2022
ఎంచుకొనుము
2022 జూన్


“ఎంచుకొనుము,” యౌవనుల బలము కొరకు, 2022 జూన్.

యౌవనుల బలము కొరకు నెలవారీ సందేశము, 2022 జూన్

ఎంచుకొనుము

ప్రభువును అనుసరించుటకు---సరైన ఎంపిక చేయమని యెహోషువ తన ప్రజలను కోరాడు.

ఎంచుకొనుము

మన కోసం ఎంచుకునే మరియు ప్రవర్తించే మన సామర్థ్యాన్ని స్వాతంత్ర్యము అంటారు. పరలోక తండ్రి ప్రణాళికలో అది ముఖ్యమైన భాగము. ఈ జీవితం యొక్క ఒక ఉద్దేశ్యం ఏమిటంటే, మనం దేవుని ఆజ్ఞలకు విధేయులగుటకు ఎంచుకొంటామని చూపించుట, తద్వారా మనం ఎక్కువగా ఆయనలా మారగలము. మన ఎంపికలను బట్టి మనము తీర్పు తీర్చబడతాము. (2 నీఫై 2:27; సిద్ధాంతము మరియు నిబంధనలు101:78; అబ్రాహాము 3:25చూడండి.)

నేడు

“నేడు” లేదా ఇప్పుడే ఎంచుకోవాలని యెహోషువా తన ప్రజలను ప్రోత్సహించాడు. మనం ఒకసారి ముఖ్యమైన ఎంపికలు చేసి, వాటికి కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించవచ్చు. (కీర్తనలు 37:5 చూడండి.)

సేవ చేయండి

ఈ వచనములో, సేవ చేయడం అంటే ఆరాధించడం, సహాయం చేయడం, విధేయులం కావడం, మరియు మిమ్మల్ని మీరు ఎవరికైనా అంకితం చేయడం. మనం ప్రభువును సేవించాలి (మోషే 1:15 చూడండి).

దేవతలు

ఇశ్రాయేలీయులు నిజమైన మరియు జీవముగల దేవుడైన యేసు క్రీస్తును మాత్రమే సేవించాలని ఆజ్ఞాపించబడ్డారు (నిర్గమకాండము 20:2-5 చూడండి). తన ప్రజలు ఆరాధించకూడని ఇతర దేవతల ఉదాహరణలను యెహోషువా ఇచ్చాడు. ఆస్తులు, ఇతరుల అభిప్రాయాలు, ఇతర ఆసక్తులు—మనల్ని ప్రభువు నుండి దూరం చేసే ఏవైనా మన జీవితాల్లోని ఇతర దేవతలు కావచ్చు.

నేను మరియు నా ఇంటివారు

యెహోషువా తన కొరకు మరియు తన ఇంటివారి కొరకు మాట్లాడాడు. వారు ప్రభువును సేవిస్తారని అతడు చెప్పాడు. అతడు తన కుటుంబాన్ని నీతిగా నడిపించాలని మరియు ప్రభువును అనుసరించమని వారికి బోధించాలని కోరుకున్నాడు (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:40 చూడండి).

ముద్రించు