లియహోనా
ప్రభువు యొక్క గొప్ప కార్యము మరియు మన గొప్ప అవకాశము
2024 జూలై


“ప్రభువు యొక్క గొప్ప కార్యము మరియు మన గొప్ప అవకాశము,” లియహోనా, 2024 జూలై.

లియహోనా నెలవారీ సందేశము, 2024 జూలై

ప్రభువు యొక్క గొప్ప కార్యము మరియు మన గొప్ప అవకాశము

మనము ప్రేమించినప్పుడు, పంచుకున్నప్పుడు, మరియు ఆహ్వానించినప్పుడు ప్రతి అమూల్యమైన ఆత్మ ఆయనయొద్దకు చేరేలా సహాయం చేయడానికి మనము ప్రభువుతో కలిసి శ్రమిస్తున్నాము.

ఇద్దరు స్త్రీలు వీధి వెంబడి నడచుచు మాట్లాడుకొనుట

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపిత సువార్తను పంచుకొనవలెనని మహత్తరమైన ఈ అంత్య యుగములోని ప్రతి ప్రవక్త యేసు క్రీస్తు యొక్క కడవరి-దిన పరిశుద్ధుల యొక్క సంఘ సభ్యులకు బోధించియున్నారు. నా జీవిత కాలంలో అనేక ఉదాహరణలు మనసులోనికి వచ్చును:

నా యవ్వన కాలపు ప్రవక్తయైన అధ్యక్షులు డేవిడ్ ఓ. మెకే (1873–1970) ఇలా ప్రకటించాడు,“ప్రతి సభ్యుడు ఒక మిషనరీ.”

అధ్యక్షులు స్పెన్సర్ డబ్ల్యు. కింబల్ (1895–1985) ఇలా బోధించెను, “సువార్తను మరిన్ని ప్రదేశములకు, మరియు జనులకు అందచేయ వలసిన రోజు, ఇప్పుడే, ఇక్కడే,” మరియు సువార్తను ఇతరులతో పంచుకొనుటలో “మనము మన వేగం పెంచాలి”

అధ్యక్షులు గోర్డన్ బి. హింక్లీ (1910–2008) ఇలా అన్నారు: బోధించువారిని గుర్తించుటలో సహాయము చేయు కార్యము గొప్పది, మన బాధ్యత మహత్తరమైనది. సువార్తను ప్రతి ప్రాణికి బోధించ వలెనను ఆదేశమును ప్రభువు మనపై విధించెను. ఇందుకొరకు మన యొక్క అత్యుత్తమమైన ప్రయత్నాలు వినియోగ పడును”

మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ బోధించినట్లు: ఇశ్రాయేలు యొక్క ఆ గొప్ప సమకూర్పులో మిషనరీ సేవ ముఖ్యమైన భాగము. ఆ సమకూర్పు నేడు భూమిపై జరుగుచున్న అతి ముఖ్యమైన కార్యము. పరిమాణంలో మరేదీ పోల్చతగదు. ప్రాముఖ్యతలో మరేదీ పోల్చతగదు. ప్రభువు యొక్క సువార్తికులు—ఆయన శిష్యులు—ఈ రోజు భూమిపై గొప్ప సవాలుతో, గొప్ప ఉద్దేశముతో, అత్యంత గొప్ప కార్యమునందు నిమగ్నమై ఉన్నారు.”

ఈ విషయం నేను బ్రిటిష్ మిషనులో ఒక యవ్వన మిషనరీగా ఉన్నప్పుడు నా యంతట నేనే తెలుసుకున్నాను. ఈ రోజు మరింత ఖచ్చితంగా ఉన్నాను. మన ప్రేమను చూపుట, నమ్మకములను పంచుకొనుట, మరియు యేసు క్రీస్తు సువార్త యొక్క సంతోషమును మనతో కలిసి అనుభవించుటకు ఇతరులను ఆహ్వానించుట ద్వారా క్రీస్తును చేరుకొనునట్లు సహాయపడుటకు అవకాశములు ప్రతిచోటకలవు అని ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపోస్తలునిగా నేను ధృవీకరిస్తున్నాను.

ఆ కార్యము ముందుకు కదులును

నా సువార్తను ప్రకటించండి అను పుస్తకము యొక్క ప్రధమ సంచిక 2004 లో ప్రవేశపెట్టబడినప్పుడు, మరియు రెండవ సంచిక 2023 లో వెలువడినప్పుడు మరొక సారి నాకు ప్రత్యేక అవకాశముగా సంఘము యొక్క మిషనరీ శాఖలో పని అప్పగింప బడింది. నా సువార్తను ప్రకటించండి మిషనరీ సేవను ప్రగాఢంగా ఆశీర్వదించిందని నేను నమ్ముచున్నాను.

