2010–2019
ఆయన కొరకు
అక్టోబర్ 2018


11:54

ఆయన కొరకు

ఎవరికి సేవ చేయాలి మరియు ఎందుకు సేవ చేయాలో తెలుసుకొనుట, ప్రేమ యొక్క మహోన్నతమైన ప్రత్యక్షతయే దేవుని పై భక్తి అని గ్రహించుటకు మనకు సహాయపడును.

ఈ ముఖ్యమైన రాత్రియందు, నా ప్రియమైన సహోదరీలైన మీలో ప్రతీఒక్కరికి నా ప్రేమను, ప్రశంసను నేను వ్యక్తపరుస్తున్నాను. మీ వయస్సు, ప్రదేశము లేక పరిస్థితి ఏదైనప్పటికీ, నేటిరాత్రి మనము ఐక్యత, బలము, ఉద్దేశమునందు మరియు మన పరలోక తండ్రి, మన రక్షకుడైన యేసు క్రీస్తు మరియు జీవించియున్న మన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ ల చేత నడిపించబడుచున్నామని మరియు ప్రేమించబడుచున్నామనే సాక్ష్యమునందు సమావేశమయ్యాము.

మేము యౌవన దంపతులుగా ఉన్నప్పుడు, నా భర్త, నేను అనేక సంవత్సరాలుగా సంఘానికి హాజరు కాని ఒక కుటుంబమును దర్శించి, పరిచర్య చేయుటకు మా బిషప్పు చేత పిలువబడ్డాము. మేము ఇష్టపూర్వకంగా పనిని అంగీకరించాము మరియు కొన్నిరోజుల తరువాత, వారి ఇంటికి వెళ్లాము. సంఘము నుండి ఎవరూ వారిని చూడడానికి వారు ఇష్టపడుట లేదని వెంటనే మాకు స్పష్టమయ్యింది.

అందువలన మా తరువాతి సందర్శనలో, చాక్లెట్ చిప్ బిస్కట్లు వారి హృదయాలను కరిగిస్తాయని మేము ఒక ప్లేటు బిస్కట్లతో వారిని సమీపించాము. కాని వారు కరగలేదు. మేము స్వాగతించబడడం లేదని ఇంకా స్పష్టపరుస్తూ, ఆ దంపతులు మాతో తలుపు తెర గుండా మాట్లాడారు. కాని మేము తిరిగి ఇంటికి వెళ్లుచుండగా, వారికి మరొక విందును ఇస్తే విజయము కలగవచ్చని మేము చాలా ఖచ్చితంగా అనుకున్నాము.

మాకు ఆత్మీయ దర్శనము లేకపోవుట వలన అదనపు ప్రయత్నాలు నిరాశను కలిగించాయి. తిరస్కారము ఎన్నడూ సౌకర్యముగా ఉండదు. కొంతకాలానికి మేము ఇలా ప్రశ్నించుకున్నాము, “మేము దీనిని ఎందుకు చేస్తున్నాము? మా ఉద్దేశ్యమేమిటి? ”

ఎల్డర్ కార్ల్ బి. కుక్ ఇలా చెప్పారు: “మనల్ని భయపెట్టే దానిని చేయుటకు మనము అడుగబడిన యెడల, సేవ చేయుటకు మనము అలసిపోయిన యెడల, లేక మొదట ఆకర్షణీయంగా కనబడనిది ఏదైనా చేయుటకు మనము పిలువబడిన యెడల . . . . సంఘములో సేవ చేయుట కష్టమైనదిగా ఉండవచ్చు.”1 మా స్వంత దానికంటే గొప్ప దర్శనము కలిగిన పరలోక తండ్రి నుండి నడిపింపును కోరాలని నిర్ణయించినప్పుడు, మేము ఎల్డర్ కుక్ గారి మాటల్లోని వాస్తవాన్ని అనుభూతిచెందాము.

అందుచేత, అధికమైన మనఃపూర్వకమైన ప్రార్థన మరియు అధ్యయనము తరువాత, మా సేవ ఎందుకు అనే ప్రశ్నకు జవాబును మేము పొందాము. మా అవగాహనలో మార్పు, హృదయములో మార్పు, ఒక బయల్పాటు అనుభవము కలిగింది.2 లేఖనములనుండి మేము నడిపింపును పొందినప్పుడు, ఇతరులకు సేవ చేయు ప్రక్రియను సులువైనదిగా, మరింత అర్థవంతమైనదిగా ఎలా చేయాలో ప్రభువు మాకు బోధించారు. మేము చదవగా మా హృదయాలు మరియు పద్ధతి రెండిటిని మార్చిన వచనమిది: “మీ దేవుడైన ప్రభువును మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ శక్తితో, మనస్సుతో, మరియు బలముతో ప్రేమించుము మరియు యేసు క్రీస్తు నామములో ఆయనను సేవించుము.”3 ఈ వచనము చాలా పరిచయమున్నది అయినప్పటికీ, క్రొత్తదైన మరియు ముఖ్యమైన విధానములో మాతో మాట్లాడుతున్నట్లుగా అనిపించింది.

