2023
యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుట
2023 జూలై


“యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుట,” లియహోనా, జూలై 2023.

లియహోనా నెలవారీ సందేశము, 2023 జూలై

యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుట

చిత్రం
ఒడిలో తెరవబడిన లేఖనాలతో యువతి

మనము యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన సంఘము యొక్క సభ్యులము కనుక మనము పొందిన దీవెనలు గురించి ఆలోచించినప్పుడు, మనము ప్రేమించిన వారితో సువార్తను పంచుకోవాలని కోరుకుంటాము. మన మాటలు మరియు మన మాదిరి ద్వారా సత్యమును గూర్చి మన సాక్ష్యములను మనము పంచుకోగలము. ఎవరితో పంచుకోవాలి మరియు ఏమి చెప్పాలో తెలుసుకోవడానికి ప్రేరేపణ కొరకు మనము ప్రార్థించగలము.

చిత్రం
దుర్భలుడైన వ్యక్తిని యేసు సమీపించుట

ఇతరులను ప్రేమించుట

యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకోవడంలో ముఖ్యమైన భాగము ఇతరులను ప్రేమించుట. క్రీస్తు వంటి క్రియల ద్వారా ఇతరులకు మన ప్రేమను మనము చూపినప్పుడు, కొన్నిసార్లు మనము ఒక మాట చెప్పకుండానే---యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకుంటున్నాము. మరియు మనము వారి గురించి శ్రద్ధ వహిస్తున్నామని ఇతరులకు తెలిసినప్పుడు, సువార్త గురించి మన ఆలోచనలు వినడానికి వారు ఎక్కువ సమ్మతించవచ్చు. (Gary E. Stevenson, “Love, Share, Invite,” Liahona, May 2022, 84–87 చూడండి.)

సాధారణమైన, సహజమైన విధానాలలో పంచుకోండి

మనము సువార్త గురించి ఇష్టపడే వాటిని పంచుకోగలము. మన అనుదిన జీవితాలలో భాగంగా దీనిని మనం చేసినప్పుడు, అది ఇబ్బందికరంగా లేదా అసౌకర్యంగా మారదు. ఉదాహరణకు, మనం ఆదివారం ఏమి చేస్తామో దాని గురించి మన కుటుంబం మరియు స్నేహితులతో మాట్లడగలము. లేదా మనము ఇతరులకు సేవ చేసినప్పుడు మనము అనుభవించే సంతోషం గురించి వారికి చెప్పవచ్చు. (డీటర్ ఎఫ్. ఉఖ్‌డార్ఫ్, “మిషనరీ కార్యము: మీ హృదయంలో ఉన్న దానిని పంచుకోవడం,” లియహోనా, మే 2019, 15–18 చూడండి.)

మనతో చేరడానికి ఇతరులను ఆహ్వానించండి

సువార్త గురించి ఎక్కువగా నేర్చుకోవడానికి మనము ఇతరులను ఆహ్వానించగలము. ఉదాహారణకు, సంఘ సమావేశము లేదా ప్రోత్సాహకార్యక్రమానికి మనము వారిని ఆహ్వానించవచ్చు, మోర్మన్ గ్రంథమును చదవవచ్చు, ఒక సంఘ వీడియోను చూడవచ్చు, లేదా మిషనరీలతో పాటు సందర్శించవచ్చును. ఈ అనుభవాలు వారు ఆత్మానుభూతిని పొందడానికి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని కోరడానికి సహాయపడగలవు.

చిత్రం
ఇద్దరు వృద్ధ మహిళలు కూర్చోని మాట్లాడుకుంటున్నారు.

వారి అనుభవము గురించి అడగండి

స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు సంఘానికి వచ్చిన తరువాత లేదా మిషనరీలతో ఒక పాఠము విన్న తరువాత, వారి అనుభవము గురించి వారిని మనము అడగవచ్చు. సువార్త యొక్క కొన్ని బోధనలు వారికి క్రొత్త కావచ్చు, ఆవిధంగా మనం వారు కలిగియున్న ప్రశ్నలకు జవాబివ్వవచ్చు. మనము మన ప్రేమను మరియు క్రీస్తు నొద్దకు వచ్చుటకు వారి ప్రయత్నాల కొరకు సహాయమును ఇవ్వగలము.

వారి నమ్మకాలకు తోడ్పడుట

మనము ఇతరుల నమ్మకాలకు విలువిచ్చి, గౌరవిస్తాము, మరియు వారు ఇదివరకే కలిగియున్న విశ్వాసానికి తోడ్పడడానికి మనము ప్రయత్నిస్తాము. ఉదాహరణకు, బైబిలు లేఖనాలలో ఓదార్పును పొందిన ఒక స్నేహితురాలు మోర్మన్ గ్రంథము నుండి మనము పంచుకొన్న బోధనలలో కూడ ఓదార్పును పొందవచ్చు.

చిత్రం
వీధిని దాటడానికి వృద్ధురాలైన స్త్రీకి సహాయపడుతున్న యువతులు

క్రొత్త సంఘ సభ్యులకు సహాయపడండి

జనులు సంఘములో చేరినప్పుడు, వారి విశ్వాసము బలపరచడానికి మనము సహాయపడగలము. మనము వారి స్నేహితులుగా ఉండగలము, వారి ప్రశ్నలకు జవాబివ్వగలము, మరియు వారు పిలుపులు పొందినప్పుడు వారికి సహాయపడగలము. యేసు క్రీస్తును అనుసరించుట మరియు ఆయన సువార్త గురించి నేర్చుకొనుటను కొనసాగించుటకు మనం వారిని ప్రోత్సహించగలము.

చిత్రం
ఇద్దరు మిషనరీ ఎల్డర్లు మరియు ఒక వ్యక్తి ఒక ఫోనును కలిసి చూస్తున్నారు.

పూర్తి-కాల మిషనరీలుగా సువార్త పరిచర్య చెయ్యండి

మన అనుదిన జీవితాలలో సువార్తను పంచుకొనుటకు అదనంగా, సంఘ సభ్యులు పూర్తి-కాల మిషనరీలుగా సేవ చేయడానికి పిలువబడవచ్చును. వారు సిద్ధపడిన యెడల, యువకులు 18 సంవత్సరాల వయస్సులోనే సేవ చేయవచ్చు. యువతులు మరియు పెద్దవారు కూడ సేవ చేయవచ్చు. ChurchofJesusChrist.org/callings/missionary వద్ద ఎక్కువ సమాచారాన్ని మీరు కనుగొనవచ్చు.

ముద్రించు