“మార్చి 25–31: ‘ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి … లేచును.’ ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2023)
“మార్చి 25-31. ఈస్టర్,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2023)
మార్చి 25–31: “ఆయన తన రెక్కల యందు స్వస్థత కలిగి … లేచును”
ఈస్టర్
ప్రాచీన అపొస్తలులు యేసు క్రీస్తు మరియు ఆయన పునరుత్థానమును గూర్చి వారి సాక్ష్యములందు ధైర్యముగా ఉన్నారు (అపొస్తలుల కార్యములు 4:33 చూడండి). బైబిలులో వ్రాయబడిన వారి మాటల వలన లక్షలమంది యేసు క్రీస్తు నందు విశ్వసించి, ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, యేసు క్రీస్తు సర్వలోక రక్షకుడు అయితే, ఆయన ప్రత్యక్ష సాక్ష్యములు ఒక చిన్న ప్రాంతము నుండి కొందరు జనులకు ఎందుకు పరిమితం చేయబడ్డాయి? అని కొందరు ఆశ్చర్యపడవచ్చు.
యేసు క్రీస్తు లోకము యొక్క రక్షకుడు అని, “సమస్త జనములకు తనను ప్రత్యక్షపరచుకొనునని” (మోర్మన్ గ్రంథము యొక్క శీర్షిక పేజీ) మరియు ఆయన వద్దకు వచ్చు వారందరికి రక్షణను ఇచ్చునని ఒప్పించుటకు మోర్మన్ గ్రంథము అదనపు సాక్ష్యముగా నిలబడుతుంది. అదనముగా, ఈ రెండవ సాక్ష్యము రక్షణ అనగా అర్థమేమిటో కూడా స్పష్టము చేస్తుంది. అందుకే నీఫై, జేకబ్, మోర్మన్ మరియు ప్రవక్తలందరు—వారు కూడా “క్రీస్తును గూర్చి ఎరిగియున్నారు మరియు … ఆయన మహిమ యొక్క నిరీక్షణ కలిగియున్నారు” (జేకబ్ 4:3–4) అని భవిష్యత్ తరములకు ప్రకటించుటకు “ఈ మాటలను పలకలపై చెక్కుటకు చాలా శ్రద్ధగా” కృషి చేసారు. ఈ ఈస్టర్ సమయంలో, క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్త శక్తి విశ్వవ్యాప్తమైనది మరియు వ్యక్తిగతమైనది—సమస్త లోకమును విమోచించును మరియు మిమ్మల్ని విమోచించుననే మోర్మన్ గ్రంథములోని సాక్ష్యములను గూర్చి ఆలోచించండి.
గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు
యేసు క్రీస్తు మూలముగా నేను పునరుత్థానము చెందుతాను.
ఈస్టర్ సమయాన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము గురించి ధ్యానించుట సంప్రదాయకమైనది, కానీ పునరుత్థానము చెందుట అనగా ఖచ్చితమైన అర్థమేమిటి? పునరుత్థానము గురించి మోర్మన్ గ్రంథము ఏ అంతరార్థములను ఇస్తుంది? బహుశా ఈ ఈస్టర్ సమయంలో, 2 నీఫై 9:6–15, 22; ఆల్మా 11:42–45; 40:21-25; 3 నీఫై 26:4–5లో పునరుత్థానము గురించి మీరు కనుగొనే సత్యములను మీరు జాబితా చేయవచ్చు.
పునరుత్థానము గురించి ఈ సత్యములు మీ చర్యలను మరియు మీరు జీవించే విధానమును ఎలా ప్రభావితం చేస్తాయో కూడా మీరు నమోదు చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ వాక్యాలను ఎలా పూరిస్తారో ఆలోచించండి: నేను ఈ విషయాలను తెలుసుకోనట్లయితే … మరియు నాకు ఈ విషయాలు తెలుసు కాబట్టి …
సువార్త గ్రంథాలయములో ఈస్టర్ వీడియోల సేకరణ ఉంది, అది మీ అధ్యయనంలో అర్థవంతమైన భాగం కాగలదు.
లూకా 24:36–43; అపొస్తలుల కార్యములు 24:15; 1 కొరింథీయులకు 15:12–23; రీనా ఐ. అబుర్తో, “సమాధికి విజయము లేదు,” లియహోనా, మే 2021, 85–86 కూడా చూడండి.