ఈ కుటుంబమునకు మరియు బిషప్పుకు సేవ చేయుటకు మేము నిజాయితీగా ప్రయాసపడుతున్నామని మేము గ్రహించాము, కానీ ప్రభువు కొరకు ప్రేమతో మేము నిజముగా సేవ చేస్తున్నామా అని మాకై మేము ప్రశ్నించుకోవాలి. ఈ విలక్షణతను రాజైన బెంజిమెన్ ఇలా చెప్పినప్పుడు, స్పష్టపరిచాడు, “ఇదిగో నేను మీతో చెప్పుచున్నాను, నేను మీ సేవలో నా దినములు గడిపియున్నానని నేను మీతో చెప్పితిని, కాబట్టి నేను గొప్ప చెప్పుకొనగోరను, ఏలయనగా నేను కేవలము దేవుని సేవలో ఉన్నాను.”4

అయితే రాజైన బెంజిమెన్ నిజముగా ఎవరికి సేవ చేస్తున్నాడు? పరలోక తండ్రికి మరియు రక్షకునికి. ఎవరికి మరియు ఎందుకు ఇతరులకు సేవ చేయాలో తెలుసుకొనుట, ప్రేమ యొక్క మహోన్నతమైన ప్రత్యక్షతయే దేవునిపై భక్తి అని గ్రహించుటకు మనకు సహాయపడును.

మా దృష్టి క్రమముగా మారినప్పుడు, మా ప్రార్థనలు కూడా మారాయి. ప్రభువు పట్ల మా ప్రేమ వలన ఈ కుటుంబముతో మా సందర్శనాల కొరకు మేము ఎదురుచూడసాగాము.5 మేము దానిని ఆయన కొరకు చేస్తున్నాము. ఆయన దానిని తక్కువ ప్రయాసకరమైనదిగా చేసారు. మేము అనేక నెలలు మెట్ల మీద నిలబడిన తరువాత, ఆ కుటుంబము మమ్మల్ని లోపలికి రానివ్వసాగారు. చివరకు, మేము క్రమముగా ప్రార్థన మరియు సువార్త చర్చలు కలిపి జరిపాము. శాశ్వతమైన స్నేహబంధము వృద్ధి చెందింది. ఆయన పిల్లలను ప్రేమించుట ద్వారా మేము ఆయనను ఆరాధిస్తున్నాము మరియు ప్రేమిస్తున్నాము.

అవసరతలో ఉన్న ఎవరికైనా మీరు నిజాయితీగా సహాయపడి, మీ ప్రయత్నాలు గమనించబడనట్లుగా లేక అభినందించబడకుండా లేక ఇష్టములేనట్లుగా ఉన్నట్లు భావించిన సమయమును మీరు ఆలోచించగలరా? ఆ క్షణములో, మీ సేవ యొక్క విలువను మీరు ప్రశ్నించారా? అలాగైతే, “మీరు మీ దేవుని సేవలో మాత్రమే ఉన్నారు: ”6 అనే రాజైన బెంజిమెన్ మాటలు మీ అనుమానమును, మీ గాయమును భర్తీ చేయునుగాక.

కోపమును పెంచుకొనుటకు బదులుగా, సేవ ద్వారా మనము మన పరలోక తండ్రితో ఎక్కువ పరిపూర్ణమైన అనుబంధమును నిర్మించగలము. ఆయన పట్ల మన ప్రేమ, మన భక్తి గుర్తింపు కొరకు అవసరతను లేక అభినందనను నిరోధించును మరియు మనకు, మన ద్వారా ప్రవహించుటకు ఆయన ప్రేమను అనుమతించును.

కొన్నిసార్లు మొదట మనము కర్తవ్యము లేక బాధ్యత యొక్క భావనతో సేవ చేస్తాము, కానీ ఆ సేవ కూడ “ఇతరులకు సేవ చేయుటకు మరియు పరిచర్య చేయుటకు ఒక క్రొత్త, పరిశుద్ధమైన విధానము”8 అనే అధ్యక్షులు నెల్సన్ గారి ఆహ్వానములో ఉన్నట్లుగా “మరింత శ్రేష్టమైన విధానము”7 లో సేవ చేయుటకు మనల్ని నడిపిస్తూ, మనలోపల ఉన్న మహోన్నతమైన దానికి మనల్ని నడిపించగలవు.

