2024 రండి, నన్ను అనుసరించండి
మార్చి 11–17: “ఒక అద్భుతకార్యము మరియు ఒక ఆశ్చర్యకార్యము.” 2 నీఫై 26–30


“మార్చి 11-17: ‘ఒక అద్భుతకార్యము మరియు ఒక ఆశ్చర్యకార్యము.’ 2 నీఫై 26-30,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“మార్చి 11-17. 2 నీఫై 26-30,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

ఒక స్త్రీని సమీపిస్తున్న యేసు

He Will Lead Thee by the Hand [ఆయన నిన్ను చేయి పట్టుకుని నడిపించును], శాండ్రా రస్ట్ చేత

మార్చి 11–17: “ఒక అద్భుతకార్యము మరియు ఒక ఆశ్చర్యకార్యము”

2 నీఫై 26–30

“అంత్య దినముల గురించి నేను మీకు ప్రవచించుచున్నాను,” అని నీఫై వ్రాసాడు (2 నీఫై 26:14). మరొకమాటలో చెప్పాలంటే, అతడు మన రోజు గురించి వ్రాసాడు. అతడు చూసిన దాని గురించి చింతించడానికి కారణముంది: జనులు దేవుని శక్తిని, అద్భుతాలను నిరాకరిస్తున్నారు; అసూయ, శతృత్వాలు విస్తృతమయ్యాయి. కానీ అపవాది నేతృత్వంలో ఈ కడవరి దినపు “అంధకార క్రియలకు” (2 నీఫై 26:10, 22) అదనంగా, ప్రభువు నేతృత్వంలోని “ఒక అద్భుతకార్యము మరియు ఒక ఆశ్చర్యకార్యమును” గురించి కూడా నీఫై మాట్లాడాడు (2 నీఫై 27:26). ఆ కార్యానికి కేంద్రము ఒక గ్రంథము—సాతాను యొక్క అబద్ధాలను బహిర్గతం చేసి, నీతిమంతులను సమకూర్చే గ్రంథము. ఆ గ్రంథము మోర్మన్ గ్రంథము, అద్భుతకార్యము అనగా కడవరి దినములలో ప్రభువు సంఘము యొక్క కార్యము మరియు ఆశ్చర్యమేమనగా—కొంతవరకు—మనకు బలహీనతలు ఉన్నప్పటికీ, సమకూర్పులో పాల్గొనడానికి దేవుడు మనందరినీ ఆహ్వానిస్తారు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

2 నీఫై 26–27; 29–30

దేవుడు మన కాలం కొరకు మోర్మన్ గ్రంథాన్ని సిద్ధం చేశారు.

2 నీఫై 26–27లో, యెషయా యొక్క మునుపటి ప్రవచనం నుండి నీఫై వ్యాఖ్యానించాడు (యెషయా 29 చూడండి) మరియు అతని జనులతో, వారి గ్రంథమైన మోర్మన్ గ్రంథముతో దానిని పోల్చాడు. మోర్మన్ గ్రంథము పూర్తిగా వ్రాయబడక ముందే, అది ఒకరోజు “నరుల సంతానమునకు చాలా విలువైనదిగా” అవుతుందని నీఫై బయల్పాటు ద్వారా తెలుసుకున్నాడు (2 నీఫై 28:2). ఎందుకు మోర్మన్ గ్రంథము మీకు చాలా విలువైనది? మీరు 2 నీఫై 29–30 చదువుతున్నప్పుడు ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. మోర్మన్ గ్రంథము ద్వారా దేవుడు ప్రపంచంలో మరియు మీ జీవితంలో సాధిస్తున్న “అద్భుతకార్యము” (2 నీఫై 27:26) ఏది?

జోసెఫ్ స్మిత్—చరిత్ర 1:62-65 కూడా చూడండి.

సెమినరీ చిహ్నము

2 నీఫై 26:23-33

ఆయన వద్దకు రమ్మని యేసు క్రీస్తు మనందరిని ఆహ్వానిస్తున్నారు.

2 నీఫై 26:23–24లో పరిగణించవలసిన అందమైన సత్యాలు అనేకమున్నాయి. ఉదాహరణకు, “లోకమునకు ప్రయోజనకరమైన దాని కొరకు”—మరియు మీ కొరకు యేసు క్రీస్తు చేసిన దాని గురించి మీరు ఆలోచించవచ్చు. ఆయన “మనుష్యులందరినీ”—మరియు మిమ్మల్ని—ఎలా “తన వైపు ఆకర్షిస్తారు”? ఆయన ప్రేమ యొక్క వ్యక్తీకరణలకు ప్రతిస్పందనగా మీరు ఏమి చేయాలని ప్రేరేపించబడినట్లు భావిస్తున్నారు?