ప్రధమ అధ్యక్షతలోని ప్రతి సభ్యుని యొక్క మరియు పన్నెండు మంది అపోస్తలుల సమూహము యొక్క ప్రేరణతో డిజిటల్ తరమునందు పంచుకొనుటకుగాను మర్పులు చేయబడి 2004 మొదలు మనము నేర్చుకున్న ప్రతీది సరి క్రొత్త నా సువార్తను ప్రకటించండి లో చేర్చబడింది. ఈ మార్పులలో కొన్నింటి ఫలితంగా గణనీయమైన విజయం కలిగింది.

సువార్తను సాధారణ, సామాన్య, మరియు సహజమైన మార్గములో “ప్రేమించుట, పంచుకొనుట, మరియు ఆహ్వానించుట” అను సూత్రముల ద్వారా సువార్తను పంచుకొనుట వలన అధికంగా దీవించబడుదుమని మనము తెలుసుకున్నాము. యేసు క్రీస్తు భూమిపై జీవించియున్నప్పుడు ఈ విధంగానే సువార్తను పంచియున్నారు. ఆయన తన జీవితమును, మరియు ఆయన ప్రేమను పంచుతూ అందరిని తన యొద్దకు ఆహ్వానించియున్నాడు. (మత్తయి 11:28 చూడుము). ఆయన వలే ప్రేమించుట, పంచుకొనుట సంఘములో ప్రతి సభ్యునికి ప్రత్యేక దీవెన మరియు బాధ్యతయై యున్నవి.

ప్రేమతో ప్రారంభించండి

గెత్సెమనే తోటలోను, మరియు సిలువపైన, యేసుక్రీస్తు ప్రపంచ పాపములన్నిటిని స్వయంగా మోయుచు మన విచారములు, మరియు “నొప్పులు మరియు బాధలు మరియు ప్రతి రకమైన శోధనలు” ఆల్మా 7:11) భరించెను. ఈ గొప్ప మరియు అనంతమైన బాధ, “అందరికంటే గొప్పవాడైన [ఆయనను], … నొప్పి కారణంగా వణకించింది మరియు ప్రతి స్వేద రంధ్రము నుండి రక్తము కారేలా చేసింది” (సిద్ధాంతము మరియు నిబంధనలు 19:18). ఆయన ప్రాయశ్చిచిత్తము మరియు పునరుత్థానము ద్వారా యేసు క్రీస్తు అందరికి రక్షణను మరియు పైకెత్తబడుటను సాధ్యము చేసియున్నాడు.

రక్షకునివైపు తిరిగి ఆయన మనకొరకు చేసినదంతయు ధ్యానించుట వలన మనలో ఆయన యెడల ప్రేమతో నిండిన హృదయమును సృష్టించును. అప్పుడు ఆయన మన హృదయములను ఇతరులవైపు త్రిప్పి వారిని ప్రేమించుటకు (యోహాను 13:34–35 చూడుము) మరియు ఆయన సువార్తను వారితో పంచుకొనుటకు ఆజ్ఞాపించును (మత్తయి 28:19; మార్కు 16:15 చూడుము). మనము స్వచ్చముగా ప్రేమిస్తున్నామనియు మరియు వారి మేలు కోరుచున్నామనియు వారు భావించినట్లైతే; రాజైన లెమోనై అమ్మోను యొక్క ప్రేమ మరియు సేవ వలన తన హృదయమును సువార్తకు తెరచినట్లే వీరు కూడ మన సందేశములకు వారి హృదయాలు తెరువ గలరు ఆల్మా 17–19 చూడుము).

మనము సువార్తను పంచుకొనునప్పుడు, ప్రేమతో ప్రారంభిద్దాము. మనము ఇతరులను ప్రేమతో సమీపించినప్పుడు—వారు మన సహోదరులు మరియు సహోదరీలనియు—మన పరలోక తండ్రి యొక్క ప్రియమైన బిడ్డలనియు జ్ఞాపకముంచుకున్న యెడల మనము ఏదైతే సత్యమని తెలుసుకున్నామో దానిని పంచుకొనుటకు అవకాశములు మనకొరకు తెరుచుకొనును.

ఆతృతతో నిమగ్నమైయుండి పంచుకొనుడి

సువార్తను పంచుకొనుటలో అధ్యక్షుడు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ (1928–2023) కంటే ఎక్కువ అంకితమైన వారు ఎవరూ లేరు. మన పరలోక తండ్రి మరియు ప్రభువైన యేసు క్రీస్తు ఈ కడవరి దినాలలో తమను తాము బయలుపరచుకోవడం, మరియు యేసు క్రీస్తు యొక్క నిత్య సువార్త సంపూర్ణతను పునఃస్థాపించడానికి జోసెఫ్ లేపబడటం, ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అత్యంత మహిమాన్వితమైన మరియు అద్భుతమైన విషయాలలో ఒకటిగా నేను భావిస్తున్నాను.”

ఆయన జీవితాంతము మరియు ప్రపంచంలో అధిక భాగములో అధ్యక్షులు బల్లార్డ్ ఈ ప్రశస్తమైన సందేశమును ప్రతి ఒక్కరితో పంచుకొనుటకు ఆతృతతో నిమగ్నమై యుండే వారు. మనము అదే విధముగ చేయవలెనని ఆయన ప్రోత్సహించారు. “మంచి పొరుగు వారిగా ఉంటూ ఆదరణ మరియు ప్రేమను చూపుచు సువార్తను పంచుకోవలెనని ఆయన తలంచారు. ఆ విధంగా చేయుట వలన సువార్త మన జీవితాలలో ప్రకాశించును, మరియు … ఇతరులకు సువార్త అనుగ్రహించు దీవెనలను ప్రకాశింప చేయుదుము.” మనము “[మనము] ఏవైతే తెలుసుకున్నామో మరియు నమ్ముచున్నామో మరియు [మనము] ఏమి భావిస్తున్నామో అను సాక్ష్యమును” కూడ పొందుదుము. అధ్యక్షులు బల్లార్డ్ బోధించారు,“స్వచ్ఛమైన సాక్ష్యము మార్పు చెందిన హృదయం నుండి వస్తుంది మరియు దానిని పొందడానికి సిద్ధంగా ఉన్న ఇతరుల హృదయాలలోనికి అది పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా కొనిపోబడగలదు.”

యేసు క్రీస్తు యొక్క పునఃస్థాపిత సువార్తను పంచుకొనుట అధ్యక్షులు బల్లార్డ్ హృదయము యొక్క అత్యంత గొప్ప కోరిక. మనము కూడా —ఆయన వలె—సువార్తను పంచుకొనుటకు మన మాటలు మరియు క్రియలలోను నిమగ్నముకావలెను. సువార్త వెలుగు కొరకు వెదకుచున్నప్పటికి, దానిని ఎక్కడ కనుగొనవచ్చునో తెలియని వారు మనలో ఎవరున్నారో మనకు తెలియదు. (సిద్ధాంతము మరియు నిబంధనలు 123:12)

ఇద్దరు పురుషులు ఏవో మెట్లపైకి నడుచుట

హృదయపూర్వక ఆహ్వానములు అందించండి

ఇతరులు క్రీస్తు నొద్దకు వచ్చుచుటకు సహాయ పడుటకుగాను రక్షకుడు మరియు ఆయన సువార్త అందించు ఆనందమును అనుభవించుటకు వారిని ఆహ్వానించుదుము. ఏదైనా వినోద కార్యక్రమమునకు ఆహ్వానించుట, మోర్మను గ్రంధమును వినిపించుట, లేక మిషనరీలకు పరిచయం చేయుట ద్వారా మనము అది చేయగలము. సంస్కార సభకు వారు మనతో కలిసి పాల్గొనవలెనని వారికి హృదయపూర్వక ఆహ్వానం కూడా అందించ వచ్చును.

దేవుని ఆరాధించుటకు మరియు సంస్కారములో పాల్గొని యేసు క్రీస్తును మరియు ఆయన ప్రాయశ్చిత్తమును జ్ఞాపకము చేసుకొనుటకు మనము ప్రతి వారము సంస్కార సభకు హాజరగుచుంటాము.” జనులు ఆత్మానుభూతి పొందుటకు, రక్షకుని చెంతకు చేరుటకు, మరియు తమ విశ్వాసమును బలపరచుకొనుటకు ఇది సరైన సమయము.

ప్రేమించుటకు, పంచుకొనుటకు, మరియు ఆహ్వానించుటకు, మనము కనిపెట్టునప్పుడు, జనులు సంస్కార సభకు హాజరవ్వడానికి సహాయము చేయుట అనునది, మన పథకాలలోను, మరియు ప్రయత్నాలలోను భాగము కావలెను. వారు మన ఆహ్వానమును అంగీకరించి సంస్కార సభకు హాజరైన యెడల, వారు బాప్తీస్మమునకును, మరియు పరివర్తన మార్గంలో కొనసాగుటకును మరింత వీలగును. మనము ఇతరులను సంస్కార సభకు ఆహ్వానించుట, మరియు వారు తద్వారా వారు పొందగల దీవెనలను గుర్తించుటకు సహాయము చేయుట వలన మహత్తరమైన ఫలితము వచ్చునని నేను పూర్ణ హృదయంతో నమ్ముచున్నాను.

ప్రభువు మనలను నడిపించును

మనము ప్రేమించుచు, పంచుకొనుచు,ఆహ్వానించుట వలన ఎటువంటి విజయాలు మరియు సవాళ్ళు మనకు కలుగునో మనకెప్పుడూ తెలియదు. మోషైయా కుమారులు “లేమనీయుల మధ్య దేవుని వాక్యమును బోధించుటకు మరియు నేర్పించుటకు నగరము నుండి నగరమునకు మరియు ఒక ఆరాధన మందిరము నుండి మరొక చోటికి, పోయిరి; మరియు ఆవిధముగా వారు గొప్ప విజయము పొందుట మొదలు పెట్టిరి.” వారి ప్రయత్నాల ద్వారా, వేలమంది ప్రభువు యొక్క జ్ఞానము లోనికి కొని రాబడిరి,” మరియు చాలామంది పరివర్తన చెందిరి… [మరియు] ఎవ్వరును పతనము కాలేదు” (ఆల్మా 23:4–6).

ఇది ఎల్లప్పుడు మన అనుభవం కాక పోయినఫ్ఫటికి, ప్రభువు మనతో పాటు శ్రమిస్తానని మనకు వాగ్దానము చేసియున్నాడు, ఏలయనగా ప్రతి ఆత్మయు ఆయనకు ప్రశస్థమైనది. మనము ప్రభువునందు నమ్మికయుంచి ఆయన సేవలో నిమగ్నమైయున్నప్పుడు ఆయన సువార్తను ఇతరులతో పంచుకొనుటకు, వారిని ప్రేమించుచు, మన జీవితాలను, మరియు మన సాక్ష్యాలను వారితో పంచుకొనుచు మరియు ఆయనను అనుసరించుటలో మనకు తోడుగా వారిని ఆహ్వానించుదము.

ఆత్మలను తన యొద్దకు చేర్చుకొనుటయను క్రీస్తు యొక్క ఘనమైన కార్యములో ఆయనకు సహాయపడుటకు మన చుట్టునున్న అవకాశములను అందుకున్నప్పుడు “[మన] సంతోషము గొప్పదగును” (సిద్ధాంతము మరియు నిబంధనలు 18:15).

గమనిక

  1. Teachings of Presidents of the Church: David O. McKay (2003), xxii.

  2. Teachings of Presidents of the Church: Spencer W. Kimball (2006), 261, 262.

  3. గోర్డన్ బి. హింక్లీ, “Find the Lambs, Feed the Sheep,”లియహోనా, 1999 జూలై, 121. ఈ ప్రసంగము 1999, ఫిబ్రవరి 21, తేదీన ఒక ఉపగ్రహ ప్రసార సమయములో సాల్ట్ లేక్ టాబర్నకల్ నుండి విడుదలైనది.

  4. రస్సెల్ ఎమ్. నెల్సన్, “నిత్య నిబంధన,” లియహోనా, 2022 అక్టోబర్, 9.

  5. ఎమ్. రస్సెల్ బల్లర్డ్, “మనుష్యునికి స్తుతి,”లియహోనా, 2023, నవంబరు, 74.

  6. ఎమ్. రస్సెల్ బల్లర్డ్, “The Essential Role of Member Missionary Work,” లియహోనా, 2003, మే, 40.

  7. ఎమ్. రస్సెల్ బల్లర్డ్, “అతి ముఖ్యమైన దానిని జ్ఞాపకముంచుకోండి,” లియహోనా, 2023, మే, 107.

  8. నా సువార్తను ప్రకటించండి: యేసు క్రీస్తు యొక్క సువార్తను పంచుకొనుటకు మార్గదర్శి (2023), 88.

  9. నా సువార్తను ప్రకటించండి,, 172 చూడండి.