ్రహించాలి.

కొందరు జనులు వినయంగా ఉండుట అనగా ఉదాహరణకు, పేదవారిగా ఉండుట వంటి ఇతర విషయాలతో తారుమారు చేస్తారు. కానీ వాస్తవానికి పేదవారైన అనేకమంది గర్విష్ఠులుగా ఉన్నారు మరియు అనేకమంది ధనికులు, అయినప్పటికినీ వినయం కలిగియున్నారు. మిగిలిన వారు చాలా బిడియము కలిగి లేక తక్కువ ఆత్మ-గౌరవాన్నికలిగియున్నవారు బయటకు వినయంగా కనబడతారు కానీ కొన్నిసార్లు లోతుగా లోపల గర్వముతో నిండియుంటారు.

అయితే వినయము అంటే ఏమిటి? నా సువార్తను ప్రకటించుడి ప్రకారము, అది “ప్రభువు యొక్క చిత్తమునకు అప్పగించుటకు సమ్మతించుట. … అది బోధించదగినట్లు ఉండుట. … [అది] మన ఆత్మీయ అభివృద్ధి కొరకు కీలకమైన ఉత్ప్రేరకం.”3

ఈ క్రీస్తు వంటి లక్షణాన్ని మెరుగుపరచుకోవడానికి మనందరికి నిశ్చయంగా అనేక అవకాశాలుంటాయి. మన ప్రవక్త సలహాను అనుసరించుటలో మనము ఎంత వినయంగా ఉన్నాము, లేదా ఉండాలో నేను ముందుగా అన్వేషించాలనుకుంటున్నాను. వ్యక్తిగతంగా మనకు చిన్న పరీక్ష

  • మన పరస్పర చర్యలలో సంఘము యొక్క పూర్తి పేరును మనము చెప్తున్నామా? “ప్రభువు యొక్క సంఘము నుండి ప్రభువు పేరును తీసివేయుట సాతానుకు పెద్ద విజయము,”4 అని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ అన్నారు.

  • మన ప్రవక్త యొక్క ఆ ప్రత్యేక ఆహ్వానమును అంగీకరించడం ద్వారా మన జీవితాలలోనికి దేవునిని ప్రబలనిస్తున్నామా? “వేరు చేయు వైఖరులు మరియు దురభిమానపు చర్యల నుండి బయటకు నడిపించమని ప్రతిచోటనున్న మన సభ్యులకు నేడు నేను పిలుపునిస్తున్నాను.”5

  • మన ప్రవక్త బోధించినట్లుగా, మనుష్యుల తత్వాల కంటే ఎక్కువగా క్రీస్తు యొక్క సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ, మనము లోకమును జయిస్తున్నామా? 6

  • జనుల గురించి మంచి మాటలు చెప్పుచూ మనము శాంతిస్థాపకులుగా మారామా? గత సర్వసభ్య సమావేశములో అధ్యక్షులు నెల్సన్ మనకు ఇలా బోధించారు: “మనం మరొకరి గురించి—అతని ముఖం మీదనైనా లేదా ఆమె వెనుక అయినా—చెప్పడానికి పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతిగలది లేదా పొగడదగినది ఏదైనా ఉన్నయెడల, అది మన సంభాషణ యొక్క ప్రమాణం కావాలి.”7

అవి సరళమైనవి కానీ శక్తివంతమైన సూచనలు. జ్ఞాపకముంచుకొండి, మోషే యొక్క జనులందరు స్వస్థత పొందాలంటే చేయాల్సినదంతా, అతడు పైకెత్తిన ఇత్తడి సర్పము వైపు చూడటమే.8 కానీ “ఆ మార్గము యొక్క సరళతను బట్టి, లేక దాని యొక్క సుళువును బట్టి అనేకమంది నశించిపోయిరి.”9

ఈ సమావేశములో మన ప్రవక్తలు మరియు అపొస్తులుల యొక్క విఫలము కాని సలహాను మనము విన్నాము, ఇంకా వింటాము. వినయమును అభివృద్ధి చేయడానికి అది పరిపూర్ణమైన సందర్భము మరియు ఈ ఏర్పరచబడిన నాయకుల ద్వారా ప్రభువు మాట్లాడుతున్నారనే ఇంకా బలమైన నమ్మకము చేత మన బలమైన అభిప్రాయాలు జయించబడనివ్వాలి.

అన్నిటికిపైగా, వినయమును వృద్ధి చేయడంలో, మన స్వంత ప్రయత్నాల ద్వారా మన సవాళ్ళను జయించలేమని లేదా మన పూర్తి సాధ్యతను సాధించలేమని కూడ మనము తప్పక గ్రహించాలి మరియు అంగీకరించాలి. ప్రపంచమంతటా ప్రేరేపించే ప్రసంగీకులు, రచయతలు, కోచ్‌లు మరియు ప్రత్యేకంగా డిజిటల్ వేదికలపై, ప్రభావితం చేసేవారు, ప్రతిదీ మనపై, మన క్రియలపై మాత్రమే ఆధారపడి ఉంటుందని చెప్తారు. ప్రపంచము శరీరబాహువునందు నమ్మికయుంచును.

