సర్వసభ్య సమావేశము
ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనుడి
2024 ఏప్రిల్ సర్వసభ్య సమావేశము


ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనుడి

మన నిబంధనలను గౌరవించడం ద్వారా, మనం మారి, ఆ నిబంధనలకు సంబంధించి వాగ్దానము చేయబడిన ఆశీర్వాదాల సమూహాన్ని కుమ్మరించేలా దేవునికి అధికారమిస్తున్నాము.

మా ఇద్దరు చిన్న పిల్లలు పెద్దవారగుతుండగా, నేను వినోదభరితమైన మరియు ఆకర్షణీయమైన పుస్తకాలను కనుగొన్నాను, కానీ వారి కథలలో ప్రతీకాత్మకత కూడా ఉపయోగించబడింది. సాయంత్రాలు మేము కలిసి చదివినప్పుడు, లోతైన సువార్త సూత్రాలను కూడా బోధించడానికి రచయత ఉపయోగిస్తున్న ప్రతీకవాదాన్ని గ్రహించడానికి మా పిల్లలకు సహాయపడటం నాకు చాలా ఇష్టమైనది.

మా చిన్న కుమారుడు తన యుక్తవయస్సు ప్రారంభదశలో ఉన్నప్పుడు ఇది బాగా గ్రహించబడిందని నాకు తెలుసు. అతడు ఒక క్రొత్త పుస్తకాన్ని ప్రారంభించాడు మరియు కథను ఆస్వాదించాలనుకున్నాడు, కానీ అతడి మనస్సు తాను చదువుతున్న ప్రతిదానిలో లోతైన అర్థాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అతడు విసుగు చెందాడు, కానీ నేను లోపల ఆనందించాను.

యేసు కథలు మరియు చిహ్నముల ద్వారా బోధించారు1 —విశ్వాసము యొక్క శక్తిని బోధించడానికి ఆవగింజ,2 ఆత్మల విలును బోధించడానికి తప్పిపోయిన గొఱ్ఱె,3 దేవుని స్వభావాన్ని బోధించడానికి తప్పిపోయిన కుమారుడు.4 ఆయన ఉపమానాలు చిహ్నాలుగా ఉన్నాయి, వాటి ద్వారా ఆయన “వినుటకు చెవులు,”5 గల వారికి లోతైన పాఠాలు నేర్పించగలరు. కానీ లోతైన అర్థాన్ని వెదకని వారు గ్రహించరు,6 నేను నా పిల్లలకు చదివిన అదే పుస్తకాలను చదివే చాలా మందికి లోతైన అర్థాలు ఉన్నాయని మరియు ఆ కథల నుండి ఎక్కువ పొందవచ్చని ఎప్పుడూ తెలియదు.

తండ్రియైన దేవుడు తన అద్వితీయ కుమారుని మన కొరకు బలిగా అర్పించినప్పుడు, మనలో ప్రతి ఒక్కరి పట్ల పరలోకమందున్న తండ్రి కలిగియున్న అచంచల ప్రేమలో యేసు క్రీస్తు తానే స్వయంగా అత్యున్నత చిహ్నంగా మారాడు.7 యేసు క్రీస్తు దేవుని యొక్క గొఱ్ఱె పిల్ల అయ్యాడు.8

దేవునితో నిబంధన సంబంధములోనికి ఆహ్వానించబడే దీవెనను, విశేషావకాశాన్ని మనం కలిగియున్నాము, దానిలో మన స్వంత జీవితాలు ఆ నిబంధన యొక్క చిహ్నముగా మారవచ్చు. నిబంధనలు కాలక్రమేణా మనల్ని మలచడానికి, మార్చడానికి మరియు రక్షకునిలా మారడానికి మనల్ని పైకి ఎత్తడానికి అనుమతించే విధమైన సంబంధాన్ని సృష్టిస్తాయి, మనల్ని ఆయనకు మరియు మన తండ్రికి 9 మరింత దగ్గరగా తీసుకువస్తాయి మరియు చివరికి వారి సన్నిధిలోకి ప్రవేశించడానికి మనల్ని సిద్ధం చేస్తాయి.

