“ఏప్రిల్ 15–21: ‘ఆయన చిత్తమును బట్టి, ఆయన నన్ను ప్రేరేపించును.’ ఈనస్–మోర్మన్ వాక్యములు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)
“ఏప్రిల్ 15-21. ఈనస్–మోర్మన్ వాక్యములు,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)
ఏప్రిల్ 15–21: “ఆయన చిత్తమును బట్టి, ఆయన నన్ను ప్రేరేపించును”
ఈనస్–మోర్మన్ వాక్యములు
భౌతిక ఆకలిని తృప్తిపరచుకోవడానికి మృగములను వేటాడేందుకు ఈనస్ అడవికి వెళ్ళాడు, కానీ అతడు రోజంతా మరియు రాత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాడు, ఎందుకనగా అతని “ఆత్మ ఆకలిగొనెను.” ఈ ఆకలి ఈనస్ “పరలోకములకు చేరునట్లు [అతని] స్వరమును ఎలుగెత్తేలా” చేసింది. ఈ అనుభవాన్ని దేవుని యెదుట “పెనుగులాటగా” అతడు వర్ణించాడు (ఈనస్ 1:2–4 చూడండి). దేవునికి దగ్గర కావడానికి మరియు ఆయన చిత్తమును తెలుసుకోవాలని కోరడానికి ప్రార్థన ఒక మనఃపూర్వకమైన ప్రయత్నమని మనం ఈనస్ నుండి నేర్చుకుంటాము. మీరు ఈ ఉద్దేశ్యముతో ప్రార్థన చేసినప్పుడు, దేవుడు మీ మాటలు వింటారని మరియు ఆయన మీ గురించి, మీ ప్రియమైనవారి గురించి, మీ శత్రువుల గురించి కూడా నిజంగా శ్రద్ధ చూపుతారని ఈనస్ గుర్తించినట్లే మీరు కూడా గుర్తిస్తారు (ఈనస్ 1:4–17 చూడండి). మీరు ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, మీరు మరింత బాగా ఆయన చిత్తాన్ని చేయగలరు. మోర్మన్ మాదిరిగా, మీరు “అన్ని విషయాలను ఎరుగకపోవచ్చు; కానీ … సంగతులన్నిటినీ ప్రభువు ఎరుగును; అందువలన ఆయన చిత్తమును బట్టి, ఆయన [మిమ్మల్ని] ప్రేరేపించును” (మోర్మన్ వాక్యములు 1:7).
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
దేవుడు నా ప్రార్థనలను విని, జవాబిస్తారు.
ప్రార్థనతో మీ అనుభవాలు ఈనస్ కంటే తక్కువ నాటకీయంగా ఉండవచ్చు, కానీ అవి తక్కువ అర్థవంతం కానవసరం లేదు. మీరు ఈనస్ 1:1–17ను చదువుతున్నప్పుడు ఆలోచించడానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి:
-
ఈనస్ ప్రార్థించినప్పుడు అతడు చేసిన ప్రయత్నాలను ఏ పదాలు వివరిస్తాయి?
-
4 నుండి 11 వచనాలలో ఈనస్ ప్రార్థనలు ఎలా మారాయి?
-
నా ప్రార్థనలను మెరుగుపరచుకోవడానికి నాకు సహాయపడగలిగేలా ఈనస్ నుండి నేను ఏమి నేర్చుకుంటాను?
నా కుటుంబాన్ని మంచి కొరకు ప్రభావితం చేయడానికి ప్రభువు నాకు సహాయపడగలరు.
క్రీస్తు యొద్దకు రావడానికి వారికి సహాయపడాలని మీరు కోరుకున్న ఒకరు మీ కుటుంబంలో ఉండవచ్చు, కానీ మీ ప్రయత్నాలు ఏమైనా మార్పు తెస్తున్నాయా అని మీరు ఆశ్చర్యపడుతుండవచ్చు. అతని కుమారుడైన ఈనస్ మీద జేకబ్ ప్రభావం గురించి ఈనస్ 1:1–4 నుండి మీరేమి నేర్చుకుంటారు? ఉదాహరణకు, “ప్రభువు యొక్క శిక్షణలో, ఉపదేశములో” అనే వాక్యభాగము మీకు ఏ అర్థమును కలిగియున్నది? మీ గృహములోనికి ఆయన ప్రభావమును మీరెలా ఆహ్వానించగలరు?
