లియహోనా
అహరోను రాజునకు బోధించుట
2024 జూలై


“అహరోను రాజునకు బోధించుట,” ఫ్రెండ్ 2024 జూలై, 26–27.

నెలవారీ ఫ్రెండ్ సందేశం, 2024 జూలై

అహరోను రాజునకు బోధించుట

అహరోను ప్రజలకు బోధిస్తున్నాడు; అహరోను రాజు యెదుట నిలబడి యుండుట

ఆండ్రూ బోస్లీ చేత సచిత్ర వర్ణన

అహరోను మోషైయ కుమారులలో ఒకడు. అతడు ఒక పరిచారకుడు. అతడు లేమనీయుల దేశమంతటిపైగల రాజునకు బోధించెను.

అహరోను రాజుతో మాట్లాడుట

దేవునియందు నమ్ముచున్నావా అని అహరోను రాజును అడిగెను. దేవుడు నిజముగ ఉన్నాడని అహరోను గనుక తనతో చెప్పిన యెడల తాను నమ్ముదునని రాజు చెప్పెను. అతడు దేవుని గురించి మరింత ఎక్కువ చెప్పవలెనని అహరోనును అడిగెను.

అహరోను పరలోకము గురించి పూర్వ వృత్తాంతమును బోధించుట

అహరోను లేఖనములను రాజునకు చదివెను. అతడు భూమి యొక్క సృష్టిని గురించి బోధించెను. అతడు దేవుని ప్రణాలిక గురించి బోధించెను. అతడు రాజునకు యేసు క్రీస్తును గురించి చెప్పెను.

లేమనీయుల రాజు మోకరించుట; అహరోను ప్రజలకు బాప్తీస్మమునిచ్చుట

ఆ తరువాత, రాజు ప్రార్ధించెను. అహరోను ఏమి చెప్పెనో అది నిజమైనదా అని దేవుని అడిగెను. అది నిజమైనదను జవాబును రాజు పొందుకొనెను!

అహరోను ఏమి బోధించెనో అది రాజు నమ్మెను. అతని గృహ పరివారములో ప్రతి ఒక్కరు నమ్మిరి. వారు బాప్తీస్మము పొందిరి, మరియు క్రీస్తును అనుసరించుటకు ఎంచుకొనిరి.

రంగులువేసే పేజీ

ప్రేమను చూపించుట ద్వారా నేను యేసును అనుసరించగలను

రంగులు వేసే పేజీ పిల్లల కొరకు మరియు విశాల హృదయులకు

ఏడమ్ కోఫోర్డ్ చేత సచిత్ర వర్ణన

నీవు ఇతరులకు ప్రేమను ఏవిధంగా చూపుదువు?