భూమిపైన ప్రతి వ్యక్తి దేవుని యొక్క ప్రత్యేక కుమారుడు లేదా కుమార్తె.10 ఒక నిబంధన యొక్క భాగముగా ఉండటానికి మనము ఎంపిక చేసినప్పుడు, అది ఆయనతో మన సంబంధాన్ని మెరుగుపరుస్తుంది మరియు లోతుగా చేస్తుంది. దేవునితో నిబంధనలు చేయడానికి మనము ఎన్నుకొన్నప్పుడు, ఆయనతో మన సంబంధము మన నిబంధనకు ముందున్న దానికంటే ఎక్కువ సన్నిహితంగా మారుతుంది మరియు అది ఆయన ప్రేమ, దయ యొక్క అదనపు కొలమానంతో మనల్ని ఆశీర్వదించడానికి వీలు కల్పిస్తుంది, నిబంధన సంబంధమైన ప్రేమ హెబ్రీయ భాషలో హెసెడ్ అని సూచించబడిందని అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించారు.11 నిబంధన మార్గం అనేది దేవునితో మన సంబంధానికి సంబంధించినది—మనది ఆయనతో హెసెడ్ సంబంధం.12

మన తండ్రి ఆయన కుమారులు మరియు కుమార్తెలు అందరితో లోతైన అనుబంధాన్ని కోరుతున్నారు,13 కానీ అది మన ఇష్టము. ఒక నిబంధన సంబంధము ద్వారా మనము ఆయనకు దగ్గరగా వచ్చినప్పుడు, అది ఆయనను మనకు దగ్గరగా చేస్తుంది14 మరియు మనల్ని మరింత సంపూర్ణంగా దీవిస్తుంది.

దేవుడు మనము చేసే నిబంధనలు మరియు బాధ్యతల యొక్క షరతులను నిర్దేశిస్తాడు.15 ఆ సంబంధములోనికి ప్రవేశించడానికి మనము ఎన్నుకున్నప్పుడు, ఆయన నిర్దేశించిన షరతులకు కట్టుబడి ఉండేందుకు మనం సిద్ధంగా ఉన్నామని ప్రతి నిబంధన యొక్క ప్రతీకాత్మక చర్యల ద్వారా మనం ఆయనకు సాక్ష్యమిస్తాము.16 మన నిబంధనలను గౌరవించడం ద్వారా, మనం మారి, మన రక్షకుని వలె మారడానికి అధికమైన శక్తితో కలిపి, ఆ నిబంధనలకు సంబంధించి వాగ్దానము చేయబడిన ఆశీర్వాదాల సమూహాన్ని కుమ్మరించేలా దేవునికి అధికారమిస్తున్నాము.17 యేసు క్రీస్తు మనం చేసే సమస్త నిబంధనలకు కేంద్రము మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము వలన నిబంధన దీవెనలు సాధ్యపరచబడినవి.18

ముంచుట ద్వారా బాప్తిస్మము ప్రతీకాత్మకమైన ద్వారము, దాని ద్వారా మనము దేవునితో నిబంధన సంబంధములో ప్రవేశిస్తాము. నీటిలో ముంచబడి, మరలా పైకి లేచుట రక్షకుని యొక్క మరణము మరియు క్రొత్త జీవితానికి పునరుత్థానానికి ప్రతీక.19 మనము బాప్తిస్మము పొందినప్పుడు, మనము ప్రతీకాత్మకంగా చనిపోయి మరలా క్రీస్తు యొక్క కుటుంబంలోనికి తిరిగి జన్మిస్తాము మరియు ఆయన నామమును మనపైకి తీసుకోవడానికి మనం సమ్మతిస్తున్నామని చూపుతాము.20 మనమే ఆ నిబంధన ప్రతీకలను కలిగియున్నాము. క్రొత్త నిబంధనలో “క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు”21 అని మనము చదివాము. మన బాప్తిస్మముతో మనము క్రీస్తును ప్రతీకాత్మకంగా ధరిస్తున్నాము.