కానీ పునఃస్థాపించబడిన సువార్త ద్వారా, మనము పరలోక తండ్రి యొక్క దయ మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తుపై గొప్పగా ఆధారపడియున్నామని మనము నేర్చుకున్నాము, “ఏలయనగా మనము సమస్తము చేసిన తర్వాత కూడా మనము కృప చేతనే రక్షింపబడియున్నామని మేము ఎరుగుదుము.”10 అందువలనే దేవునితో నిబంధనలు చేయుట మరియు పాటించుట చాలా ముఖ్యమైనది, ఆవిధంగా చేయుట ఆయన ప్రాయశ్చిత్తము ద్వారా యేసు క్రీస్తు యొక్క స్వస్థపరచు, అధికారమిచ్చు, మరియు పరిపూర్ణులుగా చేయు శక్తికి పూర్తి ప్రవేశమును మనకిస్తుంది.

వారములో సంస్కార సమావేశముకు హాజరగుట మరియు విధులలో పాల్గొనడానికి, నిబంధనలు పొంది, తిరిగి క్రొత్తవిగా చేయడానికి క్రమంగా దేవాలయంలో ఆరాధించుట పరలోక తండ్రి మరియు మన రక్షకుడైన యేసు క్రీస్తుపై మన ఆధారమును గుర్తిస్తున్నామని ఒక సూచన. అది మన సమస్యలన్నింటి నుండి మనకు సహాయపడటానికి మరియు చివరికి మన సృష్టి యొక్క పరిమాణమును నెరవేర్చడానికి వారి శక్తిని మన జీవితాలలోనికి ఆహ్వానిస్తుంది.

కొంతకాలం క్రితం నా వినయము మరియు ప్రభువుపై నా ఆదారము యొక్క అవగాహన మరొకసారి పరీక్షించబడింది. ఒక చిన్న విమానంలో ప్రయాణించడానికి నేను టాక్సీలో విమానాశ్రయానికి వెళుతున్నాను, అక్కడ పరిష్కరించడానికి చాలా కష్టమైన పరిస్థితి ఉన్నది. సంఘ సభ్యుడు కానీ టాక్సీ డ్రైవరు, అద్దము గుండా నా వైపు చూసి, “ఈరోజు మీకు బాగా లేదని నేను చూస్తున్నాను!” అని అన్నాడు

“నువ్వు చెప్పగలవా?” అని నేను అడిగాను.

“అవును,” అతడు అన్నాడు. అతడు ఈవిధంగా చెప్పాడు, “వాస్తవానికి మీరు మీ చుట్టూ చాలా ప్రతికూల భావన కలిగియున్నారు!”

నేను ఒక కష్టమైన పరిస్థితిని పరిష్కరించడానికి వెళుతున్నానని అతడికి వివరించినప్పుడు, అతడు ఇలా అడిగాడు, “దీనిని పరిష్కరించడానికి మీ శక్తి మేరకు చేయగలిగినదంతా మీరు చేసారా?”

నేను చేయగలిగినదంతా చేసానని జవాబిచ్చాను.

తరువాత అతడు చెప్పినది నేను ఎన్నడూ మరచిపోను, “అయితే దీనిని దేవుని చేతులలో వదిలెయ్యండి, మరియు అంతా సజావుగా సాగుతుంది.”

“నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా?” అని అడగాలని నేను శోధించబడ్డానని నేను ఒప్పుకుంటాను. కాని నేను అడగలేదు! నేను చేసినదేమిటంటే ఆ గంటసేపు విమాన ప్రయాణమంతటా, దైవిక సహాయం కొరకు అడుగుతూ, ప్రభువు యెదుట నన్ను నేను తగ్గించుకున్నాను. విమానము విడిచిపెట్టినప్పుడు, పరిష్కరించబడాల్సిన కష్టమైన పరిస్థితి ఇదివరకే క్రమములో ఉన్నది మరియు నా సమక్షము ఇక ముందు అవసరములేదు.

సహోదర, సహోదరిలారా, ప్రభువు నుండి ఆజ్ఞ, ఆహ్వానము మరియు వాగ్దానము స్పష్టమైనది మరియు ఓదార్పునిచ్చేది: “నిన్ను నీవు తగ్గించుకొనుము; నీ దేవుడైన ప్రభువు నిన్ను చేయి పట్టుకొని నడిపించును, నీ ప్రార్థనలకు సమాధానమిచ్చును.”11

మన ప్రవక్తల సలహాను అనుసరించుటకు మనము తగ్గించుకొని, దేవుడు, యేసు క్రీస్తు మాత్రమే—ఆయన సంఘములో పొందిన విధులు మరియు నిబంధనల ద్వారా—ఈ జీవితంలో మనల్ని ఉత్తమంగా మార్చి, మరియు ఒకరోజు క్రీస్తునందు మనల్ని పరిపూర్ణులుగా చేయగలరని, అంగీకరిద్దాం. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు