గాయపడినవారు
భూలోకము యొక్క తీవ్రమైన శ్రమలందు ఓపికగా ముందుకు సాగుము, మరియు రక్షకుని యొక్క స్వస్థపరచు శక్తి మీకు వెలుగును, జ్ఞానమును, శాంతిని, మరియు నిరీక్షణను తెచ్చును.
మార్చి 22, 2016న, ఉదయం 8 గంటలకు ముందు, బ్రుస్సెల్స్ విమానాశ్రయంలో తీవ్రవాదుల బాంబులు రెండు పేలాయి. ఎల్డర్ రిచార్డ్ నోర్బీ, ఎల్డర్ మేసన్ వెల్స్, ఎల్డర్ జోసెఫ్ ఎంఫీలు సహోదరి ఫేన్నీ క్లేయిన్ క్లీవ్లాండ్, ఒహైయోలోని తన మిషను విమానం కోసం విమానాశ్రయానికి తీసుకెళ్లారు. అప్పుడు జరిగిన సంఘటనలో ముప్పై రెండు మంది ప్రాణాలను కోల్పోయారు, మరియు మిషనరీలందరూ గాయపడ్డారు.
అందులో మిక్కిలి తీవ్రంగా గాయపడిన వారు ఎల్డర్ రిచార్డ్ నోర్బీ, వయస్సు 66, తన భార్య సహోదరి పామ్ నోర్బీతో పాటు సేవ చేస్తున్నారు.
ఎల్డర్ నోర్బీ ఆ సందర్భంపై ప్రతిస్పందించారు:
“వెంటనే, జరిగింది ఏమిటో నాకు తెలిసింది.
“భద్రత కోసం పరుగెత్తడానికి నేను ప్రయత్నించాను, కానీ నేను వెంటనే క్రింద పడిపోయాను. . . నా ఎడమకాలు బాగా దెబ్బ తిన్నదని నేను చూడగలిగాను. నేను రెండు చేతులనుండి నల్లని మసిలా సాలీడు గూడులాగ వ్రేలాడడాన్ని గమనించాను. దానిని నెమ్మదిగా లాగడానికి ప్రయత్నించాను, కానీ అది మసికాదు కాలిపోయిన నా చర్మమని తెలుసుకున్నాను. నా తెల్లచొక్కా నా వీపుపైని గాయం వల్ల ఎర్రగా మారసాగింది.
“జరిగిన దాని గురించి స్పృహ నా మనస్సును నింపినప్పుడు, . . . నేనెక్కడున్నానో, అప్పుడేమి జరిగిందో, ఆ నిమిషంలో నేను ఏమి అనుభవిస్తున్నానో . . . . రక్షకునికి తెలుసని, నాలో ఒక బలమైన ఆలోచన కలిగింది.”1
రిచార్డ్ నోర్బీకి, అతని భార్య పామ్‌కు కష్టదినాలు ఇంకా ముందున్నాయి. అతడు ప్రేరేపించబడిన కోమాలో ఉంచబడ్డాడు, తర్వాత శస్త్ర చికిత్సలు, అంటువ్యాధులు, గొప్ప అనిశ్చిత అనుసరించాయి.
రిచార్డ్ నోర్బీ బ్రతికాడు, కానీ ఆయన జీవితం మునుపటిలా ఎప్పటికీ ఉండదు. రెండున్నర సంవత్సరాల తర్వాత, ఆయన గాయాలు ఇంకా మానుతున్నాయి; ఆయన కాలులోని విరిగిన భాగానికి రేకును వేశారు; వేసే ప్రతీ అడుగు బ్రుస్సెల్స్ విమానాశ్రయం సంఘటనకి ముందు వేసిన దానికి భిన్నంగా ఉంది.
రిచార్డ్, పేమ్ నోర్బీలకు ఎందుకిలా జరిగింది? 2 వారు వారి నిబంధనలకు యధార్ధముగా ఉన్నారు. ఈ మిషనుకు ముందు, వారు ఐవరీ కోస్ట్ లో సేవ చేసారు, మరియు మంచి కుటుంబాన్ని పెంచి పెద్దచేసారు. అర్ధవంతంగా ఎవరైనా, “ఇది అన్యాయం! ఇది సరైంది కాదు! వారు యేసుక్రీస్తు సువార్త కోసం వారి జీవితాలను సమర్పించుకున్నారు; ఇది ఎలా జరిగింది?” అని అడగవచ్చు.
ఇది మర్త్యత్వము
వివరాలు భిన్నంగా ఉన్నప్పటికినీ, దుర్ఘటనలు శారీరక, ఆత్మీయమైన రెండు ఊహించని పరీక్షలు మరియు శ్రమలు, ఈ మర్త్యత్వము వలన మనలో ప్రతీఒక్కరికి వచ్చును.