యేసు క్రీస్తు నా పాపములు, బాధలు మరియు బలహీనతలను తనపై తీసుకున్నారు.
యేసు క్రీస్తు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసారని బైబిలు స్పష్టముగా బోధిస్తుంది. మోర్మన్ గ్రంథము, ముఖ్యమైన విధానాలలో క్రీస్తు యొక్క త్యాగము మరియు ఆయన అనుభవించిన బాధ గురించి మన అవగాహనను పెంచుతుంది. మోషైయ 3:7; 15:5–9; ఆల్మా 7:11–13లో ఈ బోధనలలో కొన్నిటిని మీరు కనుగొనవచ్చు. ఈ గద్యభాగములను మీరు చదివిన తరువాత, క్రింది పటములో మీరు కనుగొన్న దానిని వ్రాయడం గురించి ఆలోచించండి:
రక్షకుడు అనుభవించిన బాధ ఏమిటి? |
ఆయన ఎందుకు బాధను అనుభవించారు? |
ఇది నాకు ఏ అర్థమును కలిగియున్నది? |
---|---|---|
ఈ గద్యభాగాలను చదవడానికి ఇక్కడ మరొక విధానమున్నది: అవి బోధించే సందేశాలతో జతపరచబడతాయని మీరు భావించే కీర్తనల కొరకు చూడండి. రక్షకుని త్యాగాన్ని మరింత ఎక్కువగా అభినందించడానికి ఈ కీర్తనలు మరియు లేఖనాల నుండి ఏ వాక్యభాగాలు మీకు సహాయపడతాయి?
యెషయా 53; హెబ్రీయులకు 4:14–16; జెరాల్డ్ కాస్సే, “జీవముతోనున్న క్రీస్తుకు ఒక సజీవ సాక్ష్యము,” లియహోనా, మే 2020, 38–40 కూడా చూడండి.
యేసు క్రీస్తు నన్ను శుద్ధిచేయగలరు మరియు నేను పరిపూర్ణుడగుటలో సహాయపడగలరు.
మోర్మన్ గ్రంథము ప్రధానంగా యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము వలన మార్పుచెందిన జనుల వృత్తాంతమని చెప్పబడవచ్చు. మోషైయ 5:1–2; 27:8–28; ఆల్మా 15:3–12; 24:7–19లో ఈ అనుభవాలలో కొన్నిటిని మీరు చదువవచ్చు. అదేవిధంగా ఇతర మాదిరులను చదవడం గురించి మీరు ఆలోచించవచ్చు. ఈ అనుభవాలలో ఉమ్మడిగా ఉన్న దేనిని మీరు గమనించారు? మీరు గమనించిన తేడాలు ఏవి? రక్షకుడు మిమ్మల్ని ఏవిధంగా మార్చగలరనే దాని గురించి ఈ అనుభవాలు మీకేమి బోధిస్తాయి?
ఆల్మా 5:6–14; 13:11–12; 19:1–16; 22:1-26; 36:16-21; ఈథర్ 12:27; మొరోనై 10:32–33 కూడా చూడండి.
పిల్లలకు బోధించడానికి ఉపాయములు
ఈ ఆదివారం నెలలో ఐదవ ఆదివారం కాబట్టి, “అనుబంధం బి: దేవుని నిబంధన బాటపై జీవితకాలము నిలిచేందుకు పిల్లలను సిద్ధపరచుట”లోని అభ్యాస కార్యకలాపాలను ఉపయోగించమని ప్రాథమిక బోధకులు ప్రోత్సహించబడ్డారు.
యేసు పునరుత్థానము చెందినందువలన, నేను కూడా పునరుత్థానము చెందుతాను.
-
లేదా ఈ అధ్యాయాల్లోని చిత్రాలను ఉపయోగించి మీ పిల్లలు మీకు కథ చెప్పనివ్వండి.
-
అమెరికాలోని జనులకు పునరుత్థానుడైన రక్షకుని దర్శనము ఆయన పునరుత్థానానికి ఒక శక్తివంతమైన సాక్ష్యము. ఆయన గాయములు తాకుట (3 నీఫై 11:14–15 చూడండి) లేదా ఆయన దీవించిన పిల్లలలో ఒకరిగా ఉండుట ఎలా ఉండియుండవచ్చో ఊహించమని మీ పిల్లలను ప్రోత్సహించండి (3 నీఫై 17:21 చూడండి). యేసు క్రీస్తు మరియు ఆయన పునరుత్థానం గురించి మీ భావాలను ఒకరితో ఒకరు పంచుకోండి.
-
పునరుత్థానం గురించి మోర్మన్ గ్రంథము ఏమి బోధిస్తుందో మీ పిల్లలు కనుగొనడానికి సహాయపడేందుకు, మీకు దాని గురించి ఏమీ తెలియనట్లుగా నటించమని మీరు వారిని ఆహ్వానించవచ్చు మరియు దానిని మీకు వివరించమని వారిని అడగవచ్చు. ఇటువంటి ప్రశ్నలకు జవాబుల కొరకు 2 నీఫై 9:10–15; ఆల్మా 11:41–45; మరియు ఆల్మా 40:21–23లో చూడడానికి వారికి సహాయపడండి: పునరుత్థానము చెందుట అనగా అర్థమేమిటి? ఎవరు పునరుత్థానం చెందుతారు? వారి జవాబులో భాగంగా రక్షకుని పునరుత్థానం గురించి సాక్ష్యము చెప్పమని కూడా వారిని ఆహ్వానించండి.
నన్ను ఎలా ఓదార్చాలో యేసు క్రీస్తుకు తెలుసు.
-
ఆయన ప్రాయశ్చిత్తములో భాగంగా రక్షకుడు అనుభవించిన దానిలో కొంత మోషైయ 3:7 మరియు ఆల్మా 7:11 వివరిస్తాయి. మీరు ఈ వచనాలలో ఒకదానిని మీ పిల్లల కోసం చదువవచ్చు మరియు మన కోసం యేసు అనుభవించిన దాని గురించి వారికి చెప్పే పదాల కొరకు వినమని వారిని అడగవచ్చు. తర్వాత, ఆయన దానిని ఎందుకు అనుభవించారో కనుగొనడానికి మీరు ఆల్మా 7:12 చదువవచ్చు. ఆయన మనల్ని ఆదరించగలుగునట్లు యేసు క్రీస్తు మనందరి బాధలు, రోగాలను అనుభవించారని సాక్ష్యమివ్వండి.
-
మీ పిల్లలు యేసు క్రీస్తు మరియు ఆయన పునరుత్థానమును గూర్చి వారికి ఇష్టమైన కీర్తన లేదా పాటను కలిగియున్నారా? మీరు కలిసి దానిని పాడవచ్చు లేదా క్రొత్తదానిని నేర్చుకోవచ్చు. రక్షకుడు మనకు అందించే ఓదార్పు మరియు శాంతి గురించి మీకు బోధించేలా సాహిత్యంలో ఉన్న మాటలు లేదా వాక్యభాగాల గురించి మాట్లాడండి.
యేసు క్రీస్తు నన్ను శుద్ధిచేయగలరు మరియు నేను మారడానికి సహాయపడగలరు.
-
మోర్మన్ గ్రంథము ప్రధానంగా రక్షకుని ప్రాయశ్చిత్తము వలన మార్పుచెందిన అనేకమంది జనుల మాదిరులనిస్తుంది. బహుశా మీ పిల్లలు ఈనస్ (ఈనస్ 1:2–8 చూడండి), చిన్నవాడగు ఆల్మా (మోషైయ 27:8–24 చూడండి) లేదా ఆంటై-నీఫై-లీహైయులు (ఆల్మా 24:7–19 చూడండి) వంటి వారిలో ఒకరి గురించి నేర్చుకోవడాన్ని ఎంచుకోవచ్చు. యేసు క్రీస్తు ప్రాయశ్చిత్తం వలన ఈ వ్యక్తి లేదా సమూహము ఎలా మారారు? వారి మాదిరులను మనము ఎలా అనుసరించగలము?
-
మీరు, మీ పిల్లలు శుభ్రంగా ఉన్న ఒకదానిని, మురికిగా ఉన్నదానితో పోల్చవచ్చు మరియు మురికివి ఎలా శుద్ధిచేయబడతాయో మాట్లాడవచ్చు. ఆల్మా 13:11-13 కలిసి చదవండి. మన పాపాల నుండి మనము శుద్ధిచేయబడగలుగునట్లు యేసు ఏమి చేసారు? పాపం గురించి అది మనల్ని ఏవిధంగా భావించేలా చేస్తుంది? రక్షకుని గురించి అది మనల్ని ఏవిధంగా భావించేలా చేస్తుంది?