2010–2019
సత్యము మరియు ప్రణాళిక
అక్టోబర్ 2018


సత్యము మరియు ప్రణాళిక

మతము గురించి సత్యమును మనం వెదకుచున్నప్పుడు, ఆ అన్వేషణకు తగిన ఆత్మీయ విధానాలను మనం ఉపయోగించాలి.

ఆధునిక బయల్పాటు సత్యమును “సంగతులు అవి ప్రస్తుతము ఉన్నవిధముగా, గతములో ఉన్నవిధముగా భవిష్యత్తులో ఉండబోవు వాటి యొక్క జ్ఞానము” (సిద్ధాంతము మరియు నిబంధనలు 93:24) అని నిర్వచిస్తుంది. అది రక్షణ ప్రణాళికకు మరియు “కుటుంబము: లోకమునకు ఒక ప్రకటనకు” సరియైన నిర్వచనము.

గొప్ప విస్తారమైన, విస్తరించుచున్న సమాచారమును కలిగియున్న కాలములో మనం జీవించుచున్నాము. కాని ఆ సమాచారము మొత్తము నిజము కాదు. సత్యాన్ని వెదకుచున్నప్పుడు మరియు ఆ అన్వేషణ కొరకు మూలాధారాల్ని ఎంచుకొనుచున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. సత్యము యొక్క అర్హతగల మూలాధారముగా లౌకిక ఔన్నత్యమును లేదా అధికారమును మనం పరిగణించకూడదు. నటీనటులు, ప్రఖ్యాత క్రీడాకారులు లేదా పేరు తెలియని ఇంటర్నెట్ మూలాధారాలు ఇచ్చే సమాచారము లేదా సలహాలపై ఆధారపడుటలో మనం జాగ్రత వహించాలి. ఒక అంశములో గల ప్రావీణ్యత ఇతర అంశాల గురించిన సత్యములో ప్రావీణ్యత ఉన్నట్లుగా మనం పరిగణించకూడదు.

సమాచారము ఇచ్చే వ్యక్తిని ఏది ప్రేరేపించిందో దాని గురించి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే యాజకవంచన గురించి లేఖనాలు మనల్ని హెచ్చరిస్తున్నాయి (2 నీఫై 26:29 చూడండి). మూలాధారము పేరు తెలియనిది లేదా తెలియబడనిది అయితే, ఆ సమాచారము కూడా అపాయకరమైనదే.

మన వ్యక్తిగత నిర్ణయాలు విషయముపై అర్హత పొందిన మూలాధారాల నుండి వచ్చే సమాచారముపైన ఆధారపడియుండి, స్వార్థపూరిత ప్రేరేణలు లేనిదై ఉండాలి.

మతం గురించి సత్యాన్ని మనం వెదకినప్పుడు, ఆ అన్వేషణకు సరియైన ఆత్మీయ విధానాలు మనం ఉపయోగించాలి: ప్రార్థన, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యము, లేఖన అధ్యాయనము మరియు ఆధునిక ప్రవక్తల మాటలు. లౌకిక బోధనల వలన ఒకరి విశ్వాసము కోల్పోబడిందని తెలిపినప్పుడు నేను ఎల్లప్పుడు విచారిస్తాను. ఒకప్పుడు ఆత్మీయ దర్శనమును పొందినవారు తమకు తామే కలిగించుకున్న ఆత్మీయ అంధకారము వలన బాధపడగలరు. అధ్యక్షులు హెన్రీ బి. ఐరింగ్ చెప్పినట్లు, “వారి సమస్య వారేమి చూస్తున్నారని వారనుకొనుచున్నారో అనేదానిపైన ఆధారపడియుండదు; అది వారు ఇంకా దేనిని చూడలేకపోతున్నారో దానిపైన ఆధారపడి ఉంటుంది.”1

విజ్ఞానశాస్త్రము యొక్క విధానాలు శాస్త్రీయ సత్యమని మనం పిలిచే దానికి దారితీస్తుంది. కాని “శాస్త్రీయ సత్యము” జీవితపు పరమార్థము కాదు. “అధ్యయనము ద్వారా, విశ్వాసము ద్వారా” నేర్చుకోనివారు (సిద్ధాంతము మరియు నిబంధనలు 88:118) శాస్త్రీయ విధానాల ద్వారా వారు ధ్రువీకరించగల దానికి, సత్యము గురించిన వారి అవగాహనను పరిమితము చేసుకుంటారు. సత్యమును గూర్చిన వారి అన్వేషణపై అది అసత్యపు పరిమితులను ఉంచును.

అధ్యక్షులు జేమ్స్ ఈ. ఫౌస్ట్ ఇలా చెప్పారు: “[బాప్తీస్మము] పొందినవారు కేవలం లౌకిక మూలాధారాల ద్వారా నేర్చుకొనుటకు నిర్లక్ష్యముగా అన్వేషించుట వలన వారి నిత్యాత్మలను ప్రమాదంలో ఉంచుకుంటారు. యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము క్రీస్తు సువార్త యొక్క సంపూర్ణత్వమును కలిగియున్నదని, అది సత్యానికి, నిత్య జ్ఞానము యొక్క సారమని మేము నమ్ముచున్నాము.”2

మనమెవరము, మర్త్యజీవితము యొక్క పరమార్థమేమిటి, మరణించిన తరువాత మనమెక్కడికి వెళ్తాము మొదలైన వాటిని గూర్చిన సత్యమును తెలుసుకొని, దానిని అనుసరిస్తే యధార్థమైన, శాశ్వతమైన సంతోషాన్ని మనం కనుగొనగలము. ఆ సత్యాలను శాస్త్రీయ లేదా లౌకిక పద్ధతుల ద్వారా నేర్చుకొనబడవు.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సిద్ధాంతమునకు మూలాధారమైన పునఃస్థాపించబడిన సువార్త సత్యాల గురించి ఇప్పుడు నేను మాట్లాడుతాను. ఈ సత్యాలను దయచేసి జాగ్రత్తగా పరిగణించండి. అవి మన సిద్ధాంతము మరియు ఆచరణల గురించి ఎక్కువ వివరిస్తాయి, బహుశా వాటిలో కొన్ని ఇంకా అర్థము చేసుకోబడలేదు.

ఇకముందు జీవించిన లేదా ఇకమీదట జీవించబోవు ఆత్మలన్నింటికి ప్రేమగల తండ్రియైన ఒక దేవుడు ఉన్నాడు.

లింగము అనేది శాశ్వతమైనది. మనం ఈ భూమిపైన జన్మించకముందు, దేవుని సన్నిధిలో స్త్రీ, లేక పురుష ఆత్మలుగా మనం జీవించాము.

“I Will Follow God’s Plan”3 అని టెంపుల్ స్క్వేర్ వద్ద టేబర్నేకిల్ గాయకబృందము పాడగా ఇప్పుడే మనం విన్నాము. ఆయన ఆత్మీయ పిల్లలందరు నిరంతరము అభివృద్ధి చెందునట్లు దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇదే. ఆ ప్రణాళిక మనలో ప్రతి ఒక్కరికి ఆవశ్యకమైనది.

ఆ ప్రణాళికలో భాగంగా, దేవుడు ఆయన ప్రియమైన ఆత్మీయ పిల్లలు మర్త్యత్వములో జన్మించగలిగి భౌతిక శరీరమును పొందుటకు, నీతికరమైన ఎంపికలు చేసుకొనుట ద్వారా నిత్యాభివృద్ధి చెందుటకు ఒక అవకాశాన్ని కలిగియుండుటకు ఒక స్థలముగా ఈ భూమిని సృష్టించెను.

అర్థవంతముగా ఉండుటకు, మంచి చెడుల వ్యతిరేక బలాల యొక్క పోటీ చేసే దళాల మధ్య మర్త్య ఎంపికలు చేయబడాలి. అక్కడ వ్యతిరేకత ఉండాలి, కాబట్టి, తిరుగుబాటు వలన క్రిందకు త్రోయబడిన ఒక అపవాది దేవుని ప్రణాళికకు వ్యతిరేకముగా ప్రవర్తించుటకు దేవుని పిల్లలను శోధించుటకు అనుమతించబడ్డాడు.

దేవుని ప్రణాళిక యొక్క ఉద్దేశం ఆయన పిల్లలకు నిత్య జీవమును ఎన్నుకొను అవకాశము ఇవ్వడం. మర్త్యత్వములో అనుభవమును పొందడం ద్వారా మరియు, మరణము తరువాత, ఆత్మల ప్రపంచములో మర్త్యజీవితము తరువాత కలిగే అభివృద్ధి ద్వారా మాత్రమే ఇది సాధించబడగలదు.

మర్త్య జీవితకాలములో అపవాది యొక్క దుష్ట శోధనలకు మనము లోబడినప్పుడు, మనందరము పాపముచేత మలినమౌతాము మరియు మనము చివరకు మరణిస్తాము. మన తండ్రియైన దేవుడు తాను కనిన ఏకైక కుమారుని ఒక రక్షకుడిగా మనకు ఏర్పాటు చేస్తారన్న ఆ ప్రణాళికపై ఆధారపడి, ఆ సవాళ్ళన్నిటిని మనం అంగీకరించాము, ఆయన మరణము తరువాత మూర్తీభవించిన జీవితమునకు తన విశ్వవ్యాప్త పునరుత్థానము చేత మనల్ని కాపాడుతారు. ఆయన పెట్టిన షరతులను అనుసరించి మనందరి పాపపరిహారము చెల్లించుటకు, పాపమునుండి శుద్ధిచేయుటకు రక్షకుడు ఒక ప్రాయశ్చిత్తమును కూడా సమకూర్చెను. క్రీస్తునందు విశ్వాసము, పశ్చాత్తాపము, బాప్తీస్మము, పరిశుద్ధాత్మ వరము మరియు యాజకత్వ అధికారముతో నిర్వహించబడు ఇతర విధులు ఈ షరతులలో ఉన్నాయి.

దేవుని యొక్క గొప్ప సంతోషకర ప్రణాళిక యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా మనం పొందగల నిత్య న్యాయము మరియు కనికరములకు మధ్య సంపూర్ణమైన సమతౌల్యాన్ని సమకూరుస్తుంది. క్రీస్తునందు నూతన సృష్టిగా మార్పు చెందుటకు కూడా అది మనకు సాధ్యం చేస్తుంది.

ప్రేమగల దేవుడు మనలో ప్రతి ఒక్కరిని సమీపించును. ఆయన యొక్క ప్రేమ ద్వారా, ఆయన కనిన ఏకైక కుమారుని యొక్క ప్రాయశ్చిత్తఃము ద్వారా [ఆయన] సువార్త నియమములకు మరియు విధులకు విధేయత చూపుట ద్వారా “సమస్త మనుష్యజాతి యావత్తు రక్షింపబడునని మనము యెరిగియున్నాము (విశ్వాస ప్రమాణాలు 1:3; వివరణ చేర్చబడెను).

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము కుటుంబ-కేంద్రీకృతమైన సంఘమని సరిగా పిలవబడుచున్నది. కాని సరిగ్గా అర్థము చేసుకోబడనిది ఏమిటంటే, మన కుటుంబ-కేంద్రీకృతము అనేది మర్త్య అనుబంధాల కంటే ఎక్కువగా కేంద్రీకరించబడెను. నిత్య అనుబంధాలు కూడా మన వేదాంతమునకు మూలాధారము. “కుటుంబము దేవునిచేత నియమించబడినది. ”4 మన ప్రేమగల సృష్టికర్త యొక్క గొప్ప ప్రణాళికలో, ఆయన పునఃస్థాపించబడిన సంఘము యొక్క లక్ష్యము దేవుని పిల్లలు సిలెస్టియల్ రాజ్యములో మహోన్నతస్థితి యొక్క దేవుని దీవెనలు సాధించుటకు సహాయపడుట, అది స్త్రీ పురుషుల మధ్య నిత్య వివాహము ద్వారా మాత్రమే సాధించబడును (సిద్ధాంతము మరియు నిబంధనలు 131:1–3). “లింగము అనేది ప్రతి ఒక్కరి మర్త్యత్వమునకు ముందు జీవితం, మర్త్యత్వము, నిత్య గుర్తింపు మరియు ఉద్దేశము యొక్క ముఖ్యమైన లక్షణము మరియు “స్త్రీ పురుషుల మధ్య వివాహము ఆయన నిత్య ప్రణాళికకు ఆవశ్యకమైనది”5 అనే ప్రభువు యొక్క బోధనలను మేము ధ్రువీకరిస్తున్నాము.

చివరిగా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, కేవలం కొంతమంది ఉద్దేశపూర్వకంగా నాశన పుత్రులుగా అవ్వడం మినహా ఆయన పిల్లలందరికి మహిమకరమైన గమ్యస్థానాన్ని ఆయన ఏర్పాటు చేసారు. “ఆయన పిల్లలందరు” అనగా వారిలో మరణించిన వారందరు కూడా ఉన్నారు. మన దేవాలయాలలో వారి కొరకు ప్రతినిధుల ద్వారా విధులను మనము నిర్వర్తిస్తాము. యేసు క్రీస్తు సంఘము యొక్క ఉద్దేశమేమనగా మహిమలలో అత్యున్నతమైన మహోన్నతస్థితి లేదా నిత్యజీవమునకు ఆయన పిల్లలను అర్హులుగా చేయుట. దానిని కోరనివారు లేదా అర్హులు కాని వారి కొరకు తక్కువ మహిమగల ఇతర మహిమ రాజ్యములను దేవుడు ఏర్పాటు చేసెను.

ఈ నిత్య సత్యాలను అర్థము చేసుకున్న వారెవరైనా, యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క సభ్యులమైన మనము ఎందుకు అలా ఆలోచిస్తామో, మనము చేసినట్లుగా ఎందుకు చేస్తామో అర్థము చేసుకోగలుగుతారు.

దేవుని ప్రణాళికను పరిగణనలోనికి తీసుకొనుట వలన మాత్రమే అర్థము చేసుకోగల ఈ నిత్యసత్యాల యొక్క అన్వయములలో కొన్నిటిని ఇప్పుడు నేను ప్రస్తావిస్తాను.

మొదట, మేము వ్యక్తిగత కర్తృత్వమును గౌరవిస్తాము. సంయుక్త రాష్ట్రాలలోను మరియు ప్రపంచమంతా మత స్వేచ్ఛను ప్రోత్సాహించు పునఃస్థాపించబడిన సంఘము యొక్క గొప్ప ప్రయత్నాలు అనేకులకు తెలుసు. ఈ ప్రయత్నాలు కేవలం మన స్వంత ఆసక్తులను మాత్రమే సమర్థించవు కాని, ఆయన ప్రణాళిక ప్రకారము, ఎంపిక చేసుకొనుటకు గల స్వేచ్ఛను ఆనందించుటకు దేవుని పిల్లలందరికి సహాయము చేయుటకు కోరును.

రెండవది, మనము సువార్త పరిచారక జనులము. మనమెందుకు మిషనరీలను అనేక దేశములకు, క్రైస్తవ జనాభా మధ్యకు కూడా పంపుతామని కొన్నిసార్లు అడుగబడతాము. మనమెందుకు అనేక మిలియన్ల డాలర్లను మానవ సంక్షేమ సహాయార్ధము మన సంఘ సభ్యులు కాని వారికి ఇస్తున్నాము, ఈ విరాళాన్ని మన సువార్త పరిచర్య ప్రయత్నాలకు ఎందుకు జతపరచమని అదే ప్రశ్నను మనం అడగబడతాము. దీనిని మనం చేస్తాము ఎందుకంటే మర్త్యులందరిని దేవుని పిల్లలుగా-మన సహోదరీ, సహోదరులుగా---మనం ఆదరిస్తాము మరియు మన ఆత్మీయ, భౌతిక సమృద్ధిని ప్రతి ఒక్కరితో పంచుకోవాలనుకొంటాము.

మూడవది, మర్త్య జీవితము మనకు పవిత్రమైనది. దేవుని ప్రణాళికకు మన ఒడంబడిక గర్భస్రావమును మరియు బాధా నివారణ కోసం చంపడం వంటి వాటిని వ్యతిరేకించుటను కోరును.