రక్షకుని గురించిన సత్యాల కొరకు 25–33 వచనాలలో చదవడాన్ని, వెదకడాన్ని కొనసాగించండి. ప్రత్యేకించి ఆయన ఆహ్వానాలను గమనించండి. మీ కొరకు యేసు క్రీస్తు యొక్క సందేశాన్ని ఒక్క వాక్యంలో మీరెలా సంక్షిప్తపరుస్తారు?

మీరు ఇతరులతో సంభాషించే తీరును, క్రీస్తు నొద్దకు రమ్మని వారిని ఆహ్వానించే తీరును ఈ వచనాలు ఎలా ప్రభావితం చేయగలవో ఆలోచించండి. ఎల్డర్ డి. టాడ్ క్రిస్టాఫర్సన్ గారి సందేశము, “చెందియుండడం యొక్క సిద్ధాంతము,” (లియహోనా, నవ. 2022, 53-56) లో మీరు కొన్ని ఉపాయాలను కనుగొనవచ్చు.

3 నీఫై 18:30–32; డాలిన్ హెచ్. ఓక్స్, “మన రక్షకుడు మన కోసం ఏమి చేసారు?,” లియహోనా, మే 2021, 75–77 కూడా చూడండి.

నిశ్శబ్దాన్ని చూసి భయపడకండి. మంచి ప్రశ్నలకు జవాబివ్వడానికి సమయం పడుతుంది. వాటికి పరిశోధన, ఆలోచన మరియు ప్రేరేపణ అవసరం. ఒక ప్రశ్నకు జవాబు కోసం వేచి చూసే సమయం ధ్యానించడానికి గల పవిత్ర సమయం కాగలదు. మరొక విషయం గురించి మాట్లాడుతూ, త్వరగా ఈ సమయాన్ని ముగించాలనే శోధన నుండి తప్పించుకోండి.

2 నీఫై 28

సాతాను మోసగించడానికి ప్రయత్నిస్తాడు.

సాతాను యొక్క అబద్ధాలు మరియు కుయుక్తులలో అనేకము 2 నీఫై 28లో బహిర్గతం చేయబడ్డాయి. 6, 8, 21–23, 29 వచనాలలో వాటి కోసం చూడండి. సాతాను అబద్ధాల గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి? అపవాది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఏమి చేస్తారు?

సాతాను అబద్ధాలను నిరాకరించే కొన్ని లేఖనాలు క్రింద జాబితా చేయబడ్డాయి. ఈ వచనాలలోని నిజమైన సిద్ధాంతాన్ని 2 నీఫై 28లో నీఫై మనల్ని హెచ్చరించిన అబద్ధపు సిద్ధాంతముతో మీరు జతపరచగలరేమో చూడండి:

గ్యారీ ఈ. స్టీవెన్‌సన్, “నన్ను మోసగించకు,” లియహోనా, నవ. 2019, 93-96 కూడా చూడండి.

2 నీఫై 28:27–3129

దేవుడు తన పిల్లలకు మార్గనిర్దేశం చేయడానికి బయల్పాటు ఇస్తూనే ఉంటారు.

కడవరి దిన పరిశుద్ధులుగా మనం సమృద్ధిగా దేవుని వాక్యంతో దీవించబడ్డాము. అయినప్పటికీ, నీఫై హెచ్చరించినట్లుగా, మనం ఎన్నడూ “మాకు చాలినంత ఉన్నది!” అని భావించకూడదు. మీరు 2 నీఫై 28:27–31 మరియు 2 నీఫై 29 లోని హెచ్చరికలను చదువుతున్నప్పుడు, ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచించండి:

  • ఆయన వాక్యం గురించి నేను ఎలా భావించాలని, స్పందించాలని ప్రభువు కోరుకుంటారు?

  • దేవుని నుండి ఎక్కువ సత్యాన్ని పొందడం గురించి జనులు కొన్నిసార్లు ఎందుకు “కోపపడతారు”? (2 నీఫై 28:28). నేను ఎప్పుడైనా ఈ విధంగా భావించానా? భావించినట్లయితే, నేనెలా మారగలను?

  • దేవుని వాక్యమును పొందడం అంటే ఏమిటి? నేను ఆయన వాక్యమును ఎక్కువగా పొందాలనుకుంటున్నాను అని ఆయనకు నేను ఎలా చూపించగలను?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

2 నీఫై 26:23-28, 33

ప్రతీఒక్కరు ఆయన వద్దకు రావాలని యేసు క్రీస్తు కోరుతున్నారు.

