2024 రండి, నన్ను అనుసరించండి
ఏప్రిల్ 22-28: “దేవుని యెడల, సమస్త మనుష్యుల యెడల ప్రేమతో నిండియుండునట్లు.” మోషైయ 1–3


“ఏప్రిల్ 22-28: ‘దేవుని యెడల, సమస్త మనుష్యుల యెడల ప్రేమతో నిండియుండునట్లు.’ మోషైయ 1-3,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: మోర్మన్ గ్రంథము 2024 (2024)

“ఏప్రిల్ 22-28. మోషైయ 1-3,” రండి, నన్ను అనుసరించండి—గృహము మరియు సంఘము కొరకు: 2024 (2024)

తన జనులకు బోధిస్తున్న రాజైన బెంజమిన్

Receiving the Teachings of King Benjamin [రాజైన బెంజమిన్ యొక్క బోధనలను పొందుట], మారియా అలెజాండ్రా గిల్ చేత

ఏప్రిల్ 22-28: “దేవుని యెడల, సమస్త మనుష్యుల యెడల ప్రేమతో నిండియుండునట్లు”

మోషైయ 1–3

రాజు అనే మాటను మీరు విన్నప్పుడు, మీరు కిరీటాలు, సేవకులు మరియు సింహాసనములను గూర్చి ఆలోచించవచ్చు. మోషైయ 1–3లో, మీరు వేరే రకమైన రాజును గూర్చి చదువుతారు. జనుల యొక్క శ్రమలపై ఆధారపడుటకు బదులుగా, రాజైన బెంజమిన్ “[తన] స్వహస్తములతో శ్రమించియున్నాడు” (మోషైయ 2:14). ఇతరులు అతనికి సేవ చేయుటకు బదులుగా, “ప్రభువు [అతనికి] దయచేసిన పూర్ణ శక్తి, మనస్సు మరియు బలము” (మోషైయ 2:11) తో అతడు తన జనులకు సేవ చేసాడు. ఈ రాజు తన జనులు తనను ఆరాధించాలని కోరలేదు; బదులుగా వారి పరలోక రాజైన యేసు క్రీస్తును ఆరాధించమని అతడు వారికి బోధించాడు. “పరిపాలన చేయువాడు సర్వశక్తిమంతుడైన ప్రభువు” (మోషైయ 3:5) అని, “పరలోకము నుండి దిగి” వచ్చెనని మరియు “ఆయన నామమందు విశ్వాసముంచుట ద్వారా నరుల సంతానమునకు రక్షణ రాగలదని ఆయన తన స్వజనుల యొద్దకు వచ్చును” (మోషైయ 3:5, 9) అని రాజైన బెంజమిన్ గ్రహించాడు.

గృహములో మరియు సంఘములో నేర్చుకోవడానికి ఉపాయములు

మోషైయ 1:1–7

“[లేఖనాలను] శ్రద్ధగా వెదకండి.”

ఈ వచనాలలో, పవిత్ర గ్రంథాలు రాజైన బెంజమిన్ జనులను ఎలా దీవించాయో గమనించండి. మీరు లేఖనాలను కలిగియున్నందువలన మీ జీవితం మంచిగా ఎలా ఉంది?

సెమినరీ చిహ్నము

మోషైయ 2:10–26

నేను ఇతరులకు సేవ చేసినప్పుడు, నేను దేవునికి కూడా సేవ చేస్తున్నాను.

అతడు “పూర్ణ శక్తి, మనస్సు మరియు బలము” తో ఎందుకు సేవ చేసాడని మీరు అతడిని అడిగినట్లైతే, రాజైన బెంజమిన్ ఏమి చెప్తాడని మీరనుకుంటున్నారు? (మోషైయ 2:11). మీరు మోషైయ 2:10-26 చదువుతున్నప్పుడు, దీని గురించి ధ్యానించండి. మరింత అర్థవంతమైన విధానంలో ఇతరులకు సేవచేయడానికి మిమ్మల్ని ప్రేరేపించేలా రాజైన బెంజమిన్ ఏమి బోధించాడు? ఉదాహరణకు, మీరు ఇతర జనులకు సేవ చేసినప్పుడు, మీరు దేవునికి కూడా సేవ చేస్తున్నారని తెలుసుకొనుట మీకు ఏ అర్థాన్ని కలిగియున్నది? (మోషైయ 2:17 చూడండి). ఈ వారములో ఎవరైనా ఒకరికి మీరు ఎలా సేవ చేయగలరనే దాని గురించి ప్రేరేపణను వెదకండి.