నాల్గవది, వివాహము మరియు పిల్లల గురించి సంఘము యొక్క స్థానము గురించి కొందరు ఇబ్బందిపడుచున్నారు. దేవునిచేత బయలుపరచబడిన రక్షణ ప్రణాళిక సంప్రదాయ వివాహము నుండి వెనుదిరుగుటకు మరియు గందరగోళము కలిగించు మార్పులు చేయుటకు లేదా లింగమును మార్చుటకు లేదా స్త్రీ పురుషులకు మధ్య బేధాన్ని తొలగించుటకు నేడు మనం కలిగియున్న సాంఘిక, చట్టపరమైన ఒత్తిళ్ళను మనము వ్యతిరేకించుట అవసరమగును. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నెరవేర్చడానికి అనుబంధాలు, గుర్తింపులు, స్త్రీ పురుషుల ధర్మములు ఆవశ్యకమైనవని మనకు తెలుసు.

ఐదవది, పిల్లల గురించి మనము నిర్ధిష్టమైన దృక్పథమును కూడా కలిగియున్నాము. పిల్లలను కని, పెంచుట అనేవి దేవుని యొక్క ప్రణాళికలో భాగమని మరియు దానిలో పాల్గొనుటకు శక్తి ఇవ్వబడిన వారి యొక్క సంతోషకరమైన, పరిశుద్ధమైన బాధ్యతగా మనము చూస్తున్నాము. మన దృష్టిలో, భూమిపైన మరియు పరలోకములో అంతిమ నిధులు మన పిల్లలు, మన సంతానము. కాబట్టి, పిల్లలకు—పిల్లలందరి యొక్క అభివృద్ధి మరియు సంతోషమును కలిగించు శ్రేష్టమైన పరిస్థితులను కల్పించు సూత్రములు మరియు ఆచరణలను బోధించి, వాటిని సమర్ధించాలి.

చివరిగా, మనం పరలోక తండ్రి యొక్క ప్రియమైన పిల్లలము, పురుషత్వము, స్త్రీత్వము, స్త్రీ పురుషుల మధ్య వివాహము, పిల్లలను కని, పెంచడము మొదలైనవన్నీ ఆయన గొప్ప సంతోషకర ప్రణాళికకు ఆవశ్యకమని ఆయన మనకు బోధించారు. ఈ ప్రాథమికాంశాల గురించి మన స్థానములు తరచు సంఘము యెడల వ్యతిరేకతను రేకేతిస్తాయి. అది అనివార్యమైనదిగా మేము పరిగణిస్తున్నాము. వ్యతిరేకత అనేది ప్రణాళికలో భాగము, మరియు సాతాను యొక్క అతి శక్తివంతమైన వ్యతిరేకత దేవుని ప్రణాళికలో అత్యంత ముఖ్యమైన దానివైపు గురిపెట్టును. దేవుని యొక్క కార్యమును నాశనము చేయుటకు అతడు కోరుతున్నాడు. అతడి ప్రధానమైన పద్ధతులేవనగా, రక్షకుడు మరియు ఆయన దైవిక అధికారమును అవమానించుట, యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము యొక్క ప్రభావములను తుడిచివేయుట, పశ్చాత్తాపపడుటను నిరుత్సాహపరుచుట, బయల్పాటును అబద్దముగా చేయుట, వ్యక్తిగత జవాబుదారీతనమును ఖండించుట. లింగమును తికమక పెట్టుట, వివాహాన్ని వక్రీకరించుట, పిల్లలను కనుటను ---మరి ముఖ్యముగా పిల్లలను సత్యములో పెంచే తల్లిదండ్రులను నిరుత్సాహపరుచుట.

యేసు క్రీస్తు యొక్క కడవరి దిన పరిశుద్ధుల సంఘము యొక్క బోధనలను మనం సాధన చేయుటకు ప్రయత్నించినప్పుడు మనకు ఎదురయ్యే ఏర్పాటు చెయ్యబడిన మరియు నిరంతర వ్యతిరేకతను లక్ష్యపెట్టకుండా ప్రభువు యొక్క కార్యము ముందుకు సాగును. వ్యతిరేకతకు తడబడు వారికి నేను ఈ సలహాలు ఇస్తున్నాను.

యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తపు శక్తిచేత పశ్చాత్తాపమనే సూత్రము సాధ్యపడిందని గుర్తుంచుకోండి. “తమను తాము మార్చుకోకుండా సంఘమును మార్చుటకు ప్రయత్నించు”6 వారిమధ్య ఉండవద్దని ఎల్డర్ నీల్ ఏ. మ్యాక్సవెల్ బలంగా ప్రోత్సహించారు.

ఎల్డర్ జెఫ్రీ ఆర్. హాలాండ్ ప్రేరేపించినట్లుగా:

“మీకు ఇదివరకే తెలిసియున్న దానిని గట్టిగా పట్టుకొనియుండుము, అదనపు జ్ఞానము వచ్చువరకు బలంగా నిలబడండి. . . .

. . . ఈ సంఘములో, మనకు తెలియని దానికంటే మనకు తెలిసినది ఎక్కువ ప్రాముఖ్యమైనది.”7

సువార్త సూత్రాలలో మొదటిదైన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసమును సాధన చేయండి.

చివరిగా, సహాయము కోరండి. మన సంఘ నాయకులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మరియు మీకు సహాయము చేయుటకు ఆత్మీయ నడిపింపును వెదకుచున్నారు. LDS.org ద్వారా మీరు కనుగొను అనేక వనరులను మరియు గృహములో సువార్త అధ్యయనము చేయుటకు ఇతర సహకారములు మేము అందిస్తున్నాము. ప్రేమగల సహాయము అందించడానికి పరిచర్య చేయు సహోదరులు, సహోదరీలు కూడా మనం కలిగియున్నాము.

ప్రేమగల మన పరలోక తండ్రి తన పిల్లలు సంతోషముగా ఉండాలని కోరుచున్నారు, అదే ఆయన సృష్టి యొక్క ఉద్దేశము. ఆ సంతోషకరమైన గమ్యము నిత్యజీవము, దానిని మన ప్రవక్తయైన అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ తరచు చెప్పె“నిబంధన మార్గము” వెంబడి ముందుకు సాగుట ద్వారా మనం పొందగలము. సంఘ అధ్యక్షునిగా తన మొదటి సందేశములో దీనిని ఆయన చెప్పారు: “నిబంధన మార్గములో కొనసాగుము. ఆయనతో నిబంధనలు చేసుకొని, ఆ నిబంధనలు గైకొనుట ద్వారా రక్షకుని అనుసరించుటకు మీ నిబద్ధత ప్రతిచోటా పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు లభ్యమయ్యే ప్రతి దీవెన, విశేషాధికారము పొందుటకు అవకాశము కల్పించును.”8

నేను చెప్పిన విషయాలు సత్యమని రూఢిగా నేను సాక్ష్యమిచ్చుచున్నాను మరియు మన నిత్య తండ్రియైన దేవుని యొక్క గొప్ప ప్రణాళిక క్రింద సమస్తమును సాధ్యము చేసిన యేసు క్రీస్తు యొక్క బోధనలు మరియు ప్రాయశ్చిత్తము ద్వారా అవి సాధ్యపరచబడెను. యేసు క్రీస్తు నామములో, ఆమేన్.

వివరణలు

  1. Henry B. Eyring, To Draw Closer to God: A Collection of Discourses (1997), 143.

  2. James E. Faust, “The Abundant Life,” Ensign, Nov. 1985, 9.

  3. “I Will Follow God’s Plan,” Children’s Songbook, 164–65.

  4. The Family: A Proclamation to the World,” Liahona, May 2017, 145.

  5. The Family: A Proclamation to the World,” 145.

  6. Neal A. Maxwell, If Thou Endure It Well (1996), 101.

  7. Jeffrey R. Holland, “Lord, I Believe,” Liahona, May 2013, 94; emphasis in original.

  8. Russell M. Nelson, “As We Go Forward Together,” Liahona, Apr. 2018, 7.

ముద్రించు