మీ స్వంత కుటుంబం గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు, ఈ ప్రశ్నలు మరియు వనరులను పరిగణించండి:
-
మీ కుటుంబాన్ని సానుకూల విధానాల్లో మీరెలా ప్రభావితం చేయగలరు? (1 నీఫై 2:16–18; 3:15–21; 5:1–6; 7:20–21; ఆల్మా 36:17–20; “కుటుంబము: ప్రపంచమునకు ఒక ప్రకటన” చూడండి). ఒకరు మీ సహాయాన్ని కోరుకోనట్లు ఉంటే లేదా మీ పట్ల నిర్దయగా ఉంటే, మీరేమి చేయగలరు?
-
కుటుంబ సభ్యులతో మీ సంబంధాలను నడిపించగలిగేలా క్రింది లేఖనాలలో మీరు కనుగొను సూత్రాలేవి? మత్తయి 5:21–24, 38–44; 6:14; 7:1–5; 22:36–39; 3 నీఫై 18:21; మొరోనై 7:33; సిద్ధాంతము మరియు నిబంధనలు 18:10–13.
క్రీస్తుపై విశ్వాసాన్ని నేను సాధన చేసినప్పుడు, నేను క్షమాపణను పొందగలను.
మీ పాపాల కొరకు మీరు పశ్చాత్తాపపడిన తర్వాత కూడా, ఆ పాపాలు క్షమించబడ్డాయా అని కొన్నిసార్లు మీరు ఆశ్చర్యపోవచ్చు. ఈనస్ 1:1–8లో ఈసన్ అనుభవం నుండి ఏ అంతరార్థములను మీరు పొందుతారు? అతడు క్షమాపణను పొందడానికి ముందు మరియు తరువాత ఈనస్ యేసు క్రీస్తు యందు తన విశ్వాసాన్ని ఎలా చూపాడు?
జేరమ్–ఓంనై
నేను ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు నన్ను దీవిస్తారు.
జేరమ్ మరియు ఓంనై గ్రంథాలు రెండూ నీతికి, వృద్ధికి మధ్య సంబంధాన్ని వివరిస్తాయి. జేరమ్ 1:7–12; ఓంనై 1:5–7, 12–18 నుండి మీరేమి నేర్చుకుంటారు? వృద్ధికి ప్రభువు యొక్క నిర్వచనం నుండి లోకమిచ్చు నిర్వచనాలు ఎలా భిన్నంగా ఉన్నాయి? ఆయన జనులు వృద్ధిచెందడానికి ప్రభువు ఎలా సహాయపడతారు? (ఆల్మా 37:13; 48:15–16 చూడండి).
“ఇశ్రాయేలు పరిశుద్ధుడైన క్రీస్తు నొద్దకు రండి.”
“క్రీస్తు నొద్దకు రండి” అనే ఆహ్వానము మోర్మన్ గ్రంథములో తరచుగా కనిపిస్తుంది. వాస్తవానికి, ఆ గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటి, ప్రతీఒక్కరికి ఈ ఆహ్వానాన్ని అందించడం. మీరు ఓంనై 1:25–26 చదువుతున్నప్పుడు, క్రీస్తు యొద్దకు ఎలా రావాలో వివరించే ఏ పదాలు లేదా వాక్యభాగాలను మీరు కనుగొంటారు? మరింత పూర్తిగా ఆయన యొద్దకు రావడానికి మీరు ఏమి చేస్తారు?
నేను ఆయన నడిపింపును అనుసరించినప్పుడు, దేవుడు నా ద్వారా పనిచేస్తారు.
నీఫై యొక్క చిన్న పలకలను మోర్మన్ గ్రంథములో చేర్చమని ప్రభువు మోర్మన్‌ను ప్రేరేపించడానికి గల ఒక కారణం ఏమనగా, అనువదించబడిన మొదటి 116 పేజీలు కోల్పోబడతాయని దేవునికి తెలుసు. ఈ వ్రాతలను (1 నీఫై నుండి ఓంనై వరకు ఉన్నవి) చేర్చమనే ప్రభువు ఉపదేశాన్ని మోర్మన్ అనుసరించాడని మీరెందుకు కృతజ్ఞత కలిగియున్నారు? వాటిని చేర్చుకోవడానికి మోర్మన్ ఇచ్చిన కారణాలేవి? (మోర్మన్ వాక్యములు 1:3–7 చూడండి). మీ ద్వారా లేదా ఇతరుల ద్వారా దేవుడు పనిచేయడాన్ని మీరు ఎప్పుడు చూసియున్నారు?