మనం ఇతరులకు సేవచేయాలని మనకు తెలిసినప్పటికీ, కొన్నిసార్లు మనం సవాళ్ళను ఎదుర్కొంటాము. మోషైయ 2:10-26ను చదవడానికి మరొక విధానం ఏదనగా, మీరు సేవ చేయకుండా ఆపివేసే సవాళ్ళను జయించడానికి మీకు సహాయపడగలిగేలా రాజైన బెంజమిన్ బోధించిన సత్యాలను జాబితా చేయడం. రాజైన బెంజమిన్ బోధించినది నిజమని మీకు చూపిన అనుభవాలేవి?

అధ్యక్షురాలు జాయ్ డి. జోన్స్ ఒక శక్తివంతమైన అనుభవాన్ని పంచుకున్నారు, అది ఇతరులకు సేవ చేసే విధానము పట్ల ఆమె దృక్పథాన్ని మార్చివేసింది. “ఆయన కొరకు” (Ensign లేదా లియహోనా, నవ. 2018, 50–52)లో దాని గురించి చదవండి మరియు ఇతరులకు సేవచేయడానికి మీకు గల అవకాశాల గురించి ఆలోచించండి. మీరు కొన్నిటిని జాబితా చేయవచ్చు మరియు ఆ అవకాశాలను మీరు సమీపించే విధానాన్ని మోషైయ 2:17 తో పాటు అధ్యక్షురాలు జోన్స్ సందేశము ఎలా ప్రభావితం చేయవచ్చో ధ్యానించవచ్చు.

మత్తయి 25:40 కూడా చూడండి.

హత్తుకొంటున్న ఇద్దరు స్త్రీలు

నేను ఇతరులకు సేవ చేసినప్పుడు, నేను దేవునికి కూడా సేవ చేస్తున్నాను.

మోషైయ 2:38-41

దేవుని ఆజ్ఞలు పాటించడం వలన సంతోషం వస్తుంది.

దేవునికి విధేయులవడం వలన కలిగే సంతోషాన్ని మీరు ఎలా వివరిస్తారు? మీరు ఆయన ఆజ్ఞలను ఎందుకు పాటిస్తున్నారో వివరించడానికి మీకు సహాయపడేలా మోషైయ 2:38–41లో ఏవైనా వాక్యభాగాలున్నాయా?

మోషైయ 3:1–20

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా నేను పరిశుద్ధునిగా మారగలను.

అతని జనులు “వారి పాప క్షమాపణను పొందునట్లు మరియు మహదానందముతో సంతోషించునట్లు” (మోషైయ 3:13) రాజైన బెంజమిన్, ప్రవక్తలందరి వలే యేసు క్రీస్తు గురించి సాక్ష్యమిచ్చాడు. మోషైయ 3:1–20లో రక్షకుని గూర్చి రాజైన బెంజమిన్ యొక్క సాక్ష్యమును మీరు చదివినప్పుడు ధ్యానించుటకు ఇక్కడ కొన్ని ప్రశ్నలున్నాయి:

  • రక్షకుడు మరియు ఆయన నియమితకార్యము గురించి ఈ వచనముల నుండి నేను ఏమి నేర్చుకుంటాను?

  • ఒక పరిశుద్ధునిగా మారుటకు అర్థమేమిటనే దాని గురించి మోషైయ 3:18–19 నుండి నేను ఏమి నేర్చుకుంటాను?

  • పాపమును జయించి, నా స్వభావమును మార్చుకొని, మరింతగా పరిశుద్ధుని వలే మారుటకు యేసు క్రీస్తు నాకు ఏవిధంగా సహాయపడ్డారు?

మోషైయ 3:5-21

“సర్వశక్తిమంతుడైన ప్రభువు … పరలోకము నుండి దిగివచ్చును.”

విద్యుఛ్ఛక్తి ఏమి చేయడానికి మీకు సామర్థ్యాన్నిస్తుంది? అది లేకపోతే, మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేది? మీ జీవితంలో రక్షకుడు తీసుకురాగల గొప్ప శక్తి గురించి మీరు ధ్యానించడానికి ఈ ప్రశ్నలు సహాయపడగలవు.

రాజైన బెంజమిన్‌కు అగుపించిన దూత యేసు క్రీస్తును “సర్వశక్తిమంతుడైన ప్రభువు”గా సూచించాడు, అది ఆయన సమస్త శక్తిని కలిగియున్నారని చెప్పే ఒక బిరుదు. రక్షకుడు ఆ శక్తిని ఎలా ఉపయోగిస్తారనే దాని గురించి మోషైయ 3:5–21 నుండి మీరేమి నేర్చుకుంటారు? రక్షకుని శక్తిని మీ జీవితంలో, మీ చుట్టూనున్న వారి జీవితాల్లో మీరు ఎలా చూసారు? ఏమి చేయడానికి మరియు ఏమి కావడానికి ఆయన శక్తి మీకు సాధ్యపరుస్తుంది? అది లేకపోతే, మీ జీవితం ఎలా భిన్నంగా ఉండేది?

మరిన్ని ఉపాయముల కోసం, లియహోనా మరియు యౌవనుల బలము కొరకు పత్రికల యొక్క ఈ నెల సంచికలను చూడండి.

పిల్లలకు బోధించడానికి ఉపాయములు

మోషైయ 2:11-18

నేను ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు, నేను దేవుడిని సేవిస్తున్నాను.

  • ఈ వారపు ప్రోత్సాహ కార్యక్రమ పేజీలో మీ పిల్లలు తయారుచేయగల సులువైన కిరీటమున్నది. మోషైయ 2–3లో కనుగొనబడేవి, రాజైన బెంజమిన్ తన జనులకు బోధించిన కొన్ని విషయాలను మీరు పంచుకుంటుండగా, వారు వంతులవారీగా కుర్చీ లేదా పీటమీద నిలబడి, రాజైన బెంజమిన్ వలె నటించవచ్చు.

  • మీ పిల్లలు నేర్చుకోవడానికి మోషైయ 2:17 ఒక మంచి వచనము కాగలదు. ఒకసారి కొన్ని పదాల చొప్పున దానిని పునరుచ్ఛరించేలా మీరు వారికి సహాయపడవచ్చు. లేదా అనేక ముఖ్య పదాలను తీసివేసి మీరు ఆ వచనాన్ని వ్రాసి, ఆ పదాలను కనుగొనమని మీ పిల్లలను అడగవచ్చు. తర్వాత, మనం ఒకరికొకరు సేవచేసుకోవాలని దేవుడు ఎందుకు కోరుతున్నారనే దాని గురించి మీరు మీ పిల్లలతో మాట్లాడవచ్చు.

  • ఇతరులకు సేవ చేయడానికి రాజైన బెంజమిన్ ఏమి చేసాడో కనుగొనడానికి మోషైయ 2:11–18 ను వెదకడానికి మీరు మీ పిల్లలకు సహాయపడవచ్చు. తర్వాత మీ పిల్లలు కుటుంబ సభ్యులకు వారు సేవ చేయగల కొన్ని విధానాలను కాగితపు ముక్కలపై వ్రాయవచ్చు. ఆ కాగితాలను ఒక సంచి లేదా సీసా వంటి దానిలో వేయండి, ఆ విధంగా ప్రతీరోజు మీ పిల్లలు అందులో నుండి ఒకదానిని ఎంపికచేసి, ఎవరి కొరకైనా ఆ సేవను చేయగలరు.

మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా పిల్లలు లాభం పొందుతారు. అనేకసార్లు ప్రోత్సాహ కార్యక్రమాలను పునరావృతం చేయడానికి భయపడకండి, ప్రత్యేకించి చిన్నపిల్లలతో. పునరావృతం చేయడం పిల్లలు నేర్చుకొనేదానిని వారు గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది.

ఒక బట్ట ముక్కను మడతపెడుతున్న పిల్లలు

ఇతరులకు సేవ చేయడం ద్వారా మనం దేవునికి సేవ చేయగలమని రాజైన బెంజమిన్ బోధించాడు.

మోషైయ 2:19-25

నా దీవెనలన్నీ పరలోక తండ్రి నుండి వస్తాయి.

  • అతని జనులకు రాజైన బెంజమిన్ చేసిన సేవ దేవుని పట్ల అతని గాఢమైన కృతజ్ఞత చేత ప్రేరేపించబడింది. మీ పిల్లలలో అటువంటి భావాలను మీరెలా ప్రేరేపిస్తారు? మోషైయ 2:21 ను మీరు కలిసి చదువవచ్చు మరియు పరలోక తండ్రి మీకు ఇచ్చిన దీవెనల జాబితాను ప్రారంభించవచ్చు. తరువాత పిల్లలు ఆలోచించగల ఇతర దీవెనలను మీరు జాబితాకు జతచేయవచ్చు.

  • పరలోక తండ్రి దీవెనలను మీ పిల్లలు గుర్తించడానికి సహాయపడేందుకు మీరు ఆడగల ఆట ఒకటి ఇక్కడున్నది. కృతజ్ఞత గురించి ఒక పాటను వారు పాడుతున్నప్పుడు లేదా వింటున్నప్పుడు పిల్లలు రక్షకుని చిత్రాన్ని ఒకరికొకరు అందించుకోవచ్చు. క్రమానుగతంగా పాడడాన్ని లేదా సంగీతాన్ని ఆపి, చిత్రాన్ని పట్టుకున్నవారిని వారు కృతజ్ఞత కలిగియున్న ఒక దీవెన గురించి మాట్లాడమని ఆహ్వానించండి. మోషైయ 2:22–24 ప్రకారం, మన దీవెనల కొరకు మనం కృతజ్ఞత కలిగియున్నామని మనమెలా చూపగలము?

మోషైయ 3:5-10, 19

మరింతగా ఆయన వలె కావడానికి యేసు క్రీస్తు నాకు సహాయపడతారు.

  • యేసు క్రీస్తు యొక్క జీవితము మరియు పరిచర్య గురించి ముఖ్యమైన సత్యాలను ఒక దేవదూత రాజైన బెంజమిన్‌కు చెప్పాడు. మోషైయ 3:5–10లో చెప్పబడిన కొన్ని సంఘటనల చిత్రాల కొరకు మీరు, మీ పిల్లలు చూడవచ్చు (ఉదాహరణకు, Gospel Art Book, nos. 30, 41, 42, 5759 చూడండి). మీరు మోషైయ 3:5–10 చదువుతున్నప్పుడు, మీ పిల్లలు ఆ చిత్రాలలో కనిపించే దేనినైనా గద్యభాగంలో వారు వినినప్పుడు వారు తమ చేతులను పైకెత్తవచ్చు.

  • ఒక తయారీ విధానాన్ని ఉపయోగించి ఏదైనా పదార్థాన్ని తయారుచేయడానికి మీ పిల్లలు ఎప్పుడైనా సహాయపడ్డారా? మీరు ఆ అనుభవం గురించి మాట్లాడవచ్చు మరియు మనం యేసు క్రీస్తు వలె ఎలా మారగలమనే దానికి ఒక “తయారీ విధానం” కొరకు మోషైయ 3:19 ను ఉపయోగించవచ్చు. ఆయన వలె మారుటకు యేసు మనకెలా సహాయపడతారు?

మరిన్ని ఉపాయముల కోసం, ఫ్రెండ్ పత్రిక యొక్క ఈ నెల సంచికను చూడండి.

తన జనులకు ప్రవచిస్తున్న రాజైన బెంజమిన్

King Benjamin’s Address [రాజైన బెంజమిన్ యొక్క ప్రసంగము], జెరెమి విన్‌బర్గ్ చేత