దేవుడు మన కొరకు చేసిన సమస్తముపై మనము దృష్టిసారించినప్పుడు, మన సేవ కృతజ్ఞతగల భావనలతో ప్రేరేపించబడును. మన సేవనుండి మనకేమి ప్రయోజనము కలుగుతుందని తక్కువగా చింతించినప్పుడు, బదులుగా మన సేవా దృష్టిని దేవునికి ప్రాధాన్యతనివ్వడంపై పెట్టాలని మనము గ్రహిస్తాము.9

“దేవునిని మరియు క్రీస్తును మన పూర్ణ హృదయములు, ఆత్మలు, మరియు మనస్సులతో ప్రేమించినప్పుడు మాత్రమే, ఈ ప్రేమను మనము దయ, సేవగల చర్యల ద్వారా మన పొరుగువారితో పంచుకోగలుగుతాము,”10 అని అధ్యక్షులు ఎమ్. రస్సెల్ బల్లార్డ్ బోధించారు.

పది ఆజ్ఞలలో మొదటిది, ఈ దైవిక జ్ఞానమును పునరుద్ఘాటించును: “నీ దేవుడైన యెహోవాను నేనే, . . . నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.”11 ఈ ఆజ్ఞ యొక్క స్థానము, ఆయనను మన ప్రధాన ప్రాధాన్యతగా ఉంచిన యెడల, చివరకు మిగిలిన సమస్తము---ఇతరులకు మన సేవ కూడా సరిగ్గా జరుగునని మనం గ్రహించేందుకు సహాయపడును. మన ఆలోచనపూర్వకమైన ఎంపిక ద్వారా మన జీవితాలలో ప్రధానమైన స్థానమును ఆయన తీసుకున్నప్పుడు, ఆయన మన క్రియలను మన మేలు కొరకు, ఇతరుల మేలు కొరకు దీవించగలరు.

“ప్రతీ ఆలోచనయందు నా వైపు చూడుము,”12 అని ప్రభువు ఉపదేశించారు. ప్రతీవారము మనము కేవలము దానిని చేయుటకు----“ఆయనను ఎల్లపుడు జ్ఞాపకముంచుకొనుటకు”13 నిబంధన చేస్తున్నాము. మనము చేయు సమస్తమునకు అటువంటి దైవిక దృష్టి అన్వయించబడునా? అల్పమైన కార్యమును చేయుట కూడా ఆయనకు మన ప్రేమను, భక్తిని రుజువు చేయుటకు ఒక అవకాశము అవుతుందా? అది అవుతుంది, కాగలదని నేను నమ్ముతున్నాను.

మనము చేయాల్సిన జాబితాలో ప్రతీ విషయము ఆయనను మహిమపరచుటకు ఒక విధానమగునట్లు మనము చేయగలము. మనము గడువు తేదీలు, బాధ్యతలు లేక మురికిగా ఉన్న డైపర్ల మధ్యలో ఉన్నప్పుడు కూడా, ప్రతీ కార్యమును ఒక ప్రత్యేకాధికారము మరియు అవకాశముగా మనము చూడగలమా?

అమ్మోన్ చెప్పినట్లుగా, “అవును, నేను శూన్యుడనని నేనెరుగుదును, నా శక్తికి సంబంధించి నేను బలహీనుడను, కాబట్టి నన్ను గూర్చి నేను అతిశయించను, కానీ నేను నా దేవుని గూర్చి అతిశయించెదను, ఏలయనగా ఆయన శక్తియందు నేను సమస్త క్రియలను చేయగలను.”14

మన దేవునికి సేవ చేయుటయే జీవితంలో మన ప్రధాన ప్రాధాన్యత అయినప్పుడు, మనల్ని మనం కోల్పోతాము, మరియు చివరకు మనల్ని మనం కనుగొంటాము. 15

ఈ సూత్రమును రక్షకుడు చాలా సాధారణంగా మరియు నేరుగా బోధించారు: “కాబట్టి మీ సత్ర్కియలను చూచి మరియు పరలోకమందున్న మీ తండ్రిని వారు మహిమపరచునట్లు ఈ జనుల యెదుట మీ వెలుగును అట్లు ప్రకాశించనియ్యుడి.”16