సంస్కారము యొక్క విధి కూడా రక్షకుని వైపు సూచిస్తుంది. రొట్టె మరియు నీళ్ళు క్రీస్తు యొక్క శరీరము మరియు మన కొరకు చిందించిన రక్తము యొక్క ప్రతీకగా ఉన్నాయి.22 యాజకత్వము గలవారు రక్షకునికి ప్రతినిధిగా, మనకు రొట్టెను, నీటిని ఇచ్చినప్పుడు ప్రతీవారము మనకు ప్రతీకాత్మకంగా ప్రాయశ్చిత్తము యొక్క వరము ఇవ్వబడుతుంది. ఆయన శరీరము మరియు రక్తము యొక్క చిహ్నములను మనము తిని, త్రాగే చర్యను నెరవేర్చినప్పుడు, క్రీస్తు ప్రతీకాత్మకంగా మనలో ఒక భాగమయ్యారు.23 ప్రతీవారము మనము ఒక క్రొత్త నిబంధన చేసినప్పుడు మనము మరలా క్రీస్తును ధరిస్తున్నాము.24

ప్రభువు యొక్క మందిరములో మనము దేవునితో నిబంధనలు చేసినప్పుడు, మనమింకా ఆయనతో మన సంబంధాన్ని లోతుగా చేస్తున్నాము.25 దేవాలయంలో మనము చేసే ప్రతీది మన కోసం మన తండ్రి యొక్క ప్రణాళికను సూచిస్తుంది, దానిలో ప్రధానంగా రక్షకుడు మరియు ఆయన ప్రాయశ్చిత్త త్యాగము ఉన్నది.26 లోతైన అర్థాలను గ్రహించడానికి మనం మన హృదయాలను తెరచి, ప్రార్థనాపూర్వకంగా వెదకినప్పుడు, విధులు మరియు నిబంధనల యొక్క ప్రతీకాత్మకత ద్వారా వరుస వెంబడి వరుసగా27 ప్రభువు మనకు బోధిస్తారు.

దేవాలయ వరములో భాగముగా, మనము పరిశుద్ధ యాజకత్వము యొక్క వస్త్రమును ధరించడానికి అధికారమివ్వబడ్డాము. అది పవిత్రమైన బాధ్యత మరియు పవిత్రమైన విశేషావకాశము రెండూను.

అనేక మతపరమైన ఆచారాలలో, వ్యక్తి యొక్క నమ్మకాలు మరియు దేవునిపట్ల నిబద్ధత యొక్క చిహ్నంగా ప్రత్యేకమైన బాహ్య వస్త్రము ధరించబడింది28 మరియు ఆరాధనా కార్యక్రమాలను నడిపించే వారి చేత తరచుగా ఆచార సంబంధమైన దుస్తులు ధరించబడతాయి. ఆ పవిత్ర వస్త్రాలు వాటిని ధరించేవారికి లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ప్రాచీన కాలాలలో, దేవాలయ ఆచారక్రియలతోపాటు పవిత్రమైన ఆచార సంబంధమైన దుస్తులు ధరించబడినవని లేఖనాలలో మనం చదివాము.29

యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల సంఘ సభ్యులుగా, ప్రభువు యొక్క మందిరములో దేవునితో నిబంధనలు చేయడానికి ఎంపిక చేసిన మనము దేవాలయ ఆరాధన సమయంలో పవిత్రమైన ఆచార సంబంధ బాహ్య దుస్తులను ధరిస్తాము, ఇది పురాతన దేవాలయ ఆచారాలలో ధరించే దుస్తులకు ప్రతీక. మనము పరిశుద్ధ యాజకత్వ వస్త్రమును కూడా ధరిస్తాము, మనము దేవాలయ ఆరాధన సమయంలో మరియు మన అనుదిన జీవితాలలో రెండు విధాలా దానిని ఉపయోగిస్తాము.30

