2024 రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 1-7: “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా దేవునితో సమాధానపడుడి.” జేకబ్ 1–4


“ఏప్రిల్ 1-7: ‘క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా దేవునితో సమాధానపడుడి.’ జేకబ్ 1–4,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“ఏప్రిల్ 1-7. జేకబ్ 1–4,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

చిత్రం
యేసు పాదాల వద్ద మోకరిల్లిన స్త్రీ

Forgiven [క్షమించబడెను], గ్రెగ్ ఓల్సెన్ చేత అనుమతితో ఉపయోగించబడినది. www.GregOlsen.com

ఏప్రిల్ 1-7: క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా దేవునితో సమాధానపడుడి

జేకబ్ 1–4

నీఫైని తమ “గొప్ప రక్షణకర్త” గా నీఫైయులు పరిగణించారు (జేకబ్ 1:10 చూడండి). వారిని క్రీస్తు నొద్దకు రమ్మని అభ్యర్థిస్తూ, పాపమునకు వ్యతిరేకంగా వారిని హెచ్చరిస్తూ, అతడు వారిని ఆత్మీయ ప్రమాదాల నుండి కూడా కాపాడాడు. ఇప్పుడు ఆ బాధ్యత జేకబ్ పైకి వచ్చింది, నీఫై అతడిని యాజకునిగా మరియు బోధకునిగా ప్రతిష్ఠించాడు (జేకబ్ 1:18 చూడండి). “పాపమునందు శ్రమించుచున్న” వారిని ధైర్యముగా హెచ్చరించడానికి, అదే విధంగా ఇతరుల పాపాల చేత బాధింపబడిన వారి యొక్క “గాయపడిన మనస్సును” ఓదార్చడానికి బాధ్యతను జేకబ్ భావించాడు (జేకబ్ 2:5–9 చూడండి). అతడు ఆ రెండింటిని ఎలా చేయాలి? అతడు వారిని యేసు క్రీస్తు వైపు నడిపిస్తాడు—ఈ రెండు సమూహాలకు రక్షకుని స్వస్థత అవసరము (జేకబ్ 4 చూడండి). జేకబ్ సాక్ష్యము, అతని కంటే ముందు నీఫై ఇచ్చిన సందేశం వలె, “క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా [దేవుని]తో సమాధానపడుటకు” పిలుపు (జేకబ్ 4:11).

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

జేకబ్ 1:6–8, 15–19; 2:1–11

“ప్రభువు నుండి నా పిలుపును” పొందితిని.

జేకబ్‌ కొరకు దేవుని వాక్కును బోధించడం అనేది “ప్రభువు నుండి ఇవ్వబడిన పిలుపు,” కాబట్టి అతడు “[తన] స్థానమును ఘనపరచాలని” అత్యంత శ్రద్ధగా శ్రమించాడు (జేకబ్ 1:17, 19). జేకబ్ చేత ఉపయోగించబడిన ఈ వాక్యభాగాలు మీకు ఏ అర్థమునిస్తున్నాయి? ఒక భూతద్దము ఏమి చేస్తుందో ఆలోచించండి. అది మీకు ఏవైనా ఉపాయాలనిస్తుందా? జేకబ్ 1:6–8, 15–19 మరియు 2:1–11ను మీరు ధ్యానించినప్పుడు, మీ కొరకు ప్రభువు ఇచ్చిన పిలుపుల గురించి ఆలోచించండి. వాటిని “ఘనపరచడానికి” మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడ్డారు?

జేకబ్ 2:12–21

“మీ హృదయ గర్వము మీ ఆత్మలను నాశనము చేయకుండా చూచుకొందురు గాక!”

గర్వము మరియు సంపదలపై దృష్టికేంద్రీకరించడం అనే సమస్యలను నీఫైయులు కలిగియున్నారు (జేకబ్ 2:13 చూడండి), ఆ సమస్య వారికి లేదా వారి కాలానికి మాత్రమే ప్రత్యేకించినది కాదు. ఈరోజుల్లో సంపదలపై ప్రేమను అపవాది ఏవిధంగా ప్రోత్సహిస్తున్నాడు? జేకబ్ 2:12–21 చదివిన తర్వాత, భౌతిక సంపదను మీరు ఎలా చూడాలని దేవుడు కోరుతున్నారో మీ స్వంత మాటలలో వివరించండి. మీరు నేర్చుకుంటున్న దాని గురించి మీరు ఏమి చేయాలని ప్రేరణ పొందారు?

చిత్రం
సెమినరీ చిహ్నము

జేకబ్ 2:22–35; 3:10–12

ప్రభువు పవిత్రత యందు ఆనందించును.