భారతదేశములో కలకత్తాలోని అనాధాశ్రయము యొక్క గోడలపై కనుగొనబడిన కొన్ని జ్ఞానపు మాటలు నేను మీతో పంచుకుంటాను: “మీరు దయ కలిగియున్న యెడల, నిస్వార్థమైన, దాచబడిన ప్రేరేపణలను బట్టి జనులు మిమ్మల్ని నిందించవచ్చు. అయినా సరే దయ కలిగియుండుము. మీరు సంవత్సరాల తరబడి కట్టిన దానిని, ఒక్కరాత్రిలో ఎవరైనా నాశనము చేయగలరు. అయినా సరే కట్టుము. నేడు మీరు చేసే మేలును జనులు రేపు తరచుగా మరచిపోతారు. అయినా సరే మేలు చేయుము. మీకు గల శ్రేష్టమైన దానిని లోకమునకు ఇయ్యుము, మరియు అది ఎప్పటికీ సరిపోదు. అయినప్పటికీ మీకుగల శ్రేష్టమైనది లోకమునకు ఇయ్యుము. అయినా సరే, . . . మీరు చూడండి, చివరి విశ్లేషణలో, అది మీకు, మీ దేవునికి మధ్య ఉండును.”17

సహోదరీలారా, అది ఎల్లప్పుడు మనకు, ప్రభువుకు మధ్య ఉన్నది. అధ్యక్షులు జేమ్స్ ఈ. ఫౌస్ట్ చెప్పినట్లుగా: “‘లోకములో ఉన్న గొప్ప అవసరత ఏమిటి?’ . . . ‘ప్రతీ వ్యక్తికి రక్షకునితో ప్రతీరోజు, కొనసాగుతున్న, నిరంతర, స్వంత అనుబంధము కలిగియుండుట సమస్త ప్రపంచములో గొప్ప అవసరత కాదా?’ అటువంటి అనుబంధమును కలిగియుండుట మన లోపలి దైవత్వమును బయల్పరచును, మరియు దేవునితో మన దైవిక అనుబంధమును మనము తెలుసుకొని, గ్రహించినప్పుడు, మరేదీ మన జీవితాలలో గొప్ప భిన్నత్వమును కలిగియుండదు.” 18

అదేవిధంగా, ఆల్మా తన కుమారునికి ఇలా వివరించాడు, “అవును, నీ కార్యములన్నీ ప్రభువునకై ఉండనిమ్ము, మరియు నీవు ఎక్కడికి వెళ్ళినను అది ప్రభువునందై ఉండనిమ్ము; అవును, నీ తలంపులన్నీ ప్రభువు వైపు నడిపింపబడనిమ్ము; అవును, నీ హృదయ వ్యామోహములు నిత్యము ప్రభువుపైన ఉంచుము.” 19

మరియు అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ గారు అదేవిధంగా మనకు బోధించారు, “ఆయన స్వచ్ఛందమైన ప్రాయశ్చిత్తఃమును మనము ధ్యానించినప్పుడు, మనము త్యాగము చేస్తున్నామనే ఏ భావన అయినా ఆయనకు సేవ చేయు ప్రత్యేక అవకాశము కొరకు లోతైన కృతజ్ఞత గల భావన చేత పూర్తిగా కప్పివేయబడును.” 20

సహోదరిలారా, యేసు క్రీస్తు తన ప్రాయశ్చిత్తఃము యొక్క శక్తి ద్వారా, మన పై, మనలో పని చేసినప్పుడు, ఇతరులను దీవించుటకు మన ద్వారా ఆయన పనిచేయుట ప్రారంభించును. మనము వారిని సేవిస్తాము, కానీ ఆయనను ప్రేమించి, సేవ చేయుట ద్వారా మనము ఆవిధంగా చేస్తాము. లేఖనము వివరించినట్లుగా మనము అవుతాము: “ప్రతీ పురుషుడు (మరియు స్త్రీ) తన పొరుగువాని ఆసక్తిని వెదకును, మరియు సమస్త విషయాలను దేవుని మహిమార్థమై ఏకాగ్రతతో చేయును.”21

ఆయన ప్రియమైన కుమారులు మరియు కుమార్తెలకు పరిచర్య చేయుటకు ఆ ప్రారంభపు, మంచి ఉద్దేశము కలిగినవి, కాని పరిపూర్ణముకాని, ప్రయత్నముల నుండి నేను, నా భర్త నేర్చుకొనే పాఠము అదేనని మా బిషప్పు ఎరిగియుండవచ్చు. ఆయన కొరకు సేవ చేయుటకు మనము ప్రయాసపడినప్పుడు, ఆయన మనతో పంచుకొనే మంచితనమును మరియు ప్రేమను గూర్చి వ్యక్తిగతమైన మరియు నిశ్చయమైన సాక్ష్యమును నేను చెప్పుచున్నాను. యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున, ఆమేన్.