పరిశుద్ధ యాజకత్వ వస్త్రము లోతైన ప్రతీకాత్మకతను కలిగియున్నది మరియు రక్షకుని వైపు సూచిస్తుంది. ఆదాము, హవ్వలు జీవ వృక్ష ఫలమును తిని, ఏదేను వనము విడిచి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, తమను కప్పుకొనే దానిగా చర్మపు చొక్కాలు ఇవ్వబడ్డారు. 31 మన కోసం రక్షకుడు చేసిన త్యాగానికి ప్రతీకగా ఆ చర్మాలను తయారు చేయడానికి ఒక జంతువు బలి ఇవ్వబడి ఉండవచ్చు. కేఫర్ అనేది ప్రాయశ్చిత్తానికి సంబంధించిన మాట మరియు దాని అర్థాలలో ఒకటి “కప్పుట.”32 మన దేవాలయ వస్త్రము రక్షకుడిని మరియు మన జీవితములంతటా మనల్ని కప్పే ఆయన ప్రాయశ్చిత్తపు దీవెనలను మనకు గుర్తు చేస్తుంది. ప్రతీ రోజు పరిశుద్ధ యాజకత్వ వస్త్రమును మనము ధరించినప్పుడు, ఆ అందమైన చిహ్నము మనలో ఒక భాగమవుతుంది.

క్రొత్త నిబంధన, రోమా గ్రంథములో మనమిలా చదువుతాము: “రాత్రి చాల గడచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకారక్రియలను విసర్జించి, తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందము. … ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనుడి.”33

రక్షకుడు మరియు ఆయన అనంతమైన ప్రాయశ్చిత్తం యొక్క ఆశీర్వాదాలు నా మర్త్య ప్రయాణంలో నిరంతరం నన్ను కప్పివేస్తాయని నాకు గుర్తుచేయడానికి నా జీవితాంతం పవిత్ర యాజకత్వ వస్త్రాన్ని ధరించే విశేషావకాశం కొరకు నేను చాలా కృతజ్ఞురాలిని. ప్రభువు యొక్క మందిరములో దేవునితో నేను చేసిన నిబంధనలను పాటించినప్పుడు, కాంతి కవచంగా ఉన్న క్రీస్తును ప్రతీకగా నేను ధరించానని, అది నాకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన నన్ను చెడు నుండి రక్షించి,34 నాకు శక్తిని మరియు హెచ్చింపబడిన సామర్థ్యాన్ని ఇస్తారు35 మరియు ఈ ప్రపంచంలోని చీకటి మరియు కష్టాలలో నాకు వెలుగుగా, మార్గదర్శకునిగా ఉంటారు.36

పరిశుద్ధ యాజకత్వ వస్త్రము మరియు క్రీస్తుతో దాని సంబంధములో లోతైన, అందమైన ప్రతీకాత్మక అర్థమున్నది. పరిశుద్ధ వస్త్రము ధరించడానికి నా సమ్మతి 37 ఆయనతో నా ప్రతీకగా మారుతుందని నేను నమ్ముతున్నాను.38 అది దేవునికి నా స్వంత వ్యక్తిగత సూచన, ఇతరులకు ఒక సూచన కాదు.39

నా రక్షకుడైన, యేసు క్రీస్తు కొరకు నేను చాలా కృతజ్ఞత కలిగియున్నాను.40 మన కోసం ఆయన చేసిన ప్రాయశ్చిత్త త్యాగం, పునరుత్థానం తరువాత కూడా నిలిచియున్న—రక్షకుని చేతులు, పాదాలు మరియు ప్రక్కవైపు గుర్తులు42—ఆ ప్రేమ మరియు త్యాగం యొక్క స్పష్టమైన చిహ్నాలతో—మనలో ప్రతి ఒక్కరిపై ఆయనకు మరియు మన పరలోకమందున్న తండ్రికి ఉన్న అనంతమైన ప్రేమకు మిక్కిలి గొప్ప చిహ్నంగా మారింది.41