ఈ ఉదయకాలాన్న ఈ సభలో మాట్లాడిన వారిని గూర్చి నేను ఆలోచిస్తున్నప్పుడు, వారిలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయారు, మరియు ముగ్గురు మనవల్ని కోల్పోయారు, వారు అకస్మాత్తుగా వారి పరలోకగృహానికి తిరిగి వెళ్లిపోయారు. అస్వస్థతలు, విచారాలనుండి ఎవరూ విడిచి పెట్టబడలేరు, ఈ వారంలోనే, మనమంతా ప్రేమించే భూమి మీద దేవదూత, సహోదరి బార్బరా బాల్లార్డ్ తెరదాటి వెళ్లిపోయారు. అధ్యక్షులు బాల్లార్డ్, ఈ ఉదయము మీ సాక్ష్యాన్ని మేము ఎన్నటికీ మరచిపోలేము.
మనం సంతోషం కోసం వెదుకుతాం. శాంతి కోసం ఆపేక్షిస్తాము. ప్రేమ కోసం నిరీక్షిస్తాం. ప్రభువు గొప్పగా లెక్కించలేని దీవెనలను కురిపిస్తాడు. కానీ మీ సంతోషం, ఆనందాలతో కలిసి, ఒక్క విషయం నిశ్చయం: మీ ఆత్మను గాయపరచిన క్షణాలు, గడియలు, రోజులు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ఉంటాయి.
మనం చేదును, మధురాన్ని రుచి చూస్తామని,3 లేఖనాలు బోధిస్తున్నాయి, “అన్ని విషయాలలో వ్యతిరేకత ఉంటుందని”4 బోధిస్తాయి. యేసు, “[మీ తండ్రి] ఆయన చెడ్డవారిమీదను, మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడని,”5 చెప్పెను.
ఆత్మ యొక్క గాయాలు ధనికులకు లేక పేదవారికి, ఒక్క సంస్కృతికి, ఒక జనాంగానికి, లేదా ఒక తరానికి ప్రత్యేకమైనవి కాదు. అవి అందరికీ వస్తాయి మరియు అవి మర్త్యత్వ అనుభవం నుండి మనం నేర్చుకొనే వాటిలో భాగం.
నీతిమంతులు విడవబడరు
ఈరోజు మరిముఖ్యంగా దేవుని ఆజ్ఞలను పాటించువారికి, దేవునితో చేసిన ప్రమాణాలను పాటించే వారికి, మరియు నోర్బీల వలే లేదా ఇక్కడ ఈ ప్రపంచ వ్యాప్త శ్రోతలలో ఉన్న అనేకమంది ఇతర పురుషులు, స్త్రీలు, పిల్లల వలే ఊహించని బాధాకరమైన శోధనలు, సవాళ్లను ఎదుర్కొనే వారికే ఈరోజు ప్రత్యేకంగా నా సందేశం.
మన గాయాలు ప్రకృతి వైపరీత్యాల నుండి లేదా దురదృష్టకరమైన ప్రమాదం నుండి రావచ్చును. నీతిమంతులైన భార్య లేదా భర్త, మరియు పిల్లల జీవితాలను తలక్రిందులు చేస్తూ అవి అవిశ్వాసియైన భర్త లేదా భార్య నుండి రావచ్చు. గాయాలు మనం ప్రేమించేవారి బాధ వలన లేదా అకాల మరణం వలన అంధకారం, నిరాశ యొక్క చీకటినుండి గాని, ఊహించని అనారోగ్యం, మనం ప్రేమించేవారి బాధ లేదా అకాలమరణం వలన, కుటుంబ సభ్యుడు అతడు లేక ఆమె విశ్వాసాన్ని విడిచిపెట్టినందువలన కలిగే విచారం, పరిస్థితులు నిత్య భాగస్వామిని తీసుకురానప్పటి ఒంటరితనం వలన లేదా వందలాది మరేవిధమైన హృదయాన్ని విరిచే, బాధాకరమైన శోధనలనుండి గానీ అవి రావచ్చు.”6
కష్టాలు జీవితంలో భాగమని మనమందరం యెరుగుదుం, కానీ అవి వ్యక్తిగతంగా మనకు వచ్చినప్పుడు, అవి మన ఊపిరిని తీసివేయగలవు. భయపడకుండా, మనం సిద్ధపడి ఉండాలి. అపోస్తలుడైన పేతురు, “మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి” 7 అని చెప్పెను. సంతోషం, ఆనందం వంటి ప్రకాశవంతమైన రంగులతో పాటు, శ్రమ, దుర్ఘటన వంటి ముదురు రంగు దారాలు మన తండ్రి యొక్క ప్రణాళిక అను వస్త్రంలో లోతుగా నేయబడినవి. ఈ శ్రమలు కష్టమైనవి అయినప్పటికీ, తరచూ మనకు గొప్ప బోధకులుగా మారతాయి.8
ప్రవక్తయైన హీలమన్ యొక్క 2060 మంది యువ సైనికుల అద్భుతమైన కథను చెప్పుచున్నప్పుడు, ఈ లేఖనాన్ని మనము ప్రేమిస్తాము: “అయినప్పటికినీ దేవుని మంచితనాన్ని బట్టి, మా గొప్ప ఆశ్చర్యానికి, మా సైన్యమంతటి సంతోషానికి, వారిలో ఒక్క ఆత్మ కూడా నశించలేదు.”
కానీ ఆ వచనం కొనసాగును: “అనేక గాయములు పొందియుండని ఒక్క ఆత్మయు వారిమధ్యన లేకుండెను.” 9 2060 మంది యువకులలో ఒక్కరు కూడా మరణించలేదు, కానీ 2060 మందిలో ప్రతీ ఒక్కరు అనేక గాయములను పొందిరి మరియు మనలో ప్రతి ఒక్కరూ జీవితపు యుద్ధములో శారీరకంగా, ఆత్మీయంగా, లేదా రెండు విధాలుగా గానీ గాయపడతాం.
యేసు క్రీస్తు మన మంచి కాపరి
నిరీక్షణను కోల్పోవద్దు - మీ జీవితపు గాయాలు ఎంత లోతైనవైనా, వాటి మూలమేదైనా, అవి ఎప్పుడు ఎక్కడ జరిగినా, అవి ఎంత కాలం మీతో ఉన్నా, మీరు ఆత్మీయంగా నశించకూడదు. మీరు ఆత్మీయంగా బ్రతికియుండుటకు, జీవించుటకు, మీ విశ్వాసంలో వికసించి, దేవుని యందు నమ్మికయుంచుటకు మీరు ఉద్దేశించబడ్డారు.
దేవుడు మన ఆత్మలను ఆయననుండి స్వతంత్రంగా ఉండుటకు సృష్టించలేదు. మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు తన లెక్కింప శక్యంకాని ప్రాయశ్చిత్తం ద్వారా, మరణం నుండి మనల్ని కాపాడి, పశ్చాత్తాపం ద్వారా మన పాపాలకు క్షమాపణను అనుగ్రహించడమే కాకుండా, మన గాయపడిన ఆత్మల విచారములు, బాధలనుండి కాపాడుటకు కూడా ఆయన సిద్ధంగా నిలబడియున్నారు. 10
రక్షకుడు మన మంచి సమరయుడు,11 “విరిగిన హృదయాలను స్వస్థపరచుటకే” 12 పంపబడ్డాడు. ఇతరులు మనలను దాటిపోయినప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడు. కనికరముతో, ఆయన తన స్వస్థపరచు గుగ్గిలమును మన గాయాలపైయుంచి, కట్టుకడతాడు. ఆయన మనలను మోస్తారు. ఆయన మనలను సంరక్షిస్తారు. “నా యొద్దకు రండి. . . నేను మిమ్ములను స్వస్థపరచెదనని”13 ఆయన పిలుస్తున్నారు.
“మరియు [యేసు] . . . ప్రతీ విధమైన బాధలు, శ్రమలు, శోధనలను [అనుభవిస్తూ]. . . తన జనుల బాధలు మరియు రోగములను ఆయన తనపైన తీసుకొనులాగున, కనికరము[తో] మన బలహీనతలను [ఆయనపై వేసికొనెను] . . . ” 14
నిరాశ చెందినవారలారా, మీరు ఎక్కడ నశిస్తున్నా, రండి;
కరుణాపీఠం వద్దకు రండి, పరితాపంతో మోకరించుము.
మీ గాయపడిన హృదయాలను ఇక్కడకు తెండి; మీ వేదనను ఇక్కడ చెప్పండి.