మీరు జేకబ్ 2:22–35; 3:10–12 చదువుతున్నప్పుడు, దేవునికి పవిత్రత ఎందుకంత ముఖ్యమైనదో గ్రహించడానికి మీకు సహాయపడేలా మీరు దేనిని కనుగొంటారు? జేకబ్ రోజులలో మరియు మన రోజులలో—దుర్నీతి యొక్క ప్రతికూల పర్యవసానాలలో కొన్ని ఏవి? పవిత్రమైన జీవితాన్ని జీవించడం వలన కలిగే దీవెనలేవి?

“సంతానోత్పత్తి యొక్క పవిత్రతను ఎక్కువగా అపహాస్యం చేసే లోకంలో” మనము జీవిస్తున్నామని ఎల్డర్ డేవిడ్ ఎ. బెడ్నార్ బోధించారు (“We Believe in Being Chaste,” Liahona, May 2013, 41– 41). పవిత్రత యొక్క చట్టానికి మీరెందుకు లోబడియున్నారో ఇతరులు అర్థం చేసుకోవడానికి మీరెలా సహాయపడతారు? For the Strength of Youth: A Guide for Making Choices (pages 22–29) లోని “Your body is sacred” లో లైంగిక భావాలు మరియు సంబంధాల గురించి దేవుని ప్రమాణాల వివరణ మీరు ప్రారంభించడానికి సరైనది. మీరు పవిత్రత యొక్క చట్టాన్ని ఎందుకు జీవిస్తున్నారో వివరించడానికి మీకు సహాయపడేలా ఈ వనరులో ఇంకా దేనిని మీరు కనుగొంటారు?

లైంగిక స్వచ్ఛత గురించి దేవుని ప్రమాణము మీరు ఎదుర్కొనే ఇతర సందేశాల నుండి ఏవిధంగా భిన్నంగా ఉంది? పవిత్రమైన జీవితాన్ని జీవించడం వలన కలిగే దీవెనలేవి?

జేకబ్ 4

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా నేను దేవునితో సమాధానపడగలను.

“క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా [దేవుని]తో సమాధానపడుడి” అని జేకబ్ తన ప్రజలను వేడుకున్నాడు (జేకబ్ 4:11). సమాధానపడడం యొక్క ఒక నిర్వచనం ఏమనగా, స్నేహం లేదా సామరస్యాన్ని పునరుద్ధరించడం. మీ జీవితం గురించి మీరు ధ్యానిస్తున్నప్పుడు, మీరు పరలోక తండ్రి నుండి దూరమైనట్లు భావించిన ఒక సమయం గురించి ఆలోచించండి. ఈ సంబంధాన్ని పునరుద్ధరించడానికి రక్షకుడు మీకేవిధంగా సహాయపడ్డారు? దేవునితో సమాధానపడుటకు మీకు సహాయపడునట్లు ఈ అధ్యాయములో మీరు ఏ సలహాను కనుగొనగలరు? (4–14 వచనాలు చూడండి).

మత్తయి 5:23–24 నుండి అదనంగా ఏ అంతరార్థములను మీరు పొందుతారు? దేవునితో—మరియు ఇతరులతో సమాధానపడడానికి రక్షకుడు మీకు ఎలా సహాయపడగలరు?

2 నీఫై 10:24 కూడా చూడండి.

జేకబ్ 4:8–18

రక్షకునిపై దృష్టి పెట్టడం ద్వారా నేను ఆధ్యాత్మిక అంధత్వాన్ని నివారించగలను.

జేకబ్ తన ప్రజలను మరింత పూర్తిగా ప్రభువు వైపునకు తిప్పడానికి ప్రయత్నించినప్పుడు, ఆధ్యాత్మికంగా అంధులుగా ఉండవద్దని మరియు సువార్త యొక్క “సరళమైన మాటలను” తృణీకరించవద్దని అతడు వారిని హెచ్చరించాడు (జేకబ్ 4:13–14 చూడండి). జేకబ్ 4:8–18 ప్రకారం, ఆధ్యాత్మిక అంధత్వాన్ని నివారించడానికి మనం ఏమి చేయగలము?

రక్షకుడు బోధించినప్పుడు, ఆయన అనుదిన జీవితపు పోలికలను ఉపయోగించారు. యేసు యొక్క ఉపమానాలు వారి సాధారణ అనుభవాలలో ఆత్మీయ సత్యాలను కనుగొనడానికి జనులకు సహాయపడ్డాయి. మీరు బోధించేటప్పుడు అలాగే చేయడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, జేకబ్ 4:8–18 బోధిస్తున్నప్పుడు, ఎప్పుడైనా కంటి పరీక్ష చేయించుకున్నారా అని మీరు అభ్యాసకులను అడగవచ్చు. వారి భౌతిక దృష్టిని వైద్యుడు ఎలా అంచనా వేసాడు? మన ఆత్మీయ దృష్టిని మనమెలా అంచనా వేయగలము?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

జేకబ్ 2:8

గాయపడిన మనసును దేవుడు స్వస్థపరుస్తారు.