పరిశుద్ధ యాజకత్వ వస్త్రమును ధరించుటతో కలిపి, నా దేవాలయ నిబంధనలు మరియు బాధ్యతలను నేను పాటించినప్పుడు, నా జీవితం నా రక్షకుడైన యేసు క్రీస్తు కొరకు నా ప్రేమ, లోతైన కృతజ్ఞత మరియు ఎల్లప్పుడు ఆయనను నాతో కలిగియుండాలనే నా కోరికకు వ్యక్తిగత చిహ్నంగా మారగలదు.

మీరు ఇంకా దానిని చేసియుండని యెడల, ప్రభువు యొక్క మందిరములో ఆయనతో నిబంధనలు చేయడం ద్వారా దేవునితో లోతైన సంబంధాన్ని ఎంపిక చేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మన ప్రవక్త ప్రసంగాలను (అనేక సమావేశ ప్రసంగాలలో ఉన్న ఆయన ప్రసంగాలలోని పాదవివరణలో ఉన్న అందమైన బోధనలతో పాటుగా) చదవండి. ఆయన సంవత్సరాలుగా, ప్రత్యేకంగా సంఘ అధ్యక్షునిగా అయినప్పటినుండి నిబంధనలు గూర్చి పలుమార్లు ప్రసంగించారు. దేవునితో నిబంధనలను చేయడం మరియు పాటించటం ద్వారా మీవి కాగల అందమైన దీవెనలు మరియు హెచ్చింపబడిన శక్తి, సామర్థ్యము గురించి ఆయన బోధనల నుండి నేర్చుకొనండి.43

దేవాలయ నిబంధనలు చేయడానికి ఒక మిషను పిలుపు కలిగియుండడం లేదా వివాహ నిశ్చితార్థం చేయబడడం అవసరం లేదని ప్రధాన చేతిపుస్తకము వివరిస్తుంది.44 ఒక వ్యక్తి కనీసం 18 సంవత్సరాలు పైబడి, ఉన్నత పాఠశాల లేదా సమామైనది హాజరు కాని వారైయుండాలి మరియు కనీసం ఒక సంవత్సరం సంఘ సభ్యులై ఉండాలి. వ్యక్తిగత పరిశుద్ధత యొక్క ప్రమాణాలు కూడా అవసరమవుతాయి.45 ప్రభువు యొక్క మందిరములో పవిత్ర నిబంధనలు చేయుట ద్వారా పరలోకమందున్న తండ్రి మరియు యేసు క్రీస్తుతో మీ అనుబంధాన్ని లోతుగా చేసుకోవాలని మీరు కోరినట్లయితే, మీ బిషప్పు లేదా శాఖాధ్యక్షునితో మాట్లాడి మీ కోరికలను తెలియజేయమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆ నిబంధనలు పొందడానికి మరియు గౌరవించడానికి ఎలా సిద్ధపడాలో తెలుసుకోవడానికి అతడు మీకు సహాయపడతాడు.

దేవునితో ఒక నిబంధన సంబంధము ద్వారా, మన స్వంత జీవితాలు పరలోకమందున్న తండ్రి పట్ల మన నిబద్ధతకు మరియు గాఢమైన ప్రేమకు, ఆయన పట్ల మన హెస్‌డ్కు,46 మరియు అభివృద్ధి చెందాలనే మన కోరికకు మరియు చివరికి మన రక్షకుని వలె మారి, ఒకరోజు వారి సన్నిధిలో ప్రవేశించడానికి సిద్ధపడేందుకు సజీవ చిహ్నంగా మారగలవు. ఆ నిబంధన సంబంధము యొక్క గొప్ప దీవెనలు చాలా విలువైనవని నేను సాక్ష్యమిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

ముద్రించు