2022
ఆదివారపు సంఘ సమావేశాలలో ఏమి జరుగుతుంది?
2022 జూన్


“ఆదివారపు సంఘ సమావేశాలలో ఏమి జరుగుతుంది?” లియహోనా, 2022 జూన్.

లియహోనా నెలవారీ సందేశము, 2022 జూన్

ఆదివారపు సంఘ సమావేశాలలో ఏమి జరుగుతుంది?

చిత్రం
ఇద్దరు స్త్రీలు హత్తుకొనుట

ప్రతి ఆదివారం యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘ సభ్యులు దేవునిని ఆరాధించడానికి మరియు యేసు క్రీస్తు సువార్తను ఒకరికొకరు బోధించడానికి సమావేశమవుతారు. హాజరయ్యేందుకు అందరూ ఆహ్వానితులే, మరియు సభ్యులు కోరినట్లైతే, ప్రార్థించడానికి, ప్రసంగాలు ఇవ్వడానికి మరియు పాఠాలు బోధించడానికి అవకాశాన్ని కలిగియుంటారు. సభ్యులు విశ్వాసంలో ఒకరినొకరు బలపరచుకొనుటకు మరియు “ఒకరి యెడల ఒకరు ఐక్యతయందును, ప్రేమయందును తమ హృదయములు ముడివేయబడుటకు” (మోషైయ 18:21) ఈ సమావేశాలు ఉపయోగపడతాయి.

చిత్రం
ఒక చక్రాల కుర్చీలో ఉన్న బాలుడు సంస్కారమును ఇస్తున్నాడు

సంస్కార సమావేశము

వార్డు లేదా శాఖ సభ్యులు ప్రతి ఆదివారం సంస్కార సమావేశము కొరకు సమావేశమవుతారు. (మన విశ్వాసానికి చెందని వారు కూడా హాజరు కావడానికి ఆహ్వానితులే.) ఈ సమావేశంలో సభ్యులకు యేసు క్రీస్తును జ్ఞాపకము చేసుకోవడంలో సహాయపడటానికి సంస్కారము ఇవ్వబడుతుంది (సంస్కారం గురించి మరింత సమాచారం కోసం ఏప్రిల్ 2022 సువార్త ప్రాథమికాంశాలు వ్యాసాన్ని చూడండి). సమావేశంలో ప్రార్థనలు, ఆరాధన సంగీతం, మరియు యేసు క్రీస్తు సువార్త గురించి సభ్యులు ఇచ్చిన ప్రసంగాలు కూడా ఉంటాయి.

చిత్రం
సంఘములో చిరునవ్వుతో ఇద్దరు అమ్మాయిలు

ఇతర సమావేశాలు

సంస్కార సమావేశం తరువాత, సభ్యులు తరగతులు మరియు సమూహాలుగా విభజించబడతారు. 18 నెలల నుండి 11 సంవత్సరాల లోపు పిల్లలు ప్రాథమికకు హాజరవుతారు. ప్రతి నెల మొదటి మరియు మూడవ ఆదివారాలలో, ఇతర సభ్యులందరూ ఆదివారపు బడికి హాజరవుతారు. రెండవ మరియు నాల్గవ ఆదివారాలలో, వారు ఉపశమన సమాజము, యువతులు, లేదా యాజకత్వ సమూహ సమావేశాలకు హాజరవుతారు.

ప్రార్థనలు

సంఘ సమావేశాలలో ప్రార్థనలు సభ్యులచే ఇవ్వబడతాయి. ప్రార్థనలు సరళమైనవి మరియు పరిశుద్ధాత్మచే నిర్దేశించబడతాయి. సభ్యులు పరలోక తండ్రి పట్ల ప్రేమ మరియు గౌరవాన్ని వ్యక్తపరిచే పదాలను ఉపయోగించి ప్రార్థిస్తారు. ఆయనకు ప్రార్థించేటప్పుడు మీకు, మీ, మీ యొక్క, మరియు మీరు అనే సర్వనామాలను ఉపయోగించడాన్ని ఇది కలిగియుంటుంది.

ప్రసంగములు

బిషప్రిక్కులో లేదా శాఖాధ్యక్షత్వములో ఒక సభ్యుడు సంస్కార సమావేశంలో ప్రసంగాలు ఇవ్వమని సభ్యులను అడుగుతాడు. ఈ ప్రసంగాలు యేసు క్రీస్తు యొక్క సువార్తపై దృష్టిసారిస్తాయి. ప్రసంగీకులు తమ ప్రసంగాలను సిద్ధం చేస్తున్నప్పుడు లేఖనాలను మరియు సంఘ నాయకుల పదాలను ఉపయోగిస్తారు. తమ జీవితాలలో సువార్త సూత్రాల వలన కలిగిన దీవెనల గురించి కూడా వారు సాక్ష్యమిస్తారు.

పాఠాలు

సంస్కార సమావేశం తరువాత, సభ్యులు చిన్న తరగతులలో సువార్త గురించి తెలుసుకుంటారు. లేఖనాలు, సర్వసభ్య సమావేశం నుండి బోధనలు, లేదా ఇతర విషయాల గురించి పాఠాలు ఉండవచ్చు. బోధకుడు పాఠాన్ని నడిపించినప్పటికీ, అది ఉపన్యాసం కాదు. తరగతిలోని సభ్యులందరూ ఈ అంశం గురించి తమ ఆలోచనలను పంచుకోవచ్చు.

చిత్రం
సంఘములో వేదిక వద్ద మాట్లాడుచున్న వ్యక్తి

సాక్ష్యము

నెలకు ఒకసారి, సంస్కార సమావేశములో భాగంగా సాక్ష్యపు సమావేశం ఉంటుంది. సాధారణంగా ఇది నెలలో మొదటి ఆదివారం ఉంటుంది. ఈ సమావేశంలో, సభ్యులు యేసు క్రీస్తు మరియు ఆయన సువార్త గురించి వారి సాక్ష్యాలను పంచుకోవచ్చును. సాక్ష్యమివ్వడం అంటే పరిశుద్ధాత్మచే ప్రేరేపించబడిన సువార్త సత్యాలను ప్రకటించడం.

సిద్ధపాటు

ప్రార్థనలు చేయడం, లేఖనాలను అధ్యయనం చేయడం, మరియు పరిశుద్ధాత్మ నుండి ప్రేరేపణ పొందేందుకు సిద్ధంగా ఉండటం ద్వారా సభ్యులు ఆదివారపు సమావేశాలకు సిద్ధపడతారు. ఒక ప్రసంగం ఇవ్వమని లేదా ఒక పాఠం చెప్పమని మిమ్మల్ని అడిగితే, మీరు సువార్త సూత్రాలను ఎలా బోధించవచ్చో ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి. లేఖనాలను ఉపయోగించండి. సత్యము గురించి సాక్ష్యం చెప్పండి. అవసరమైతే, మీ సంఘ నాయకులు మీ సిద్ధపాటులో సహాయపడగలరు.

ముద్రించు