పరలోకం స్వస్థపరచలేని ఏ విచారమును భూమి కలిగియుండలేదు.15
విస్తారమైన బాధను అనుభవిస్తున్న సమయంలో, ప్రవక్తయైన జోసెఫ్‌తో ప్రభువు “ఈ విషయాలన్నీ నీకు అనుభవాన్ని ఇస్తాయి, మరియు అవి నీ మేలు కొరకే”16 అని చెప్పారు. బాధాకరమైన గాయాలు మన మేలు కొరకు ఎలా కాగలవు? భూలోకము యొక్క అతి తీవ్రమైన శోధనలలో, రక్షకుని స్వస్థపరచు శక్తి వెలుగును, అవగాహనను, శాంతిని, మరియు నిరీక్షణను తెచ్చును. 17
ఎప్పటికీ నిరాశ చెందవద్దు
మీ పూర్ణ హృదయముతో ప్రార్థించండి. యేసుక్రీస్తులో, ఆయన యధార్ధతలో, ఆయన దయలో మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. ఆయన వాక్యాలను పట్టుకోండి: “నా కృప నీకు చాలును: బలహీనతలో నా బలం పరిపూర్ణం చేయబడును.”18
పశ్చాత్తాపం శక్తివంతమైన ఆత్మీయ ఔషదమని జ్ఞాపకముంచుకొనుము.19 ఆజ్ఞలను పాటించుము, మరియు ఆదరణకర్తను పొందుటకు అర్హత కలిగియుండుము, రక్షకుడు, “నేను మిమ్మును ఆనాధగా విడవను: మీ యొద్దకు వత్తును”20 వాగ్ధానం చేశారు.
గాయపడిన ఆత్మకు దేవాలయ శాంతి ఉపశమనాన్నిచ్చే గుగ్గిలము. మీ గాయపడిన హృదయముతో ప్రభువు మందిరానికి తిరిగి మీ కుటుంబ సభ్యుల పేరులతో ఎంత తరచుగా సాధ్యమైతే అంత తరచుగా వెళ్లండి. దేవాలయం మన మర్త్యత్వంలోని ఒక చిన్న క్షణం నిత్యత్వంలో కలిగించే పర్యవసానాన్ని మనకు చూపిస్తుంది.21
మీ మర్త్యత్వమునకు ముందు స్థితిలో మీ యోగ్యతను మీరు రుజువు చేసుకున్నారని జ్ఞాపకము చేసుకుంటూ వెనకకు చూడుము. మీరు దేవుని యొక్క విలువైన బిడ్డ, మరియు ఆయన సహాయముతో, మీరు ఈ పడిపోయిన లోకములో యుద్ధములందు గెలవగలరు. మీరు దానిని ఇంతకుముందు చేసారు, మరియు మీరు మరలా దానిని చేయగలరు.
ముందుకు చూడుము. మీ శ్రమలు, విచారాలు చాలా వాస్తనమైనవి, కానీ అవి శాశ్వత కాలముండవు.22 మీ చీకటి రాత్రి గతించును, ఎందుకనగా “కుమారుడు . . . తన రెక్కలయందు స్వస్థత తో . . . [లేచును]” 23
నోర్భీలు నాతో, “నిరాశ అప్పుడప్పుడు దర్శించడానికి వస్తుంది కానీ ఇక్కడే ఉండిపోడానికి అనుమతించబడలేదు.”24 అని చెప్పారు. అపోస్తలుడైన పౌలు, “శ్రమపడుచున్నను ఇరికింపబడువారము కాము; అపాయములో నున్నను కేవలము ఉపాయము లేనివారము కాము; తరుమబడుచున్నను దిక్కులేనివారము కాము; పడద్రోయబడినను నశించువారము కాము”25 అని చెప్పాడు. మీరు మిక్కిలి అలసిపోయి ఉండవచ్చు కానీ, మీరు నమ్మిన దానిని విడిచిపెట్టవద్దు. 26
మీ స్వంత గాయములతో కూడా, మీరు రక్షకుని వాగ్దానమును నమ్ముతూ, ఇతరులను సహజంగా సమీపిస్తారు: “నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొనును.”27 గాయపడిన ఇతరులను బాగు చేయు గాయపడినవారు భూమిమీద దేవుని యొక్క దూతలు.
కొన్ని నిమిషాలలో, మన ప్రియమైన ప్రవక్త, అధ్యక్షులు రస్సెల్ ఎమ్. నెల్సన్ నుండి మనము వింటాం, యేసుక్రీస్తు నందు సంకోచంలేని విశ్వాసం గల వ్యక్తి, నిరీక్షణ, శాంతిని కలిగిన వ్యక్తి, దేవునిచేత ప్రేమించబడినవారు, కానీ ఆత్మ యొక్క గాయాలనుండి మినహాయించబడలేదు.