  • ఈ వచనాలలో రక్షకుని ఆహ్వానాల గురించి మీ పిల్లలకు బోధించడానికి, పుట్టినరోజు పండుగ వంటి ఒక ప్రత్యేక కార్యక్రమానికి వారు జనులను ఆహ్వానించిన సమయాల గురించి మీరు వారితో మాట్లాడవచ్చు. తర్వాత మీరు కలిసి 2 నీఫై 26:23–28 చదివి, ఏమి చేయమని యేసు మనల్ని ఆహ్వానిస్తున్నారో కనుగొనవచ్చు. యేసు క్రీస్తు వద్దకు రమ్మని ఒకరిని ఆహ్వానిస్తూ ఒక పత్రికను తయారు చేయడాన్ని మీ పిల్లలు ఇష్టపడవచ్చు. వారి ఆహ్వానపత్రికలో ఈ వచనాల నుండి ఒక వాక్యాన్ని ఉపయోగించమని వారిని ప్రోత్సహించండి.

  • ఈ సారాంశము చివరన ఉన్న చిత్రపటము అనేక నేపథ్యాలు గల జనులను చూపుతుంది. మీరు 2 నీఫై 26:33 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు ఈ చిత్రాన్ని చూడవచ్చు. మీ పిల్లలు చిత్రములోని ప్రతీ వ్యక్తిని—మరియు తర్వాత తమనుతాము చూపించినప్పుడు, “ఆయన వద్దకు రమ్మని యేసు అందరినీ ఆహ్వానిస్తారు” అనే వాక్యాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చెప్పవచ్చు. మనం యేసు వద్దకు ఎలా రాగలము?

2 నీఫై 28:2; 29:7–11; 30:3–6

మోర్మన్ గ్రంథము ఒక దీవెన.

  • మోర్మన్ గ్రంథము “చాలా విలువైనది” (2 నీఫై 28:2) అని మీ పిల్లలు భావించేలా సహాయపడేందుకు, ఒక ప్రతిని మీరు బహుమతిలా కాగితంలో చుట్టి, లోపల ఏముందో వారిని ఊహించనివ్వండి. ఆధారాల కోసం వారు 2 నీఫై 30:3–6లో చూడవచ్చు. మోర్మన్ గ్రంథము మీకెందుకు చాలా విలువైనదో మీ పిల్లలకు చెప్పండి మరియు వారిని తమ మనోభావాలు పంచుకోనివ్వండి.

  • ఒక స్నేహితుడు ఇలా చెప్పడాన్ని ఊహించుకోమని మీ పిల్లలను అడగడం గురించి ఆలోచించండి, “నేను మోర్మన్ గ్రంథమును చదవనవసరం లేదు. నేను ఇంతకుముందే బైబిలు చదివాను.” మన స్నేహితునికి మనమేమి చెప్పగలము? రెండు గ్రంథాలు కలిగియుండాలని ఎందుకు దేవుడు మనల్ని కోరుతున్నాడో తెలుసుకోవడానికి 2 నీఫై29:7–11 కలిసి చదవండి.

2 నీఫై 28:30–31

పరలోక తండ్రి నాకు కొద్ది కొద్దిగా బోధిస్తారు.

  • “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ”గా నేర్చుకోవడమంటే అర్థమేమిటో గ్రహించడానికి మీ పిల్లలకు సహాయపడేలా ఒక వస్తుపాఠం గురించి బహుశా మీరు ఆలోచించవచ్చు. ఉదాహరణకు, ఒకసారి ఒక ముక్క తీసుకొని ఒక పజిల్‌ను పూర్తి చేయవచ్చు లేదా బ్లాకులతో ఏదైనా నిర్మించవచ్చు. లేదా ఒక్కొక్క మెట్టుగా మీరు వారికి, ఒక విల్లు కట్టడం లేదా ఒక బొమ్మ గీయడం వంటి నైపుణ్యాన్ని బోధించవచ్చు. తర్వాత మీరు 2 నీఫై 28:30 చదివి, పరలోక తండ్రి ఒక్కోసారి ఒక్కో సత్యాన్ని మనకెలా బోధిస్తారో చర్చించవచ్చు.

  • మరొక ఉపాయం ఏమిటంటే, 2 నీఫై 28:30 నుండి ఒక వాక్యభాగాన్ని ఎంచుకొని, ఒక్కోసారి ఒక్కో పదం చొప్పన వంతులవారీగా దానిని వ్రాయడం. ఇది దేవుడు మనకు సత్యాన్ని ఇవ్వడాన్ని ఏవిధంగా పోలియున్నది? దేవుడు మనకు నిజాన్ని అంతా ఒక్కసారిగా కాకుండా “ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, ఇచ్చట కొంత అచ్చట కొంత” ఎందుకు వెల్లడిస్తారు? మనము ఆయన నుండి మరి ఎక్కువ సత్యాన్ని పొందాలనుకుంటున్నామని మనం దేవునికి ఎలా చూపగలము?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

జనసమూహము మధ్య యేసు క్రీస్తు

Christ in the Midst [మధ్యలో క్రీస్తు], జూడిత్ ఎ. మెహర్ చేత