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ప్రార్థన ద్వారా నేను పరలోక తండ్రితో మాట్లాడగలను.
-
మీ పిల్లలు వారి ప్రార్థనలను మరింత అర్థవంతంగా చేయడానికి మీరు ఎలా సహాయపడగలరు? ఈనస్ ప్రార్థిస్తున్న చిత్రాన్ని వారికి చూపడాన్ని పరిగణించండి; వారు చూసేదానిని వారు వివరించేలా చేయండి. అప్పుడు వారు తమ కళ్ళు మూసుకొని, పరలోక తండ్రితో ముఖాముఖి మాట్లాడుతున్నట్లుగా ఊహించుకోవచ్చు. వారు దేని గురించి మాట్లాడాలి అనుకుంటారు? ఆయన వారితో ఏమి చెప్పాలని అనుకోవచ్చు?
-
మీరు బిగ్గరగా ఈనస్ 1:1–5 చదివినప్పుడు, చిన్నపిల్లలు వేటాడడం, ప్రార్థించడానికి మోకరించడం మొదలైనవి అభినయిస్తూ ఈనస్ వలె నటించవచ్చు. పెద్ద పిల్లలు ఈనస్ ప్రార్థనలను వివరించే పదము లేదా వాక్యభాగం కొరకు వినవచ్చు. ఈనస్ ప్రార్థనల గురించి ఈ పదాలు మనకేమి చెప్తాయి? మీ ఆత్మ “ఆకలిగొనిన” మరియు మీరు ప్రభువుకు “మొరపెట్టిన” ఒక అనుభవాన్ని పంచుకోండి (ఈనస్ 1:4).
పరలోక తండ్రి నా ప్రార్థనలను ఆలకిస్తారు మరియు జవాబిస్తారు.
-
పరలోక తండ్రి వారి ప్రార్థనలను ఆలకిస్తారు మరియు జవాబిస్తారని అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడగలరు? వారు ప్రత్యేకంగా ప్రార్థించే కొన్ని విషయాలను జాబితా చేయమని వారిని ఆహ్వానించడం గురించి ఆలోచించండి. తర్వాత, ఈనస్ 1:2, 9, 13–14, and 16లో ఈనస్ దేని కొరకు ప్రార్థించాడో కనుగొనడానికి మీరు వారికి సహాయపడవచ్చు.
ఈనస్ ప్రార్థనల యొక్క ఫలితాలేవి? (6, 9, 11 వచనాలు చూడండి).
మన ప్రార్థనలను ఎలా మెరుగుపరచుకోవాలనే దాని గురించి ఈనస్ అనుభవం నుండి మనము ఏమి నేర్చుకుంటాము?
-
పరలోక తండ్రి మీ ప్రార్థనలకు జవాబిచ్చిన కొన్ని విధానాల గురించి మీ పిల్లలకు చెప్పండి.
నేను పరిశుద్ధాత్మను వినినప్పుడు, నేను ఇతరులను దీవించగలను.
-
నీఫై యొక్క చిన్న పలకలను మోర్మన్ గ్రంథములో చేర్చమనే పరిశుద్ధాత్మ నడిపింపును మోర్మన్ అనుసరించాడు. ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథములో ఇప్పటివరకు మనం చదివిన ప్రతిదీ ఆత్మను ఆలకించడానికి మోర్మన్ ఎంచుకోవడం మూలంగా మనకు వచ్చింది. ఆత్మను ఆలకించడం గురించి నేర్చుకోవడానికి మీ పిల్లలకు మీరెలా సహాయపడగలరు? మోర్మన్ వాక్యములు 1:3–8 నుండి వచనాలను వంతులవారీగా చదవడానికి వారిని ఆహ్వానించండి. ప్రతీ వచనం నుండి వారు నేర్చుకున్న దాని గురించి మీరు మాట్లాడవచ్చు. తర్వాత మీ పిల్లలు:
-
ఈ సంవత్సరం మోర్మన్ గ్రంథములోని కథల నుండి వారు నేర్చుకున్న దానిని పంచుకోవచ్చు (వారు జ్ఞాపకం చేసుకోవడానికి రండి, నన్ను అనుసరించండి నుండి చిత్రాలు సహాయపడగలవు).
-
ఏదైనా చేయడానికి వారు నడిపించబడి, అది ఎవరినైనా దీవించిన అనుభవాల గురించి మాట్లాడండి.
-