  • “గాయపడిన మనసు” ఎలా స్వస్థపరచబడగలదో అర్థం చేసుకోవడానికి మీ పిల్లలకు సహాయపడేందుకు, మన శరీరాలు ఎలా గాయపరచబడతాయో మరియు అవి స్వస్థపడడానికి ఏది సహాయపడుతుందోనని మీరు కలిసి చర్చించవచ్చు. బహుశా మీ పిల్లలు వారు గాయపడిన సమయాలు మరియు స్వస్థపడడానికి వారికి ఏది సహాయపడిందనే దాని గురించి మాట్లాడవచ్చు. ఈ సంభాషణలో భాగంగా మీరు వారికి గాయానికి కట్టే కట్లు లేదా మందులు కూడా చూపించవచ్చు. మీ ఆత్మకు స్వస్థత అవసరమైనప్పుడు రక్షకుడు మీకు ఎలా సహాయపడ్డారో మీరు వారితో పంచుకోవచ్చు.

జేకబ్ 2:17-19

నేను వారితో పంచుకున్నప్పుడు, అవసరంలో ఉన్న ఇతరులకు నేను సహాయపడగలను.

  • జేకబ్ కాలంలో ఉన్న జనులలో కొంతమంది చాలా ధనవంతులు, కానీ వారికున్న దానిని ఇతరులతో వారు పంచుకోవాలనుకోలేదు. జేకబ్ 2:17–19లో జేకబ్ వారికి బోధించిన దానిని మీరు చదువుతున్నప్పుడు, ఈ వచనాలలోని మాటలు లేదా వాక్యభాగాలతో సరిపోయే చిత్రాలు లేదా వస్తువులను మీరు మీ పిల్లలకు పట్టుకోవడానికి ఇవ్వవచ్చు. మీరు ఈ వస్తువులను వారితో పంచుకుంటున్నారని మీరు వివరించవచ్చు; తర్వాత ఆ వస్తువులను మీతో లేదా ఒకరితో ఒకరు పంచుకోమని మీరు వారిని ఆహ్వానించవచ్చు. మీరు పంచుకొనేటప్పుడు మీరు ఎలా భావించారనే దాని గురించి మాట్లాడండి. ఇతరులు సంతోషించేలా వారికి సహాయపడునట్లు ఇంకా మనం వారితో ఏమి పంచుకోగలము?

  • జేకబ్ 2:17ను కలిసి చదివిన తర్వాత, బహుశా మీ పిల్లలు పరలోక తండ్రి వారితో పంచుకున్న కొన్ని దీవెనల గురించి చెప్పవచ్చు. మనం ఒకరితో ఒకరు పంచుకోవాలని ఆయన ఎందుకు కోరుతున్నారు?

జేకబ్ 4:6, 10–11

నేను యేసు క్రీస్తు నందు నా విశ్వాసమును బలపరచుకోగలను.

  • క్రీస్తు నందు జేకబ్ విశ్వాసము ఎంత బలమైనదంటే, అది కదల్చబడలేదు. అటువంటి విశ్వాసాన్ని ఎలా నిర్మించాలో మీ పిల్లలకు బోధించడానికి, మన శరీరాలను బలంగా చేసుకోవడానికి మనం చేసే విషయాల గురించి మీరు వారిని అడగవచ్చు. యేసు క్రీస్తు నందు మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి మనమేమి చేయగలము? వారి విశ్వాసాన్ని “నిశ్చలంగా” చేసుకోవడానికి జేకబ్ మరియు అతని జనులు ఏమి చేసారో కనుగొనడానికి పిల్లలకు సహాయపడేందుకు జేకబ్ 4:6 కలిసి చదవండి.

  • వారి విశ్వాసంలో “నిశ్చలంగా” ఉండడం అంటే ఏమిటో మీ పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయపడేందుకు మరొక విధానం, ఒక పెద్ద చెట్టును కనుగొని, ఆ చెట్టు యొక్క విడివిడి కొమ్మలను ఊపాల్సిందిగా వారిని అడగడం. ఆ తర్వాత చెట్టు కాండమును ఊపడానికి ప్రయత్నించమని వారికి చెప్పడం. చెట్టు కాండమును ఊపడం ఎందుకు కష్టం? యేసు క్రీస్తుయందు మన విశ్వాసాన్ని నిశ్చలంగా చేయడానికి మనం చేయగల వాటిని జేకబ్ 4:6, 10–11 లోని ఏ వచనాలు వివరిస్తాయి?

    చిత్రం
    ఒక ఉద్యానవనంలో పెద్ద చెట్టు

    చెట్టు కాండము వలె, క్రీస్తుపై మన విశ్వాసం “నిశ్చలంగా” ఉండగలదు.

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

చిత్రం
బంగారు పలకలపై వ్రాస్తున్న జేకబ్

I Will Send Their Words Forth (Jacob the Teacher) [నేను వారి మాటలను ముందుకు పంపెదను (బోధకుడైన జేకబ్)], ఎల్స్‌పెత్ కెయిట్లిన్ యంగ్ చేత

ముద్రించు