1995లో ఆయన కుమార్తె ఎమిలీ, గర్భవతిగా ఉండగా, కేన్సర్ వ్యాధితో నిర్ధారించబడింది. తన ఆరోగ్యవంతమైన బిడ్డ ప్రసవించబడిప్పుడు నిరీక్షణ, సంతోషంతో కూడిన దినాలున్నాయి. కానీ కేన్సర్ తిరిగి వచ్చింది, వారి ప్రియమైన ఎమిలీ తన 37వ జన్మదినం తర్వాత రెండు వారాలలో తన ప్రియమైన భర్తను, ఐదుగురు చిన్నపిల్లలను వదిలి ఈ జీవితం నుండి వెళ్లిపోయింది.
సర్వసభ్య సమావేశంలో, ఆమె చనిపోయిన కొద్ది రోజుల తర్వాత, ఎల్డర్ నెల్సన్ వెల్లడించారు: “మా కుమార్తెకు నేను ఇంకా అధికంగా చేయగలిగియుండవలసిందనే ఆశలతోపాటు విచారంతో కూడిన నా కన్నీళ్లు ప్రవహించాయి. …నాకు పునఃరుత్థాన శక్తి ఉండి ఉంటే, (ఆమెను) తిరిగి తీసుకొని వచ్చేందుకు శోధించబడేవాడినేమో ... (కానీ) యేసు క్రీస్తు ఆ తాళపు చెవులను కలిగియున్నాడు మరియు వాటిని ఎమిలీ కొరకు . . . ప్రజలందరి కొరకు ప్రభువు తన స్వంత సమయంలో ఉపయోగిస్తారని” 28 చెప్పారు.
గత నెలలో, పోర్టోరికోలోని పరిశుద్ధులను దర్శించినప్పుడు, పోయిన సంవత్సరం విధ్వంసం చేసిన మరియా పెనుతుఫానును జ్ఞాపకం చేసుకుంటూ అధ్యక్షులు నెల్సన్ ప్రేమతో, ఆదరణతో మాట్లాడారు:
“[ఇది] జీవితంలో భాగం. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. మనం శరీరాలను పొంది శోధించబడి పరీక్షించబడడానికి ఇక్కడ ఉన్నాం. అందులో కొన్ని పరీక్షలు భౌతికమైనవి; కొన్ని ఆత్మీయమైనవి, ఇక్కడ మీ శోధనలు కూడా భౌతికమైనవి, ఆత్మీయమైనవి.”29
“మీరు నిరీక్షణను కోల్పోలేదు. మీ గురించి మేము (చాలా) గర్విస్తున్నాం. విశ్వసనీయ పరిశుద్ధులైన మీరు చాలా కోల్పోయారు, కానీ వాటన్నిటి ద్వారా, ప్రభువైన యేసు క్రీస్తునందు మీ విశ్వాసాన్ని బలపరచుకున్నారు.” 30
“దేవుని ఆజ్ఞలను పాటించుట ద్వారా, మన మిక్కిలి అధ్వాన్నమైన పరిస్థితులలో కూడా మనం సంతోషాన్ని కనుగొనగలము.”31
కన్నీళ్లన్నియు తుడిచి వేయబడతాయి
నా సహోదరీ సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విశ్వాసాన్ని పెంచుకోవడం అధికమైన బలాన్ని, గొప్ప నిరీక్షణను తెస్తుందని నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. నీతిమంతులైన మీకు, మన ఆత్మల యొక్క వైద్యుడు, ఆయన సమయమందు, ఆయన విధానములో, మీ గాయాలన్నింటినీ మాన్పును.32 ఏ అన్యాయం, ఏహింసా, ఏ శోధన, ఏ విచారం, ఏ వేదన, ఏ బాధ, ఏ గాయం అవి ఎంత లోతైనవైనా, ఎంత విశాలమైనవి అయినా, ఎంత బాధాకరమైనవి అయినా ఆయన సన్నిధిలోనికి తిరిగి స్వాగతించుటకై గాయపడిన బాహువులను తెరిచియుంచిన ఆయన యొక్క ఎడతెగని నిరీక్షణ, శాంతి, ఆదరణల నుండి మినహాయించబడలేవు. అపోస్తలుడైన యోహాను ఇలా సాక్ష్యమిచ్చెను, ఆ దినమును నీతిమంతులు “మహాశ్రమలనుండి వచ్చిన వారు”33 నిలువబడి “దేవుని సింహాసనము ఎదుట. . . తమ వస్త్రములను తెలుపుచేసికొనిరని” సాక్ష్యమిచ్చును. గొర్రెపిల్ల “తానే తన గుడారమును వారిమీద కప్పును. . . దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయునని”34 నేను యేసుక్రీస్తు నామంలో సాక్ష్యమిస్తున్నాను, ఆమేన్.